For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పల్మనరీ ఫైబ్రోసిస్ చికిత్సకు సూచించదగిన గృహ నివారణా చిట్కాలు

|

శ్వాసతీసుకోవడంలో సమస్యలతో పాటు పొడిదగ్గు కూడా భాదిస్తూ ఉంటే, బహుశా అది పల్మనరీ ఫైబ్రోసిస్ అయిఉండే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. పల్మనరీ ఫైబ్రోసిస్, దాని కారణాలు మరియు లక్షణాలు గురించిన వివరాలు మరింతగా తెలుసుకునే క్రమంలో మరియు చికిత్స లేదా, నొప్పి తగ్గుదలలో భాగంగా సూచించబడిన కొన్ని గృహనివారణా చర్యల గురించిన వివరాలు తెలుసుకునే క్రమంలో ఈ వ్యాసం దోహదపడుతుంది. ఇవి నొప్పి తగ్గుదలలో సమర్ధవంతముగా పనిచేయడమే కాకుండా, సమస్య తగ్గుదలలో కూడా ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

Pulmonary Fibrosis : Causes, Symptoms and Home remedies

అసలు పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి?

దీనిని ఊపిరితిత్తుల సంబంధిత గాయంగా మరియు శ్వాససంబంధ వ్యాధిగా పరిగణిస్తారు. ఈవ్యాధిలో, ఫైబ్రోటిక్ కణజాలం మందంగా మారుతుంది. క్రమంగా కణజాలం దాని సాధారణ శక్తి మరియు స్థితిస్థాపకతను కోల్పోతుంది. ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతిని మరియు గాయాలకు గురైన సందర్భంలో ఈసమస్య తలెత్తుతుంది. ఈ దట్టమైన మరియు వాపుతో కూడిన కణజాలం ఊపిరితిత్తుల పనితీరును కష్టతరం చేస్తుంది.

తెలుపురంగు ఫైబ్రోసిస్ కణజాలాలు కొల్లాజెన్ ఫైబర్స్ నిక్షేపాలను కలిగి ఉంటాయి. కాలంతోపాటుగా కొల్లాజన్ ఫైబర్ నిక్షేపాలు పెరుగుతున్న కారణాన, ఈ కణజాల సంబంధిత వ్యాధి, శరీరంలోని మిగిలిన అవయవాలకి కూడా విస్తరిస్తుంది. క్రమంగా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.

పల్మనరీ ఫైబ్రోసిస్ కారణంగా సృష్టించబడిన ఫైబ్రోటిక్ కణజాలం ఊపిరితిత్తులలోని వాయు నాళాలను భర్తీ చేయగలదు. క్రమంగా కణజాలంలోని గాయాలు మందంగా మారడం మరియు శ్వాస నాళాలు ఆక్సిజన్ బదిలీచేసే సామర్ధ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఈ నష్టం తిరిగి పూడ్చలేని విధంగా ఉంటుంది.

సాధారణంగా, వైద్యులు ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ సమస్యకు గల కారణాన్ని నిర్దారించగలరు. అయినప్పటికీ, వారు చెప్పిన కారణం అస్పష్టంగానే ఉన్న ఎడల , ఆ పరిస్థితిని ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటారు.

ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ఫలితంగా జరిగే ఊపిరితిత్తుల నష్టాన్ని భర్తీ చేయలేకపోయినా, మందులు మరియు కొన్ని చికిత్సలు, లక్షణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంచవచ్చు. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో, ఊపిరితిత్తి మార్పిడిని కూడా వైద్యులు సూచించవచ్చు.

పల్మనరీ ఫైబ్రోసిస్ యొక్క లక్షణాలు:

పల్మనరీ ఫైబ్రోసిస్ యొక్క లక్షణాలు:

ఈ వ్యాధి యొక్క సూచనలు మరియు లక్షణాలు:

• అలసట

• పొడిదగ్గు

• శ్వాస ఆడకపోవుట

• కీళ్ళు/కండరాల నొప్పులు

• కాలివేళ్లు లేదా వేళ్ల చివరల వాపు/విస్తరణ

• అధిక బరువునష్టం

లక్షణాల తీవ్రత వ్యక్తివ్యక్తికీ మారుతుంది మరియు అనారోగ్యం యొక్క తీవ్రతను బట్టి కూడా లక్షణాలు ఉంటాయి. కొంతమంది వారి అనారోగ్య జీవనవిధానాల కారణంగా త్వరితగతిన సమస్యలను అభివృద్ధి చేసుకొని, అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొందరు మాత్రం పరిస్థితి తీవ్రంకాకుండా తక్షణనివారణా చర్యలకు పూనుకోవడం చేస్తుంటారు.

అనారోగ్యాల(లక్షణాలు తీవ్రంగా పెరిగిపోవడం- ఉదాహరణకు, శ్వాసఆడకపోవడం, విపరీతమైన దగ్గు మొదలైనవి) మరియు సంకేతాల తీవ్రతను బట్టి వ్యక్తులను కృత్రిమ వెంటిలేటర్లపై ఉంచవచ్చు కూడా. యాంటీబయాటిక్స్, కార్టికోస్టెరాయిడ్ ఔషధాలు లేదా ఇతర పద్దతుల ద్వారా కూడా చికిత్స చేయవచ్చు.

పల్మనరీ ఫైబ్రోసిస్ కారణాలు:

పల్మనరీ ఫైబ్రోసిస్ కారణాలు:

పల్మనరీ ఫైబ్రోసిస్ సమస్య కారణంగా, మీ రక్తకణాలకు, ఆక్సిజన్ సరఫరా చేయడంలో కష్టమవుతుంది. క్రమంగా రక్తపోటు, గుండె సంబందిత వ్యాధులకు కూడా కారణమవుతుంది. ఈ వ్యాధి యొక్క కొన్ని కారణాలు క్రిందివి:

• పర్యావరణ కారకాలు:

కాలుష్యకోరలకు తీవ్రంగా ప్రభావితమవడం కారణంగా మీ ఊపిరితిత్తులు దెబ్బతినవచ్చు. ఘనలోహాలు కలిసిన ధూళి, ధాన్యపు దుమ్ము, పక్షి/జంతువుల రెట్ట, ఆస్బెస్టాస్-ఫైబర్స్, సిలికాధూళి మరియు బొగ్గుధూళి వంటివి మీ ఊపిరితిత్తులకు అత్యంత హానికరంగా ఉంటాయి.

• రేడియేషన్ చికిత్సలు:

• రేడియేషన్ చికిత్సలు:

క్యాన్సర్ వంటి కొన్ని ప్రత్యేకమైన రోగాల చికిత్స కోసం రేడియేషన్ థెరపీని తీసుకున్న వ్యక్తులు ప్రాధమిక రేడియేషన్ చికిత్స తర్వాత, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏదేమైనా, నష్టతీవ్రత అనేది రేడియోధార్మికతకు ఎంతగా గురయ్యారు అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అంతర్లీనంగా ఊపిరితిత్తుల రుగ్మతల ఉనికి ఉన్న ఎడల, రోగి చికిత్సకు నిర్దేశించిన కీమోథెరపీ విధానం మీద ఆధారపడి ఉంటుంది.

• మందులు:

• మందులు:

కొన్ని మందులు ఊపిరితిత్తులకు తీవ్రనష్టం కలిగిస్తాయి. క్యాన్సర్ కణాలను చంపే కీమోథెరపీ మందులు ఊపిరితిత్తుల కణజాలాలకు హాని కలిగిస్తాయి. అసమతుల్య హృదయ స్పందనలకు సూచించబడే ఇథాంబూటాల్ లేదా నైట్రోఫురాన్టోయిన్ వంటి యాంటీబయాటిక్స్ మరియు సల్ఫేసలజైన్ లేదా రిట్యుజిమాబ్ వంటి యాంటి ఇన్ఫ్లమేటరీ మందులు అధికంగా వినియోగించుట కారణంగా కూడా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున వీటి వాడకంనందు వైద్యుని సూచనలు తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది.

కీళ్ళనొప్పులు, న్యుమోనియా, సార్కోయిడోసిస్, డెర్మాటామియోసిటిస్, స్క్లెరోడెర్మా, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటోసస్ వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా కూడా ఊపిరితిత్తుల నష్టం సంభవిస్తుంది.

పల్మనరీ ఫైబ్రోసిస్ చికిత్సకై సూచించదగిన గృహచిట్కాలు:

పల్మనరీ ఫైబ్రోసిస్ చికిత్సకై సూచించదగిన గృహచిట్కాలు:

స్వయం ప్రతిరక్షక రుగ్మతగా పరిగణించబడే ఈవ్యాధి ప్రభావాలను, గృహచిట్కాల ద్వారా తగ్గించవచ్చు. మీరు ఈవ్యాధి యొక్క సంకేతాలను చూడడం ప్రారంభించినప్పుడు, వైద్యుడి నుండి సంపూర్ణ వైద్యచికిత్సను తీసుకునే ముందుగా, క్రింది గృహనివారణలను కూడా ప్రయత్నించవచ్చు. అయితే, మీ పరిస్థితిపట్ల మీకు ఒక అవగాహన ఉండాలి. తీవ్రమైన పరిస్థితులనందు ఏ ఇతర చిట్కాలు పనిచేయకపోవచ్చు.

• ఇమ్మ్యునోకాంప్లెక్స్:

• ఇమ్మ్యునోకాంప్లెక్స్:

పోషకవిలువలు కలిగిన ఈస్ట్, కణజాలాల పునర్నిర్మాణానికి దోహదం చేయడం మూలంగా, శ్వాసను పునరుద్దరించగలదు. ఇది కాలేయం మరియు కణాలలో నిర్విషీకరణకు సహాయం చేస్తుంది. కణజాలాలలో ఆక్సిజన్ ప్రవాహాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీర జీవక్రియల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ యొక్క టి-సెల్ కూడా మెరుగుపడుతుంది.

• కొల్లోయిడల్ సిల్వర్:

• కొల్లోయిడల్ సిల్వర్:

ఇది ఊపిరితిత్తుల సమస్యలను నయంచేయడంలో సహాయపడుతుంది. ఇది ప్రధానంగా వైరస్/ఫంగస్ తొలగించడం మరియు ఇతర విషతుల్య దోషాలను తొలగించడం ద్వారా సహాయపడగలదు. ఫైబ్రోసిస్ యొక్క తీవ్రపరిస్థితిని మెరుగుపరుస్తుంది. మరియు ఊపిరితిత్తులను మంచిస్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది.

• జనపనార నూనె:

• జనపనార నూనె:

దీనిలో శరీరానికి అవసరమైన స్థాయిలో కొవ్వుఆమ్లాల నిక్షేపాలు ఉన్నాయి. ఇది ఊపిరితిత్తులవాపును తగ్గించి, కణజాలాలను పునర్నిర్మించడంలో సహాయం చేస్తూ ఫైబ్రోసిస్ చికిత్సకు సమర్థవంతమైన సహకారాన్ని అందివ్వగలదు. కాడ్ కాలేయ నూనెని కూడా జనపనార నూనెకు బదులుగా ఉపయోగించుకోవచ్చు. రోజులో కనీసం ఒక టీస్పూన్ తీస్కోవడం మంచిదిగా సూచించబడింది.

English summary

Pulmonary Fibrosis : Causes, Symptoms and Home remedies

Pulmonary fibrosis has symptoms like difficulties in breathing along with a dry cough. Fatigue, dry cough, shortness of breath, aching joints & muscles, etc. This condition is caused by environmental factors, radiation treatments, etc. Some remedies of this condition are hemp oil, seaweed, organic germanium, organic silicon, etc.
Story first published: Tuesday, August 14, 2018, 11:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more