For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు అలవాటుగా చేసే ఈ పనులు మీ వెన్నెముకు హానికరమని తెలుసా?

మీరు అలవాటుగా చేసే ఈ పనులు మీ వెన్నెముకు హానికరమని తెలుసా?

|

వెన్నెముక మీ శరీరంలోనే అతి ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీరం నిటారుగా నిలబడటానికి సహాయపడుతుంది, మీ మొత్తం బరువు వెన్నెముక మోస్తుంది. క్రమంగా మీ వెన్నుకు మద్దతునిస్తుంది. మీ శరీరానికి సౌకర్యవంతమైన కదలికను ఇవ్వడంలో సహాయం చేస్తుంది మరియు అంతర్గత భాగాలను రక్షిస్తుంది. కొన్ని సందర్భాలలో, రోజువారీ అలవాటుగా చేసే కొన్ని పనులు కూడా మీ వెన్నెముకకు హాని కలిగించవచ్చు. కాకపొతే అనేకమందికి వాటి గురించిన అవగాహన ఉండదు.

వెన్నునొప్పికి కారణం ఏమిటి?

మీ వెన్ను కండరాలు లేదా లిగ్మెంట్స్ గాయాలకు గురైనప్పుడు, లేదా బలహీనపడినప్పుడు, సాధారణంగా వెన్నునొప్పి ఉంటుంది. డిస్క్ జారడం వంటివి కూడా వెన్నునొప్పికి కారణమవుతుంది. డిస్క్ జారినందువల్ల, డిస్క్ మీద అధిక ఒత్తిడి ఉంటుంది. ఇది వాపు లేదా చీలికకు కారణమవుతుంది. వెన్నుపాము నరాలు మృదులాస్థి పక్కకి వెళ్ళడం ద్వారా, మృదులాస్థిమీద ఒత్తిడిని పెంచుతుంది, క్రమంగా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.

10 Everyday Habits That Are Hurting Your Spine

ఇతర ఆరోగ్య పరిస్థితులైన బోలు ఎముకల వ్యాధి(ఆస్టియో పొరాసిస్), ఆస్టియో ఆర్థరైటిస్, వెన్నెముక స్టెనోసిస్, ఫైబ్రోమైయల్గియా కూడా వెన్నునొప్పికి కారణమవుతాయి. పైన చెప్పిన పరిస్థితులు మీకు లేనట్లయితే, మీ వెన్నునొప్పికి కారణం అత్యంత ప్రాథమికంగా ఉంటుంది. మీ దైనందిక అలవాట్లే కారణంగా ఉండవచ్చు కూడా.
1.అధిక బరువు వ్యాయామాలు

1.అధిక బరువు వ్యాయామాలు

వెన్నెముక యొక్క ఎముక సాంద్రత పెరుగుతున్నప్పుడు బరువు మోసే వ్యాయామాలు వెన్నెముక చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడం ద్వారా, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలదు. కానీ, మీరు అధిక బరువులతో ఎక్కువకాలం వ్యాయామాలు చేస్తే, అది మీ వెన్నుపాము పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.

ఇంటర్నేషనల్ ఆస్టియోపొరాసిస్ ఫౌండేషన్, ఒక వారంలో 30-40 నిమిషాలు మాత్రమే హెవీవెయిట్స్ అనుసరించాలని, అది కూడా వారంలో 3-4 సార్లు మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది.

2.భంగిమలోపం

2.భంగిమలోపం

మీరు కూర్చునే, లేదా పడుకునే భంగిమ కూడా మీ వెన్నెముకపై దుష్ప్రభావాలను కలిగించవచ్చు. క్రమంగా వెన్నెముకను పాడుచేయవచ్చు, ఇది మీ మోకాళ్ళపై ఒత్తిడిని పెంచుతుంది. మీ భంగిమను మెరుగుపర్చడానికి, నిలబడడం లేదా నిటారుగా మీ ఛాతీని నిలబెట్టినట్లు సిటింగ్ పొజిషన్ తీసుకోవడం, మీ భుజం కొద్దిగా దిగినట్లుగా ఉంచడం(విరిచినట్లు కాకుండా) వంటివి చేయడం మంచిది. మీ వెన్నెముక యొక్క పరిస్థితిని మెరుగుపరచడానికి వెన్నెముక వ్యాయామాలు(స్ట్రెచ్) కూడా చేయవచ్చు.

3.మీరు సెల్ ఫోన్లతో వ్యవహరించే మార్గం కూడా

3.మీరు సెల్ ఫోన్లతో వ్యవహరించే మార్గం కూడా

కొందరికి గంటల తరబడి ఫోన్లు మాట్లాడడం, చాటింగ్, న్యూస్ ఫీడ్ లేదా సోషల్ నెట్వర్క్ ఫీడ్స్ స్క్రోల్ చేయడం వంటి అలవాట్లను తీవ్రంగా కలిగి ఉంటారు. ఎంతగా అంటే, వాస్తవిక ప్రపంచం మనుగడలో లేనట్లు, డిజిటల్ ప్రపంచమే మనలోకం అయినట్లుగా. సర్జికల్ టెక్నాలజీ ఇంటర్నేషనల్లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనంలో, మొబైల్ ఫోన్ అధిక వాడకం, వ్యక్తి వెన్నెముకపై 50పౌండ్ల ఒత్తిడిని కలిగి ఉంటుంది, ఇది వ్యక్తి ఫోన్ పట్టుకొని ఉన్న కోణంపై ఆధారపడి ఉంటుంది.

మీరు మీ ఫోన్ స్క్రీన్ వద్ద చూస్తూ, క్రిందికి వంగిపోతున్న సమయంలో, తల ముందుకు వచ్చే భంగిమకు గురవడం మూలంగా ఎగువ వెన్నెముక ఎక్కువగా వంపునకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కాలక్రమేణా వెన్నుపాము బలహీనపడడానికి కారణమవుతుంది.

4.ధూమపానం

4.ధూమపానం

ధూమపానం మీ వెన్నెముకను దెబ్బతీసే అంశాలలో ప్రధానమైన రోజువారీ అలవాటుగా ఉంది. సిగరెట్లోని నికోటిన్ వెన్నుముకకు సాధారణ రక్తప్రవాహాన్ని అడ్డుకుంటుంది, తద్వారా ఎముకను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది మరియు అకాల డిస్క్ క్షీణతకు కూడా కారణమవుతుంది. ధూమపానం వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకాలను శోషించగల డిస్కుల సామర్థ్యాన్ని తీవ్రంగా నిరోధిస్తుంది.

5.సిర్కాడియన్ లయల విఘటన

5.సిర్కాడియన్ లయల విఘటన

సిర్కాడియన్-రిథం అనేది మీ మెదడులోని 24గంటల అంతర్గత గడియారం, ఇది నిద్ర మరియు దైనందిక కార్యకలాపాలు రెండింటినీ క్రమబద్దీకరిస్తుంది. నిద్రపోయే సమయం మరియు మేలుకోవలసిన సమయం వంటివాటిని ప్రాథమికంగా మీకు చెబుతుంటుంది.

వృద్ధాప్యo, నిద్రలేమి మరియు నైట్ షిఫ్ట్ ఉద్యోగాల కారణంగా మీ సిర్కాడియన్ లయలు దెబ్బతింటున్నాయని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు కూడా. వీటి అసమతుల్యం కారణంగా ఇంటర్వెటేబ్రెరల్ డిస్క్లలోని కణాలు తీవ్రంగా పనిచేయడం ప్రారంభిస్తాయి, ఇవి దీర్ఘకాలిక శోథను లేదా వాపును కలిగిస్తాయి. మరియు దిగువ వెన్నుబాగంలో నొప్పి అభివృద్ధికి ఎక్కువ అవకాశం కలిగిస్తుంది.

6. తప్పు పాదరక్షలు లేదా బూట్లను ధరించడం

6. తప్పు పాదరక్షలు లేదా బూట్లను ధరించడం

పాదరక్షల ఎంపిక కూడా వెన్ను మీద ప్రభావాలను కలిగి ఉంటుంది. శరీరానికి నప్పని బూట్లను ధరించడం, ముఖ్యంగా హైహీల్స్ వాడకం, వెన్నెముక యొక్క వక్రత, లేదా బయటకు కనిపించేలా కనపడడానికి కారణం కావచ్చు. స్నీకర్, బూట్లు లేదా ఫ్లాట్ బూట్లు ఎంచుకోవడం ద్వారా మీ కాళ్లపై ఒత్తిడి తగ్గించండి.

7.తక్కువ కాల్షియం తీసుకోవడం

7.తక్కువ కాల్షియం తీసుకోవడం

ఎముక ఆరోగ్యానికి కాల్షియం అత్యవసర ఖనిజంగా ఉంటుంది మరియు కాల్షియం అధికంగా ఉండే పాలఉత్పత్తులను మీ రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. మీరు తక్కువ కాల్షియం తీసుకుంటూ ఉంటే, ఎముకలలో కాల్షియం నిల్వలు తగ్గుముఖం పడుతాయి. క్రమంగా వెన్నెముక బలహీనతకు దారితీస్తుంది.

8.చిన్న విరామాలు కూడా లేకుండా మీ డెస్క్ వద్దనే కూర్చుని ఉండడం

8.చిన్న విరామాలు కూడా లేకుండా మీ డెస్క్ వద్దనే కూర్చుని ఉండడం

డెస్క్ వద్దనే అతుక్కుపోయి చేసే ఉద్యోగం, మీ వెన్నునొప్పికి సాధారణ కారకంగా ఉంటుంది. ఇది కూడా దైనందిక కార్యాచరణలలో భాగమే. సుదీర్ఘకాలం అదేపనిగా కూర్చోవడం, భంగిమ మొదలైనవి వెన్నెముక బలహీనతకు మరియు వక్రతకు దారితీస్తుంది. కావున కూర్చునే సమయంలో మెత్తను వాడడం, అప్పుడప్పుడు నడకకు ఉపక్రమించడం మొదలైనవాటిని అనుసరించడం ద్వారా, కొంతమేర ప్రయోజనాన్ని పొందగలరు.

9.మందులు

9.మందులు

కొన్ని మందులు మీ ఎముకల దృఢత్వాన్ని దెబ్బతీస్తాయి, ప్రధానంగా స్టెరాయిడ్ల వాడకం మీ వెన్నెముకను బలహీనపరచవచ్చు. మీరు తీసుకునే స్టెరాయిడ్స్, మీ ఎముకలు మరియు వెన్నెముకపై తీవ్రమైన ప్రభావం చూపగలదు. స్టెరాయిడ్ల ప్రధాన ప్రభావాలు కాల్షియం, విటమిన్ డి మరియు ఎముకల జీవక్రియలపై ఉంటాయి. క్రమంగా పరిమితి దాటిన వాడకం, ఎముకల నష్టం, వెన్నుపాము బలహీనత మరియు బోలు ఎముకల వ్యాధికి కారణమవుతుంది.

10.తప్పుడు భంగిమలో నిద్ర

10.తప్పుడు భంగిమలో నిద్ర

మీరు నిద్రకు ఉపక్రమించే భంగిమ తప్పుగా ఉంటే, క్రమంగా మీ వెన్నెముక బలహీనపడడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు, పూర్తిగా పక్కకు వంగి పడుకునే అలవాటు, మీ వెన్నెముక ఆరోగ్యానికి హానికరం. ఇది మీ వెన్నెముక వంపుకే కాకుండా, మెడపై అధిక ఒత్తిడిని కలుగజేస్తుంది. క్రమంగా కీళ్ళ నొప్పి, వెన్ను నొప్పి మరియు మెడ నొప్పికి దారితీస్తుంది.

English summary

10 Everyday Habits That Are Hurting Your Spine

10 Everyday Habits That Are Hurting Your Spine, Everyday habits that are hurting your spine which includes carrying heavyweights, poor posture, smoking, wearing high heels, etc. Know More.
Story first published:Friday, August 31, 2018, 11:23 [IST]
Desktop Bottom Promotion