For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలరోజులలో ఉదరభాగంలో కొవ్వు తగ్గడానికి సమర్ధవంతమైన మార్గాలు

|

మీ స్నేహితురాలి ఇంట్లో జరగబోయే పుట్టినరోజు పార్టీకి మీకెంతో ఇష్టమైన మంచి ఫిట్టింగ్ ఉన్న దుస్తులను ధరించాలని మీరు నిర్ణయించుకున్నారు.కానీ ఇంతలోనే మీలో ఒక నిరుత్సాహం. పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వుల వలన ఆ దుస్తుల్లో మీకు మీరే ఎబ్బెట్టుగా కనిపిస్తే? ఎలా ఉంటుందో మీకు మీరు ఒకసారి ఊహించుకుని చూడండి. ఇప్పటికే మీకిలాంటి పరిస్థితి కనుక ఎదురై ఉంటే, మీరు ఈసరికే వీలయినంత త్వరగా పొట్ట తగ్గించుకోవాలని నిర్ణయించుకుని ఉంటారు!

ఫిట్నెస్ ఎక్సపర్ట్లు మరియు పోషకాహార నిపుణుల అభిప్రాయానుసారం నిజానికి ఉదరం దగ్గరి కొవ్వు తగ్గించుకోవడం కొంచెం కష్టమే! ఉదర ప్రాంతంలో ఎన్నో అంతర అవయవాలుంటాయి. కనుక ఈ ప్రాంతంలో త్వరగా, సులభంగా కొవ్వు పెరుకుపోతుంది.

అంతరావయవాల రక్షణకు కొవ్వు యొక్క అవసరం కొంత మేర ఉన్నాకాని, అధిక మూత్రంలో కొవ్వులుండటం సమస్యగా మారింది. దీనివల్ల వ్యక్తులకు తమ రూపురేఖల పిస్టుల అపనమ్మకం ఏర్పడి ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అంతే కాకుండా దీని వలన పలు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.

 Effective Ways To Lose Belly Fat In A Month

పొట్టలో కొవ్వు అధికంగా పేరుకుపోతే అజీర్ణం,వెన్ను నొప్పి,కీళ్ల నొప్పులు, అలసట, డిప్రెషన్, గుండె సంబంధిత జబ్బులు, అధిక రక్తపోటు మరియు కొన్నిసార్లు కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయి.

కనుక, పొట్టలో ఉండే కొవ్వును తప్పనిసరిగా కరిగించుకోవాలి. పొట్టలో ఉండే కొవ్వును తగ్గించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలను మీకోసం వివరిస్తున్నాం. వీటిని పాటిస్తే ఖచ్చితంగా నెలరోజుల్లో మీ పొట్ట తగ్గుతుంది.

1.పొద్దుట అల్పాహారానికి ముందు కాసేపు నడవండి:

1.పొద్దుట అల్పాహారానికి ముందు కాసేపు నడవండి:

ప్రతి ఉదయం అల్పాహారం తినడానికి ముందు 15 -20 నిమిషాల పాటు ఆరుబయట లేదా థ్రెడ్మిల్ పై బ్రిస్క్ వాక్ చేయాలి. ఈ అలవాటు చేసుకోవడం వలన జీవక్రియ రేట్ మెరుగై కొవ్వు త్వరగా కరుగుతుంది, ముఖ్యంగా ఉదర భాగంలో. కొన్ని పరిశోధనల్లో తేలినదేమిటంటే, అల్పాహారం తినడానికి ముందు వ్యాయామం చెయ్యటం వలన ఐదు వారాల్లోనే పొట్ట ఐదు ఇంచీల వరకు తగ్గుతుంది.

2. అధికంగా పీచుపదార్థాలు ఉన్న అల్పాహారాన్ని తీసుకోండి:

2. అధికంగా పీచుపదార్థాలు ఉన్న అల్పాహారాన్ని తీసుకోండి:

సాధారణంగా చాలామంది పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి అల్పాహారం తినడం మానేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వలన జీవక్రియ రేటు తగ్గిపోయి మనం అనుకున్న లక్ష్యం చేరుకోలేము.

ఇలా కాకుండా పీచుపదార్థాలు అధికముగా ఉండే ఆకుకూర సలాడ్ లు, ఓట్స్ మొదలైనవి తీసుకుంటే, అవి పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వు కణాలను గోకేసి కొవ్వు తగ్గేట్టు చేస్తుంది.

3. వివిధ రంగులున్న పండ్లను తినండి:

3. వివిధ రంగులున్న పండ్లను తినండి:

రకరకాల కూరగాయలు, పండ్లు తినడం వలన ఆరోగ్యం మెరుగై , సరైన బరువును చేరుకుంటాం. మనకి తెలియని విషయం ఏమిటంటే ఉదరంలో కొవ్వు కరగడానికి ఆకుపచ్చని పళ్ళకంటే ఎర్రటి పళ్ళు ఎక్కువగా ఉపయోగపడతాయి. పుచ్చ కాయ, పంపర పనస,ఎర్ర జామ మొదలైన పండ్లలో ఉండే అధిక ఫీనాల్స్ పొట్టలో కొవ్వును కరిగిస్తాయి.

4. అవకాడో మీ నేస్తం:

4. అవకాడో మీ నేస్తం:

ఆలస్యంగా తెలుసుకున్నదేమిటంటే, అవకాడో వలన పలు లాభాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గించడం నుండి కేన్సర్ నిరోధించడం వరకు రకరకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. అవకాడో లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ లు జీవక్రియ రేటును మెరుగుపరుస్తాయి. కనుక అవకాడోను తరచుగా తినడం వలన మీ ఉదరం కరిగిపోతుంది.

5. ప్రోటీన్ షేకులను తీసుకోండి:

5. ప్రోటీన్ షేకులను తీసుకోండి:

ప్రతి ఉదయం అల్పాహారం తీసుకున్నాక ప్రోటీన్ సప్లిమెంట్ తో (వే లేదా వృక్ష ఆధారిత ప్రొటీన్లు) తయారు చేసిన షేకును తాగితే కనుక పోత తగ్గే ప్రక్రియ వేగమందుకుంటుంది. ప్రోటీన్లకు కొవ్వుతో పోరాడే గుణముంది. మీకు కనుక కొవ్వు కరగడానికి వ్యాయామం చేసే అలవాటు ఉంటే కనుక , ప్రోటీన్ షేకులు కండరాలను టోన్ చేయడానికి ఉపయోగపడతాయి.

6. గుడ్డు తెల్లసొనను తినండి:

6. గుడ్డు తెల్లసొనను తినండి:

మీరు కనుక కండలను పెంచుతూ బరువు తగ్గాలనుకుంటే కనుక, మీ ఆహారానికి గుడ్డు తెల్ల సొనను జత చేర్చండి. గుడ్డు తెల్ల సోనలో కేవలం ప్రొటీన్లు మాత్రమే ఉన్నందున అది కొవ్వును కరిగించి బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. రోజులో కనీసం రెండుసార్లు గుడ్డు తెల్ల సొనను తీసుకుంటే కొవ్వు త్వరగా కోల్పోతారు. వీటిని తీసుకోవడంతో పాటు వ్యాయామం తప్పనిసరి.

7. నిమ్మరసం కలిపిన నీళ్లను తాగండి:

7. నిమ్మరసం కలిపిన నీళ్లను తాగండి:

చాలా పరిశోధనలలో తేలినదేమిటంటే మీరు తాగే నీటికి కొన్ని నిమ్మకాయ ముక్కలను కలపడం వలన పొట్టలో కొవ్వు తగ్గుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ-ఆక్సిడెంట్ లు పొట్టగోడకు అంటుకుని ఉన్న కొవ్వు కణాలను గోకేసి కొవ్వును మన శరీరం నుండి బయటకు నెట్టేస్తుంది.

8. పిండిపదార్ధాలను తక్కువగా తీసుకోండి:

8. పిండిపదార్ధాలను తక్కువగా తీసుకోండి:

మీరు కనుక ఉదర భాగం వద్ద కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే, మీ ఆహారంలో నుండి పిండిపదార్ధాలను మినహాయించండి.వైట్ బ్రేడ్, తెల్లని వరి అన్నం,పంచదార, పాస్తా, పిజ్జా,బేకరీ ఉత్పత్తులు మొదలైన వాటిలో అనారోగ్యకరమైన పిండిపదార్ధాలు ఉంటాయి కనుక వాటిని తినరాదు. ఇలా చేస్తే పొట్టలో కొవ్వు తగ్గుతుంది.

9. ఉదరభాగానికి సంబంధించిన వ్యాయామాలు చేయండి:

9. ఉదరభాగానికి సంబంధించిన వ్యాయామాలు చేయండి:

ఏ రకమైన వ్యాయామాలు చేసినా మీ బరువు తగ్గి, సౌష్టవం మెరుగుపడుతుంది. ప్రత్యేకంగా మీ ఉదరభాగంలో కొవ్వు తగ్గాలంటే, గుండెకు సంబంధించిన వ్యాయామాలు అయిన పరుగు, జాగింగ్ లేదా ప్లాంక్స్, క్రంచెస్ వంటివి క్రమం తప్పకుండా చేయాలి.

English summary

Effective Ways To Lose Belly Fat In A Month

Effective Ways To Lose Belly Fat In A Month,Excess belly fat can make a person feel less confident and unfit. Here are the effective ways to lose belly fat in a month.
Desktop Bottom Promotion