For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజులో ఒక్క గ్లాస్ మద్యం (ఆల్కహాల్) తీసుకున్నా ఆరోగ్యానికి ప్రమాదకరమా?

రోజులో ఒక్క గ్లాస్ మద్యం (ఆల్కహాల్) తీసుకున్నా ఆరోగ్యానికి ప్రమాదకరమా?

|

నేడు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని తెలుసుకుంటూ కూడా, వారాంతంలో లేదా పార్టీలలో మాత్రమే మద్యాన్ని తీసుకునేలా కొందరు ఆలోచనలు చేస్తున్నారు. మరికొంతమంది, రోజులో ఒక్క గ్లాస్ మద్యం తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదన్న అపోహలో కూడా ఉంటున్నారు. 18 సంవత్సరాల వయసు తర్వాత మద్యం కొనవచ్చు న్యాయపరంగా అంటే, 18 తర్వాతి వాళ్లకు మద్యం హానిచేయదని అర్ధం కాదు.

ఏదిఏమైనా, మద్యపానం అనేది మానసికంగా మరియు శారీరికంగా వ్యక్తి మీద ప్రతికూల సామర్థ్యాన్ని చూపగలిగే పదార్ధం. నిజానికి ఈ ఆల్కహాల్ శరీరానికి అవసరంలేని సమ్మేళనం, దీనివలన ఒక్క లాభం కూడా లేకపోగా, నష్టాలు మాత్రం అనేకం. కొద్దిగా తీసుకున్నా, ఎక్కువ తీసుకున్నా , ఏదో ఒక రీతిలో నష్టాలు మాత్రం చవిచూడాల్సిందే.

Even One Glass Of Alcohol A Day May Pose Health Risk, Study Finds

రోజులో కొద్ది మోతాదులో తీసుకున్నా కూడా దీని ప్రతికూల ప్రభావాలు మాత్రం ఖచ్చితం. కొన్ని సమస్యలు కనీసం గుర్తించలేనివిగా కూడా ఉంటాయి. పరిస్థితులు విషమిస్తే కానీ, తప్పును తెలుసుకోలేని విధంగా.

రోజులో ఒక్క గ్లాస్ మద్యం (ఆల్కహాల్) తీసుకున్నా ఆరోగ్యానికి ప్రమాదకరమా?

ఉదాహరణకు, ప్రతిరోజూ డిన్నర్ లేదా సుదీర్ఘమైన పని వేళల తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల మద్యం తీసుకోవడం ఉపశమనంగా భావిస్తారు కొందరు. బీర్, విస్కీ, రం, జిన్, ఓడ్కా వంటి ఏ పానీయమైనా సరే, తక్కువ పరిమాణంలో తీసుకుంటే, దుష్ప్రభావాలు ఉండవు అని కొందరి ఫీలింగ్. కానీ అది అవాస్తవం అని సర్వేలు చెబుతున్నాయి. నిజానికి కొంతమేర మద్యం స్వీకరిస్తున్నా, దాని ప్రభావాలు భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటాయని తేల్చిచెప్తున్నారు పరిశోధకులు.

Most Read:మా ఆయన శృంగారం స్టార్ట్ చేస్తే ఆపడు, ఇక చాలండీ అంటే వినడు, ఎలా తట్టుకోవాలి?

ఆల్కహాల్ తీసుకోవడం ప్రమాదకరమా:

శరీరానికి ఆల్కహాల్ అనేది అనవసరమైన పదార్ధం, దీనిని తక్కువగా తీసుకున్నా, ఎక్కువగా తీసుకున్నా దుష్ప్రభావాలు తప్పనిసరి. విషాన్ని తక్కువ తీసుకున్నామా, ఎక్కువ తీసుకున్నామా అని ఉండదు. విషం విషమే. రోజులో ఒక గ్లాస్ మద్యం కూడా మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని ఒక అధ్యయనం నిరూపించింది కూడా.

Even One Glass Of Alcohol A Day May Pose Health Risk, Study Finds

దుష్ప్రభావాలను ఎలా నిర్ధారించారు :

ఇంగ్లాండ్లో, నిర్వహించిన 'గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్' అని పిలవబడే ఒక అధ్యయనంలో ఆరోగ్యంపై మద్యం చూపే దుష్ప్రభావాలను విశ్లేషించడం జరిగింది. ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా 195 భిన్న దేశాల నుండి 100,000 మంది ప్రజల జీవనశైలి ప్రమాణాల ఆధారితంగా జరిగింది. ముఖ్యంగా 15 - 95 ఏళ్ల వయస్సులో ఉన్న వారిని దృష్టిలో ఉంచుకుని.

100,000 మంది సమూహాన్ని కలిగిన ఈ అద్యయనంలో మద్యం సేవించే వారిని (కనీసం రోజులో ఒక్క గ్లాసు తీసుకునేవారు), అలవాటులేని వారు(మద్యం ముట్టని వారు) అంటూ రెండు వర్గాలుగా విభజించారు.

1990 నుండి 2016 వరకు, అనేక సంవత్సరాల పాటు ఈ అద్యయనం కొనసాగింది. అద్యయనంలో భాగంగా ఎప్పటికప్పుడు అనేక దేశాల నివేదికలు తీసుకోవడం జరిగింది కూడా. అక్కడ ఉన్న ప్రజల ఆరోగ్య పరిస్థితులను సైతం నిరంతరం పర్యవేక్షించడమే కాకుండా, వారి మద్యపాన అలవాట్లను గుర్తించడం కూడా జరిగింది.

Most Read: భర్త సుఖం అందించడం లేదంది, నా పక్కన పడుకుంటానంది, రోజూ తనకు నచ్చినట్లుగా చేయించుకునేది #mystory235Most Read: భర్త సుఖం అందించడం లేదంది, నా పక్కన పడుకుంటానంది, రోజూ తనకు నచ్చినట్లుగా చేయించుకునేది #mystory235

రోజువారీగా కనీసం ఒక గ్లాసు ఆల్కహాల్ తీసుకునేవారు, అలవాట్లులేని వారితో పోలిస్తే మద్యపాన సంబందిత ఆరోగ్య సమస్యలను ఎక్కువ శాతంలో కలిగి ఉన్నారని తేలింది.

కావున, నిపుణులు సూచిస్తున్న ప్రకారం మీరు ఆల్కహాల్ మోతాదును 5 గ్లాసులు తీసుకున్నా, ఒక్క గ్లాసు తీసుకున్నా సమస్యలని మాత్రం ఎదుర్కొనక తప్పదు. మరియు ప్రతి శరీరానికి భిన్నమైన రోగ నిరోధక శక్తి స్థాయిలు ఉంటాయి. అందరికీ ఒకేలా ఉండవు.

మరియు దృఢoగా, బలిష్టంగా కనిపించే వ్యక్తి సైతం రోగనిరోధక శక్తి పరంగా తక్కువ ఉండే అవకాశాలు లేకపోలేదు. కావున శరీర సౌష్టవాన్ని చూసి అంచనా వేయలేమని కూడా నిపుణులు చెప్తున్నారు. కావున, ఒక గ్లాసు ఆల్కహాల్ అయినా ప్రమాదమే అని నిర్ధారించబడింది.

ఆల్కహాల్ తీసుకోవడం శరీరానికి నెమ్మదిగా విషాన్ని ఎక్కించడంతో సమానం.

ఆల్కహాల్ వినియోగం వల్ల కలిగే అనారోగ్య పరిస్థితులు ఏమిటి?

తక్కువ మోతాదులో తీసుకునే ఆల్కహాల్ కూడా మన ఆరోగ్యాన్ని గణనీయంగా హాని చేయగలదని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు, మద్యం మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం.

దీర్ఘకాలిక మద్యం వినియోగం వలన సంభవించే సాధారణ శారీరక ఆరోగ్య సమస్యలు:

• ప్రధానంగా మెదడు యొక్క ఫ్రంటల్ లోబ్స్ పరిమాణం కుదించబడుతుంది, క్రమంగా జ్ఞాపకశక్తి మరియు ప్రవర్తనా లోపం వంటి అసాధారణ సమస్యలకు కారణమవుతుంది.

• నిరంతర మైకము మరియు బ్లాక్-అవుట్ సర్వసాధారణంగా ఉంటుంది. అనగా ఆల్కహాల్ సేవించని సమయంలో కూడా మత్తు ఆవరించి ఉంటుంది.

• నాలిక కణజాలం గట్టి పడడం, మందంగా తయారవడం, క్రమంగా ఎక్కువ సేపు మాట్లాడలేని పరిస్థితి.

Most Read:భార్య దగ్గర త్వరగా ఔట్ అయిపోతున్నా, దాంతో మంచి ఎనర్జీ వస్తుందంటా? నిజమేనా?Most Read:భార్య దగ్గర త్వరగా ఔట్ అయిపోతున్నా, దాంతో మంచి ఎనర్జీ వస్తుందంటా? నిజమేనా?

• దీర్ఘకాలిక వికారం అసౌకర్యం

• నోటి పూతలు

• గుండె సంబంధిత సమస్యలు

• కాలేయ సమస్యలు

• పాంక్రియాటైటిస్

• మలబద్ధకం లేదా అతిసారం

• చికాకుపెట్టే ప్రేగు సిండ్రోమ్ సమస్య

• దీర్ఘకాలిక ఆమ్లత, కడుపులో పూతలు మరియు పేగు వాపు

• లైంగిక అసమర్థత

• వంధ్యత్వం

• గర్భధారణ సమయంలో మద్యం వినియోగం కారణంగా, జన్మించిన పిల్లలలో జన్యుపర లోపాలు

• ఎముకల బలహీనత

• కండరాల తిమ్మిరి మరియు నొప్పులు

• క్యాన్సర్

అధిక మద్యపానం యొక్క మానసిక ఆరోగ్య ప్రభావాలు:

• దూకుడు ప్రవర్తన

• ఉద్రేకం, రిస్క్ టేకింగ్ ప్రవర్తన

• డిప్రెషన్

• ఆందోళన

• వ్యసనపరులుగా లేదా మద్యం లేనిదే ఉండలేము అన్నట్లుగా మారిపోవడం.

• భ్రాంతులు, మద్యం తీసుకొనని సమయంలో కూడా.

• ఆత్మహత్య ధోరణులు

కావున వారాంతంలో లేదా రోజులో ఒకగ్లాసు ఆల్కహాల్ అలవాటు ఉన్నా మానుకోవడమే మంచిదని సూచించబడింది.

Most Read:యోని టైట్ అయ్యేందుకు కందిరీగ గూళ్లను అందులో పెట్టుకుంటున్నారు, సెక్స్ చేస్తే బాగా నొప్పి వస్తుందిMost Read:యోని టైట్ అయ్యేందుకు కందిరీగ గూళ్లను అందులో పెట్టుకుంటున్నారు, సెక్స్ చేస్తే బాగా నొప్పి వస్తుంది

మీరు మీ మద్యపాన అలవాటును వదిలేయడం అత్యంత కష్టమైన అంశంగా కూడా ఉండవచ్చు. కానీ అది మద్యపానం దుష్ప్రభావాలలో భాగంగా కలిగిన మానసికసమస్యలలో “వ్యసనం”గా గుర్తించవలసిన అవసరం ఉంది. ఒకవేళ దుష్ప్రభావాల బారిన పడుతూ కూడా మానలేని పరిస్థితులకు చేరుకుంటుంటే, తక్షణమే మీవైద్యుని సంప్రదించి, వారు సిఫార్సు చేసిన మందులను తీసుకోవడం మంచిదిగా సూచించబడింది.

English summary

Even One Glass Of Alcohol A Day May Pose Health Risk, Study Finds

Many of us may be under the impression that consuming just a glass of alcohol per day may not be harmful to health. A recent research study has found that even a glass of alcohol per day can have adverse health effects such as chronic fatigue, mouth ulcers, heart damage, infertility, liver damage, etc.
Desktop Bottom Promotion