For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి చిట్కాల‌తో నోటి దుర్వాస‌న‌కు చెక్‌

By Sujeeth Kumar
|

నోటి నుంచి దుర్వాస‌న రావ‌డం కొంద‌రికి స‌హ‌జమే. ఇలా దుర్వాస‌న వ‌చ్చే వాళ్లు ఒప్పుకొని త‌గిన జాగ్ర‌త్త పాటించ‌డం మేలు. నోటి దుర్వాస‌న వ‌ల్ల స‌మాజంలో చెడ్డ పేరు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆత్మ‌విశ్వాసాన్ని, వ్య‌క్తిత్వాన్ని కోల్పోయే ప్ర‌మాదం ఉంది. అందుకే నోటి ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెట్టాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. శుభ్రంగా బ్ర‌ష్ చేసుకోవ‌డం, నాలుక‌ను శుభ్రంగా ఉంచుకోవ‌డం ఒక్క‌టే స‌రిపోదు. పూర్తి నోటి శుభ్ర‌త‌కు ఎన్నో ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. నోటి దుర్వాస‌న ద‌రిచేర‌కుండా కొన్ని ఇంటి చిట్కాలున్నాయి.

నోటి దుర్వాసన ఎందుకొస్తుంది?

నోటి దుర్వాసన ఎందుకొస్తుంది?

వైద్య‌ప‌రంగా హ్యాలీటోసిస్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. నోటి దుర్వాస‌న అప‌రిశుభ్ర‌మైన నోటి నిర్వ‌హ‌ణ వ‌ల్ల వ‌స్తుంది. మ‌నం తినే ఆహారమూ నోటి దుర్వాస‌న‌కు కార‌ణం కావొచ్చు. అదీ కాక మారుతున్న జీవ‌న‌శైలి ప్ర‌భావమూ ఉంది. ఇది ఇత‌ర జ‌బ్బుల‌కు దారితీస్తుంది.

స‌రైన ఆహార అల‌వాట్లు

స‌రైన ఆహార అల‌వాట్లు

స‌రైన ఆహార అల‌వాట్లతో నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించుకోవ‌చ్చు. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు ఘాటైన వాస‌న క‌లిగి ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి అలాంటి జాబితాలోకి వ‌స్తాయి. నిజానికి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి కాక‌పోతే క‌డుపులోకి వెళ్లేవ‌ర‌కు వీటి వ‌ల్ల వ‌చ్చే నోటి దుర్వాస‌న‌ను పోగొట్టుకోవాలంటే బ్ర‌ష్ చేయ‌డ‌మో, మౌత్ వాష్ వాడ‌ట‌మో చేయాల్సిందే.

అనారోగ్య‌క‌ర జీవ‌న‌శైలి అల‌వాట్లు

అనారోగ్య‌క‌ర జీవ‌న‌శైలి అల‌వాట్లు

ఆరోగ్యక‌ర‌మైన అల‌వాట్ల‌లో భాగంగా రోజుకు రెండు సార్లు బ్ర‌ష్ చేయడ‌మూ అలవాటుగా చేసుకోండి. బ్ర‌ష్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల నోరు దుర్వాస‌న కొడుతుంది. ఇలా ఎందుకు అవుతుందంటే నోటిలో మ‌నం తిన్న ఆహార ప‌దార్థాలు ఇరుక్కుని పోతాయి. వాటి మీద సూక్ష్మ క్రిములు ద‌రిచేరి అవే చెడు వాస‌న‌కు కార‌ణ‌మ‌వుతాయి. బ్యాక్టీరియా చిగుళ్ల‌కూ హాని క‌లిగిస్తాయి.

పైన తెలిపిన‌ట్టు నోటి శుభ్ర‌త‌పై ఎంత దృష్టి సారించినా ఒక్కోసారి కొన్ని వైద్య స‌మ‌స్య‌ల‌తోనూ నోటి నుంచి చెడు వాస‌న రావొచ్చు.

వైద్య కార‌ణాలు

వైద్య కార‌ణాలు

కొంద‌రు ఎంతో కాలంగా నోటి దుర్వాస‌న‌తో బాధ‌ప‌డుతుంటారు. అలాంటివారు త‌మ నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా దుర్వాస‌న‌ను మాత్రం ఆపుకోలేరు. వీరికి చిగుళ్ల స‌మ‌స్య ఉండి ఉండొచ్చు. దీనికి ముఖ్య కార‌ణం బ్యాక్టీరియా చిగుళ్ల‌లో ఉండ‌టం. ఇత‌ర కార‌ణాల్లో దంతాల్లో పుచ్చులు. ఒక్కో్సారి నోరు ఎండిపోయిన‌ట్టుగా ఉంటుంది. దీన్ని జెరోస్టోమియాగా వ్య‌వ‌హ‌రిస్తారు.

లాలాజ‌ల గ్రంథుల్లో స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా నోరు ఎండిపోయిన‌ట్టుగా అనిపించొచ్చు. ఒక్కోసారి నోటి నుంచి ఎక్కువ‌గా గాలి పీల్చ‌డ‌మూ నోటి దుర్వాస‌న‌కు కార‌ణంగా ప‌రిణ‌మించ‌వ‌చ్చు.

ఇంకా ఇవి కాకుండా లివ‌ర్‌, కిడ్నీ స‌మ‌స్య‌ల వ‌ల్ల‌, న్యుమోనియా, బ్రాంకైటిస్‌, సైన‌స్ ఇన్ఫెక్ష‌న్ల‌తోనూ నోటి దుర్వాస‌న రావొచ్చు. డ‌యాబెటిస్ వ‌ల్ల కూడా నోరు చెడు వాస‌న కొటొచ్చు.

సోంఫ్‌

సోంఫ్‌

ఏదైనా రెస్టారెంట్‌కు వెళితే లంచ్ లేదా డిన్న‌ర్ చేశాక బిల్‌తో పాటు సోంఫ్ అందిస్తారు. ఇది నోటి దుర్వాస‌నను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటుంది. తాత్కాలికంగా దీని వ‌ల్ల నోటి దుర్వాస‌న రాకుండా ఉంటుంది. కొంచెం సోంఫ్ ఎల్ల‌ప్పుడూ గుప్పెట్లో ఉంచుకోవ‌డం మంచిది.

నిమ్మ తొన‌లు

నిమ్మ తొన‌లు

నిమ్మ లేదా నారింజ తొన‌ల‌ను శుభ్రంగా క‌డిగి న‌మ‌లాలి. నిమ్మ జాతిలో సిట్ర‌స్ చెడు వాస‌న పోయేలా చేస్తుంది.

లవంగాలు

లవంగాలు

ల‌వంగాల్లో యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. ఇవి బ్యాక్టీరియాతో పోరాడి నోటి దుర్వాస‌న‌ను అడ్డుకుంటాయి.

బ్ర‌ష్‌తో...

బ్ర‌ష్‌తో...

ప్ర‌తిరోజు బ్ర‌ష్ చేసుకొని ఫ్లాసింగ్ చేసుకోవ‌డం మ‌ర‌వ‌ద్దు. రోజుకు క‌నీసం రెండుసార్లైనా బ్ర‌ష్ చేసుకుంటే మేలు.

ఓర‌ల్ చెక‌ప్‌

ఓర‌ల్ చెక‌ప్‌

దంత వైద్యుడ్ని త‌ర‌చూ క‌ల‌వాలి. ఎంత నోటి శుభ్ర‌త పాటించినా క‌నీసం ఆరు నెల‌ల‌కు ఒక సారి దంత వైద్యుడ్ని క‌లిస్తే మంచిది.

నీళ్లు బాగా తాగాలి

నీళ్లు బాగా తాగాలి

నీళ్లు లాలా జ‌ల గ్రంథుల‌ను ఉత్తేజంగా ఉంచుతుంది. ఎక్కువ‌గా నీళ్లు తాగితే నోటి దుర్వాస‌న‌ను అదుపులో ఉంచ‌వ‌చ్చు. ఉద‌యం లేవ‌గానే గ్లాసు నీళ్లు తాగితే ఫ్రెష్‌గా ఉంటుంది.

క‌ట్టుడు ప‌ళ్లా?

క‌ట్టుడు ప‌ళ్లా?

మీవి క‌ట్టుడు ప‌ళ్ల‌యితే ప‌డుకునే ముందు వాటిని తీసేయండి. ఆ త‌ర్వాత నోటిని శుభ్రం చేసుకోండి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ్యాక్టీరియా ద‌రిచేర‌దు.

నాలుక‌ను శుభ్రం చేసుకోండి

నాలుక‌ను శుభ్రం చేసుకోండి

దీన్ని ఏ రోజు కూడా మ‌ర‌వ‌ద్దు. నాలుక‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల బ్యాక్టీరియా, ఫంగ‌స్ పేరుకోదు. ఇవ‌న్నీ నోటి దుర్వాస‌న‌కు కార‌ణమ‌వుతాయి.

ఆరోగ్య క‌ర ఆహారాన్నే తినండి. డైట్‌లో భాగంగా బ్ర‌వున్ రైస్ తీసుకోండి. తాజా ఆకుకూర‌లు, పండ్లను భాగం చేసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉన్న ఆహారం అంటే న‌ట్స్‌, చేప‌లు, బీన్స్ తీసుకోవ‌డం మంచిది. అవిసె గింజ‌ల‌ను తీసుకోవ‌డ‌మూ ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రం.

మౌత్ రిన్స్‌

మౌత్ రిన్స్‌

వైద్యులు సిఫార‌సు చేస్తే మౌత్ రిన్స్ వాడ‌డం మంచిది. భోజ‌నం త‌ర్వాత మౌత్ రిన్స్ చేస్తే ఫ‌లిత‌ముంటుంది. ఇదొక్క‌టే నోటి దుర్వాస‌న పోగొట్ట‌లేదు. రెగ్యుల‌ర్‌గా బ్ర‌ష్ చేసి ప‌ళ్ల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి.

మ‌రి ఈ చిట్కాల‌న్నీ పాటించి నోటిని శుభ్రంగా ఉంచుకుంటారు క‌దూ!

English summary

Home remedies for bad breath

Have you ever been told that you've got bad breath? Let's admit it- it could be the most embarrassing situation one could face. It is considered as socially unacceptable, which could take a toll on your confidence and personality!For that reason, you may think that brushing and flossing is all you need for oral hygiene. But, when it comes to oral care, there is so much more involved in it. Before we mention a few remedies to get rid of bad breath, let's understand why you get smelly breath?Why you have smelly breath?
Story first published:Thursday, February 22, 2018, 18:07 [IST]
Desktop Bottom Promotion