For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతానం కావాలనుకునే వారు, చిన్నపిల్లలు గ్రీన్ టీ తాగకూడదు ! గ్రీన్ టీతో చాలా ప్రయోజనాలు

ఇక పెళ్లయి పిల్లలు పుట్టి... ఇక పిల్లలు చాల్లే అనుకున్నవారు ఈ గ్రీన్ టీ తాగితే ఫర్లేదు కానీ పెళ్లి కాకుండా గ్రీన్ టీ తాగితే కొంప మునుగుతుంది. గ్రీన్ టీ లాభాలు, గ్రీన్ టీ ప్రయోజనాలు, గ్రీన్ టీ ఉపయోగాలు

|

గ్రీన్ టీ తాగితే బ‌రువు త‌గ్గుతామ‌ని, సాధార‌ణ టీ క‌న్నా గ్రీన్ టీ ఎంతో బెట‌ర‌ని ఇప్పుడు చాలా మంది దీన్ని తాగేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. అయితే నిజానికి గ్రీన్ టీ అంటే ఏమిటి..? ఆ టీ పొడిని ఏ ఆకుల‌తో త‌యారు చేస్తారనే విషయాలు చాలా మందికి తెలియవు.

ఆకుల పొడినే..

ఆకుల పొడినే..

కామెల్లియా సైనెన్సిస్ (Camellia sinensis) అనే మొక్క‌కు చెందిన ఆకుల‌నే గ్రీన్ టీ పొడిగా త‌యారు చేస్తారు. అది ఈ పొడి త‌యారీ సాధార‌ణ టీ పొడి త‌యారీలా ఉండ‌దు. వేరేగా ఉంటుంది. ఎలా అంటే... ఈ మొక్క ఆకులు లేత నుంచి కొద్దిగా ముదురుకు మారాక వాటిపై ఎండ త‌గ‌ల‌కుండా ప‌ర‌దా వంటివి క‌ప్పుతారు. దీంతో ఆ మొక్క‌ల‌కు ఉన్న ఆకులు రంగు మార‌తాయి.

సహజంగానే తయారు చేస్తారు

సహజంగానే తయారు చేస్తారు

ఇలా కొద్ది రోజులు ఉంచాక ఆ ఆకుల‌ను తెంపి మ‌ళ్లీ వాటిని నీడ‌లో ఎండ‌బెట్టి రోలింగ్ చేస్తారు. ఆ త‌రువాత పొడి చేసి ప్యాక్ చేస్తారు. మొత్తం స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌ద్ధతిలోనే జ‌రుగుతుంది. క‌నుక ఈ టీ పొడి మ‌న‌కు చాలా మంచిది. దీంతో త‌యారు చేసిన గ్రీన్ టీని తాగితే మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కెర కలుపుకోకుండా తాగాలి

చక్కెర కలుపుకోకుండా తాగాలి

గ్రీన్ టీని త‌యారు చేయాలంటే ఒక క‌ప్పు వేడి నీటికి ఒక టీస్పూన్ పొడి వేస్తే చాలు. అయితే నీటిని బాగా మ‌రిగించాక మాత్ర‌మే ఈ పొడిని వేసి 4 - 5 నిమిషాలు వేచి ఉండాలి. ఆ త‌రువాత వ‌చ్చే మిశ్ర‌మాన్ని వ‌డ క‌డితే గ్రీన్ టీ త‌యారైన‌ట్టే. అయితే నేడు చాలా మంది గ్రీన్ టీలోనూ చ‌క్కెర క‌లుపుకుని తాగుతున్నారు. కానీ అలా తాగితే మ‌ళ్లీ సాధార‌ణ టీ తాగిన‌ట్టే అవుతుంది. క‌నుక చ‌క్కెర లేకుండా అలాగే డైరెక్ట్‌గా తాగితేనే ప్రయోజనాలు కలుగుతాయి.

క్యాన్సర్ ప్రమాదాలు రావు

క్యాన్సర్ ప్రమాదాలు రావు

గ్రీన్ టీని రోజూ ఉద‌యం, సాయంత్రం తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలిన నిజ‌మిది. క్యాన్స‌ర్ క‌ణాల‌కు వ్య‌తిరేకంగా పోరాడే గుణాలు గ్రీన్ టీలో ఉంటాయి.

పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్

పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్

గ్రీన్ టీలో ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్ష‌న్ల బారి నుంచి ర‌క్షిస్తాయి. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి వ్యాధులు రాకుండా చూస్తాయి.

రక్త సరఫరా మెరుగుపడుతుంది

రక్త సరఫరా మెరుగుపడుతుంది

గ్రీన్ టీని రోజూ తాగితే గుండె సంబంధ స‌మ‌స్య‌లు రావు. ర‌క్త స‌రఫ‌రా మెరుగు ప‌డుతుంది. మ‌ధుమేహం ఉన్న‌వారు గ్రీన్ టీ తాగితే వారి బ్ల‌డ్ షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. దీంతోపాటు కొవ్వు కూడా కరిగి అధిక బ‌రువు త‌గ్గుతారు.

లివర్ శుభ్రం

లివర్ శుభ్రం

నొప్పులు, వాపుల‌ను త‌గ్గించ‌డంలోనూ గ్రీన్ టీ ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తుంది. గ్రీన్ టీని ఎప్ప‌టికీ తాగే వారి ఆయుష్షు కూడా పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థ‌, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది.

ఈ విష‌యాలు గుర్తు పెట్టుకోవాలి

ఈ విష‌యాలు గుర్తు పెట్టుకోవాలి

గ‌ర్భిణీలు మాత్రం డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు గ్రీన్ టీ తాగితే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే కొన్ని ఔష‌ధ గుణాలు క‌డుపులో ఉండే పిండాల‌కు ప‌డ‌క‌పోవ‌చ్చు. గ్రీన్ టీ అనేది కేవ‌లం పెద్ద‌లు మాత్ర‌మే తాగాలి. పిల్ల‌లు తాగ‌కూడ‌దు. తాగితే వారికి పోష‌ణ స‌రిగ్గా అంద‌క వారు ఎద‌గ‌రు.

రక్తహీనతతో బాధపడేవారు

రక్తహీనతతో బాధపడేవారు

ర‌క్త‌హీన‌తతో బాధ‌ప‌డేవారు కూడా గ్రీన్ టీ తాగ‌కూడ‌దు. ఎందుకంటే గ్రీన్ టీ వ‌ల్ల శ‌రీరం ఆహారంలో ఉండే ఐర‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హించ‌దు. నిద్రలేమి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు కూడా గ్రీన్ టీ తాగ‌కూడ‌దు. లేదంటే ఆ స‌మ‌స్య ఇంకా ఎక్కువ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

హై బీపీ ఉన్నవారు

హై బీపీ ఉన్నవారు

హై బీపీ ఉన్న‌వారు కూడా గ్రీన్ టీ తాగ‌కూడ‌దు. ఎందుకంటే ర‌క్త‌స‌ర‌ఫ‌రా ఎక్కువ‌గా అవ‌డం వ‌ల్ల బీపీ ఇంకా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది.

మతిమరుపును పొగొట్టేందుకు

మతిమరుపును పొగొట్టేందుకు

ఈ మధ్య ఎవరిని కదిలించినా గుర్తులేదు..మర్చిపోయాం అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటికి కారణం పనివత్తిడి, టెన్షన్స్‌, ఎక్కువగా ఆలోచించడం. అయితే పనివత్తిడిలో ఉన్నపుడు గ్రీన్ టీ తాగితే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మతిమురుపు సమస్య కూడా తగ్గుతుంది. గ్రీన్‌ టీ లో ఉండే ధయామిన్‌ , అమినోసిడ్స్‌ మనల్ని ఒత్తిడి నుంచిదూరం చేస్తాయి.

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ని నియంత్రిస్తుంది

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ని నియంత్రిస్తుంది

రోజుకో కప్పు గ్రీన్‌ టీ తాగటం వల్ల కీళ్ళనొప్పులు దూరమవుతాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. గుండెకు రక్త ప్రసరణ అందేలా చేస్తూ గుండెలో కొవ్వుని తగ్గించి, గుండెపోటు, రక్తపోటు వంటి ప్రమాదాల నుండి రక్షిస్తుంది. పురుషుల్లో సంభంవించే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ని గ్రీన్‌ టీ నియంత్రిస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

జీర్ణవ్యవస్థ సరిగా పనిచేసేలా చేస్తూ శరీరానికి శక్తినందిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మరీ ముఖ్యంగా గ్రీన్‌ టీని తాగడం వల్ల మన శరీరం తేజోవంతంగా, ఆరోగ్యంగానూ ఉంటుంది.

ఆ సామర్థ్యం తగ్గుతుంది

ఆ సామర్థ్యం తగ్గుతుంది

ఇక పెళ్లయి పిల్లలు పుట్టి... ఇక పిల్లలు చాల్లే అనుకున్నవారు ఈ గ్రీన్ టీ తాగితే ఫర్లేదు కానీ పెళ్లి కాకుండా గ్రీన్ టీ తాగితే కొంప మునుగుతుంది. ఇంతకీ ఏం జరుగుతుందీ...? గ్రీన్ టీని తరచుగా తీసుకునేవారిలో పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గిపోతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. అధిక మోతాదులో గ్రీన్ టీ తీసుకుంటే ఫెర్టిలిటీ సామర్థ్యానికి గండి కొడుతుంది.

మోతాదుకు మించి తాగితే..

మోతాదుకు మించి తాగితే..

10 మి.గ్రా గ్రీన్ టీ తీసుకునే స్త్రీ లేదా పురుషుల్లో సంతానోత్పత్తి అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుందనీ, ఫలితంగా వారికి పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. మొత్తానికి గ్రీన్ టీని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేయడం ఖాయం అంటున్నారు పరిశోధకులు. అందువల్ల గ్రీన్ టీ ప్రయోజనాలు తెలుసుకుని దానికి అనుగుణంగానే ప్రయత్నించాలి.

English summary

green tea uses benefits and side effects

green tea uses benefits and side effects
Desktop Bottom Promotion