For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలతో షుగర్ పెషేంట్ల పాదాల గాయాలకు చెక్ పెట్టొచ్చు...

డయాబెటిస్ రోగుల పాదాలలో అల్సర్ పుండ్లను పోగొట్టే చిట్కాలు

|

డయాబెటిస్ రోగుల పాదాలలో వచ్చే అల్సర్ అనేది మధుమేహంము పై తక్కువ నియంత్రణను కలిగి ఉండే వారిలో వచ్చే ఒక సాధారణ సమస్య. దీని ప్రభావం వల్ల పాదాల అడుగు భాగంలో ఉండే చర్మ కణజాలాలు విచ్చిన్నమవుతాయి. ఇలాంటి పరిస్థితులను కాలి బొటనవేలు, పాదాల అడుగు భాగం లో చూడవచ్చు. ఇది మీ కాళ్ళ చుట్టూ మాత్రమే కాకుండా పాదం అడుగు భాగంలో ఉన్న ఎముకలకు కూడా వ్యాపిస్తుంది. ఇలాంటి సమస్యతో బాధపడే వారికి, ఈ వ్యాసం ద్వారా కొన్ని నివారణా మార్గాల గూర్చి తెలియజేయడం జరిగింది.

ఈ అల్సర్ల మొదటి లక్షణం, మీ పాదాలు బాగా ఎండిపోయి పగిలిపోతుంది. అలాగే అసాధారణమైన వాపును, చికాకును, ఎరుపుదనాన్ని & పాదాల అడుగు నుండి దుర్వాసన రావడం వంటి ఇతర లక్షణాలను కలిగి ఉంటాయి.

ఈ అల్సర్లో కనబడే ప్రత్యక్ష లక్షణము ఏమిటంటే, పాదాలపై ఏర్పడిన పుండు చుట్టూ ఉన్న పరిసర కణజాలాలు నల్లగా మారడం. ఆ పుండు చుట్టూ ఉన్న ప్రాంతంలో ఆరోగ్యకరమైన రక్తప్రవాహం సరఫరా కాలేనప్పుడు ఇలా సంభవిస్తుంది.

Home Remedies For Diabetic Foot Ulcers

మధుమేహ రోగులలో కాళ్ళ నొప్పులు సంభవించడానికి గల కారణం ఏమిటంటే, పాదాలలో రక్త ప్రసరణ సరిగా లేకపోవటం, రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, రక్తనాళాలకు నష్టం వాటిల్లడం, పాదాల అడుగున గాయాలు, పాదాలు చికాకును కలిగి ఉండటం వంటివి మొదలైనవి.

డయాబెటిస్ రోగులు ఇలాంటి పాదాల నొప్పులను కలిగి ఉన్న ప్రారంభదశలోనే ఇంటి చిట్కాల ద్వారా పూర్తి నివారణలను ప్రయత్నించవచ్చు.

1. కెఫిన్ :

1. కెఫిన్ :

డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చే సాధారణ సమస్య ఏమిటంటే, మీ పాదాల చివర భాగం వరకు రక్తం సరిగా చేరుకోలేదనేది, అనగా ఇన్ఫెక్షన్ కు వ్యతిరేకంగా పోరాడే సమ్మేళనాలు డయాబెటిక్ ఫుట్ అల్సర్ నుండి మీ శరీరాన్ని రక్షించలేవు. కెఫిన్, కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది మీ పాదాలలో రక్త ప్రసరణ సమస్యలకు సహాయపడవచ్చు, అలాగే ఆ ప్రాంతంలో రోగనిరోధక ప్రతిస్పందనను కూడా మెరుగుపరుస్తుంది.

2. తేనె :

2. తేనె :

యాంటీ బ్యాక్టీరియల్, యాంటివైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ & యాంటీఆక్సిడెంట్ వంటి లక్షణాలను తేనె కలిగి ఉన్న కారణంగా చేత డయాబెటిక్ ఫుట్ అల్సర్లను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. తేనెలో గల ఈ పదార్థాలు జెర్మ్స్ వ్యతిరేకంగా పోరాడటానికి, మీ పాదాలకు వ్యాధి నిరోధక శక్తినే చేకూర్చడం ద్వారా ఏ ఇతర అంటువ్యాధులు రాకుండా నిరోధిస్తాయి.

3. అలోవెరా :

3. అలోవెరా :

అలోవెరా కూడా డయాబెటిక్ ఫుట్ అల్సర్కు చికిత్సను అందించే మరొక ఇంటి చిట్కా. ఇది శోథ నిరోధక, యాంటీమైక్రోబయల్ & అనాల్జేసిక్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. వాపు, పుండుల మీద అలోవెరా జెల్ను అప్లై చేయడం వల్ల, డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్లను తగ్గించే క్రమంలో, మీకు కలిగే నొప్పిని & అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

4. అమెరికన్ జిన్సెంగ్ :

4. అమెరికన్ జిన్సెంగ్ :

అమెరికన్ జిన్సెంగ్ అనే మూలిక మధుమేహంతో బాధపడేవారికి సిఫారసు చేయబడినది. ఈ మూలిక (హెర్బ్) కూడా మానవ శరీరం & దాని వ్యవస్థల మీదనే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. జీన్సెంగ్ మూలిక కూడా డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్కు సరైన చికిత్స అందించగలదు, అలానే ఇతర అంటువ్యాధులకు మన శరీరం గురికాకుండా రక్షిస్తుంది. డయాబెటిక్ ఫుట్ అల్సర్ను నయం చేయడానికి జిన్సెంగ్లో అద్భుతమైన సమ్మేళనాలను కలిగి ఉంది.

5. మెగ్నీషియం ఉన్న ఆహార పదార్ధాలు :

5. మెగ్నీషియం ఉన్న ఆహార పదార్ధాలు :

పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో, శరీరంలో ఏర్పడిన ఖనిజాల వైవిధ్యాల వల్ల డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్ తరచుగా రావడానికి (లేదా) తీవ్రంగా మారడానికి దారి తీయగలదు. మెగ్నీషియం లోపం అనేది బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు & మధుమేహంపై నామమాత్రపు నియంత్రణను కలిగిన వ్యవస్థతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. గుమ్మడి కాయ విత్తనాలు, పాలకూర, బ్లాక్ బీన్స్, అవకాడోలు, డార్క్ చాక్లెట్ & అరటిపండ్లలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది కాబట్టి వీటినే ఎక్కువగా వినియోగించండి.

6. సైలియం హెర్బ్ :

6. సైలియం హెర్బ్ :

మధుమేహం ఉన్నవారి రక్తంలో ఇన్సులిన్ & గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి నల్లని సైలియం బాగా ఉపయోగపడుతుంది, అలాగే మధుమేహ బాధితుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఈ సైలియం డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్లను వృద్ధి చెందే అవకాశాలను తగ్గిస్తుంది, ఈ ప్రత్యేక మూలికను మీ మెడిసిన్ క్యాబినెట్లో ముఖ్య భాగంగా చేసుకోవడం చాలా ముఖ్యం.

7. రుబార్డ్ రూట్ :

7. రుబార్డ్ రూట్ :

రుబార్డ్ అనే మొక్క వేర్లలో "ఎమోడిన్" అని పిలువబడే సమ్మేళనాన్ని కలిగి ఉంది, ఇది యాంటీమైక్రోబయల్ & యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటుంది. డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్కు ఈ మొక్క వేర్లు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రుబార్డ్ మొక్క వేర్లను సరైన పద్ధతిలో ఉపయోగించినప్పుడు, ఇది ఇన్ఫెక్షన్లను త్వరగా తటస్తం చేయగలదు, మీ పాదాలపై ఉన్న పుండ్ల పరిమాణాన్ని తగ్గిస్తుంది.

8. సోయ్ ఉత్పత్తులు :

8. సోయ్ ఉత్పత్తులు :

ఆరోగ్యానికి సోయ్ ఉత్పత్తులను ఎంత లాభదాయకంగా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ, రక్త ప్రసరణను ఉత్తేజపరచడం కోసం, అల్లం & సోయ్ మిశ్రమాల కలయిక రక్త ప్రసరణ వ్యవస్థను ప్రేరేపించడంలో అద్భుతాలను చేయగలవు. మీరు ఈ విషయం తెలియదని, మాకు తెలుసు ! సోయ్ ఉత్పత్తులను మరింతగా వినియోగించడం వల్ల డయాబెటిక్ ఫుట్ అల్సర్ను సమర్థవంతంగా నివారించడంలో బాగా పనిచేస్తుంది.

9. జింక్ :

9. జింక్ :

శరీరంలోని జింక్ లోపం వల్ల, చాలామందిలో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది, ఎందుకంటే మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన ప్రతిరోధకాలను & ఇతర వ్యాధికారక-పోరాట సమ్మేళనాలను ఉత్పత్తి చేయలేరు. జింక్, వైద్య ప్రక్రియలను & ఇతర మరమ్మతులను వేగవంతం చేస్తుంది, ఆ కారణంచేత అది డయాబెటిక్ ఫుట్ అల్సర్ చికిత్స కోసం సమర్థవంతమైనదని కూడా భావిస్తారు. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందటం కోసం గింజలను, డార్క్ చాక్లెట్లను, గొడ్డు మాంసం, బచ్చలికూర, పుట్టగొడుగుల వంటి జింక్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోండి.

10. ఆస్ట్రాగాలస్ :

10. ఆస్ట్రాగాలస్ :

డయాబెటిక్ ఫుట్ అల్సర్ చికిత్సకు "ఆస్ట్రాగాలస్" అనేది మరోక గొప్ప ఔషధం అందుబాటులో ఉంది. ఇది భూగ్రహం మీద శక్తివంతమైన రోగనిరోధక-నిర్మాణమును కలిగిన మొక్కల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆస్ట్రాగాలస్ అనేది చర్మంపై నేరుగా అప్లై చేయబడుతుంది, అలా ఇది రక్త ప్రవాహాన్ని & వేగవంతమైన వైద్యమును ప్రేరేపిస్తోంది. ఇది మధుమేహ రోగుల రక్త కేశ నాళికలో రక్త ప్రసరణలో ఏర్పడిన సమస్యలను అధిగమించి, అల్సర్కు కారణమైన ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

English summary

Home Remedies For Diabetic Foot Ulcers

One of the first signs and symptoms of a diabetic foot ulcer is drainage from your foot. Other symptoms include unusual swelling, irritation, redness and odour from one or both of your feet. The home remedies for treating diabetic foot ulcer are caffeine, aloe vera, magnesium-rich foods, zinc-rich foods, honey, American ginseng, etc.
Desktop Bottom Promotion