For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దానిమ్మరసం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గూర్చి మీకు తెలుసా?

|

మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో పండ్లరసాలు కూడా మనం తీసుకునే ఆహారాలలో చాల ముఖ్యమైన భాగం. ఆకుపచ్చని పండ్లరసాలు మనకు ఆరోగ్యకరమైనవిగా సూచించబడుతున్నందున అత్యంత జనాదరణను పొందినప్పటికీ, ఒక పండు మాత్రం ఇతర వాటికన్నా చాలా ఆరోగ్యకరమైనదని చెప్పబడింది.

అవును, అది బాగా శక్తివంతమైన వనరులను కలిగిన "దానిమ్మపండు రసం" ! దానిమ్మ (పునికా గ్రానటం) అందరికీ సులభంగా లభించే పండు. ఆరోగ్యకరమైన పండ్ల రసాలలో దానిమ్మకు చోటు దక్కుతుంది, ఇది చాలా వ్యాధులను నిర్మూలించి, నివారించ గలిగే లక్షణాలను కలిగి ఉంటుంది.

Did You Know These Amazing Benefits Of Pomegranate Juice

దానిమ్మపండు రసం వల్ల కలిగే ప్రయోజనాల గూర్చి ఇటీవల అధ్యయనం చేయబడ్డాయి, ముఖ్యంగా ఈ రసం చాలా అవసరమైన పోషక పదార్ధాలతో పూర్తిగా నిండి ఉందని, ఇది గ్రీన్-టీ తో సమానంగా ఉండి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ ఫలం నుండి సేకరించిన ఎర్ర వైన్ లాంటి రసం అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్ల తో పూర్తిగా నిండి ఉంది, అందువల్ల పలు సాధారణమైన & భయంకరమైన వ్యాధుల చికిత్సకు ఇది ఒక ఆరోగ్యకరమైన ఛాయిస్. ప్రతిరోజూ తాజాగా చేసిన దానిమ్మపండు రసమును తాగడం వల్ల అసంఖ్యాక మార్గాల్లో శరీరానికి మేలు చెయ్యడంలో సహాయపడుతుంది.

ఈ పండు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం !

1. క్యాన్సర్ వ్యతిరేకిని :

1. క్యాన్సర్ వ్యతిరేకిని :

దానిమ్మరసం క్యాన్సర్ & ట్యూమర్ల వంటి అనేక రకాల కారకాలతో పోరాడటానికి సహాయపడుతుంది, ప్రోస్టేట్ క్యాన్సర్ & రొమ్ము క్యాన్సర్లతో సహా ! ఇది క్యాన్సర్ కణాల ఉత్పత్తిని తగ్గించి, వాటిని నిర్మూలించగలదని చెప్పబడింది. క్యాన్సర్ను నిర్మూలించి, నివారించగలిగే సామర్థ్యం ఈ దానిమ్మరసంతో కలుగుతాయని కొన్ని అధ్యయనాల ద్వారా బయటపడింది.

2. ఆరోగ్యమైన గుండె కోసం :

2. ఆరోగ్యమైన గుండె కోసం :

దానిమ్మరసం గుండె పనితీరును మెరుగుపర్చడం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దానిమ్మరసమును తాగడం వలన రక్తపోటు తగ్గిపోతుంది, అలాగే ధమనులలో ఉన్న అడ్డంకులు నివారించబడతాయి.

3. యాంటీ డయాబెటిక్ లక్షణాలు :

3. యాంటీ డయాబెటిక్ లక్షణాలు :

డయాబెటిక్ రోగులకు ఇతర పండ్లను కాకుండా, దానిమ్మరసమును సిఫారసు చేయబడింది, ఎందుకంటే ఇది డయాబెటిక్ రోగులకు ఈ పండ్ల రసం బాగా ఉపయోగపడవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను & కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, అలానే 2వ రకం డయాబెటిస్ లక్షణాలను కూడా నిరోధిస్తుంది.

4. రక్తహీనతను తగ్గిస్తుంది :

4. రక్తహీనతను తగ్గిస్తుంది :

ఫోలేట్లో అధికంగా ఉండే ఈ పండ్ల రసము, అనేమియాతో బాధపడేవారికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఈ దానిమ్మ రసం ఐరన్ను కలిగిన గొప్ప మూల పదార్థం. ఇది రక్తహీనత ఉన్న రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ రసంలో ఉండే విటమిన్ K కంటెంటు రక్తం గడ్డకట్టడానికి, అందులో ఉండే ఫోలేట్కు ఎర్ర రక్తకణాలు ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.

5. ఆరోగ్యవంతమైన చర్మం కోసం :

5. ఆరోగ్యవంతమైన చర్మం కోసం :

దానిమ్మ రసం, విటమిన్ సి తో పుష్కలంగా నిండి ఉంది, ఇది ఆరోగ్యకరమైన & యవ్వనమైన చర్మంను కలిగి ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. దానిమ్మరసం చర్మపు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిగా తగ్గించే యాంటీ-ఎర్జింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ముడుతలను నిరోధిస్తుంది, కొత్తచర్మమును పునరుత్పత్తి చేయుటలో సహాయపడుతుంది, అలాగే వివిధ చర్మ సంబంధిత వ్యాధులతో కూడా పోరాడుతుంది. ఇది పింపుల్స్ & మోటిమలను కూడా చికిత్స చేయవచ్చు, అలానే పొడి చర్మాన్ని నిరోధించడంలో కూడా సహాయపడుతుంది.

6. ఆరోగ్యవంతమైన జుట్టు కోసం :

6. ఆరోగ్యవంతమైన జుట్టు కోసం :

దానిమ్మ రసాన్ని తాగడం వల్ల మీకు ఒత్తయిన, ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తుంది. ఇది మీ వెంట్రుకల కుదుళ్లను బాగా బలంగా చేయడం ద్వారా జుట్టు రాలిపోవటాన్ని నివారించి, మీ జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది, అలాగే మాడు వద్ద రక్త ప్రసరణను పెంచుతుంది.

7. దంతాలను బలపరుస్తుంది :

7. దంతాలను బలపరుస్తుంది :

దానిమ్మరసం, దంతాలపై ఫలకాన్ని ఏర్పరచకుండా నిరోధించగలిగే ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది, నోటి వాషెష్తో పోలిస్తే ఇది చాలా మెరుగైన ఛాయిస్గా ఉంది. దానిమ్మరసం మీ పళ్ళను బలంగా చేసి, మీ దంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

8. రోగనిరోధక శక్తిని పెంచుతుంది :

8. రోగనిరోధక శక్తిని పెంచుతుంది :

ఈ ఆరోగ్యకరమైన దానిమ్మరసమును తాగడం వల్ల, మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దానిమ్మరసంలో కనిపించే శోథ నిరోధక సమ్మేళనాలు రోగనిరోధక సంబంధిత వ్యాధులతో పోరాడడానికి సహాయపడతాయి. విటమిన్ C సమృద్ధిగా ఉండే దానిమ్మరసం, మీ శరీరంలో రోగనిరోధక స్థాయిలను పెంచుతుంది.

9. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

9. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

దానిమ్మరసంలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది. ఈ దానిమ్మరసాన్ని ఒక గ్లాసు మోతాదులో తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావలసిన ఫైబర్ను అందించగలదు.

కాబట్టి, దానిమ్మరసము ఒక రుచికరమైన ఛాయిస్ మాత్రమే కాదు, ఆరోగ్యకరమైనది కూడా !

English summary

Did You Know These Amazing Benefits Of Pomegranate Juice?

One of the healthiest fruit juices suggested by doctors and nutritionists is pomegranate juice. This fruit juice has innumerable health benefits, as it is loaded with a lot of essential nutrients that can repair and boost the body. Many studies reveal that the medicinal properties of pomegranate juice are beneficial for overall health, including the skin and hair.
Story first published:Tuesday, April 10, 2018, 18:19 [IST]
Desktop Bottom Promotion