For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మూడ్ సరిగ్గాలేనప్పుడు, మీరు తీసుకోవల్సిన 7 ఆహార పదార్థాలు !

మీ మూడ్ సరిగ్గాలేనప్పుడు, మీరు తీసుకోవల్సిన 7 ఆహార పదార్థాలు !

|

మనోవేదనను ఎదుర్కోవడం నిజంగా చాలా కష్టతరమైనది. ముఖ్యంగా, శరీర హార్మోన్లలో వచ్చే అసమానతలను మీరు నియంత్రించక పోవడం వల్ల సంభవిస్తాయి.

కాబట్టి మీరు చాలా బాధాకరమైన పరిస్థితులను తట్టుకోవడంలో అలిసిపోయి ఉంటే, అలాంటి సందర్భంలో మీరు ఏడవడానికి సిద్ధమయినట్లయితే మీరు నిజంగా అదృష్టవంతులు. మీరు మనోవేదనకు గురైనప్పుడు మీరు తీసుకోవల్సిన ఆహార పదార్థాల గురించి ఈ వ్యాసం ద్వారా మనము తెలుసుకుందాము !

 # 1 కొబ్బరి :

# 1 కొబ్బరి :

కొబ్బరికాయలు "మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్ల"తో పుష్కలంగా నిండి ఉండటం వల్ల, అవి మీ మెదడు ఆరోగ్యాన్ని సంరక్షించడమే కాక, మీ మానసిక స్థితిని సరిచేయడానికి సరిగ్గా సరిపోతాయి. అలాగే ఇవి సహజ సిద్ధంగానే తీపిని కలిగి ఉంటాయి.

కాబట్టి మీరు మనోవేదనకు గురైనప్పుడు, కొబ్బరిని వినియోగించినట్లయితే మీరు త్వరగా మంచి మానసిక స్థితిని పొందుతారు.

# 2 డార్క్ చాక్లెట్ :

# 2 డార్క్ చాక్లెట్ :

మీరు ఒక ఔన్స్ పరిమాణంలో డార్క్ చాక్లెట్ను తినడం వల్ల, కార్టిసోల్ మరియు కేతకొలామైన్ అనబడే ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తుంది అని అధ్యయనంలో బయటపడ్డాయి.

దట్టమైన మేఘాలతో ఆకాశంలో కనువిందు చేసే సమయంలో, పాలతో కలిపి డార్క్ చాక్లెట్లను తీసుకోవడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా ఉండగలుగుతారు.

# 3 పాలకూర :

# 3 పాలకూర :

ఆకుపచ్చని ఆకుకూరలు మీ మానసిక స్థితిని సరిచేసి మిమ్మల్ని సాధారణ స్థాయికి తీసుకు

వచ్చే విషయంలో మొట్టమొదటిది కాదు, కానీ వాటిలో దాగున్న రహస్యమైన శక్తులను గూర్చి మీరు తెలుసుకున్నట్లైతే ఆశ్చర్యపోతారు.

మీకు కావలసిన కిరాణా జాబితాలో ఖచ్చితంగా ఏదో ఒక ఆకుకూరను చేర్చండి, మంచి ఫలితాలను పొందండి.

# 4 గుడ్లు :

# 4 గుడ్లు :

ఈ ముఖ్యమైన ప్రోటీన్ ఆహారం, మీ మానసిక స్థితిని అనుకూలముగా మార్చే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను, ఇతర విటమిన్లను సమృద్ధిగా కలిగి ఉంటాయి. అంతే కాకుండా, వాటిలో ఉండే ప్రోటీన్లు మిమ్మల్ని సంతృప్తి చెందేలా చేసి, మీలో మానసిక ఆనందానికి కారణమవుతాయి.

# 5 టమోటాలు :

# 5 టమోటాలు :

టమోటాల తొక్కలో లైకోపీన్స్ చాలా ఎక్కువ స్థాయిలో లభిస్తుంది, అది మీ మెదడు పై అద్భుతంగా పనిచేసే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి మీరు డల్ (నిస్తేజం) గా ఉన్నప్పుడు కొన్ని టమోటాలను వినియోగించడం చాలా మంచిది.

నిజానికి, టమోటా సలాడ్కు కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ను కూడా జోడించవచ్చు, ఎందుకంటే మీ ప్రేగుల నుంచి లైకోపీన్ను శోధించడాన్ని మెరుగుపరుస్తుంది.

# 6 తేనె :

# 6 తేనె :

కాఎమ్పెఫరోల్ & క్వెర్సెటటిన్ల వంటి సమ్మేళనాలను తేనె కలిగి ఉంటుంది, ఇవి మీ మెదడును ఆరోగ్యంగా ఉంచి, ఒత్తిడిని దూరంగా ఉంచుతుంది. అంతే కాకుండా, ఇది సాధారణ చక్కెర కంటే 5 రెట్లు తియ్యగా ఉంటుంది. అందువలన, దీనిని చాలా తక్కువ పరిమాణంలో తీసుకునేటప్పుడు పూర్తి స్థాయిలో తీపిని ఆస్వాదించేందుకు ఇదొక మంచి మార్గం.

# 7 పెరుగు :

# 7 పెరుగు :

పెరుగులో కాల్షియం అనేది పూర్తిస్థాయిలో ఉంది, ఇది మీ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను విడుదల చేయడానికి, అనగా మంచి భావాలను కలుగచేసే వాటిని విడుదల చేయడానికి ఇది చాలా అవసరం. కాబట్టి మీ పండ్ల రసాలలో దీనిని కలిపి తీసుకోవడం చాలా మంచిది.

English summary

7 Foods You Should Eat When You Are In A Bad Mood!

Most of the time they are caused by hormonal fluctuations over which you have no control (hint: PMS).So if you are tired of snapping at innocents and then melting into a puddle of tears, you are in luck. In this article we will discuss X foods you should eat when you are in a bad mood that are known to work wonders on the foulest of temperaments.
Desktop Bottom Promotion