For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎసిడిటీ నడుము నొప్పిని కలుగజేస్తుందా?

ఎసిడిటీ నడుము నొప్పిని కలుగజేస్తుందా?

|

మన శరీరంలోని, గ్యాస్ట్రిక్ గ్రంథులు అధికంగా ఆమ్లాలు స్రవించడం వలన కలిగే కొన్ని లక్షణాల సమూహాన్ని ఎసిడిటీ లేదా ఆసిడ్ రిఫ్లక్స్ అంటారు. ఆహార నాళం ద్వారా ఆమ్లాలు పైకి ఎగదన్నడం వలన ఛాతీలో మంట, తదనంతరం మలబద్దకం మరియు అజీర్ణం కలుగుతాయి.

మనం తీసుకునే ఆహారం, ఆహారనాళం ద్వారా కడుపులోకి చేరుతుంది. అక్కడ గ్యాస్ట్రిక్ గ్రంథులు, ఆహారం జీర్ణమవ్వడానికి అవసరమైన ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి.

జీర్ణానికి అవసరమయ్యే పరిమాణం కన్నా, ఆమ్ల ఉత్పత్తి అధికంగా జరిగినపుడు, ఎసిడిటీ కలుగుతుంది. ఇలా వివిధ కారణాల వలన జరగవచ్చు. అందులో ఒక ముఖ్య కారణం అధికంగా కారం తినడం.

Acidity or acid reflux is the term used for a certain set of symptoms caused by the production of excess acid by the gastric glands in the body. It causes heartburn due to the acid flowing up through the food pipe which could be followed by constipation and indigestion. Read more at: https://www.boldsky.com/health/wellness/2018/does-acidity-cause-back-pain-123442.html

ఎసిడిటీ కలగడానికి ముఖ్య కారణాలేమిటి?

మనం తీసుకునే ఆహారం జీర్ణమవ్వడానికి దోహదపడే ఆమ్లాలు మన కడుపులో ఉత్పత్తి అవుతాయని మనందరికీ తెలిసినదే! మన జీర్ణవ్యవస్థపై, ఈ ఆమ్లాలు దుష్ప్రభావాలు చూపకుండా తటస్థీకరించడానికి, మన శరీరం కొన్ని బైకార్బనేట్లను శ్లేష్మ పొరలోకి విడుదల చేస్తుంది.

ఆమ్ల ఉత్పత్తి అధికమై, బైకార్బనేట్ల ఉత్పత్తికి అంతరాయం కలిగినపుడు, శ్లేష్మ పొరలో మంట మొదలవుతుంది. దీనినే ఎసిడిటీ అంటారు. ఎసిడిటీ కలగడానికి వివిధ కారణాలు ఉంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి-

Acidity or acid reflux is the term used for a certain set of symptoms caused by the production of excess acid by the gastric glands in the body. It causes heartburn due to the acid flowing up through the food pipe which could be followed by constipation and indigestion. Read more at: https://www.boldsky.com/health/wellness/2018/does-acidity-cause-back-pain-123442.html

1. భోజనం చేయకపోవడం, అతిగా తినడం మరియు అకాల భోజనం వంటి అనారోగ్యకర ఆహారపు అలవాట్లు.

2. ఆహారంలో అతిగా కారం మరియు మసాలాలు కలిగి ఉండటం

3. కడుపులో అల్సర్, ఆస్తమా, డయాబెటిస్, పొప్టిక్ అల్సర్ మొదలయిన సమస్యలు కలిగి ఉండటం

4. నాన్- స్టెరాయిడ్ నొప్పి నిరోధక మందులు, యాంటీబయాటిక్స్, ఆతృత, రక్తపోటు మరియు ఒత్తిడి నివారణ మందులు వంటి కొన్ని మందులు వాడేటప్పుడు కలిగే దుష్ప్రభావాలు

5. ఒత్తిడి మరియు నిద్రలేమి

6. అతిగా ధూమపానం మరియు మద్యపానం

Acidity or acid reflux is the term used for a certain set of symptoms caused by the production of excess acid by the gastric glands in the body. It causes heartburn due to the acid flowing up through the food pipe which could be followed by constipation and indigestion. Read more at: https://www.boldsky.com/health/wellness/2018/does-acidity-cause-back-pain-123442.html


ఎసిడిటీ యొక్క సర్వసాధారణ లక్షణాలు ఏమిటి?

1. గొంతు, కడుపు మరియు ఛాతీలో మంట,

2. మింగేటప్పుడు నొప్పి

3. వికారం

4. అజీర్ణం

5. మలబద్దకం

6. నోటి దుర్వాసన మరియు దంత సమస్యలు

7. అలసట

8. నోటిలో చేదు

9. త్రేనుపులు

10. ఉబ్బసం/పిల్లికూతలు

11. క్రానిక్ న్యుమోనియా

ఎసిడిటీ వలన నడుము నొప్పి కలిగే అవకాశం నిజంగా ఉందా?

దీనికి సమాధానం అవుననే చెప్పాలి. ఎసిడిటీ, నడుము నొప్పికి కారణం కావచ్చు. చాలా కేసులలో, ఎసిడిటీ వలన నడుము పై భాగం, నడుము క్రింది భాగం, ఛాతీ నొప్పి మరియు నడుము మధ్యలో నొప్పి కలిగినట్లు నివేదికలు ఉన్నాయి.

మన శరీరంలో జీర్ణావసరాలకై, HCl లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి చేయబడుతుంది. ఈ ఆమ్లానికి, మన శరీరంలో ఏ ప్రదేశంలో ఉన్న నరాలనైనా కొరికివేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని వలన వీపీ, ఛాతీ, నడుము మరియు భుజాల మధ్య నొప్పి కలుగుతుంది.

తీవ్రమైన ఎసిడిటీ సమస్య ఉన్నవారు, ఆమ్లం అన్నవాహికలోకి ఎగదన్నకుండా, ఛాతీ నుండి పై భాగం ఎత్తులో ఉండేటట్లు పడుకుంటారు. ఇలా చేయడం వల్ల, ఆమ్లం ఎగదన్నకుండా నిరోధింపబడినప్పటికి, వెన్నుకి మంచిది కాదు.

ఈ భంగిమలో ఎక్కువ కాలం పాటు పడుకున్నట్లైతే, మృదు కణజాళానికి నష్టం కలిగి, నడుము నొప్పి ఇంకా తీవ్రమవుతుంది.

ఈ నొప్పి యొక్క తీవ్రత వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది. ఈ సమస్యను పరిష్కరించకపోతే, దీర్ఘకాలిక ఎసిడిటీ, తీవ్రమైన నడుము నొప్పి మరియు ఇతర సంబంధిత లక్షణాలు మొదలవుతాయి.


ఎసిడిటీ వలన కలిగే నడుము నొప్పికి చికిత్స ఎలా ?

ఎసిడిటీ వలన కలిగే నడుము నొప్పి, కండరాలపై ఒత్తిడి లేదా గాయం వలన కలుగదు. ఇది జీర్ణవ్యవస్థలో అధిక ఆమ్లోత్పత్తి జరగడం వలన కలుగుతుంది. కనుక ఈ రకమైన నడుము నొప్పి చికిత్సకు, నొప్పి నివారణ మందులు పనికిరావు.

ఈ రకమైన నడుము నొప్పి చికిత్సకై, మూలలను వెతుక్కుంటూ వెళ్ళాలి. అదే ఎసిడిటీ. ఎసిడిటీ కలగడానికి ముఖ్య కారణం, క్రమశిక్షణ లేని ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి విధానాలు.

ఎసిడిటీ యొక్క తీవ్రత వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది. సమస్య తేలికపాటిదైనట్లైతే, సత్వరమే వాడటానికి ఎటువంటి మందులు లభ్యతలో లేవు. సమస్య తీవ్రత, ఎక్కువగా, చాలా కాలం నుండి ఉన్నట్లైతే, దానికి చికిత్స అవసరం.

వైద్యులు సాధారణంగా pH పరీక్ష నిర్వహించి, హిస్టమైన్ -2 బ్లాకర్స్ ను సిఫార్సుచేస్తారు. ఈ మందులు చాలా గాఢత కలిగిన మందులు. అనేక ఇతర మందుల వలే, ఈ మందులు కూడా దుష్ప్రభావాలు కలిగి ఉంటాయి.

ఈ సమస్య నివారణకు, మరొక మంచి ప్రత్యామ్నాయం, మూలికా ఔషధ విధానం. ఈ సమస్యను ప్రభావవంతంగా నివారించడానికి, ఎన్నో రకాల మూలికా సమ్మేళనాలు లభ్యతలో ఉన్నాయి. చామోమైల్ మరియు నిమ్మ రసాల కషాయం అద్భుతమైన పరిష్కారం చూపుతుంది. ఈ మూలికలు ఆర్గానిక్ దుకాణాలలో లభిస్తాయి. వీటితో టీ కాచుకొని రోజుకు రెండుసార్లు తాగితే సరి!

ఇక ఆహారం విషయానికి వస్తే, ప్రోటీన్లు అధికంగా, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారపదార్ధాలను సేవించాలి. అధికంగా తినడం మంచిది కాదు. తేలికపాటి, ఆరోగ్యవంతమైన ఆహారం భుజించాలి.

మీ మనసులో ఉంచుకోవలసిన ఇంకో విషయం ఏమిటంటే, నిద్రించే సమయంలో వదులైన దుస్తులు ధరించి, పాదాలు ఎత్తులో పెట్టుకుని పడుకోవాలి. దీనివలన ఎసిడిటీ నెమ్మదిస్తుంది. కొన్ని రకాల ఆహారపదార్ధాలు, ఎసిడిటీని రేకెత్తిస్తాయి.

నిమ్మజాతి పండ్లు, మద్యం, కాఫీ, ఉల్లిపాయ, వెల్లుల్లి, కర్బనీకరించిన శీతల పానీయాలు మొదలైనవి కొంతమందిలో ఎసిడిటీ కి ఆజ్యం పోస్తాయి.

మీకు ఎసిడిటీ మూలంగా తీవ్రమైన నడుము నొప్పి కలుగుతుంటే కనుక, యోగాని అభ్యసిస్తూ, ఎసిడిటీ కలుగజేసే ఆహారపదార్ధాలకు దూరంగా ఉండండి. కొద్దిరోజుల పాటు ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించి, మళ్లీ మొదటికే రావడం దీర్ఘకాలిక పరిష్కారం చూపదు. మీకు కనక ఎసిడిటీ సమస్య తరచూ సతాయిస్తున్నట్లైతే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అనివార్యం.

ఎసిడిటీ అనేది తేలికగా తీసిపారేయవలసిన సమస్య కాదు. అలా చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. అంతేకాక, ఇది మీ వెన్నుపై శాశ్వత దుష్ప్రభావం చూపించవచ్చు. పైన చెప్పబడిన జాగ్రత్తలన్నీ పాటించినప్పటికీ, ఈ సమస్య ముదిరిపోతుంటే, మీరు సరైన వైద్యుని తప్పక సంప్రదించాలి.

English summary

Does Acidity Cause Back Pain?

Acidity or acid reflux is the term used for a certain set of symptoms caused by the production of excess acid by the gastric glands in the body. It causes heartburn due to the acid flowing up through the food pipe which could be followed by constipation and indigestion.
Desktop Bottom Promotion