For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రెప్ థ్రోట్ ( గొంతులో పుండ్లు) నివారణకు 10 గృహ చిట్కాలు

స్ట్రెప్ థ్రోట్ ( గొంతులో పుండ్లు) నివారణకు 10 గృహ చిట్కాలు

By Lekhaka
|

మీరు గతంలో గొంతులో పుండ్ల వంటి సమస్యలను కలిగి ఉంటే, ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. నిజానికి స్ట్రెప్ థ్రోట్ ఒక బాక్టీరియా సంక్రమణం, ఇది మీ గొంతు నొప్పి మరియు వాపును ప్రభావితం చేస్తుంది. చికిత్స చేయకపోతే, ఇది మూత్రపిండాల వాపు లేదా రుమాటిక్ జ్వరంతో సహా మరిన్ని సమస్యలకు కారణంగా మారవచ్చు.

Common Sore Throat or Strep Throat: 10 Natural Remedies

ఈ సంక్రమణానికి ప్రధాన కారణం స్ట్రెప్టోకోకస్ పయోజెనిస్ లేదా స్ట్రెప్టోకోకస్-ఎ సమూహానికి చెందిన బ్యాక్టీరియా. ఈ బాక్టీరియా అత్యంత వేగంగా సంక్రమించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అత్యంత సాధారణ చికిత్సగా యాంటీ బయాటిక్స్ వాడకం ఉంటుంది, కానీ స్ట్రెప్ థ్రోట్ విషయానికి వస్తే యాంటీ బయాటిక్స్ కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మీరు స్ట్రెప్ థ్రోట్ సమస్యతో పోరాడుతుంటే, మీ లక్షణాల నుండి ఉపశమనం పొందటానికి మరియు మీ రోగనిరోధక వ్యవస్థను తిరిగి సంతరించుకోడానికి అనేక గృహ నివారణా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

1.విటమిన్-డి

1.విటమిన్-డి

రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో విటమిన్-డి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ డిసీజెస్లో ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, విటమిన్-డి లోపం మరియు శ్వాససంబంధిత పరిస్థితులు స్ట్రెప్ బ్యాక్టీరియా వలన వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తేలింది. విటమిన్-డి యొక్క రోజువారీ వినియోగం ద్వారా, స్ట్రెప్ థ్రోట్ నివారించవచ్చు.

2. హెర్బల్ టీ

2. హెర్బల్ టీ

మీరు స్ట్రెప్ థ్రోట్ సమస్యతో పోరాడుతున్నప్పుడు మీ గొంతును సాధారణంగా మార్చే క్రమంలో హెర్బల్-టీ పరిపూర్ణ పరిష్కారంగా ఉంటుంది. వాపును తగ్గించడం ద్వారా , నొప్పిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. చామంతి-టీ, నొప్పి, రద్దీ, మరియు వాపును తగ్గించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లతో కూడుకుని ఉంటుంది. డాండెలియాన్-టీ అనేది స్ట్రెప్ థ్రోట్ నివారణకు నిర్దేశించబడిన మరొక గొప్ప గృహ చికిత్సగా ఉంది. మీ రోగనిరోధక వ్యవస్థను పెంచడం ద్వారా ఇది సంక్రమణను తగ్గించే ప్రయత్నం చేస్తుంది.

3. ఆపిల్ సైడర్ వెనిగర్

3. ఆపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్, సహజ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది, దీనిలోని ఎసిటిక్ ఆమ్లానికి కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే. అనారోగ్యంగా ఉన్నప్పుడు దీనిని కొంచెం సిప్ చేయడం ద్వారా, శరీరంలో మంచి బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తూ ప్రమాదకరమైన బాక్టీరియాను చంపటానికి సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరియు ఇది తిరిగి మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా సహాయంచేసే తత్వాలని కలిగి ఉంటుంది.

4. హిమాలయన్ ఉప్పు

4. హిమాలయన్ ఉప్పు

పింక్ హిమాలయన్ ఉప్పును కలిపిన నీటిని గొంతులో గలగరించడం ద్వారా స్ట్రెప్ థ్రోట్ సంబంధించిన వాపు తగ్గుదలలో సహాయపడగలదు. ఇది మీ శరీరంలో ఆల్కలీన్ వాతావరణాన్ని సృష్టించడానికి మీ నోటి యొక్క పి.హెచ్ సంతులనాన్ని కూడా తాత్కాలికంగా పెంచుతుంది. ఇది చెడు బ్యాక్టీరియా మనుగడను కష్టతరం చేస్తుంది. పింక్ హిమాలయన్ ఉప్పు ఒక సహజ సిద్దమైన యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను సైతం కలిగి ఉంటుంది.

5. పెప్పర్మింట్ ఆయిల్

5. పెప్పర్మింట్ ఆయిల్

పెప్పర్మిట్ ఆయిల్ గొంతు సమస్యల పరిష్కారానికి ఒక సహజ సిద్దమైన నివారణగా చెప్పబడినది. ఇది మెంథోల్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్రమంగా ఇది గొంతులో శీతలీకరణ సంచలనాన్ని కలిగిస్తుంది మరియు శరీరంలో ఒక ప్రశాంతమైన ప్రభావాన్ని ఏర్పరచడంలో సహాయం చేస్తుంది. కేవలం 1-2 చుక్కల పిప్పరమెంటు చమురును ఒక గ్లాస్ నీటిలో తీసుకుని గలగరించడం. మరియు సమయోచిత ఉపయోగం కోసం, మీ గొంతు, ఛాతీ మరియు కణత భాగాలలో 1-2 చుక్కలను వర్తించి మసాజ్ వలె చేయడం ద్వారా ఫలితాన్ని పొందగలరు.

6. ముడి తేనె

6. ముడి తేనె

ముడి తేనెలో అనేక వైద్యవిశిష్టతలు ఉన్నాయని మనకు ఇదివరకే తెలుసు, దానిలోని యాంటీ బాక్టీరియల్ చర్యకు కృతజ్ఞతలు. సంక్రమణను నివారించడానికి ఇది ఒక రక్షిత అవరోధాన్ని సృష్టించగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ముడి తేనెలోని అనామ్లజనకాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది స్ట్రెప్ థ్రోట్ నొప్పి ఉపశమనానికి సహాయపడుతుంది.

 7. బోన్ బ్రోత్

7. బోన్ బ్రోత్

మీరు గొంతు నొప్పికి గురై ఉన్నప్పుడు బోన్ బ్రోత్ తీసుకోవడం ఉత్తమంగా సూచించబడినది. దీనిలోని మినరల్స్, మీ శరీరం సులభంగా కాల్షియం, మెగ్నీషియం మరియు భాస్వరం వంటి ఖనిజాలను శోషించుకునేలా సహాయం చేస్తుంది. అంతేకాకుండా, మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడగలదని చెప్పబడింది.

8. ఎల్డెర్బెర్రీ

8. ఎల్డెర్బెర్రీ

ఎల్డెర్బెర్రీ యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది స్ట్రెప్ థ్రోట్ సమస్యతో పోరాడుతున్నపుడు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. మీరు, ఎల్డెర్బెర్రీ-టీ తాగడానికి గుళికలు లేదా పొడిని కొనుగోలు చేయవలసి ఉంటుంది. దీనిని ద్రవ రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు స్ట్రెప్ థ్రోట్ కలిగి ఉంటే, ఆయుర్వేదిక్ లేదా ఆహార-ఆరోగ్య దుకాణాలలో దీనికోసం ప్రయత్నించవచ్చు.

9. నిమ్మ నూనె

9. నిమ్మ నూనె

దీనిలోని సహజ సిద్దమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ధన్యవాదాలు. నిమ్మ చమురు శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. పరిశోధనల ప్రకారం నిమ్మ నూనె యాంటిబయోటిక్, మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాల పెరుగుదలను పరిమితం చేస్తుంది. స్ట్రెప్ థ్రోట్ నివారణకు గృహ నివారణ చిట్కాగా ఉపయోగించటానికి, ఒక గ్లాసు నీటిలో 1 నుండి 2 చుక్కల నిమ్మ చమురును జోడించండి. మీరు మరింత రుచి లేదా అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం హెర్బల్- టీ కు జోడించవచ్చు కూడా.

10. ఆయిల్ పుల్లింగ్

10. ఆయిల్ పుల్లింగ్

నోటిలో స్ట్రెప్ బ్యాక్టీరియా ఉనికిని ఆయిల్ పుల్లింగ్ తగ్గించగలదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్, మీ నోటిలో ఒక శుభ్రమైన, బాక్టీరియా-రహిత పర్యావరణాన్ని సృష్టించడానికి, క్రమంగా చెడు బాక్టీరియాను తొలగించడానికి సూచించిన ఉత్తమ మార్గాలలో ఒకటిగా ఉంది. మీ నోటిలో కొబ్బరి నూనె 1 నుండి 2 టేబుల్ స్పూన్లు తీసుకుని, సుమారు 10 నిముషాల పాటు ఉంచి, చెత్తలో ఉమ్మివేయండి. మీ నోరు శుభ్రం చేసిన తర్వాత మీ దంతాలను బ్రష్ చేయండి.

English summary

Common Sore Throat or Strep Throat: 10 Natural Remedies

Strep Throat: 10 Natural Remedies,If you’ve ever had strep throat, you know what a pain it can be. Literally. Strep throat is a bacterial infection that can make your throat feel sore and swollen. If untreated, it can cause further complications, including kidney inflammation or rheumatic fever.
Story first published:Wednesday, August 29, 2018, 18:10 [IST]
Desktop Bottom Promotion