For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 10 ఆహారాలు మీలో ఉన్న శృంగార కోరికలను చంపేస్తాయి

By R Vishnu Vardhan Reddy
|

ప్రతి వ్యక్తిలో ఉండే టెస్టోస్టెరోన్ మరియు ఈస్ట్రోజెన్ స్థాయిలను బట్టి వారిలో ఉండే శృంగార కోరికలు మరియు సామర్ధ్యాన్ని గుర్తించడం జరుగుతుంది. టెస్టోస్టెరోన్ వ్యక్తిలో ఉన్న శృంగార కోరికలను, వాంఛను పెంచుతుంది. ఈస్ట్రోజెన్ వాటిని తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.

10 Foods That Kill Your Sex Drive

అందుచేతనే మీరు గనుక శృంగార కోరికలను, శక్తిని పెంచుకోవాలని భావిస్తున్నట్లైతే, వాటిని పెంచే ఆహారాలను తీసుకోవడం మంచిది. మీ శరీరంలో టెస్టోస్టెరోన్ స్థాయిలను పెంచుకోవడానికి కొని చిట్కాలు ఈ వ్యాసంలో చెప్పడం జరిగింది. అదే సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి.

మీలో ఉన్న శృంగార కోరికలను చంపేసే 10 ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

ఇప్పుడు మీరు తెలుసుకోబోయే సమాచారాన్ని మంచికి లేదా చెడుకి ఎలా ఉపయోగిస్తారు అనేది మీ ఇష్టం. మంచికే ఉపయోగిస్తారని భావిస్తూ అసలు విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

శృంగార కోరికలను చంపేసే ఆహారాలు :

1. తెల్లటి బ్రెడ్ :

1. తెల్లటి బ్రెడ్ :

అది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. కానీ, దానిలో ఉండే శుద్ధిచేసిన కార్బోహైడ్రేట్ ఖచ్చితంగా రాత్రి సమయంలో బాగా ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది.

ఎందుకు ఇలా జరుగుతుందంటే, శుద్ధిచేసిన కార్బో హైడ్రేట్లు ల్లో సాధారణంగా ఉండవలసిన జింక్ ఖనిజ శాతం అధికంగా కోల్పోవడం జరుగుతుంది. ఈ ఖనిజం పురుషుల్లో శృంగార శక్తిని కోరికలను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది, అవసరం కూడా.

2. కలుపు మొక్క :

2. కలుపు మొక్క :

గంజాయి ని మీరు ఎప్పుడైనా తాగారా ? లేక కలుపుమొక్క ఉన్న కాల్చిన ఆహారాలను తిన్నారా ? ఇలా గనుక చేసినట్లయితే, గంజాయి మీ యొక్క శరీరానికి పూర్తి విశ్రాంతి కలిగేలా చేస్తుంది. ఈ పరిణామాల వల్ల ఆ కలుపు మొక్క వ్యక్తిలో ఉండే శృంగార కోరికలను విపరీతంగా ప్రభావితం చేసి, 24 గంటలపాటు అలాంటి కోరికలు కలగకుండా చంపేస్తుంది. దాని విపరీతమైన ప్రభావం వల్ల శృంగారం వంటి, తీవ్రమైన పనులను చేయలేరు.

3. మద్యం :

3. మద్యం :

మద్యం శరీరానికి తగ్గించే కారకంగా పనిచేస్తుంది. ఇలా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, మద్యం జీవ క్రియను, హార్మోన్ ఉత్పత్తిని, నరాలని చైతన్య పరచడం వీటన్నింటిని తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. ఒక చిన్న గ్లాసు లో మద్యాన్ని తీసుకున్నట్లైతే పెద్దగా నష్టం ఉండదు గాని, ఎప్పుడైతే అంతకు మించి తీసుకుంటారో అటువంటి సమయంలో మేలో ఉన్న శృంగార కోరికలు పూర్తిగా చచ్చిపోతాయి.

4. సోయా బీన్స్ :

4. సోయా బీన్స్ :

జన్యుపరంగా మార్చబడిన విత్తనాలను ఈ మధ్యకాలంలో వ్యవసాయ రంగంలో విరివిగా వాడటం జరుగుతుంది. వీటికి సోయా బీన్స్ అతీతం ఏమీకాదు.

దురదృష్టకరమైన అంశం ఏమిటంటే, ఈ సోయా బీన్స్ స్త్రీల యొక్క యోని పనితనం, శృంగార హార్మోన్ల పై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా పురుషుల్లో ఉత్పత్తి అయ్యే వీర్యాన్ని 40% తగ్గేలా చేస్తుంది. మీరు గనుక సోయాతో చేసిన వస్తువులను అధికంగా గనుక తింటున్నట్లైతే, మీ శృంగార జీవితం విసుగు చెందడానికి అదే ప్రధాన కారణం అని గుర్తుపెట్టుకోండి.

5. జున్ను :

5. జున్ను :

మరో దురదృష్టకరమైన, నమ్మలేని నిజం ఏమిటంటే, పాల ఉత్పత్తిని పెంచడానికి వివిధ రకాలుగా హార్మోన్లను పశువుల శరీరంలోకి చొప్పించడం జరుగుతుంది. దీని వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇలాంటి పాలను ఎప్పుడైతే జున్ను తయారీకి ఉపయోగిస్తారో, అదే జున్నుని తిన్నప్పుడు అది వ్యక్తుల్లో ఉండే శృంగార కోరికలను నశింపజేసే అవకాశం ఉంది.

కాబట్టి జున్ను ని స్వీకరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి.

6. చక్కెర :

6. చక్కెర :

చక్కెర ఎప్పుడైతే ఎక్కువగా తింటామో, అటువంటి సమయంలో వద్దన్నా బొజ్జ ఏర్పడుతుంది. దీని వల్ల ఎన్నో సమస్యలు కూడా తలెత్తుతాయి. అందులో శృంగార కోరికలు తగ్గిపోవడం కూడా ఒకటి.

ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడానికి ప్రేరేపించడం జరుగుతుంది. దీని వల్ల టెస్టోస్టెరోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. వీటన్నింటి మూలంగా శృంగార కోరికలు తగ్గిపోతాయి. వీటికి తోడు, బాగా బొజ్జ గనుక పెరిగినట్లైతే, అందులో ఉండే కొవ్వు ఈస్ట్రోజెన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా శృంగార కోరికలను చంపేస్తుంది.

7. లికో రైస్ :

7. లికో రైస్ :

లికో రైస్ లక్షణాలు గ్లిసిరైజ్ ఆమ్లం రుచి నుండి ఉద్భవించడం జరిగింది. ఇది కూడా శరీరంలో టెస్టోస్టెరోన్ ఉత్పత్తి తగ్గించే విధంగా ప్రేరేపిస్తుంది. అసలు నిజం ఏమిటంటే, రోజు 7 గ్రాములు లేదా అంతకు మించి లికో రైస్ ని సేవిస్తున్నట్లైతే, మీ శరీరంలో ఉత్పత్తి అయ్యే టెస్టోస్టెరోన్ శాతం 35% వరకు పడిపోతుంది.

8. పొదీనా :

8. పొదీనా :

ఇది మీకు తాజా శ్వాసకు ఎంతగానో ఉపయోగపడొచ్చు. కానీ, పొదీనా లో ఉండే మెంథాల్ టెస్టోస్టెరోన్ స్థాయిలను బాగా తగ్గిస్తుంది. దీంతో మీలో ఉన్న శృంగార కోరికలు బాగా తగ్గుముఖం పడతాయి.

9. అవిసె గింజలు :

9. అవిసె గింజలు :

సబ్జా గింజలు, అవొకాడోస్ వంటి చాలా ఉత్తమమైన ఆహారాల సరసన అవిసె గింజలు కూడా నిలుస్తాయి. కానీ, వీటి గురించి కూడా ఇబ్బందికరమైన కోణం మరొకటి ఉంది. దీని గురించి ఎవ్వరు పెద్దగా చర్చించలేదు. అదేమిటంటే, ఇది శరీరంలో ఉండే, టెస్టోస్టెరోన్ స్థాయిలను విపరీతంగా తగ్గించి వేస్తుంది. అదే సమయంలో శృంగార కోరికలను కూడా తగ్గిస్తుంది.

10. స్ట్రాబెర్రిస్ :

10. స్ట్రాబెర్రిస్ :

స్ట్రాబెర్రిస్ విషయంలో మీరు చిన్న పద్దతిని పాటించాల్సి ఉంది. అదేమిటంటే, వాటిని తినే ముందు మీరు శుభ్రంగా కడగాలి.

ఇలా ఎందుకుచేయాలంటే, వాటి పై విపరీతమైన క్రిమిసంహారకాలు ఉంటాయి. అవి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచేందుకు దోహదపడతాయి. అదే సమయంలో శృంగార కోరికలను తగ్గిస్తాయి.

English summary

10 Foods That Kill Your Sex Drive

Testosterone is the hormone responsible for your sex drive. No wonder men are such sex-crazed maniacs all the time! Unfortunately, the foods on this list are not so good for your testosterone levels. So if your sex life is going through a slump, you should definitely avoid these foods that kill your sex drive.
Desktop Bottom Promotion