For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వక్కపొడి వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు

వక్కపొడి వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు

|

వివిధ ఏషియన్ కల్చర్స్ లో వక్కపొడికున్న విశిష్టత ప్రతేక్యం. వక్కపొడిని పాన్ రూపంలో తీసుకోవడం ఎంతో మందికి అలవాటే. పాన్ ను తీసుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే, పాన్ తయారీ అనేది దేశానికీ అలాగే దేశానికీ విభిన్నంగా ఉంటుంది. పాన్ తయారీలో సాధారణంగా సున్నం, తమలపాకు, యాలకులు, దాల్చినచెక్క మరియు టొబాకోలను వినియోగిస్తారు. వక్కపొడి అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందువలనే, చాలా మంది పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.

ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఆఫ్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రకారం పాన్ తయారీలో వాడే పదార్థాలలో యాలకులు అలాగే దాల్చిన తప్పించి మిగతావన్నీ క్యాన్సర్ కి దారితీస్తాయి. వీటిలో, వక్కపొడి ముందు స్థానాన్ని కైవసం చేసుకుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది వక్కపొడిని క్యాన్సర్ కారకంగా ప్రకటించింది. వక్కపొడిని నమలడంఅనే చర్యను మీరు ఆస్వాదించవచ్చు. అయితే, దీని వలన ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఇక్కడ, అటువంటి కొన్ని హెల్త్ రిస్క్స్ గురించి వివరించాము.

క్యాన్సర్

క్యాన్సర్

అనేక అధ్యయనాలలో వక్కపొడిని తీసుకోవడం వలన నోటి క్యాన్సర్ తో పాటు ఎసోఫిగాస్ క్యాన్సర్ బారిన ప్రమాదం పెరుగుతుందని ఆమోదయోగ్యమైన వివరణలతో వెల్లడైంది. వక్కపొడిని నమిలేవారు ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ బారిన ప్రమాదం ఎక్కువని తెలుస్తోంది. నోటిలో తలెత్తే ఈ నయం కానీ అనారోగ్యం వలన రాను రాను జా మూవ్మెంట్ కోల్పోయే ప్రమాదం ఉంది.

గుండె సమస్యలు:

గుండె సమస్యలు:

అధ్యయనాల ప్రకారం వక్కపొడిని తీసుకోవడానికి అలాగే గుండెవ్యాధుల బారిన పడే ప్రమాదం పెరగడానికి, మెటబాలిక్ సిండ్రోమ్ కు గురవడానికి అలాగే ఊబకాయం సమస్యకు గురవడానికి మధ్య బలమైన బంధం ఉందని తెలుస్తోంది.

దంత సమస్యలు:

దంత సమస్యలు:

తరచూ వక్కపొడిని నమలడం వలన గమ్ ఇరిటేషన్ తో పాటు టూత్ డీకే సమస్య తలెత్తుతుందని తెలుస్తోంది. కెమికల్ రియాక్షన్ వలన దంతాలు శాశ్వతంగా ఎరుపు లేదా నల్లటి రంగులోకి మారిపోవచ్చు.

కెమికల్ రియాక్షన్స్:

కెమికల్ రియాక్షన్స్:

ఇతర డ్రగ్స్ తో లేదా హెర్బల్ సప్లిమెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు వక్కపొడి శరీరంలో అనేక టాక్సిక్ రియాక్షన్స్ కు దారితీస్తుంది. మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఇతర దుష్ప్రయోజనాలు:

ఇతర దుష్ప్రయోజనాలు:

వక్కపొడిని తరచూ తీసుకోవడం వలన అడిక్షన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. వక్కపొడి అలవాటును మానుకోలేకపోతారు. వక్కపొడిని నమలడం ఆరోగ్యకరం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

English summary

dangers-of-chewing-betel-nut

Is betel nut dangerous? Do you know about the dangers of chewing betel nut? Read on to know…
Story first published:Wednesday, July 11, 2018, 17:57 [IST]
Desktop Bottom Promotion