For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరనుకున్నట్లుగా ఈ ఆహారాలు, మీ ఆరోగ్యానికి చేటు చేసేవి కాదు !

|

చాలామంది ఆరోగ్య నిపుణులు సూచించిన సూచనల మేరకు, మీరు తీసుకునే అనారోగ్యకరమైన ఆహారాలు మీ ఆరోగ్యానికి చెడు చేసేవిగా మాత్రం ఉండవు. ఇటువంటి ఆహార పదార్ధాలను తినడానికి ప్రయత్నించేటప్పుడు, మీరు ఊహించుకున్నంత చెడు ప్రభావాన్ని మాత్రం ఇవి కలిగి ఉండవు. వాస్తవానికి, మీరు ఇలాంటి ఆహారాలను సమతుల్యమైన మోతాదులో తీసుకునేటప్పుడు, అవి మీపై ఎలాంటి చెడు ప్రభావాన్ని కలిగి ఉండవు. కాబట్టి, మీరు తీసుకునే ఇలాంటి ఆహార పదార్ధాల విషయంలో, మీ మనసును పై నియంత్రణను కలిగి ఉండటం చాలా మంచిది.

Not-so-healthy Foods That Arent As Bad As You Thought

ఒకవేళ మీరు చిరుతిండిగా తీసుకునే ఆహారాల విషయంలో, పై చేయిని సాధించినట్లయితే వాటిని దూరంగా ఉంచగలుగుతారు. వాస్తవానికి, ఆరోగ్యకరంగా లేని ఆహారాలను వినియోగించడం వల్ల మీ ఆరోగ్యంపై ఎలాంటి తీవ్రమైన చెడు ప్రభావాన్ని కలగజేయావని తెలియజేసే ఆహారాల జాబితాను సిద్ధం చేశాము, అవేమిటో మీరు తెలుసుకోవచ్చు !

చాక్లెట్ :-

చాక్లెట్ :-

"చాక్లెట్లు మంచివి కావు" అన్న నానుడి మనలో ఉన్నప్పటికీ, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక రుచికరమైన పదార్థంగా ఉన్నది. ముఖ్యంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్, రక్తపోటు నియంత్రణ, ఎథెరోస్క్లెరోసిస్ & వృద్ధాప్యం వంటి పరిస్థితుల ప్రభావాన్ని గురికాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. శరీరంలో ఉన్న కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు మీ మేధాసంపత్తి క్షీణించకుండా పరిరక్షించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

పోషకాహార నిపుణుడు "సియారా ఫోయ్" అభిప్రాయం ప్రకారం, చాక్లెట్స్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అందువల్ల చాలామందిలో వీటిని తినాలన్న కోరిక ప్రధానంగా కనపడతుంది. "ఒకవేళ మీరు చాక్లెట్స్ తినాలనుకుంటే డార్క్ చాక్లెట్ మంచిది.ఇవి రుచిలోనే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచివని" ఆమె తెలియజేశారు.

వైన్ :-

వైన్ :-

మీరు ఆల్కహాల్‌ను తీసుకోవడం వల్ల అది మీ శారీరక ఆరోగ్యానికి మంచిది & మీ మనసుకు విశ్రాంతిని కలుగజేస్తుంది. వైన్ యాంటీఆక్సిడెంట్స్‌తో నిండి ఉండటం వల్ల అవి శరీరంలో స్వేచ్ఛగా తిరిగే రాడికల్స్‌ను నిరోధిస్తాయి. వైన్ రోగనిరోధక వ్యవస్థను & ఎముకల సాంద్రతను పెంచుతుంది. అంతేకాకుండా స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ & క్యాన్సర్ ప్రమాదాల ముప్పును కూడా తగ్గిస్తుంది.

ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. కాబట్టి, ఇన్నిరకాల ఆరోగ్యప్రయోజనాలను కలుగజేసే ఈ వైన్‌ను మనము తప్పక అభినందించాలి.

మాంసం :-

మాంసం :-

గొడ్డుమాంసము కూడా ఆరోగ్యకరమైన ఆహార జాబితాలో ప్రధానమైన స్థానమును కలిగి ఉన్నది కావునా, దీనిని మీ డైట్లో ఉంచుకోవటం మంచిది. మీ వారపు డైట్లో తాజాయైన లీన్ మాంసమును వినియోగించడం వల్ల ఇది మీ శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలను సరఫరా చేసేదిగా ఉంటుంది.

ఇది ప్రోటీన్స్, ఐరన్ & B-విటమిన్లను మీకు అందిస్తుంది. B విటమిన్లు సహజంగా లీన్‌గా ఉండే ఎర్రని మాంసం నుండి సేకరించబడతాయి. ఇందులో ఉండే జింక్ మీ శరీర కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తూ, మీ మెదడు యొక్క ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

నట్స్ :-

నట్స్ :-

నట్స్ రుచికరంగా ఉంటూ, మనకు విస్తృతంగా అందుబాటులో ఉంటాయి. వీటిలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ, మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలుగజేసేవిగా ఉన్నాయి. ఇవి అనేక పోషకాలకు గొప్ప మూలంగా ఉంటూ, యాంటీఆక్సిడెంట్లతో బాగా లోడ్ చేయబడి ఉన్నందున మీ శరీర బరువును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

ఈ నట్స్ కొలెస్ట్రాల్ & ట్రైగ్లిజరైడ్ స్థాయిలపై తీవ్ర ప్రభావాలను కలిగి ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ & మెటబోలిక్ సిండ్రోమ్ వంటి శారీరక రుగ్మతల కోసం నట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. నట్స్, బలమైన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే వీటిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఈ నట్స్ మీ గుండెకు చాలా మంచివి & గుండెపోటు, స్ట్రోక్ వంటి ముప్పు తీవ్రతను తగ్గిస్తాయి.

కొవ్వుతో ఉండే పెరుగు :-

కొవ్వుతో ఉండే పెరుగు :-

అన్ని రకాల వయస్సుల వారు పెరుగును తింటున్నారు. ఇది పోషకాహారమైనది & మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో దోహదపడే అనేక అంశాలను పెంపొందించడానికి క్రమం తప్పకుండా పెరుగును తినడం. ఇది గుండె జబ్బులు & బోలు ఎముకల వ్యాధి ప్రమాద తీవ్రతను తగ్గించడంతోపాటు, మీ శారీరక బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

కాల్షియం, B & D విటమిన్లు, ఫాస్పరస్ వంటి పోషకాలన్నీ కూడా పెరుగులో కనిపిస్తాయి. ఇది ప్రోబయోటిక్స్‌ను కూడా కలిగి ఉంది. కాబట్టి ఇది, కడుపు ఉబ్బరాన్ని, అతిసారం & మలబద్ధక లక్షణాలను తొలగించడం ద్వారా జీర్ణశక్తిని పెంపొందించడంలో మీకు సహాయపడుతుంది. ఫ్లవర్స్‌ను కలిగి ఉండని సేంద్రీయమైన పెరుగును మీరు ఎంచుకున్నట్లయితే మీరు గరిష్టమైన ప్రయోజనాలను పొందగలరు.

గుడ్డు పచ్చసొన :-

గుడ్డు పచ్చసొన :-

గుడ్డుసొన చుట్టూ అనేక అపోహలు ప్రబలంగా ఉన్నాయి అవన్నీ నిజమైనవి కావు. గుడ్డు పచ్చసొనలో కూడా అనేక పోషకాలు దాగి ఉన్నాయి. గుడ్డులో ఉండే తెలుపు & పచ్చసొనలు రెండూ కూడా మీ శరీర కండరాలను నిర్మించడంలో ఉపయోగపడతాయి. గుడ్డుసొనలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో పాటు A, D, E & K విటమిన్లను కూడా కలిగి ఉంది.

గుడ్డు పచ్చసొనను తెల్లసొనతో పోలిస్తే, పచ్చసొనలోనే ఫోలేట్ & విటమిన్ B12 వంటివి పుష్కలంగా ఉంటాయి. మాక్రోబయోటిక్ న్యూట్రీషనిస్ట్ "శిల్ప అరోరా ND" అభిప్రాయం ప్రకారం, "గుడ్డు పచ్చసొన కోలిన్‌ను కలిగి ఉంటుంది, ఇది మెదడుకు కీలకమైన న్యూరోట్రాన్స్మిటర్లలో ఒకటని నమ్ముతారు."

DK పబ్లిషింగ్ చేసిన హీలింగ్ ఫుడ్స్ అనే పుస్తకం ప్రకారం; "గుడ్డు పచ్చసొనలో యాంటీ ఆక్సిడెంట్లుగా ఉండే లుటీన్ & జియాక్స్తిన్, వయస్సు ఆధారితంగా సంభవించే దృష్టిలోపాలను నుండి కళ్ళను రక్షించుకోడానికి సహాయపడతాయి. అంతేకాకుండా గుండె వ్యాధులను నిరోధించడానికి సహాయపడే అమైనో ఆమ్లాలు, ట్రిప్టోఫాన్ & టైరోసిన్ వంటివి కూడా ఉంటాయి" . అందువలన పచ్చసొనతో పాటు మొత్తం గుడ్డును తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

పాప్‌కార్న్ :-

పాప్‌కార్న్ :-

ఈ రుచికరమైన అల్పాహారం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ సాధారణమైన అల్పాహారం తృణధాన్యాలను, ఫైబర్ & అనామ్లజనకాలను కలిగి ఉన్నాయి. పాప్‌కార్న్ - ఉప్పు, కొవ్వు, చక్కెర & సువాసనలతో నిండినప్పుడు మాత్రమే ఇది జంక్ ఫుడ్ గా మారుతుంది. సహజంగా లభించే పాప్‌కార్న్ పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

"పాప్‌కార్న్ మీకు ఫైబర్, ప్రోటీన్లను అందజేయడంతో పాటు, పరిమాణంలో ఎక్కువగా కనబడేటప్పటికీ కూడా- 3 కప్పుల పాప్‌కార్న్ లో కేవలం 100 కేలరీలను మాత్రమే కలిగి ఉంటుంది" అని "అనరి అలీడినా" (రిజిస్టర్డ్ డైటీషియన్) సూచించారు. కాబట్టి మీరు చిప్స్ & కుకీలను దూరంగా ఉంచుతూ, పాప్‌కార్న్స్ కు ఎక్కువ ప్రాధాన్యత నివ్వండి !

జున్ను (చీజ్) :-

జున్ను (చీజ్) :-

జున్ను, అధిక రక్తపోటు & బోలు ఎముకల వ్యాధి వంటి వాటి నుండి మీకు ఉపశమనమును కలుగజేయడంతో పాటు అనేక ఆరోగ్యప్రయోజనాలను చేకూరుస్తుంది. జున్ను విటమిన్లతో సహా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కాల్షియం, సోడియం, జింక్, ఫాస్పరస్, పొటాషియం & ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలను జున్ను మన శరీరానికి అందిస్తుంది.

క్యాన్సర్‌ను నివారించడంలో కూడా జున్ను బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా, ఇది విటమిన్ B ను పుష్కలంగా కలిగి ఉంది. ఇది మీ కాలేయమును బలోపేతం చేస్తూ, రక్తము యొక్క ఉత్పాదకతను పెంచుతుంది & మీరు తీసుకునే ఆహారంలో ఉన్న పోషకాలను మీ శరీరం సంగ్రహించేలాగా చేస్తుంది. అబీ లాంగర్, (రిజిస్టర్డ్ డైటీషియన్) సూచనల ప్రకారం - "జున్ను, కాల్షియముకు మంచి మూలంగా ఉంటూ - యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉన్నదని పరిశోధనలలో కనుగొనబడిందని" తెలిపారు.

English summary

Not-so-healthy Foods That Aren't As Bad As You Thought

There are a few foods that we think are bad, but actually they are not. Yes, foods such as chocolate, peanut butter, egg yolk, full-fat yogurt, etc. are a few foods that we assume are high in calories and are not good for health. For example, eating chocolate might impact ageing, lowering cholesterol levels, preventing cognitive decline, etc.
Story first published: Saturday, August 25, 2018, 15:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more