For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ను తినడం వల్ల మీకు ఈ 8 మార్గాలలో అనారోగ్యము కలగవచ్చు !

By Ssn Sravanth Guthi
|

రసగుల్లాలు, లడ్డూలు, డోనట్స్, కేకులు, చాక్లెట్లు, మిల్క్ షేక్స్ వంటి మంచి రుచికరమైన ఆహారాల పేర్లను చదివినప్పుడు మీ నోటి నుంచి లాలజలము వస్తున్నట్లయితే, మీరు ఖచ్చితంగా తీపిని ఇష్టపడుతుంటారు !

మనము పెద్దగా స్వీట్లను ఇష్టపడేవారిమి కానప్పటికీ, మనలో చాలామంది వారు ఇష్టపడి & రోజూ తినగలిగే షుగర్ను ఎక్కువగా కలిగిన ఉన్న ఒక్క స్వీటునైన కలిగి ఉండవచ్చు.

Here Are 8 Surprising Ways In Which Eating Sugar Makes You Sick!

ఉదాహరణకు:- శీతల పానీయాలు, పండ్ల రసాలు. వాటిలో కొన్ని పండ్లు కూడా చాలా ఎక్కువ షుగర్ను కలిగి ఉంటాయి!

ఎక్కువగా షుగర్ను కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవడం, మన ఆరోగ్యానికి చాలా మంచివి కావని మనకు తెలుసు.

అయినప్పటికీ ఇలాంటి నిజాలు తెలిసిన తరువాత కూడా, చాలామంది ఈ తీపి పదార్థాలకు దూరంగా ఉండలేరు.

షుగర్ను అధికంగా కలిగి ఉండే ఆహారాలు శరీరబరువును పెంచి, దంతక్షయమును కలుగచేస్తాయని చాలామంది అభిప్రాయపడతారు.

అయినప్పటికీ, దీర్ఘకాలంపాటు అధికంగా షుగర్ను వినియోగిస్తున్న వారిలో ఎదురయ్యే అనారోగ్యాల జాబితా చాలా ఎక్కువే !

వాస్తవానికి, పరిశోధన అధ్యయనాలు & గణాంకాల ప్రకారం చక్కెరను అధికంగా వినియోగించడం వల్ల ప్రజలలో కొన్ని ప్రాణాంతక వ్యాధులు కలిగించవచ్చని నిరూపించాయి!

కాబట్టి, షుగర్ను తినడం వల్ల మీకు అనారోగ్యము కలిగించే కొన్ని ఆశ్చర్యకరమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:

1. గుండె సమస్యలు :

1. గుండె సమస్యలు :

ఇటీవల కాలంలో హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక పరిశోధనలో, రోజువారీ డైట్లో కనీసం 25% కేలరీల పరిమితిని కలిగి ఉన్న చక్కెర పదార్థాలను తినేవారిని, చక్కెర పదార్థాలను తినని వారిలో పోలిస్తే - వీరిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి, చక్కెర పదార్థాలను మీ రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యానికి హానిని కలిగించడమే కాక, అంతకంటే ఎక్కువ హృద్రోగాలు కలగడానికి కారణమవుతుంది.

2. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం :

2. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం :

బాత్ విశ్వవిద్యాలయం నిర్వహించిన మరొక పరిశోధనలో రోజువారీ ఆహారంలో అధిక మోతాదులో చక్కెరను కలిగిన ఆహారాలను తినడం వల్ల మీ వృద్ధాప్యంలో ఎదురయ్యే చిత్తవైకల్యము (జ్ఞాపకశక్తి క్షీణించడము) ను ప్రభావితం చేయటలో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంది. చక్కెరలో ఉండే ఎంజైమ్ను మీ మెదడులో అసాధారణమైన స్థాయిలో ప్రోటీన్లను పెంచుతుంది, ఇలా అనేక సంవత్సరాలు గడిచేటప్పటికి మీరు చిత్తవైకల్యం వంటి వ్యాధులకు గురవుతారు.

3. పిల్లల్లో ఊబకాయం :

3. పిల్లల్లో ఊబకాయం :

చక్కెరను ఎక్కువగా కలిగి ఉన్న తీపి పదార్థాలను పిల్లలు బాగా ఇష్టపడతారన్నదే వాస్తవం. అయినప్పటికీ, తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ ఆహార విషయంలో వాటి వినియోగాన్ని ఆపడానికి ప్రయత్నం చేయకపోతే, అది మీ పిల్లలను ఊబకాయులుగా మార్చవచ్చు. పిల్లల్లో వచ్చే ఈ ఊబకాయం - బాల్య మధుమేహం, గుండె సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, నిరాశ వంటి ఇతర ప్రధాన జబ్బులతో సంబంధమును కలిగి ఉంటుంది.

4. జీర్ణ సమస్యలు :

4. జీర్ణ సమస్యలు :

రోజూ చక్కెర ఆహారాలను తీసుకోవడం వలన మీ ప్రేగుల ఆరోగ్యాన్ని మరింతగా దిగజార్చవచ్చు. చక్కెరలో కనిపించే ఎంజైమ్లు మీ కోలన్ లైనింగ్లో ఉన్న మంచి బాక్టీరియాను చంపుతాయి, దీని వల్ల మీకు అసిడిటి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్ణం, ఆకలి మందగించడం మరియు ప్రేగుల కాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల వంటి వాటికి కారణమవుతాయి.

5. కాలేయానికి హాని చేస్తుంది :

5. కాలేయానికి హాని చేస్తుంది :

ఆల్కహాల్ వంటి చక్కెర పదార్థాలను వినియోగించడం వల్ల కాలేయానికి హాని కలిగించవచ్చని అనేక అధ్యయనాలు నిరూపించాయి ! జీర్ణ వ్యవస్థలో భాగంగా షుగర్ మొలెక్యుల్స్ను కూడా కాలేయంలోనే ప్రాసెస్ చేయాలి. ఈ షుగర్ మొలెక్యుల్స్ను కాలేయంలో విచ్ఛిన్నం చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది, అందుకోసం కాలేయం చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తోంది, తద్వారా కాలేయానికి నష్టము వాటిల్లుతుంది, అలానే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధులు సంభవించడానికి కూడా కారణమవుతుంది.

6. అకాల వృద్ధాప్య ఛాయలు :

6. అకాల వృద్ధాప్య ఛాయలు :

చర్మము ముడుతలు పడటం, జుట్టు నెరవడం, జీర్ణక్రియ మందగించడం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, అలసట వంటి సంకేతాలు ఒక వ్యక్తి వృద్ధాప్యంలోకి వస్తున్నప్పుడు క్రమక్రమంగా ప్రారంభమవుతాయి. ఏమైనప్పటికీ, ఒక వ్యక్తి అనారోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండడంతోపాటు, వారు తీసుకునే ఆహారంలో ఎక్కువ చక్కెరను కలిగి ఉన్నట్లయితే, వృద్ధాప్య దిశగా మీ శరీర కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఇది ఇలా మిమ్మల్ని అసంతృప్తి పరచి, మీకు అనారోగ్యకరమైనది కూడా మారవచ్చు!

7. క్యాన్సర్ :

7. క్యాన్సర్ :

డల్లాస్లో ఉన్న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్లో నిర్వహించిన పరిశోధన అధ్యయనం ప్రకారం, చక్కెరను కలిగి ఉన్న ఆహార పదార్ధాలకు మరియు కొన్ని రకాలైన క్యాన్సర్లలో ప్రత్యక్ష సంబంధమును కలిగి ఉందని కనుగొనబడింది. షుగర్ మొలెక్యుల్స్ అనేవి శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలకు ఆహారంగా మారగలదని ఈ అధ్యయనంలో వెల్లడించింది. అందువల్ల ఈ కణాలు వేగవంతంగా వృద్ధి చెంది, పూర్తిస్థాయిలో క్యాన్సర్ కలగడానికి కారణం అవుతుంది.

8. డిప్రెషన్ :

8. డిప్రెషన్ :

కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో నిర్వహించిన మరోక పరిశోధన ప్రకారం, రోజువారీ ఆహారంలో చక్కెర పదార్థాలను తినడం వల్ల డిప్రెషన్ వంటి మానసిక వ్యాధుల తీవ్రతను పెంచుతుంది. రక్తంలో చక్కెర అధిక మొత్తంలో ఉండటం వల్ల సెరోటోనిన్, డోపామైన్ వంటి మెదడు రసాయనాలలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది, ఇవి మీలో డిప్రెషన్ను, ఆందోళనను కలిగించవచ్చు.

English summary

Here Are 8 Surprising Ways In Which Eating Sugar Makes You Sick!

Here Are 8 Surprising Ways In Which Eating Sugar Makes You Sick!,Here are a few dangerous health conditions which are caused by consuming sugary foods regularly.
Desktop Bottom Promotion