For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీర్ణ సమస్యలను తగ్గించే మూలికా చికిత్సలు

By Deepti
|

జీర్ణ వ్యవస్ధ మన శరీరంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది, ఇది లేకపోతే మన శరీరం సరిగా పనిచేయదు. జీర్ణ వ్యవస్ధకు సంబంధించిన ఎటువంటి సమస్య అయినా అంతర్గతంగా, బహిర్గతంగా రెండు విధాలా ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

ఆహారం నుండి శరీర కణాల లోని పోషకాలను పీల్చుకుని, శరీరం నుండి వ్యర్ధాలను తొలగించడమే జీర్ణ వ్యవస్ధ చేసే ప్రధానమైన పని.

అజీర్ణం, కడుపు ఉబ్బరం, పిత్తు, గుండెల్లో మంట, డయేరియా, మలబద్ధకం, ఆసిడ్ రిఫ్లక్స్, కడుపులో పూత, లాక్టోజ్ పడకపోవడం, పేగువాపు వ్యాధి, చికాకు పెట్టే బోవేల్ సిండ్రోమ్ వంటివి కొన్ని సాధారణ జీర్ణ లోపాలు.

జీర్ణ లోపాలకు కారణాలు ఒకవ్యక్తి నుండి మరో వ్యక్తికీ మారుతూ ఉంటాయి. అయితే, ఆహారం సరిగా తీసుకోకపోవడం, సరైన పరిశుభ్రత లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, ఆల్కాహాల్ తాగడం, వత్తిడి, నిద్రలేమి, పోషక లోపాల వంటి కొన్ని సాధారణ లోపాలు ఉన్నాయి.

జీర్ణ లోపాలకు ఇంట్లోనే తేలికగా చికిత్స చేసుకోవచ్చు. ఇక్కడ చికిత్స జాబితా ఉంది, దీనితో జీర్ణ సమస్యలు అన్నిటికీ సాధ్యమైనంత తేలిగా చికిత్స చేసుకోవచ్చు.

అందువలన, ఈ వ్యాసంలో, బోల్డ్ స్కై వారు శరీరంలోని జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడే కొన్ని మూలికా చికిత్సల జాబితాను ఇచ్చారు. మరిన్ని విషయాల కోసం చదివి తెలుసుకోండి.

అల్లం

అల్లం

అల్లం జీర్ణవ్యవస్దను మెరుగుపరుస్తుంది, జీర్ణ వ్యవస్ధకు సంబంధించిన సమస్యలను నిరోధిస్తుంది. ఆహారంలో అల్లం లేదా అల్లం రసం తీసుకుంటే, ఇది జీర్ణ రసాలకు ఉద్దీపన కలిగించి, జీర్ణానికి అవసరమైన ఎంజైమ్ లను నియంత్రిస్తుంది.

ప్రొ-బయోటిక్ పదార్ధాలు:

ప్రొ-బయోటిక్ పదార్ధాలు:

ప్రొ-బయోటిక్ పదార్ధాలు జీర్ణ వ్యవస్ధను ఆరోగ్యంగా ఉంచి, ప్రభావవంతంగా పనిచేసేట్టు చేస్తాయి. ప్రొ-బయోటిక్ ఆహారాలలో ఉండే బాక్టీరియా పొత్తికడుపు ఉబ్బరం, అతిసారం, పిత్తు వంటి జీర్ణ సమస్యలకు చికిత్సగా సహాయపడుతుంది.

పుదీనా

పుదీనా

జీర్ణ ప్రక్రియలో, జీర్ణ సమస్యల చికిత్సలో కూడా పుదీనా బాగా పనిచేస్తుంది. దీనిలో ఉండే పొట్ట ఉబ్బరం తగ్గించే, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్, కడుపుబ్బరం, వికారం, వాంతులు వంటి వాటి చికిత్సలో కూడా సహాయపడతాయి.

సోంపు

సోంపు

సోంపు గింజలు జీర్ణ ఆరోగ్యంతో అనుసంధానించబడి ఉంటాయి. వీటిని గుండెల్లో మంట, అజీర్ణం, తక్కువ పొట్ట అసిడిటీ చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది IBS, పొట్ట ఉబ్బరం నుండి అద్భుతమైన ఉపశమనాన్ని కూడా అందిస్తుంది.

వెనిగర్:

వెనిగర్:

వెనిగర్ జీర్ణ-సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు ఉపయోగించే మరో చికిత్స. దీని వినియోగం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది అజీర్ణం, పిత్తు, కడుపుబ్బరం, పొట్టనొప్పి, గుండెల్లో మంట వంటి సమస్యలకు చికిత్స చేస్తుంది.

కలబంద:

కలబంద:

మలబద్ధకాన్ని నివారించే లక్షణం ఉన్న కలబంద జీర్ణ వ్యవస్ధ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది. కలబందలో ఉండే సమ్మేళనాలు కడుపు అల్సర్ తోసహా అనేక జీర్ణ సమస్యల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇంగువ

ఇంగువ

జీర్ణ ఆరోగ్యానికి ఇంగువ కూడా చాలా మంచిది. దీని యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-ఫ్లాటులెంట్ లక్షణాలు కడుపు నొప్పి, కలుషిత ఆహరం వంటి సమస్యలకు చికిత్సగా పనిచేయడంతో పాటు శరీరంలోని పిత్త సమస్యల చికిత్సలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

English summary

Herbal Remedies To Treat Digestive Problems

Herbal Remedies To Treat Digestive Problems,Digestive disorders can be treated at home easily. There is a list of remedies that are available easily to treat all sorts of digestive problems.Therefore, in this article, we at Boldsky will be listing out some of the herbal remedies that help to treat digestive problems
Desktop Bottom Promotion