For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద‌ద్దుర్ల నుంచి త్వ‌రిత ఉప‌శ‌మ‌నానికి 10 గృహ చిట్కాలు

By Sujeeth Kumar
|

ద‌ద్దుర్లు... ఈ మాట వింటేనే భ‌రించ‌లేని అస‌హ‌నం క‌లుగుతుంది. ద‌ద్దుర్లు ఏర్ప‌డిన ప్ర‌దేశంలో గోక‌కుండా ఉండ‌లేం. అలా అని ఆ బాధ‌ను దిగ‌మింగ‌నూ లేము. మ‌నం తినే ఆహారం ప‌డ‌క అల‌ర్జీల వ‌ల్ల కూడా ఒక్కోసారి ద‌ద్దుర్లు ఏర్ప‌డ‌వ‌చ్చు. ద‌ద్దుర్లు ఏర్ప‌డ‌గానే కంగారు ప‌డ‌కండి. ఆ ఎర్ర‌ని మంట పుట్టించే శ‌త్రువును త‌రిమేందుకు ఇంట్లోనే చ‌క్క‌ని ప‌రిష్కార మార్గాలున్నాయి.

దానిక‌న్నా ముందు అస‌లు ద‌ద్దుర్ల గురించి కొన్ని విష‌యాలు తెలుసుకుందాం.

Effective home remedies for hives | Home Remedies For Itchy Skin| Natural Cure For Itchy Skin| How To Get Rid Of Itchy Skin All Over Your Body| Itchy Skin Treatment

శ‌రీరంలోని క‌ణాలు హిస్ట‌మిన్ అనే ర‌సాయ‌నాన్ని విడుద‌ల చేస్తుంది. అది ర‌క్త‌నాళాల గుండా చ‌ర్మంపు పై అంచుల‌కు చేరుకుంటుంది. ఇది సూర్య‌ర‌శ్మి ప్ర‌భావంతో మ‌రింత చికాకును తెప్పించ‌వ‌చ్చు. దుర‌ద‌, మంటతో పాటు ఆ ప్ర‌దేశంలో స్ర‌వాలు జ‌నించ‌వ‌చ్చు. దీనికి కార‌ణాలేమిటో తెలుసుకుందాం...

* పుప్పొడి రేణువులు

* కీట‌కాలు కుడితే..

* కొన్ని ర‌కాల మందులు

* గుడ్డు, పాలు, న‌ట్స్‌లాంటివి కొంద‌రికి ప‌డ‌క‌పోవ‌చ్చు.

* జంతువుల వ్య‌ర్థాలు

* అధిక ఉష్ణోగ్ర‌త‌లు

* ఒత్తిడి

* సూక్ష్మ‌క్రిముల తో ఏర్ప‌డే ఇన్ఫెక్ష‌న్లు

* మురికి నీటితో...

* అధిక స్వేద‌నం

* జ్వ‌రం, జ‌లుబు చేసిన‌ప్పుడు లేదా గ‌ర్భం దాల్చిన‌ప్పుడు సైతం ద‌ద్దుర్లు ఏర్ప‌డే అవ‌కాశాలెక్కువ‌.

ఇంట్లోనే 10 చ‌క్క‌ని ప‌రిష్కారాలు

ద‌ద్దుర్లు పెద్ద స‌మ‌స్య‌లా అనిపించినా సులువుగా త‌గ్గేలా ఇంట్లోనే 10 ర‌కాల ప‌రిష్కారాల‌ను సూచిస్తున్నాం. వాటిని పాటించేందుకు ప్ర‌య‌త్నించండి.

 1. కొబ్బ‌రి నూనె

1. కొబ్బ‌రి నూనె

ఆర్గానిక్ కొబ్బ‌రినూనెను తీసుకొని ద‌ద్దుర్లు ఏర్ప‌డిన ప్రాంతంలో మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేశాక కొన్ని గంట‌ల‌పాటు అలాగే వ‌దిలేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

కొబ్బరి నూనె స‌హ‌జమైన స్కిన్ మాయిశ్చ‌రైజ‌ర్‌లా ప‌నిచేస్తుంది. ఇది దుర‌దను త‌గ్గించి ద‌ద్దుర్లు మంట‌ను అరిక‌డుతుంది. అంతేకాకుండా కొబ్బ‌రినూనెకు యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలున్నాయి. అవి చ‌ర్మాన్ని బ్యాక్టీరియా, ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ల నుంచి కాపాడ‌తాయి.

ఇక ఎట్టిప‌రిస్థితుల్లోనూ దీనికి రిఫైన్డ్ కొబ్బ‌రినూనెను వాడ‌కండి. ఈ నూనె ద‌ద్ద‌ర్లు స‌మ‌స్య‌ను మ‌రింత పెంచేలా చేస్తుంది.

2. ఓట్‌మీల్‌తో...

2. ఓట్‌మీల్‌తో...

2 లేదా 3 క‌ప్పుల ఓట్ మీల్‌ను చ‌ల్ల‌ని నీళ్ల‌లో వేసి 10-15 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. ఈ నీళ్ల‌తో రోజుకు ఒక‌సారి స్నానం చేస్తే దుర‌ద నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

చ‌ల్ల‌ని నీరు చ‌ర్మానికి రిలీఫ్‌లా ప‌నిచేస్తుంది. చ‌ర్మం పొర‌లు మూసుకుపోకుండా ఉంటాయి. అంతేకాదు చ‌ల్ల‌టి నీటికి యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలుంటాయి. ఓట్‌మీల్‌లో బీటా గ్లూకాన్స్ ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని కాపాడ‌తాయి. అంతేకాదు దీంట్లో ఫీనాల్స్ వ‌ల్ల యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క‌లుగుతాయి. ఇవి చ‌ర్మానికి మంచిది.

3. బేకింగ్ సోడా

3. బేకింగ్ సోడా

కొద్దిగా బేకింగ్ సోడాకు నీళ్లు జ‌త‌చేసి మెత్త‌ని పేస్టులా చేయాలి. దీన్ని ద‌ద్దుర్లు ఏర్ప‌డిన ప్రాంతంపై రాసి ఆర‌బెట్టాలి. ఆ త‌ర్వాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మంచిది.

బేకింగ్‌సోడాలోని క్షార గుణం చ‌ర్మానికి సాంత్వ‌న క‌లిగిస్తుంది. దుర‌ద‌, మంట లేకుండా చేస్తుంది. ఈ చిట్కాను కొన్ని సార్లు పాటించాక మీరే స్వ‌యంగా ఫ‌లితాన్ని అనుభ‌విస్తారు.

4. అలోవెరా జెల్‌

4. అలోవెరా జెల్‌

తాజా క‌ల‌బంద ర‌సాన్ని తీసుకొని ద‌ద్దుర్లు ఏర్ప‌డిన ప్రాంతంలో రాయాలి. అలా 20-30 నిమిషాల‌పాటుఉంచి చ‌ల్ల‌నినీటితో క‌డిగేయాలి,. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే చర్మానికి చాలా మంచిది.

క‌ల‌బంద‌లో ఉండే గ్లూకోమాన‌న్స్ హీలింగ్ ప్రాసెస్‌ను వేగ‌వంతంచేస్తాయి. అంతేకాదు స‌హ‌జంగానే మాయిశ్చ‌రైజింగ్, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలుంటాయి. అందుకే అలోవెరా ద‌ద్దుర్ల‌కు మంచి ఇంటి చిట్కా అని చెప్ప‌వ‌చ్చు.

5. డెవిల్స్ క్లా టాబ్లెట్లు

5. డెవిల్స్ క్లా టాబ్లెట్లు

500 ఎం.జి. డెవిల్స్ క్లా టాబ్లెట్లు తీసుకోవ‌డం వ‌ల్ల ద‌ద్దుర్ల స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది. ఇది అల‌ర్జీల‌తో పోరాడుతుంది.

ప‌సుపు

ప‌సుపు

ఒక గ్లాసు నీళ్ల‌లో 1 టీస్పూన్ పసుపు వేసుకొని రోజుకు రెండుసార్లు తాగితే ద‌ద్దుర్ల నుంచి నిదానంగా ఉప‌శ‌మనం క‌లుగుతుంది. ఇక ప‌సుపును పేస్టులా చేసుకొని కూడా ర్యాషెస్ ఏర్ప‌డిన ప్ర‌దేశంలో రాయ‌వ‌చ్చు.

ప‌సుపులో కర్‌కుమిన్ అనే ఒక ప‌దార్థం వ‌ల్ల దీనికి యాంటీ-ఇన్‌ఫ్ల‌మేట‌రీ, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ హిస్ట‌మైన్ గునాలు వ‌చ్చాయి. స‌హ‌జ‌సిద్ధంగా దుర‌ద‌, మంట‌ను త‌గ్గించేందుకు ప‌సుపు చ‌క్క‌ని మార్గం.

6. టీ ట్రీ ఆయిల్

6. టీ ట్రీ ఆయిల్

కొన్ని చుక్క‌ల టీ ట్రీ ఆయిల్‌ను దుర‌ద ఉన్న ప్రాంతంలో రాసి బ్యాండేజ్ క‌ట్టాలి. శ‌రీరంలో అధిక ప్రాంతంలో ద‌ద్దుర్లు ఏర్ప‌డితే మాత్రం 15-20 చుక్క‌ల ఆయిల్ తీసుకొని క‌ప్పు నీటిలో వేయాలి. ఆ త‌ర్వాత బ‌ట్ట‌ను తీసుకొని ఈ మిశ్ర‌మంలో ముంచి రెండు నిమిషాల పాటు ర్యాషెస్ ఉన్న ప్రాంతంపై అద్దాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

టీ ట్రీ ఆయిల్‌కు యాంటీ ఇన్‌ప్ల‌మేట‌రీ, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలున్నాయి. ఇవి నొప్పి, వాపును త‌గ్గించ‌డంలో స‌హ‌క‌రిస్తాయి.

7. గ్రీన్ టీ

7. గ్రీన్ టీ

ఒక క‌ప్పు వేడి నీటిలో టీ బ్యాగ్ వేసి అలాగే కొన్ని నిమిషాలు ఉంచాలి. దీనికి టీ స్పూన్ తేనె క‌లిపి గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు తాగాలి. ఇలా రోజుకు రెండు మూడు క‌ప్పులు తాగాలి.

గ్రీన్ టీలో ఉండే పాలీ ఫినాల్స్ ఇన్‌ఫ్ల‌మేష‌న్‌ను త‌గ్గిస్తుంది. అంతేకాదు గ్రీన్ టీకి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ హిస్ట‌మైన్ గుణాలున్నాయి. గ్రీన్ టీ లోప‌లి నుంచి ప్ర‌భావాన్ని చూపిస్తుంది.

8. లోష‌న్లు

8. లోష‌న్లు

క్యాల‌మైన్ లేదా విచ్ హేజెల్ లోష‌న్‌లో దూదిని ముంచి ద‌ద్దుర్లు ఏర్ప‌డిన ప్రాంతంలో రాయాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చేస్తే తొంద‌ర్లోనే న‌య‌మ‌వుతుంది. క్యాల‌మైన్ లోష‌న్ చ‌క్క‌ని ఆస్ట్రింజెంట్‌లా చ‌ర్మాన్ని ర‌క్షిస్తుంది. ఈ లోష‌న్ రాయ‌గానే ఆ ప్రాంతంలో ర‌క్త‌నాళాలు య‌థాస్థితికి చేరుకునే ప్ర‌య‌త్నం చేస్తాయి. ఇక నిదానంగా వాపు, మంట‌, ఇరిటేష‌న్ త‌గ్గుతుంది.

9. చేప నూనె

9. చేప నూనె

రోజుకు రెండు మూడు చేప నూనె క్యాప్సుల్స్ తీసుకోండి. ఇలా ద‌ద్దుర్ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగేంత వ‌ర‌కు కొన‌సాగించండి.

ఈ క్యాప్సుల్స్ ద‌ద్దుర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా త‌గ్గించ‌గ‌ల‌దు. చేప నూనెలో యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలుంటాయి. ఇక త‌మ డైట్‌లోభాగంగా కోల్డ్ వాట‌ర్ ఫిష్‌, సాల్మ‌న్, ట్యూనా చేప‌ల‌ను కూడా భాగంచేయ‌వ‌చ్చు.

కొంద‌రికి చేప నూనె అంటే ప‌డ‌దు. అలాంటివారు ఇలాంటి తీసుకోవ‌డం వ‌ల్ల అలర్జీలు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంది.

10. అల్లం

10. అల్లం

ఒక టీ స్పూన్ తాజా అల్లం ర‌సంలో 2 టీ స్పూన్ల తేనె క‌ల‌పండి. దీన్ని రోజుకు 2-3 సార్లు తాగండి.

అల్లం న్యాచుర‌ల్ బ్ల‌డ్ ఫ్యురిఫ‌య‌ర్‌లా ప‌నిచేస్తుంది. ఇది నిదానంగా దుర‌ద‌ను త‌గ్గిస్తుంది. అంతేకాదు అల్లంలో యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు మెండు.

ద‌ద్దుర్ల ల‌క్ష‌ణాలివే!

అతిగా దుర‌ద క‌ల‌గ‌డం, ఆ ప్రాంతంలో చ‌ర్మం ఎర్ర‌గా క‌మిలిపోవ‌డం, క్ర‌మేణా వాటి ప‌రిమాణం, రంగు మార‌వ‌చ్చు. ఇది నిమిషాల్లో జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇక కొంద‌రిలో అల‌ర్జీ ఒక వారం నుంచి 6 వారాల దాకా అలాగే కొన‌సాగ‌వ‌చ్చు. ఇలాంటివాళ్లు స్కిన్ స్పెషలిస్ట్‌ను క‌ల‌వ‌డం మంచిది.

ద‌ద్దుర్ల స‌మ‌స్య పెద్ద‌దే కావ‌చ్చు. ఇంట్లోనే దీనికి కొన్ని ప్ర‌త్యేక‌మైన చిట్కాల‌ను తెలుసుకున్నాం క‌దా! ఈ సారి దద్దుర్లు ఏర్ప‌డితే కంగారు ప‌డ‌కండి. ఈ క‌థ‌నాన్ని గుర్తుతెచ్చుకొని ఇక్క‌డున్న చిట్కాల‌ను ప్ర‌య‌త్నించండి. మెరుగైన ఫ‌లితాన్ని మీరే చూస్తారు. !

English summary

Effective home remedies for hives | Home Remedies For Itchy Skin| Natural Cure For Itchy Skin| How To Get Rid Of Itchy Skin All Over Your Body| Itchy Skin Treatment

Itchy skin is medically known as pruritus. Causes of itchy skin are skin allergy, any skin diseases, dry skin, hives, body lice, eczema, measles, fungal infection on skin, diaper rash, fertiliser poisoning, food allergy, drug allergy and insect bite etc. Scratching your skin continuously may create injury to the already sensitive skin. It will also spread infections on your skin, if itching is due to any skin disease. Fortunately, there are effective home remedies for itchy skin.
Story first published:Tuesday, May 1, 2018, 8:18 [IST]
Desktop Bottom Promotion