For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కండరాల నొప్పులను మటుమాయం చేసే ఆహారపదార్థాలు!

కండరాల నొప్పులను మటుమాయం చేసే ఆహారపదార్థాలు!

|

మనందరం జీవితంలో ఏదో ఒక సమయంలో, కండరాల నొప్పిలను అనుభవించినవారమే. కండరాల నొప్పులు సర్వసాధారణంగా కలుగుతాయి. కొన్ని సెకన్ల వ్యవధిలో మటుమాయం అయితే, కొన్ని గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం వరకు పత్తి పీడిస్తాయి. కండరాల నొప్పి అనేది ఒక అసంకల్పితంగా లేదా ఒత్తిడి పడటం వలన పెట్టేసిన (సంకోచించిన)కండరాలు లేదా కండరాల సమూహం తిరిగి సాధారణ స్థితికి చేరుకోక పోవడం వలన కలుగుతుంది. పెద్దవాళ్ళలో కండరాల నొప్పులు సాధారణమే. కానీ, కొన్నిసార్లు పిల్లలలో కూడా ఇవి కలగవచ్చు.

సాధారణంగా, కండరాల నొప్పులు కాళ్ళు మరియు పాదాలలో, ముఖ్యంగా పిక్కల వద్ద కలుగుతాయి. తొడ, పిక్కలు, పాదాల వంపులో అస్థిపంజర కండరాలు చాలా సాధారణంగా నొప్పులకు లోనవుతాయి. కండరాల నొప్పులు సాధారణంగా ప్రమాదకరం కానప్పటికీ, ప్రభావితమైన కండరాలని ఉపయోగించి ఏదైనా పని చేస్తే, నొప్పి మరీంత అధికం అవుతుంది. కండరాల నొప్పులు విశ్రాంతి సమయంలో లేదా రాత్రి సమయంలో లేదా వ్యాయామం చేసే సమయంలో అయినా సంభవించవచ్చు. నొప్పిగా ఉన్న కండరాన్ని ముట్టుకున్నప్పుడు మరీంత నొప్పిగా అనిపిస్తుంది. చూడటానికి కూడా ఇవి సంకోచించినట్లుగా కనపడతాయి. సాధారణంగా, ఇటువంటి కండరాలలో తీవ్రమైన నొప్పితో పాటు, కదిపినప్పుడు బాధ కూడా ఉంటుంది.

Foods That Can Help Cure Muscle Cramps

చాలావరకు నొప్పులు వాటంతట అవే, కొన్ని సెకన్లలో పరిష్కరించబడతాయి. కండరాల సాగదీత (స్ట్రెచ్చింగ్) ఇవి కొంతవరకు తగ్గుతాయి. అంతేకాక, తగినంత పోషకాహారం మరియు నీటిని అందివ్వడం, వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్త వహించడం, వంటి అంశాల వలన కూడా కండరాల నొప్పులు పరిష్కరించబడతాయి.

కండరాల నొప్పికి కారణాలు:

• ఒకే కండరాన్ని మితిమీరి వాడటం

• డీహైడ్రేషన్

• గర్భధారణ

• కండరాలపై ఒత్తిడి పడటం లేదా కండరాలను ఒకే భంగిమలో ఎక్కువ కాలం పాటు ఉంచడం

• మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు, కండరాలకు సరిపడా రక్త ప్రసరణ జరగకపోవడం

• వెన్నెముక నరాలు నొక్కుకుపోవడం

• కాల్షియం, పొటాషియం లేదా మెగ్నీషియం వంటి ఖనిజాల లోపం

• B1, B5 మరియు B6 వంటి విటమిన్లు యొక్క లోపం

• ఖనిజాలను విచ్ఛిన్నం చేసే డయ్యూరిటిక్స్ వంటి కొన్ని మందులను వాడటం

• వ్యాయామం చేయడానికి ముందు తగినంతగా స్ట్రెచ్చింగ్ చేయకపోవడం

• కండరాల అలసట లేదా వేడిలో వ్యాయామం చేయటం


కండరాల తిమ్మిరిని నయం చేసే ఆహారాలు:

సాధారణంగా, కండరాల నొప్పిని తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా మన ఇంటిలోనే నయం చేసుకోవచ్చు. తరచుగా, డీహైడ్రేషన్ లేదా విటమిన్ మరియు ఖనిజ లోపాలకు గురవడం మూలాన కండరాల నొప్పులు కలుగుతాయి. మనం తినే ఆహారంలో, కొన్ని మార్పులను చేసుకోవడం ద్వారా వీటిని సులభంగా పరిష్కరించుకోవచ్చు. కండరాల కణజాల విశ్రాంతి మరియు సంకోచ వ్యాకోచాలు, కొన్ని ఎలక్ట్రోలైట్లు మరియు ఖనిజాలపై ఆధారపడి ఉంటాయి. డీహైడ్రేషన్ మరియు అనారోగ్యకర ఆహారం వంటి అంశాల కారణంగా, శరీరంలోని సహజ ఖనిజ మరియు ఎలక్ట్రోలైట్ల సమతుల్య లోపం తలెత్తి, కండరాలు నొప్పులకు గురవుతాయి.

మీ కొరకు మేము, కండరాల నొప్పిని మటుమాయం చేసే కొన్ని అద్భుతమైన ఆహారపదార్థాల జాబితాని సిద్ధం చేసాము. వీటిని తింటే, నొప్పులు మాయమవడమే కాక తిరిగి రావు కూడా!

1. అరటి పండు

1. అరటి పండు

అరటి పండులో సమృద్ధిగా ఉండే పొటాషియం, శరీరంలోని పిండి పదార్థాలు విచ్ఛిన్నం కావడానికి మరియు కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. పొటాషియం, కండరాలు మరియు నాడీ వ్యవస్థ యొక్క సరైన పనితీరుకు చాలా అవసరం. దీని లోపం తలెత్తితే, మీ కండరాలు నొప్పిగా ఉంటాయి. అంతేకాకుండా, అరటిపండ్లు పొటాషియంతో పాటుగా, కండరాల నొప్పిని తగ్గించడానికి అవసరమైన కాల్షియం మరియు మెగ్నీషియంలను కూడా కలిగి ఉంటాయి. ప్రతిరోజూ అరటి పండు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారపదార్థాలను సేవిస్తే, కళ్ళనొప్పులను తగ్గించుకోవడమే కాక, తిరిగి పునరావృతమవకుండా నిరోధించవచ్చు.

2. బీన్స్ మరియు పప్పుధాన్యాలు

2. బీన్స్ మరియు పప్పుధాన్యాలు

బీన్స్ మరియు పప్పుధాన్యాలలో, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పుడు వండిన పప్పుధాన్యాలలో, 71 mg మెగ్నీషియం కలిగి ఉంటే, అయితే ఒక కప్పు వండిన బ్లాక్ బీన్స్ లో అంతకు రెట్టింపు (120 mg) మెగ్నీషియం ఉంటుంది. అంతేకాక, వాటిలో ఋతుస్రావ సమయంలో కలిగే నొప్పులను తగ్గించడానికి సహాయపడే పీచుపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.

3. ఆకుకూరలు

3. ఆకుకూరలు

పాలకూర మరియు బ్రోకలీ వంటి ఆకుకూరలలో, కాల్షియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మీ ఆహారంలో వాటిని భాగం చేరుకోవడం వలన కండరాల నొప్పిని నిరోధించడానికి సహాయపడతాయి. ఈ ఆకుకూరలు ఋతుక్రమ సమయంలో కలిగే నొప్పులను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఆకుకూరలలో కాల్షియం అధికంగా ఉండటం వలన, వారు ఋతుస్రావ నొప్పి మరియు బాధ నుండి ఉపశమనం ఇస్తాయి.

4. గింజలు మరియు విత్తనాలు

4. గింజలు మరియు విత్తనాలు

పప్పుధాన్యాల వలే, గింజలు మరియు విత్తనాలలో కూడా మెగ్నీషియం నిలువలు అధికంగా ఉంటాయి. 1 ఔన్స్ (28.3 g) కాల్చిన పొద్దుతిరుగుడు విత్తనాలలో 37 mg మెగ్నీషియం ఉంటుంది.1 ఔన్స్ కాల్చిన బాదం గింజలలో, మెగ్నీషియం పరిమాణం రెట్టింపుగా ఉంటుంది. ఇతర గింజలు మరియు గింజలలో కూడా కాల్షియం మరియు మెగ్నీషియం ఉంటాయి. కనుక మీ ఆహారంలో వీటిని తప్పకుండా భాగంగా చేసుకోండి.

6. బొప్పాయి

6. బొప్పాయి

తక్షణ శక్తి పొందటానికి బొప్పాయి సహాయపడుతుంది. కేవలం ఒక్క బొప్పాయిలో, మన దైనందిన పొటాషియం అవసరాల విలువలో 16%, అనగా 781 mg ఉంటుంది. తక్కువ కొవ్వు ఉన్న పెరుగు వంటి ప్రోటీన్ సహిత పదార్ధంతో పాటుగా తీసుకున్నప్పుడు, ఇది ఎలెక్ట్రోలైట్స్ ను భర్తీ చేసు, కండరాలలో కలిగే ఇబ్బందులను సరిచేస్తుంది.

7. గుడ్లు

7. గుడ్లు

ప్రోటీన్లు పుష్కలంగా లభించే గుడ్డులో, కండరాల నిర్మాణానికి అవసరమైన 'ల్యూసిన్', అనే అమైనో ఆమ్లం కూడా అధిక మొత్తంలో ఉంటుంది. జియాక్సాంథిన్, సెలీనియం మరియు ల్యూటిన్ వంటి యాంటిఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నందున, గుడ్లు శరీరంలో వాపు మరియు నొప్పి తగ్గించడంలో తోడ్పడతాయి.

7 పాలు

7 పాలు

తక్కువ కొవ్వుశాతం కలిగిన పాలు, పెరుగు మరియు ఇతర పాల ఉత్పత్తులలో, ఎముకల యొక్క ఆరోగ్యానికి చాలా అవసరమైన కాల్షియం నిల్వలు అధికంగా ఉంటాయి. కండరాల సంకోచ వ్యాకోచాలకు కాల్షియం అత్యవసరం. ఇది కనుక లోపిస్తే కండరాలలో నొప్పులు అధికంగా కలుగుతాయి. అందువలన, మీరు సహజ పద్ధతులలో కండరాల నొప్పిని తగ్గించాలనుకుంటే, పాలు మరియు పెరుగును తీసుకోండి.


English summary

Foods That Can Help Cure Muscle Cramps

Muscle cramps, though common, can be extremely painful. Dehydration, vitamin & mineral deficiencies, muscle overuse, and certain medications are just some the causes. Self-care at home, coupled with adequate vitamin & mineral intake can help in arresting the cramps to a great extent. Foods rich in potassium, calcium
Story first published:Tuesday, August 7, 2018, 13:33 [IST]
Desktop Bottom Promotion