For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతిగా నీళ్లను తాగడం వలన మెదడు వాపుకు గురయ్యే ప్రమాదం తలెత్తుతుందా?

అతిగా నీళ్లను తాగడం వలన మెదడు వాపుకు గురయ్యే ప్రమాదం తలెత్తుతుందా?

|

మండే వేసవి కాలంలో వేడిని తట్టుకోవడానికి మనం ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉంటాం. నీటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ ను అరికట్టవచ్చని డాక్టర్ల నుంచి కూడా సూచనలు అందుతాయి. అయితే, డీహైడ్రేషన్ లాగానే ఓవర్ హైడ్రేషన్ కూడా ప్రమాదకరం.

ఇటీవలి అధ్యయనం ప్రకారం ఎక్కువగా నీటిని తీసుకుంటే శరీరంలో నీరు నిలిచిపోవడం అధికమవుతుంది. అందువలన, రక్తంలో ప్రమాదకరంగా సోడియం స్థాయిలు తక్కువవుతాయి. మెదడు కూడా వాపుకు గురవవచ్చు. ఈ ఆర్టికల్లో వాటర్ ఇంటాక్సికేషన్ గురించి తెలుసుకుందాం.

Drinking Too Much Water Can Lead To Brain Swelling, Says Study

వాటర్ ఇంటాక్సికేషన్ అంటే ఏంటి?

సోడియం యొక్క తక్కువ రక్త సాంద్రత (హైపోనట్రేమియా)ను వాటర్ ఇంటాక్సికేషన్ గా పేర్కొంటారు. తగినంత సోడియాన్ని భర్తీ చేయకుండా నీటిని ఎక్కువగా తాగడం వలన ఇలా జరుగుతుంది.

తగినంత నీటిని తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. మలబద్దకం సమస్య అరికట్టబడుతుంది. టాక్సిన్స్ శరీరంలోంచి బయటకు పోతాయి. అలాగే శరీరంలోని అన్ని మేజర్ ఫంక్షన్స్ సజావుగా సాగుతాయి. ఓవర్ హైడ్రేషన్ ను హైపోనట్రేమియా, హైపర్హైడ్రేషన్ మరియు వాటర్ పాయిజనింగ్ అని కూడా అంటారు. ఎలెక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వలన ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

సాధారణంగా రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తీసుకోమని వైద్యులు సూచిస్తున్నారు.

వాటర్ ఇంటాక్సికేషన్ అనేది అనేక కారణాల వలన తలెత్తవచ్చు.

వాటర్ ఇంటాక్సికేషన్ అనేది అనేక కారణాల వలన తలెత్తవచ్చు.

బలవంతంగా నీటిని తీసుకోవడాన్ని సైకోజెనిక్ పోలీడీప్సియాగా పేర్కొంటారు. ఇది మానసిక రుగ్మతలతో అనుసంధానమై ఉంటుంది.

ఎక్కువగా ద్రవాలను తీసుకోవడం అలాగే యాంటీ డైయూరేటిక్ హార్మోన్ యొక్క విడుదల ఎక్కువవడంతో అనుసంధానమై ఉంటుంది. దీని వలన కిడ్నీలు నీటిని నిలిపి ఉంచుతాయి. హీట్ రిలేటెడ్ ఇంజ్యూరీస్ వలన హైపోనట్రేమియా అనే సమస్య అథ్లెట్స్ లోకనిపించే అవకాశాలు కలవు.

గ్యాస్ట్రోయేంట్రయిటిస్ మరియు కిడ్నీస్ పనితీరు దెబ్బతినడం వలన కూడా యాక్సిడెంటల్ హైపోనట్రేమియా తలెత్తే సూచనలు కలవు.

కొన్ని రకాల ఆరోగ్యపరిస్థితులలో ఎలెక్ట్రోలైట్స్ ని వాడటం వలన అలాగే నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ఫీడింగ్, న్యూరాలజికల్ మరియు సైకియాట్రిక్ మెడికేషన్స్ వలన వాటర్ ఇంటాక్సికేషన్ సమస్య తలెత్తగలదు.

వాటర్ ఇంటాక్సికేషన్ లక్షణాలు:

వాటర్ ఇంటాక్సికేషన్ లక్షణాలు:

1. వికారం మరియు వాంతులు

2. తలనొప్పి, గందరగోళం మరియు దిక్కుతోచని స్థితి

3. హాలూసినేషన్స్, సైకోసిస్, డెల్యూషన్స్ మరియు అనుచిత ప్రవర్తన వంటి మానసిక రుగ్మతలు

4. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

5. కండరాల బలహీనత, నొప్పులు, తిమ్మిరి మరియు విపరీతమైన అలసట

6. తరచూ మూత్రానికి వెళ్ళవలసి రావడం

7. రక్తపోటుతో మార్పులు, గుండెకొట్టుకోవడంలో మార్పులు

8. సీజర్స్, బ్రెయిన్ స్టెమ్ హెర్నియేషన్, కోమా, తీవ్రమైన మగత, శ్వాసపీల్చడంలో విపరీతమైన ఇబ్బంది

వాటర్ ఇంటాక్సికేషన్ సమస్య శిశువులలో కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా 9 నెలల లోపు చిన్నారులలో ఈ సమస్య కనిపించవచ్చు. ఏడుపు, శ్వాసలో ఇబ్బందులు, ప్రవర్తనలో మార్పులు, బ్రెయిన్ డేమేజ్, వాంతులు మరియు వణుకు ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చు.

నీళ్లను ఎక్కువగా తీసుకోవడం ఎందుకు హానికరం?

నీళ్లను ఎక్కువగా తీసుకోవడం ఎందుకు హానికరం?

1. హైపోనట్రేమియాకు దారితీస్తుంది:

క్విక్ ఓవర్ హైడ్రేషన్ వలన సోడియం స్థాయిలలో తగ్గుదల ఏర్పడినప్పుడు హైపోనట్రేమియా సమస్య తలెత్తుతుంది. సోడియం అనేది శరీరం పనితీరుకు అవసరం. సెల్ సిగ్నలింగ్ తో పాటు ఇతర చర్యలకు ఇది తోడ్పడుతుంది. కాబట్టి, సోడియం లెవెల్స్ లో తగ్గుదల ఏర్పడినప్పుడు వికారం, విపరీతమైన అలసట లేదా తలనొప్పిని గుర్తించవచ్చు.

2. హైపోకలేమియా:

2. హైపోకలేమియా:

పొటాషియం అయాన్స్లో తగ్గుదల లేదా హైపోకలేమియాకు దారితీసేందుకు వాటర్ ఇంటాక్సికేషన్ తనదైన పాత్ర పోషిస్తుంది. అతిగా నీళ్లను తాగినప్పుడు ఇంట్రాసెల్యులార్ మరియు ఎక్స్ట్రా సెల్యులార్ పొటాషియం అయాన్స్ ల బాలన్స్ అనేది దెబ్బతింటుంది. దీని వలన తీవ్రమైన డయేరియాతో పాటు ఎక్కువసేపు చెమట పడుతుంది.

3. మెదడు వాపు సమస్య తలెత్తుతుంది:

3. మెదడు వాపు సమస్య తలెత్తుతుంది:

శరీరంలో సోడియం స్థాయి తగ్గినప్పుడు సెమీపేర్మియబుల్ సెల్ మెంబ్రేన్ ద్వారా నీరు శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వలన మెదడు కణాలలో వాపు ఏర్పడుతుంది. మెదడుకు తీవ్రమైన డేమేజ్ జరగవచ్చు. అలాగే మజిల్ టిష్యూలతో పాటు ఆర్గాన్స్ డేమేజ్ కూడా తలెత్తవచ్చు.

4. కిడ్నీలపై అధిక ఒత్తిడి:

4. కిడ్నీలపై అధిక ఒత్తిడి:

అతిగా నీటిని తీసుకోవడం వలన కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. కిడ్నీలు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ప్రతి గంటకు ఒక లీటర్ లిక్విడ్ ను ఫిల్టర్ చేయగల సామర్థ్యం కిడ్నీలకు గలదు. అయితే, అంతకు మించి వాటిపై ఒత్తిడి ఏర్పడితే వాటి పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది.

5. గుండెపై ఒత్తిడి అధికమవుతుంది:

5. గుండెపై ఒత్తిడి అధికమవుతుంది:

రక్తాన్ని సరఫరా చేయడంతో పాటు ఆక్సిజన్ ను అలాగే పోషకాలను టిష్యూలకు సరఫరా చేయడం వంటి ఎన్నో ముఖ్య విధులను గుండె నిర్వర్తిస్తుంది. ఎక్కువగా నీళ్లను తీసుకోవడం వలన శరీరంలోని బ్లడ్ వాల్యూం పెరుగుతుంది. దీనివలన గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది.

రోజుకు ఎంత నీటిని తీసుకోవాలి?

రోజుకు ఎంత నీటిని తీసుకోవాలి?

ఒక వ్యక్తి యొక్క జెండర్, వయసు, ఆరోగ్య స్థితితో పాటు వారి జీవన శైలిని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఎంత నీటిని తీసుకోవాలో ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారు స్పష్టం చేస్తున్నారు.

అయితే, నేషనల్ అకడెమిక్స్ ఆఫ్ సైన్సెస్ ఇంజినీరింగ్ మెడిసిన్ సూచనల ప్రకారం మహిళలు రోజుకు 2.7 లీటర్ల నీటిని తీసుకోవాల్సి ఉండగా పురుషులు 3.7 లీటర్ల నీటిని తీసుకోవాలి.

English summary

Drinking Too Much Water Can Lead To Brain Swelling, Says Study

Research has indicated that drinking too much of water can lead to excess fluid accumulation and cause dangerous low sodium levels in the blood or even brain swelling. The normal intake of water should be 8 to 10 glasses a day. Water intoxication causes low blood concentration of sodium, without adequate replacement of sodium.
Desktop Bottom Promotion