For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవలసిన ఎనిమిది ఆశ్చర్యపరచే నిజాలు.

|

ఛాతీలో నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క అత్యంత స్పష్టమైన సంకేతం. అంతేకాక, మనకు పొగత్రాగే అలవాటు లేనప్పటికీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ను సూచించే అనేక ఇతర సంకేతాలు మరియు లక్షణాలను గురించి కూడా మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. అమెరికాలోని క్యాన్సర్ కారణంగా మృతి చెందే పురుషులు మరియు మహిళలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణం. ఇలా చనిపోయిన వ్యక్తులలో 20 శాతం మందికి ధూమపానం అలవాటు లేదు.

ధూమపానం అలవాటు లేని వారిని కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు దాడి చేస్తుంది? శాంటా మోనికా, కాలిఫోర్నియాలో ఉన్న ప్రొవిడెన్స్ సెయింట్ జాన్స్ ఆరోగ్య కేంద్రంలో థొరాసిక్ సర్జన్ గా పనిచేస్తున్న రాబర్ట్ మెక్కెన్నా, జూనియర్, MD, రాడాన్ (ఇళ్లలో ఉండే వాసనలేని ఒక వాయువు)కు తరచుగా బహిర్గతం కావడం వలనే అని ఆరోపిస్తున్నారు. వాయు కాలుష్యం, ధూమపానం చేయనప్పటికి ఆ పొగను పీల్చడం, మరియు ఆస్బెస్టాస్ వంటి పర్యావరణ హానికారకాలు ఇతర ముఖ్య కారణాలుగా తెలియజేస్తున్నారు.

మీరు అదేపనిగా పొగ త్రాగేవారైనా లేదా మీ జీవితంలో ఎప్పుడు సిగరెట్ వెలిగించకపోయినా, మీలో ఈ క్రింది లక్షణాలు పొడచూపుతున్నాయేమో ఒక కన్ను వేసి ఉంచండి. ఈ సమస్యలకు కారణం అయ్యే స్వల్ప ప్రాధాన్యత కలిగిన అనేక ఇతర కారణాలు ఉన్నప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉంటూ డాక్టర్ తో చర్చించి సలహా తీసుకోవాలి.

1. నిరంతరంగా బాధించే దగ్గు:

1. నిరంతరంగా బాధించే దగ్గు:

"ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న చాలామంది దగ్గుతూ ఉంటారు. అప్పుడప్పుడూ రక్తంతో కూడిన దగ్గు కూడా కలుగుతుంది. " అని డాక్టర్ మక్ కెన్నా చెబుతున్నారు. చిక్కటి, త్రుప్పు-రంగు కఫం ఒక ప్రారంభ సంకేతం. మీరు ఒక నెల రోజుల నుండి పొడి దగ్గుతో బాధ పడుతున్నట్లయితే డాక్టర్ చేత తనిఖీ చేయించుకోవటం మంచిది.

2. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు

2. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వారి అధ్యయనం ప్రకారం, దీర్ఘకాలిక భ్రాంఖైటిస్ వంటి ఊపిరితిత్తుల అంటువ్యాధులకు ఎప్పుడు వైరస్లే కారణమని మనం నిందిస్తాం. కానీ తరచుగా జబ్బు పడుతూ, ప్రతి సమస్య ఛాతీలో అనారోగ్యంతోనే ముడిపడి ఉంటే, దీనిని క్యాన్సర్ కు సంకేతంగా కూడా భావించవచ్చు.

3. బరువు కోల్పోవడం:

3. బరువు కోల్పోవడం:

ఆహారప్రణాళిక లేదా వ్యాయామంలో మార్పు లేకుండా బరువు తగ్గుతున్నారా? "ఏ అవయవంలో క్యాన్సర్ వ్యాధి తలెత్తినా, కణితి ఉన్నత స్థాయికి చేరినప్పుడు, శరీర బరువు కోల్పోవడాన్ని ప్రేరేపించే ప్రోటీన్లను తయారు చేయవచ్చు." డాక్టర్ మెక్ కెన్నా తెలియజేస్తున్నారు "అందువల్ల ఆకలి తగ్గడాన్ని గమనించవచ్చు. (మీరు బరువు పెరుగుతున్నారని అనిపిస్తూ, దానికి ఖచ్చితమైన కారణం తెలియకపోతే, అందుకు గల కారణాల్లో ఇది కూడా ఒకటి కావచ్చు.)

4. ఎముకలలో నొప్పి:

4. ఎముకలలో నొప్పి:

ఫౌంటైన్ వ్యాలీ, కాలిఫోర్నియాలోని మెమోరియల్ కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు ఆరెంజ్ కోస్ట్ మెమోరియల్ మెడికల్ సెంటర్లో థొరాసిక్ ఆంకాలజీ వైద్య నిపుణుడు మరియు డైరెక్టర్ అయిన జాకబ్, MD, ఊపిరితిత్తుల క్యాన్సర్ శరీరంలో ఇతర అవయవాలకు వ్యాప్తి చెందినపుడు,ఎముకలు లేదా కీళ్ళ లోపలి నుండి నొప్పిని కలుగుతుందని తెలియజేస్తున్నారు. వెన్ను మరియు నడుము పక్కల్లో నొప్పి అధికంగా ఉంటుంది. ఇది కూడా విటమిన్ డి యొక్క లోపానికి సంకేతం అయి ఉండవచ్చు.

5. మెడ మరియు ముఖంలో వాపు:

5. మెడ మరియు ముఖంలో వాపు:

ఒక ఊపిరితిత్తులలో ఏర్పడిన కణితి ఉన్నత వైనా కావాను(తల మరియు చేతుల నుండి హృదయానికి రక్తం తీసుకువెళ్లే పెద్ద సిర) అదిమేయడం వలన, మెడలో మరియు ముఖంలో వాపును గమనించవచ్చు అని డాక్టర్ జాకబ్ చెబుతున్నారు. చేతులు మరియు ఎగువ ఛాతీ భాగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు.

6. అధిక అలసట:

6. అధిక అలసట:

"అలసిపోవడం అనే అనుభూతికి ఇది భిన్నంగా ఉంటుంది. " అని డా. "మంచం మీదకు క్షణాల్లో చేరిపోవాలనేంతగా మీలో అలసట కమ్మేస్తుంది. ,విశ్రాంతి తీసుకున్నప్పటికి ఎటువంటి ప్రయోజనం లేనట్టు అనిపిస్తుంది" అని డాక్టర్ జాకబ్ చెబుతున్నారు. సహాయపడటం లేదు. 80 శాతం మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో, "అధిక అలసట"ను ఒక లక్షణంగా గుర్తించారు.

7. కండరాల బలహీనత:

7. కండరాల బలహీనత:

ఊపిరితిత్తుల క్యాన్సర్, అవయవాలతో పాటుగా కండరాలను కూడా ప్రభావితం చేస్తుంది. ముందుగా తుంటి భాగం ప్రభావితమవుతుంది. "మీరు కూడా కూర్చున్న కుర్చీలో నుండి లేవడం కూడా కష్టమైన పనిగా అనిపిస్తుంది" అని డాక్టర్ జాకబ్ చెబుతున్నారు . భుజాలు, చేతులు మరియు కాళ్ళలో బలహీనత కనిపించడం సాధారణ లక్షణమే!

8. అధిక కాల్షియం స్థాయిలు:

8. అధిక కాల్షియం స్థాయిలు:

కొన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ల ప్రభావం వలన శరీరంలో హార్మోన్ల వంటి పదార్ధాలు ఉత్పత్తి అయ్యి ఖనిజాల సమతుల్యాన్ని దెబ్బతీస్తాయి. కొన్ని సందర్భాల్లో, అధిక కాల్షియం రక్తప్రవాహంలోకి విడుదల అవుతుందని డాక్టర్ మెక్ కెన్నా తెలిపారు. వైద్యుడు పరీక్షలు జరిపి చెప్పేంతవరకు, దీనిని ఎవరూ కాల్షియం పరిమాణం తారాస్థాయికి చేరుకుందని గుర్తించలేకపోతున్నారు. కనుక, అధిక కాల్షియం ఉంటే శరీరంలో కనిపించే ఈ క్రింది లక్షణాలను గమనించాలి: తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, మలబద్ధకం, వికారం, కడుపు నొప్పి, మరియు మత్తుగా ఉండటం.


English summary

Eight Surprising Signs of Lung Cancer Everyone Should Know

Whether you smoke regularly or have never lit up in your life, keep an eye out for the following symptoms. Although there are plenty of less nefarious reasons why these issues might crop up, play it safe and discuss them with your doctor.
Story first published:Wednesday, August 1, 2018, 16:01 [IST]
Desktop Bottom Promotion