For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీటికీ మాటికీ ఆకలి వేస్తూ ఉందా? బహుశా ఈ కారణాలు ఉండొచ్చు

చీటికీ మాటికీ ఆకలి వేస్తూ ఉందా? బహుశా ఈ కారణాలు ఉండొచ్చు

|

శరీరo సరైన జీవక్రియలు నిర్వహించుటకు సమయానికి ఇంధనసరఫరా చేయాల్సి ఉంటుంది. అదే ఆహారం. ఆహారం అవసరమైనప్పుడు మన శరీరం మనకు చెప్తుంది, ఆకలి ద్వారా. దానికి తగ్గట్లు మనం ఆహారాన్ని అవసరమైన పరిణామంలో ఆరోగ్యకరరీతిలో అందివ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఆహారం ఆలస్యం చేస్తే కడుపు నొప్పి, ఆయాసం, తలనొప్పి, నీరసo, డీ-హైడ్రేషన్ వంటి సమస్యలు చుట్టుముట్టాడుతాయి. ఒక కొత్త బండిని కొన్నప్పుడు పెట్రోల్ పోసి, సమయానికి ఇంజిన్ ఆయిల్, చైన్-స్ప్రే, వాటర్ వాష్, సర్వీసులు అంటూ అపురూపంగా చూసుకుంటాం. అలాగే శరీరాన్ని కూడా ఒక కొత్త బండి వలె భావించాలి. సరైన వ్యాయామం, ఆహార ప్రణాళిక, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు వంటివి ఫాలో అవుతూ.

అయితే ఆకలి పట్టీలు ప్రజలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కొందరు సుదీర్ఘకాలం ఆహారం లేకుండా కూడా ఉండవచ్చు. కొందరు తరచుగా ఆకలితోనూ ఉండవచ్చు. మీరు రెండవ విభాగంలో ఉంటే, మీరు తరచుగా ఆకలి అనుభూతి చెందేందుకు ఒక నిర్దిష్ట కారణం ఉండే అవకాశo ఉంది.

Do You Feel Hungry Very Often? It Could Be Due To These Reasons,

ఇది నిర్జలీకరణం, ప్రోటీన్ లోపం, ఫైబర్ లేదా కొవ్వు లోపం, నిద్ర తక్కువ వంటి మొదలైన అనేక కారణాల వలన కావచ్చు. మీకు తరచూ ఆకలివేయడానికి గల కొన్ని కారణాలను ఇప్పుడు చూద్దాం.
ప్రోటీన్ లేకపోవడం:

ప్రోటీన్ లేకపోవడం:

ప్రోటీన్ అనేది మన శరీరంలో అత్యవసరమైన పోషకాలలో ఒకటి. ఆకలి తగ్గించేందుకు ప్రోటీన్ చక్కగా పని చేస్తుంది. ప్రోటీన్ కడుపును నిండుగా చేస్తుంది, మరియు మిమ్ములను ఆహారం వైపుకు మనసు వెళ్ళకుండా చేయగలుగుతుంది. క్రమంగా తక్కువ కాలరీలు ఉన్న ఆహారాన్నే తీసుకోగలుగుతారు. ఇది హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది, కడుపు నిండిన సంకేతాలను ఇస్తుంది. మరియు ఆకలిని ప్రేరేపించే హార్మోన్లను తగ్గిస్తుంది. ఆకలి హార్మోన్లను నియంత్రించే శక్తి ప్రోటీన్లో మాత్రమే ఉన్నందున, దాని లోపం ఆకలికి దారితీస్తుంది.

నిద్రలేమి:

నిద్రలేమి:

పని ఒత్తిడి కారణంగా జీవన శైలి మీద అధిక ప్రభావం పడి ఎక్కువ జనాభా నిద్రలేమి సమస్యలను ఎదుర్కుంటూ ఉంది. ఎందుకంటే లాప్టాప్ ముందేస్కుని పెండింగ్ పనులను పూర్తి చేయడానికే గంటలు వెచ్చించాల్సిన అవసరం ప్రజలది. కానీ శరీరానికి, సరైన కార్యాచరణకు తగినంత నిద్ర అత్యవసరం. సరైన నిద్ర పొందిన శరీరం గ్రెలిన్ ఉద్దీపన హార్మోన్ నియంత్రించడం మూలంగా ఆకలిని క్రమబద్దీకరించగలదు. నిద్రలేమి సమస్య ఉన్నప్పుడు, ఈ హార్మోన్ల స్థాయి క్రమంగా తగ్గుతుంది మరియు తరచుగా ఆకలికి దారి తీస్తుంది.

నిర్జలీకరణము:

నిర్జలీకరణము:

మన శరీరంలో మూడింట రెండు వంతు నీరు కలిగి ఉంటుంది. నీరు మన శరీరం యొక్క సరైన పనితీరుకు ఒక ముఖ్యమైన అవసరంగా ఉందని కూడా మనకు తెలుసు. ఒక రోజులో తగినంత నీటిని తాగడం మూలంగా అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చు మరియు రాకుండా చూడవచ్చు. నీరు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా, నీరు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. మరియు మీకు ఆకలి తరచూ కలుగకుండా చూస్తుంది. మీ భోజనానికి ముందు ఒక గ్లాసు నీటిని తీస్కున్నట్లయితే, మీరు తినే ఆహారం కన్నా తక్కువగా ఆహారాన్ని తీసుకుంటారు.

ఫైబర్ లోపం:

ఫైబర్ లోపం:

మీరు తరచుగా ఆకలికి గురవుతూ బాధపడుతున్నట్లయితే, మీ ఆహారంలో ఫైబర్ కంటెంట్ లోపం కూడా కారణం కావచ్చు. జీర్ణ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుటకు మరియు ఆకలిని నియంత్రించడంలో అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు సహాయపడతాయి. ఇది ఆకలి తగ్గించే హార్మోన్లను విడుదల చేస్తుంది మరియు ముఖ్యమైన షార్ట్-చైన్ ఆమ్లాల ఉత్పత్తిని పెంచుతుంది, క్రమంగా మీ కడుపుని శాంతపరుస్తుంది.

పరద్యానం:

పరద్యానం:

ఈ రద్దీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మల్టీ-టాస్కింగ్ విధానాలకు అలవాటు పడుతున్నారు అన్నది జగమెరిగిన సత్యం. క్రమంగా ప్రజలు వారు తినే ఆహారం మీద దృష్టి కేంద్రీకరించడం లేదు కూడా. ఆహారం తీసుకునేటప్పుడు పరద్యానం మీ ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. ఎందుచేతననగా, లాప్టాప్, కంప్యూటర్, లేదా టెలివిజన్ కు కళ్ళప్పగించడం, మొబైల్ గేమ్స్ ఆడడం, చాటింగ్ వంటి చర్యల వలన ఆహారాన్ని అధికంగా కానీ, తక్కువగా కానీ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా శరీరానికి అందివ్వవలసిన పోషకాలలో అసమతుల్యం ఏర్పడుతుంది.

క్రమబద్దమైన వ్యాయామం:

క్రమబద్దమైన వ్యాయామం:

మీరు క్రమo తప్పకుండా రోజూ వారీ విధానంలో భాగంగా వ్యాయామం చేస్తున్నట్లయితే, అది తరచుగా ఆకలికి దారి తీస్తుంది. మీ శరీరం కాలరీ-బర్నింగ్ ప్రక్రియలో పాలుపంచుకున్నప్పుడు, అది శరీరoలో ఉండే కొవ్వును తరచుగా కోల్పోవడం జరుగుతుంది. అందువలన, మీ శరీరం వేగవంతమైన జీవక్రియ సామర్ధ్యాన్ని కలిగి ఉండి క్రమంగా ఆకలికి దారితీస్తుంది.

మద్యపానం:

మద్యపానం:

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ భాదాకరమైన విషయం ఏమిటంటే, ఈ వాస్తవం అందరికీ తెలిసినప్పటికీ, చాలామంది వ్యసనపరులుగా ఉన్నారు. అధిక మద్యపానం మెదడు బలహీనతకు కారణమవుతుంది మరియు మీరు చాలా తరచుగా ఆకలికి గురవడం జరుగుతుంటుంది. ఇది ఆకలిని ప్రేరేపించే లక్షణాలను కలిగి ఉంటుంది మరియు సంపూర్ణత్వాన్ని ప్రోత్సహించే హార్మోన్ల ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. అసహజ ఆహారపు అలవాట్లకు కూడా మద్యపానం ప్రధాన కారణం.

కాలరీలను తాగేస్తున్నారు:

కాలరీలను తాగేస్తున్నారు:

మనం తీసుకునే ఆహారం ఎక్కువగా మన ఆకలిని ప్రభావితం చేస్తుంది. ఈ వేడి వేసవి నెలలో, మనం చల్లగా స్మూతీస్ మరియు పండ్లరసాలను తీసుకునే అవకాశం ఉంది. కానీ గంట వ్యవధిలోనే మనం ఆకలికి గురవడం పరిపాటి. ద్రవాహారం ఘనాహారo కంటే సులభంగా జీర్ణమవడమే దీనికి కారణం. మీరు అధికంగా ద్రవాహారాన్ని తీసుకున్న కొలదీ, మీ ఆకలి అవకాశాలు పెరుగుతూనే ఉంటాయి

ఒత్తిడి:

ఒత్తిడి:

ఇంటా బయటా శారీరిక మానసిక శ్రమల కారణంగా, ఒత్తిడి అనేది సర్వసాదారణమైపోయిన అంశంగా ఉన్నది. ఒత్తిడి మన భౌతిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు మరియు ఆకలి కోరికలకు కారణమవుతుంది. ఆకలిని ప్రేరేపించే కార్టిసోల్ హార్మోన్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అందువలన, మీరు తరచుగా ఆకలిని ఎదుర్కొంటూ ఉండి, నియంత్రించాల్సిన అవసరాన్ని గుర్తిస్తే మాత్రం, మీ మనస్సుని ఒత్తిడి నుండి బయటకు లాగాలి.

ఔషధ ప్రతిచర్య:

ఔషధ ప్రతిచర్య:

మీరు తరచుగా ఆకలిని ఎదుర్కొంటుంటే, దీనికి ఒక్కోసారి ఔషద ప్రతిచర్యలే (మెడికల్ రియాక్షన్) కారణం కావొచ్చు.

వేగంగా తినడం:

వేగంగా తినడం:

చాలా తరచుగా, మనలో అనేకమంది ఆహారాన్ని అధిక వేగంగా తింటూ ఆత్రుతను ప్రదర్శిస్తుoటారు. దీనికి కారణం, ఆహారం కన్నా ఇతరములైన పనులు ముఖ్యంగా భావించడం. కానీ మన శరీరం ఆహారాన్ని అనుభూతి చెందడం లేదు సరికదా, పోషకాల అసమతౌల్యం కూడా ఏర్పడుతుంది మరియు తరచుగా ఆకలి వేయడానికి కూడా కారణమవుతుంది. ఆహారం నెమ్మదిగా నమలడం ఆకలిని తగ్గించే హార్మోన్లను విడుదల చేస్తుంది మరియు ఆకలిని నియంత్రిస్తుంది. కావున గాబరాపడకుండా, నెమ్మదిగా ఆహారాన్ని తీసుకోవడమే అన్నివిధాలా శ్రేయస్కరం.

అనారోగ్యం:

అనారోగ్యం:

తరచుగా ఆకలి వేయడం అనేది మీరు సరైన సమయంలో గుర్తించని కారణంగా కొన్ని అసాధారణ రోగాలకు కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, మైగ్రేన్ వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది.

మీకు ఈ వ్యాసం నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి ఆరోగ్య సoబంధిత విషయాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

English summary

Do You Feel Hungry Very Often? It Could Be Due To These Reasons

Hunger is the natural cue that says the body requires food for proper body functioning. At any point in time, all of us have felt the symptoms of hunger, i.e., growling of stomach, headache, feeling irritated, etc. The bouts of hunger, however, vary according to people. Some can go without food for a long span of time, while others feel hungry very often.
Desktop Bottom Promotion