For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లూస్ మోషన్స్ పైన బ్రెడ్ ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తుంది ?

మనము గత 30,000 సంవత్సరాలలో వివిధ రకాల రొట్టెలను వినియోగిస్తూ వచ్చాము.

|

మనము గత 30,000 సంవత్సరాలలో వివిధ రకాల రొట్టెలను వినియోగిస్తూ వచ్చాము. ఆధునిక జీవనశైలి ప్రకారం, రొట్టె అనేది అనారోగ్యము కలిగి నప్పుడు ఉపయోగించే ఆహారంగా భావించినప్పటికీ, 65% మంది ప్రజలు దీనిని వారి ఆహారంలో ముఖ్యమైన భాగంగా వాస్తవంగా వినియోగిస్తున్నారు. మనము ప్రతిరోజూ ఉపయోగించే బ్రెడ్లో వివిధ లోపాలను కలిగి ఉంది. అవి రక్తంలో షుగర్ స్థాయిలను పెంచడం, ఉదరకుహర వ్యాధి, ఫ్రక్టోజ్ను అధిక వినియోగం, క్యాలరీలు ఎక్కువగా ఉంటూ - పోషకాలు తక్కువగా ఉన్న ఆహారంగానూ, చెడ్డ కొలెస్ట్రాల్ వృద్ధి చేసేలా ఉండటం మొదలైనవి.

కాబట్టి, విరోచనాలపై రొట్టె చూపే ప్రభావం ఏమిటి?

1. గ్లూటెన్ ఉనికి :

1. గ్లూటెన్ ఉనికి :

పిండిలో ఉపయోగించే ధాన్యాలలో ప్రోటీన్ల మిశ్రమాన్ని కలిగి ఉండటాన్ని "గ్లూటెన్గా" పిలుస్తారు. గ్లూటెన్ అనేది గింజలలో ఉండే ఎండోస్పెర్మ్లో గల పిండిపదార్థాలతో పాటు కలిసి ఉంటుంది. ఈ రొట్టెలను కాల్చి - తినడానికి సిద్దంగా ఉంచినప్పుడు, ఇవి బంకగా సాగే గుణాన్ని కలిగి తినేందుకు మెత్తగా వుండే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.

ఈ గ్లూటెన్ను శరీరం జీర్ణం చేసేటప్పుడు జీర్ణాశయ గోడలకు చికాకును కలిగిస్తుంది, ఇది ముఖ్యంగా చిన్నప్రేగు అంకురాలను బాగా ఇబ్బంది పెడుతుంది. దీనినే 'గ్లూటెన్ అసహనము' (లేదా) 'ఉదరకుహర వ్యాధి' అని పిలుస్తారు. మన శరీరానికి అవసరమైన పోషకాలను సంగ్రహించడంలో ఈ అంకురాలివే ప్రధాన బాధ్యత. ఇది ఈ విధమైన పనితీరును కనబరచక పోతే అది కడుపు నొప్పికి, కడుపు ఉబ్బరానికి, ప్రేగుల కదలికలలో అసమానతలు ఏర్పడేందుకు దారితీస్తుంది.

ఈ ఉదరకుహర వ్యాధిని కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ చికాకును అనుభవించడం లేదు, కానీ జనాభాలో 77% వరకూ ప్రజలు ఈ వ్యాధి తాలూకా ఉనికితో సంబంధం లేకుండా ఈ లక్షణాలను అనుభవిస్తారు.

2. ఫైటిక్ యాసిడ్ :

2. ఫైటిక్ యాసిడ్ :

రొట్టెలలో వాడబడే ధాన్యాలలో కూడా ఫైటిక్ యాసిడ్ అని పిలువబడే ఒక "పోషక వ్యతిరేక" లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కూడా గ్లూటెన్ మాదిరిగా చూపబడే ప్రభావాలను కలిగిస్తుంది, శరీరం చేత స్వీకరించబడిన ఆహారంలో ఉండే జింక్, కాల్షియం వంటి అత్యంత ఆవశ్యకమైన పోషకాలను - మన శరీరము సంగ్రహించడాన్ని నిరోధిస్తుంది. ఇది ప్రేగులలో చికాకును ప్రేరేపించడానికి దారితీస్తూ, చివరికి ఇది మల విసర్జనలో అస్థిరత్వానికి దారితీస్తుంది.

3. ఫైబర్ అధికంగా ఉంటుంది :

3. ఫైబర్ అధికంగా ఉంటుంది :

రొట్టెలలో చాలా అధికంగా ఫైబర్ ఉంటుంది. వీటిలో ఫైబర్ ఉన్న కారణంగా అవి త్వరగా జీర్ణం కావు, అలాగే శరీర బరువు నియంత్రణ కోసం చాలామంది వీటిని వినియోగిస్తారు. ఫైబరు శరీరంలో ఉండే నీటితో బాగా కలిసిపోవడం వలన మీ ప్రేగులు ఇరిటేషన్కు గురికాబడి మీరు తరచుగా బాత్రూంకి వెళ్ళవలసి వస్తుంది.

4. పిండిపదార్థము :

4. పిండిపదార్థము :

రొట్టెలు పిండిపదార్థమును కలిగి ఉంది. ఈ పిండిపదార్థము రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, మీ శరీరాన్ని చాలా సులభంగా విచ్ఛిన్నం చేస్తుంది. అందువల్ల మీరు ఎక్కువ ఆకలిని కలిగి ఉంటారు. ఈ కారణమా చేత మీ కంటికి సాధారణంగా కనిపించే అధిక-కార్బోహైడ్రేట్లను కలిగి ఉండే స్నాక్స్ను ఎక్కువగా వినియోగిస్తారు. ఇలా మీరు అధికంగా రొట్టెలను వినియోగం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కు దారి తీస్తుంది, ఈ విధంగా మీరు గ్యాస్ తో నిండిన పొట్టను కలిగి, నీళ్ల విరోచనాలు సమస్యను ఎదుర్కొంటారు.

అందువల్ల బ్రెడ్ అనేది విరేచనాలను కలిగించే - స్నేహపూర్వక ఆహారము మాత్రం కాదు.

ఒకవేళ మీరు అధిక మొత్తంలో రొట్టెలను వినియోగించినట్లయితే, మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనమును కలిగించే కొన్ని పరిష్కారమార్గాలు ఉన్నాయి. అవి,

* చాలా అధికంగా నీరును తాగి, మీ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచాలి.

* నీటి నష్టం వల్ల శరీరంలో ఏర్పడిన అసమతుల్యతను భర్తీ చేయడానికి నీటి ఎలెక్ట్రోలైట్లను ఉపయోగించడం చాలా మంచిది.

* సోడియం, పొటాషియము అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

* ఫైబర్ అధికంగా ఉన్న ఆహారపదార్ధాలను (లేదా) GI ని పెంచే ఆహారాలను నిషేధించాలి.

* తక్కువ పరిమాణంలో ఆహారాలను తీసుకోవాలి, అలాగే అన్నము, అరటిపండ్లు, యాపిల్స్ వంటి

తేలికైన ఆహారాలను తినాలి.

మీరు తీసుకొనే ఆహారం పట్ల ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్పృహతో జాగ్రత్తలను తీసుకోవాలి. ఇలా మీరు సరైన జాగ్రత్తలు పాటించడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని వినియోగిస్తూ, ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు.

English summary

What Is The Effect of bread on loose motions?

Bread is not loose motion friendly because it contains gluten, phytic acid, and a lot of fibre that cause bloating, gut irritation, and increased bowel movements, which is something you definitely do not want when you are already suffering from loose motions. a diet of higher calories but low essential nutrients, a raise in bad cholesterol, etc.What Is The Effect of bread on loose motions,Bread is not loose motion friendly because it contains gluten, phytic acid, and a lot of fiber that cause bloating, gut irritation, and increased bowel movements, which is something you definitely do not want when you are already suffering from loose motions.
Story first published:Tuesday, March 20, 2018, 17:25 [IST]
Desktop Bottom Promotion