For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధూమపానం ఆపివేయడంలో ఉన్న అపోహల గురించిన నిజాలు మీకోసం ..

|

ఈరోజుల్లో ప్రభుత్వం మరియు మీడియా సమిష్టిగా ప్రజలను చైతన్య పరచే క్రమంలో భాగంగా సినిమా హాళ్ళలో, టీవీలలో ధూమపానానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్నది ప్రకటన మాత్రమే కాదు, నిజం. ధూమపానం ఆరోగ్యాన్నే కాదు మీ మరియు మీ కుటుంబ సంతోషాలను దూరం చేస్తుంది అనడం పచ్చి నిజం. ధూమపానం చేసినప్పుడు నికోటిన్, శరీరంలోని రక్తం నిల్వలతో కలిసి ప్రయాణించడం ప్రారంభిస్తుంది. తద్వారా శరీరంలోని అన్ని భాగాలకు నికోటిన్ చేరవేయబడుతుంది. క్రమంగా కాన్సర్ వంటి భయంకర రోగాల చిట్టా తెరుచుకుంటుంది.

థియేటర్లలో ప్రకటలకు హేళన చేసే వారే ఎక్కువ కనిపిస్తున్నారు కానీ, పరిస్థితులను ఆలోచిoచలేకున్నారు. కానీ ధూమపానాన్ని దూరం చెయ్యడం ద్వారా కూడా అనేక సమస్యలు తలెత్తుతాయని, కొందరి ప్రజల మూఢనమ్మకo. అవి ఎంతవరకు నిజమో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

Common Smoking Myths Debunked

అనేకమంది ఈ ధూమపానం వలన కలిగే అనేక నష్టాల గురించిన అవగాహన ఉన్నాకూడా, మానడానికి ప్రయత్నం కూడా చేయరు. దీనికి కారణాలు కొన్ని పిచ్చివాదనలను నమ్మడం, లేదా ఆ వ్యసనం నుండి బయటకు రాలేకపోవడం.

కొన్ని పిచ్చివాదనలు ధూమపాన ప్రియులను మాన్పించే దిశగా కాకుండా ప్రోత్సహిస్తుంటే, కొందరు ఎందుకైనా మంచిదని కాస్త తగ్గించి ధూమపానం చేయడం చేస్తుంటారు.

1.వాదన: ధూమపానం ఆపకుండా 5సంవత్సరాలు చేస్తే, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయి ఉంది.

1.వాదన: ధూమపానం ఆపకుండా 5సంవత్సరాలు చేస్తే, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయి ఉంది.

నిజం: జరగాల్సిన నష్టం ఇదివరకే జరిగిపోయింది కావున, ధూమపానం వదలడం అనేమాటకు అర్ధమే లేదు అన్న భావనలో ఉంటారు. కానీ నిజానికి ఎంత త్వరగా ధూమపానాన్ని మానితే అంత మంచిది. మీరు ఎంతకాలం ధూమపానం చేశారు అన్న ఆలోచన చేయకుండా ధూమపానానికి స్వస్తి పలకడమే మేలు. ధూమపానం కొనసాగించే కొలదీ, ఆయువు నెమ్మదిగా తగ్గడం మాత్రం ఖచ్చితం. మీరు 5సంవత్సరాలు ధూమపానం సేవించినా, మానివేశాక గుండెపోటు సమస్యలు తగ్గుముఖం పడుతాయి. పూర్తిగా మానివేసిన 15సంవత్సరాల తర్వాత, ధూమపానం చేయని వ్యక్తితో సమానంగా మీ గుండెపోటు ఆధారపడి ఉంటుంది.

2.వాదన: అప్పుడప్పుడూ ధూమపానం చేయడం మంచిదే

2.వాదన: అప్పుడప్పుడూ ధూమపానం చేయడం మంచిదే

నిజం: ధూమపానాన్ని మానివేయాలనుకున్న వారు, లేదా పూర్తిగా మానివేసిన వారు ఒక్కోసారి అప్పుడప్పుడూ సేవిస్తే తప్పులేదు అన్న భావనలో ఉంటుంటారు. తద్వారా శరీరానికి ఏ హాని జరగదు అన్న భావన ఉంటుంది. కానీ కొద్ది మోతాదులో నికోటిన్ కూడా రక్తనాళాలను విచ్చిన్నం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని గుర్తెరగడం మంచిది.

3. వాదన : ధూమపానం ఒత్తిడిని దూరం చేస్తుంది

3. వాదన : ధూమపానం ఒత్తిడిని దూరం చేస్తుంది

నిజం :ధూమపానం ఒత్తిడిని దూరం చేయడం అన్నది తాత్కాలికమే, కానీ దీర్ఘకాలిక ఒత్తిడులకు ప్రధాన కారణంగా ధూమపానం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వైద్యుల ప్రకారం, డోపమైన్, నోరాడ్రేనలిన్ అనే రెండు రసాయనాలకు ప్రత్యామ్నాయంగా నికోటిన్ పనిచేస్తుంది. తద్వారా ఉపశమనం లభించిన అనుభూతికి లోనవుతారు, తద్వారా వీరి ఆలోచనా విధానాలు మారడమే కాకుండా మెదడు నికోటిన్ కు అలవాటు పడేలా తయారవుతుంది. నెమ్మదిగా ఒత్తిడులకు కారణంగా మారుతుంది.

4.వాదన: లైట్స్ తీసుకోవడం ద్వారా ధూమపానాన్ని వదలడాన్ని ఆలస్యం చేయవచ్చు

4.వాదన: లైట్స్ తీసుకోవడం ద్వారా ధూమపానాన్ని వదలడాన్ని ఆలస్యం చేయవచ్చు

నిజం : అనేకులు ధూమపానాన్ని వెంటనే వదిలెయ్యడానికి మొగ్గు చూపలేరు, అందుచేతన ఫిల్టర్ ఉండేలా, లైట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అందరి శరీరాలు ఒకేలా ఉంటాయి అనుకోవడం పొరపాటే, కొందరు తక్కువ పరిమాణంలో నికోటిన్ కు గురయినా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోకతప్పదు. అనేకమంది పాసివ్ స్మోకింగ్ ద్వారా కూడా కాన్సర్ కు బలవుతున్నారని తెలియనిది కాదు, అనగా ధూమపానం చేయకపోయినా, చేసే వారి పక్కనచేరి తెలీకుండా పీల్చిన పొగ కూడా కాన్సర్ వంటి వ్యాధులకు కారణమని అనేక ప్రయోగాలలో తేలింది కూడా. కావున లైట్స్ అనుకుని జీవితాన్ని లైట్ తీసుకోవడం సరికాదు.

5.వాదన : నికోటిన్ ప్రత్యామ్నాయాలకు పూర్తిగా అలవాటు పడడం ద్వారా ధూమపానాన్ని వదిలేయవచ్చు.

5.వాదన : నికోటిన్ ప్రత్యామ్నాయాలకు పూర్తిగా అలవాటు పడడం ద్వారా ధూమపానాన్ని వదిలేయవచ్చు.

నిజం: ఎక్కువమంది నికోటిన్ చ్యూయింగ్ గం లా తీసుకోవడం ద్వారా పొగ పీల్చడం ఉండదు, తద్వారా సమస్యకు దూరం కావొచ్చు అనుకుంటారు. కానీ ఇవి తాత్కాలికంగా పనిచేస్తాయే తప్ప, వీటికి అలవాటు పడడం వలన శరీరంలోకి నెమ్మదిగా నికోటిన్ చేరే అవకాశాలు కూడా లేకపోలేదు.

6.వాదన : ధూమపానాన్ని వదిలివేయడం ద్వారా బరువు పెరుగుతారు

6.వాదన : ధూమపానాన్ని వదిలివేయడం ద్వారా బరువు పెరుగుతారు

నిజం : కొందరు వైద్యుల కథనం ప్రకారం ధూమపానానికి, ఆహారాన్ని ప్రత్యామ్నాయంగా చేసుకోవడం ద్వారా ఊబకాయానికి సైతం గురయి, శరీరంలో పొట్ట చుట్టూ క్రొవ్వులు పేరుకునే అవకాశాలు ఉన్నాయి. ధూమపానం ఆపివేసినవారు నెమ్మదిగా వ్యాయామానికి అలవాటు పడడం అన్నిటా మేలు.

7.వాదన : ఈ – సిగరెట్స్ వలన ఏ సమస్యా లేదు

7.వాదన : ఈ – సిగరెట్స్ వలన ఏ సమస్యా లేదు

నిజం : నికోటిన్ కు ప్రత్యామ్నాయంగా భావించే ఈ – సిగరెట్లలో ఏయిరోసాల్ ఉన్నట్లుగా ఒక అమెరికన్ వైద్యుడు కనుగొన్నాడు. తద్వారా ఇందులో అనేక రకాల చెడు రసాయనాలు నికోటిన్ తో సహా ఉన్నాయని తేల్చారు. ఇవి కొన్ని ఖనిజ పదార్ధాలను ఊపిరితిత్తులలోనికి చేర్చి తద్వారా అనేక సమస్యలకు కారణమవుతున్నాయని తేల్చారు. ఎక్కువకాలం ఇవి తీసుకోవడం ప్రాణాంతకంగా మారవచ్చు.

8.వాదన : సరైన ఆహార ప్రణాళిక ఉంటే, నికోటిన్ తీసుకున్నా సమస్య లేదు

8.వాదన : సరైన ఆహార ప్రణాళిక ఉంటే, నికోటిన్ తీసుకున్నా సమస్య లేదు

నిజం : మీరు ఎలాంటి ఆహార ప్రణాళికలను కలిగి ఉన్నా, విష ప్రభావాన్ని ఆపలేరు. అలాంటిదే నికోటిన్ కూడా. ఈ నికోటిన్ వలన శరీరంలో కాన్సర్ దాదాపు అన్ని భాగాలలోనూ వస్తుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు, రక్తపోటు, అధిక ఒత్తిడులు డిప్రెషన్ వంటి సమస్యలకు ప్రధాన కారకంగా ధూమపానం ఉంది.

9.వాదన : ధూమపానాన్ని వదిలెయ్యడం వలన ఆలోచన విధానాలు మారుతాయి

9.వాదన : ధూమపానాన్ని వదిలెయ్యడం వలన ఆలోచన విధానాలు మారుతాయి

నిజం : నికోటిన్ అలవాటు ఉన్నవారికి ప్రతి ౩౦నిమిషాలకు కనీసం ధూమపానం చేయాలన్న ఆలోచన ఉంటుంది. పూర్తిగా ఆపివేసినప్పుడు, ఆ ఆలోచన రావడం, మీరు కఠినంగా ఉన్న పక్షంలో నెమ్మదిగా ఆలోచన చచ్చిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఒక రెండు వారాలు ఉన్నా, నెమ్మదిగా వెళ్ళిపోతాయి.

English summary

9 Common Smoking Myths Debunked

Nowadays, the government and the media have made it their mission to inform people of how smoking a cigarette can devastate your health. Smoking puts you at a major health risk, as the nicotine flows through your veins. But, there are many myths and facts on smoking that you aren't aware of. This article will debunk all your smoking-related myths.
Story first published: Saturday, April 21, 2018, 10:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more