For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైంగిక సంబంధం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసా?

లైంగిక సంబంధం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసా?

|

విశ్వసనీయత, ఆసక్తి, భద్రత మొదలైన అంశాలతో కూడిన పరిపూర్ణ సంబంధాన్ని నిర్వచించమని మిమ్మల్ని ఎవరైనా అడుగుతుంటే, మీ భాగస్వామితో ఉన్న ఒక గొప్ప లైంగిక కెమిస్ట్రీ మీ మనస్సుకి వస్తుంది. అవునా?

మంచి లైంగిక సంబంధం మరియు అద్భుతమైన లైంగిక కెమిస్ట్రీ కలిగి ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా తప్పు కాదు, నిజానికి ప్రతి జంట మధ్య ఒక ఆరోగ్యకరమైన లైంగిక సంబంధం ఉండడం అవసరం.

Did You Know About This Benefit Of Having Sex?


మనకు ఇప్పటికే తెలిసినట్లుగా, ప్రతి జీవి ఆకలి, దాహం, మనుగడ వంటి ప్రవృత్తులను మరియు లైంగిక ప్రేరేపకాలు వంటి ప్రాథమిక ప్రవృత్తులను కలిగి ఉంటుంది.

లైంగిక సంబంధం కలిగి ఉండాలనే కోరిక మానవాళిని ప్రోత్సహిస్తుంది మరియు లైంగిక సంబంధం కలిగి ఉండటం అనేది ఒక ప్రాథమిక స్వభావంగా ఉంది.

లైంగిక సామర్థ్యంను పెంచే 15 ఇండియన్ సూపర్ ఫుడ్స్ లైంగిక సామర్థ్యంను పెంచే 15 ఇండియన్ సూపర్ ఫుడ్స్

పునరుత్పాదక చర్యల కోసమే కాకుండా, లైంగిక సంబంధం కూడా చాలా ఆహ్లాదకరoగా మరియు సరదాగా ఉంటుంది మరియు భాగస్వాముల మధ్య బంధాన్ని బలపరుస్తుంది.

లైంగిక సంబంధంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి, పునరుత్పత్తికి సహాయపడటంతో పాటు మానసిక ప్రశాoతతను పొందుటలో ఎంతగానో దోహదపడుతుంది. లైంగిక సంబంధం సమయంలో ఎండోర్ఫిన్లు మరియు సెరోటోనిన్లు వంటి అనేక ఆరోగ్యకరమైన హార్మోన్లు శరీరంలో విడుదలవుతాయి, ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కేంద్ర బిందువుగా ఉంటాయి కూడా.

డిప్రెషన్ తగ్గించడం, ఒత్తిడిని తగ్గించడం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కలిగి ఉండటం వంటి ఇతర ప్రయోజనాలతో సహా, బుద్ది మాంద్యానికి చికిత్స చేయడానికి, మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడo వరకు లైంగిక సంబంధం వలన అనేకములైన అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నా, అనేక కారణాల వలన, చాలామంది ప్రజలు సాధారణ లైంగిక సంబందాన్ని కలిగి ఉండరు.

తీరిక లేని సమయాల వలన లైంగిక సంబంధం కుదరక ఒత్తిడి, లైంగిక అసమతుల్యత మరియు స్తబ్ధత క్రమంగా వంధ్యత్వం, శీఘ్రస్ఖలనo వంటి లైంగిక సమస్యలతోపాటు, సంబంధం పట్ల ఆసక్తి లేకపోవడం, భాగస్వామితో సరైన బంధం లేకపోవడం, లైంగిక భాగస్వామి లేకపోవడం లేదా సరైన లైంగిక భాగస్వామి లేకపోవడం వంటివి అనేక మంది ప్రజలకు లైంగిక సంబంధాలు కలిగి లేకపోవడానికి ఉన్న కొన్ని ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

కానీ లైంగిక సంబంధం లేని కారణంగా, వాటి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తప్పడం వలన అనేక ప్రతికూల పరిస్థితులకు కేంద్రబిందువుగా ఉంటున్నారు.

ఈ విషయం తెలిస్తే..మగవారు సెక్స్ ను అస్సలు విడిచిపెట్టరు?ఈ విషయం తెలిస్తే..మగవారు సెక్స్ ను అస్సలు విడిచిపెట్టరు?

మీకు తెలుసా లైంగిక సంబంధాలను తరచుగా కలిగి ఉండడం మూలంగా వయసుతో నిమిత్తం లేకుండా ముందుగా వచ్చే వృద్ధాప్య చాయలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతాయి. మరియు చాలా కాలం వరకు యవ్వనంగా ఉండవచ్చు కూడా. ఎలానో ఇప్పుడు తెలుసుకోండి.

శరీర కణాల యొక్క వృద్ధాప్య ప్రక్రియ :

మనలో వృద్దాప్య చాయలు కలగడం అంటే, బూడిద జుట్టు, ముడతలు, చర్మంపై సున్నితమైన పంక్తులు, క్రుంగిపోయిన చర్మం, అలసట, జాయింట్ నొప్పి, మధుమేహం, ఆర్థరైటిస్ మొదలైన వయస్సు – సంబందిత అనారోగ్యాలు వంటి వృద్ధాప్య గుర్తులను చూస్తాము. అవునా?

ఇది వయస్సుతో పాటు, శరీరం యొక్క కణాలు వేగవంతముగా వయస్సుతో పాటు క్షీణించటం ప్రారంభమవుతాయి.

30 సంవత్సరాల వయస్సులోనే, మీరు మీ జుట్టులోని కొన్ని తెల్ల వెంట్రుకలను చూడవచ్చు, 40 ఏళ్ళు వచ్చేసరికి హెయిర్ – డై లకు అలవాటు పడడం పరిపాటిగా చూస్తుంటాము.

దీనికి కారణం, ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత, శరీర కణాల క్షీణత వేగంగా జరగడమే. వాస్తవానికి కొందరు వ్యక్తులు అనారోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉంటారు అనగా చెడు ఆహారాలకు మొగ్గు చూపడం, వ్యాయామం లేకపోవటం, అధిక ఒత్తిడి, మొదలైనవి కణాల అకాల క్షీణతకు కారణభూతమవుతాయి. అలాంటి సందర్భాలలో, వారు అత్యంత పిన్న వయస్సులోనే వృద్ధాప్య సంకేతాలను అనుభవించటం జరుగుతుంటుంది.

శృంగారం గురించి నమ్మశక్యం కాని కొన్ని వాస్తవాలుశృంగారం గురించి నమ్మశక్యం కాని కొన్ని వాస్తవాలు

మనలో చాలామంది వయసు మీదపడడాన్ని అస్సలు సహించలేరు. మరియు జీవితకాలమంతా దృడంగా, ఆరోగ్యంగా ఉండాలని కలలు కంటూ ఉంటారు. ఈ కలలే, అనేక లాభసాటి వ్యాపారాలకు కారణమని వేరే చెప్పనవసరం లేదు కూడా.

కాబట్టి, సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు, కణాల అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడానికి మార్గాలను చూడవలసి ఉంటుంది.

ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు మరియు క్రమంగా లైంగిక సంబంధం కలిగి ఉండడం, ద్వారా శరీర కణాల అకాల వృద్ధాప్యాన్ని కూడా నిరోధించవచ్చని పరిశోధనా అధ్యయనాలు తెలుపుతున్నాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు, లైంగిక సంబంధం ద్వారా శరీర కణాల యొక్క అకాల వృద్ధాప్యాన్ని కూడా నిరోధించవచ్చని పరిశోధనా అధ్యయనాలు కనుగొన్నాయి.

క్రమంగా లైంగిక సంబంధాన్ని కలిగి ఉండడం వలన, ఎలా కణాల క్షీణతను నిరోధించవచ్చు?

ఇంతకుముందు చదివినట్లుగా, క్రమంగా లైంగిక సంభోగం కలిగి ఉండడం మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ఎండోర్ఫిన్లు మరియు సెరోటోనిన్లు వంటి హార్మోన్లు శరీరంలో విడుదల కావడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రపంచంలోనే వింతైన..విడ్డూరమైన సెక్స్ రూల్స్ ..!!ప్రపంచంలోనే వింతైన..విడ్డూరమైన సెక్స్ రూల్స్ ..!!

ఎండోర్ఫిన్లు మరియు సెరోటోనిన్లు వంటి హార్మోన్లు, కణాల వేగవంతమైన క్షీణతను తగ్గించగల సామర్థ్యం కలిగి ఉంటాయి, తద్వారా వృద్ధాప్య ప్రక్రియను తగ్గించగలవు.

అవే హార్మోన్లు వ్యాయామం సమయంలో, లేదా ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు మరియు ఎక్కువ ఉత్తేజితమైనప్పుడు విడుదల అవుతూ ఉంటాయి.

కాలిఫోర్నియా యూనివర్సిటీలో నిర్వహించిన ఒక పరిశోధనా అధ్యయనంలో, 129 మంది మహిళలపై జరిపిన ఒక సర్వే ఆధారంగా, లైంగిక సంబంధం వలన దీర్ఘాయువు లేదా మీ జీవితకాలాన్ని పెంచుతుందని నిర్ధారించారు కూడా.


ఈ అధ్యయనంలో, క్రమంగా లైంగిక సంబంధం కలిగి ఉన్న వారిలో , టెలోమేర్ల పొడవు కూడా క్రమబద్దీకరించబడుతుంది(వృద్ధాప్యం మరియు జీవిత కాలానికి బాధ్యత వహించే డి.ఎన్.ఏ స్ట్రాండ్స్ లో కనిపించే రక్షణ పొరలు) అందువలన అకాల వృద్ధాప్యతను నిరోధించడం సాధ్యమై మీ జీవితకాలం కూడా పెరుగుతుంది.

సాధారణంగా, టెలోమేర్ వివిధ జీవన విధానాల కారణాల వలన వయస్సుతో పాటు చిన్నదిగా ఉంటుంది, కానీ క్రమంగా లైంగిక సంబంధం కలిగి ఉండడం ద్వారా టెలోమేర్ పొడవును ఎక్కువ కాలంపాటు ఉంచగలదు.

సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా అశ్వగంధ తినాల్సిందే..!! సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా అశ్వగంధ తినాల్సిందే..!!

క్రమం తప్పకుండా లైంగిక సంబంధం కలిగి ఉండడం ఎంతో ప్రయోజనకరoగా ఉంటుంది, ఇది వృద్దాప్య చాయలను నివారించడమే కాకుండా ఎక్కువ కాలం మీరు యవ్వనoగా మరియు ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తుంది.

ప్రతి వారం కనీసం 2 - 4 మార్లు కనీసం లైంగిక సంబంధాలు కలిగి ఉండటం పైన పేర్కొన్న లాభాలను సులభతరం చేయగలదని నిపుణులు చెబుతున్నారు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలుపండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలకోసం తరచుగా బోల్డ్స్కీ పేజిని సందర్శించండి.

English summary

Did You Know About This Benefit Of Having Sex?

It's known that having regular sexual intercourse with your partner helps you staying healthy and strong! It is also a form of a physical exercise, but did you know it can slow down ageing. Our body releases hormones like endorphins and serotonins are secreted while we have sex, these slow down rapid degeneration of cells resulting in slow ageing.
Story first published:Saturday, May 26, 2018, 15:15 [IST]
Desktop Bottom Promotion