For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హ్యాండ్ వాషా? లేదా సబ్బా? సూక్ష్మజీవులను సమర్థవంతంగా ఏది అరికడుతుంది! తెలుసుకుందాం రండి...

హ్యాండ్ వాషా? లేదా సబ్బా? సూక్ష్మజీవులను సమర్థవంతంగా ఏది అరికడుతుంది! తెలుసుకుందాం రండి...

|

మీ చేతులను అంటిపెట్టుకుని ఉండే సూక్ష్మ క్రిములను నాశనం చేయడంలో, హ్యాండ్ వాష్ మరియు సబ్బులలో సమర్థవంతమైనది లేదనే చర్చ మనం తరచూ వింటుంటాం. ఏది సమర్ధవంతమైనది అనే విషయం మీకు తెలియదు, ఎందుకంటే, మీ జీవితమంతా మీ చేతులను శుభ్రపరచుకోమని, ఆహారం తినేముందు మరియు బాత్రూం నుండి వచ్చాకా,శుభ్రం చేసుకోవాలని మాత్రం చెప్పేవారే! ఈ వ్యాసం ద్వారా, మీరు సబ్బు మరియు హ్యాండ్ వాష్ మధ్య వ్యత్యాసం తెలుసుకుందాం.

మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి పదేపదే, క్రిములు చేరకుండా చేతులను ఎలా కడుక్కోవాలో శిక్షణ ఇచ్చి ఉన్నారు. ఫలితంగా, సబ్బులు అనేక సంవత్సరాలుగా మన జీవితాల్లో భాగంగా మారాయి.

 Hand Wash Or Soap: Which Is Effective In Killing Germs?

యాంటీ బాక్టీరియల్ సబ్బు vs రెగ్యులర్ సబ్బు ప్రయోగం:

మీ చేతులను సబ్బుతో కడుక్కోవడం వలన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, మీ చర్మంపై ఉండే పరాన్నజీవులు మరియు స్పర్శ ద్వారా సులభంగా వ్యాప్తి చెందే క్రిములు తొలగింపబడతాయి.

చేతులు కడుక్కోకపోవడం వలన వ్యాప్తి చెందే కొన్ని వ్యాధులు:

చేతులు కడుక్కోకపోవడం వలన వ్యాప్తి చెందే కొన్ని వ్యాధులు:

వైరల్ గ్యాస్ట్రో ఎంటెరరైటీస్ ను కలుగజేసే నోరోవైరస్, చేతులు కడుక్కోకపోవడం వలన విస్తరిస్తుంది. కనుక, ఈ అనారోగ్యాన్ని నివారించడానికి, మీరు బాత్రూంని ఉపయోగించిన తరువాత చేతులను కడగాలి మరియు ఆహారాన్ని తయారుచేయటానికి ముందు మీరు మీ నోటిని మరియు ముక్కును తాకకూడదు.

చేతులు కడుక్కోకపోవడం వలన వ్యాప్తి చెందే కొన్ని వ్యాధులు:

చేతులు కడుక్కోకపోవడం వలన వ్యాప్తి చెందే కొన్ని వ్యాధులు:

హెపటైటిస్ ఎ, కాలేయంను ప్రభావితం చేసే ఒక వైరస్ సంక్రమిత వ్యాధి. దీని మూలంగా కడుపు నొప్పి, కామెర్లు, అలసట మరియు జ్వరం కలుగుతాయి. అశుభ్రంగా ఉన్న చేతులతో ఆహారాన్ని తయారుచేస్తే, ఆహార పదార్థాలు కలుషితమయ్యి హెపటైటిస్ ఎ వ్యాప్తి చెందుతుంది.

చేతులు కడుక్కోకపోవడం వలన వ్యాప్తి చెందే కొన్ని వ్యాధులు:

చేతులు కడుక్కోకపోవడం వలన వ్యాప్తి చెందే కొన్ని వ్యాధులు:

గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు, సాధారణంగా తుమ్ములు మరియు దగ్గు ఉన్నప్పుడు వెలువడే తుంపరల వ్యాప్తి చెందుతాయి. తుమ్ములు మరియు దగ్గు వచ్చినప్పుడు, మనం చేతులను అడ్డు పెట్టుకుంటాం. కానీ, తరువాత ఆ చేతులను కడుక్కోవటం మర్చిపోయి పనిలో పడిపోతాం. ఇలా చేస్తే అనారోగ్యాలు వ్యాపిస్తాయి.

చేతులు కడుక్కోకపోవడం వలన వ్యాప్తి చెందే కొన్ని వ్యాధులు:

చేతులు కడుక్కోకపోవడం వలన వ్యాప్తి చెందే కొన్ని వ్యాధులు:

నోసోకోమియల్ అంటువ్యాధులు సాధారణంగా ఆసుపత్రుల వద్ద సంక్రమిస్తాయి. ఇవి యాంటీబయాటిక్ నిరోధక బ్యాక్టీరియా వల్ల ఏర్పడతాయి. ఉదాహరణకు, MRSA.

హ్యాండ్ వాష్ లేదా సబ్బులో సూక్ష్మజీవులను సమర్థవంతంగా అరికట్టేందుకు ఏది ఉత్తమమైనదో తెలుసుకునేందుకు చదవండి మరి!

చేతులు కడుక్కోకపోవడం వలన వ్యాప్తి చెందే కొన్ని వ్యాధులు:

చేతులు కడుక్కోకపోవడం వలన వ్యాప్తి చెందే కొన్ని వ్యాధులు:

'సూక్ష్మజీవి' అనే పదం బాక్టీరియా, వైరస్లు మరియు శిలీంధ్రాలను సూచిస్తుంది. ఒక తడి సబ్బుపై ఎన్నో క్రిములు ఉంటాయి. సబ్బు నీటితో తడిచినప్పుడు, సబ్బులో ఉండే కొవ్వులు విచ్ఛిన్నం అయ్యి, నురుగు ఏర్పడుతుంది. మీ చేతులను అంటిపెట్టుకుని ఉన్న సూక్ష్మజీవులు, సబ్బు మీదకు రవాణా అవుతాయి.

సబ్బు నీటిలో కరిగేంత వరకు, సమస్యను సృష్టించదు. కాబట్టి,వాడిన తరువాత సబ్బును శుభ్రం చేస్తే, దానిపై పేరుకున్న బ్యాక్టీరియా కొంతమేరకు తొలగిపోతుంది. ఇంటిలో కొద్దిమంది వాడుకునేటప్పుడు, సబ్బును ఉపయోగించడం సురక్షితమే!

అయితే, సబ్బును ఉపయోగించినపుడు దాని ప్రభావం, మీ చేతులపై ఉంటుంది. సబ్బు మీ చర్మం నుండి సహజ నూనెలను తొలగించడానికి సరిపడా, అధిక పీహెచ్ స్థాయిని కలిగి ఉంటుంది. కనుక చర్మం పొడిబారుతుంది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారి అధ్యయనం ప్రకారం, మీ చేతులను శుభ్రపరచుకోవడానికి, సబ్బు మరియు గోరు వెచ్చని నీటిని వాడితే సూక్ష్మక్రిములు నశిస్తాయి.

సూక్ష్మక్రిములను తొలగించడంలో హ్యాండ్ వాష్ కు 100 శాతం సమర్థత ఉందా?

సూక్ష్మక్రిములను తొలగించడంలో హ్యాండ్ వాష్ కు 100 శాతం సమర్థత ఉందా?

ప్రజలు హానికరమైన సూక్ష్మక్రిముల వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించడానికి ద్రవ హ్యాండ్ వాష్ ను ఉపయోగిస్తారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారి అధ్యయనం ప్రకారం, హ్యాండ్ వాష్ డిస్పెన్సర్లను తిరిగి నింపేటప్పుడు, జాగ్రత్తలు తీసుకోకపోతే, అవి సూక్ష్మజీవులకు అడ్డాగా మారతాయి.

కాబట్టి, మీరు ఇదివరకు వాడిన ద్రవ హ్యాండ్ వాష్ డిస్పెన్సర్లను తొలగించటం కానీ లేదా హాండ్ వాష్ ను తిరిగి నింపడానికి ముందుగా, పరిపూర్ణంగా శుభ్రపరచడం కానీ చేయాలి. ఇలా చేస్తే సూక్ష్మజీవులు డిస్పెన్సర్ ని అంటిపెట్టుకుని ఉండవు.

ముక్తాయింపు...

ముక్తాయింపు...

మీరు కనుక ఒంటరిగా ఉంటున్నా లేదా కొద్దిమంది కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నా, సబ్బును ఉపయోగించి చేతులను కడుక్కోవడం సురక్షితమే, ఎందుకంటే బాగా కడుక్కుంటే క్రిములనన్నింటిని వదిలించుకోవచ్చు. అయితే, ఎక్కువ మంది సభ్యులు ఉపయోగిస్తున్నప్పుడు మాత్రం, ద్రవరూపంలో ఉండే హ్యాండ్ వాష్ ను వాడటం మంచిది. మీకు నచ్చితే, వ్యక్తిగత హ్యాండ్ సానిటయిజర్ ను కూడా వాడవచ్చు.

English summary

Hand Wash Or Soap: Which Is Effective In Killing Germs?

Our hands are constantly touching something which is why it's imperative to wash them often. Cleaning your hands with soap and warm water can be useful in killing germs. However, a liquid soap/hand wash turns out to be useful if there are more members using it, or if you are concerned about dry hands.
Story first published:Thursday, August 9, 2018, 18:17 [IST]
Desktop Bottom Promotion