For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే ప్రాచీన కిచెన్ రెమెడీ!

|

అధిక కొలెస్ట్రాల్ ను కలిగి ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండకపోతే ప్రాణానికి హానీ కూడా ఉంటుంది. కాబట్టి, ఈ సమస్యను సరైన విధంగా అలాగే వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి.

కొలెస్ట్రాల్ అనేది కొవ్వు వంటి పదార్థమే. మన శరీరం రోజువారీ పనులను సాధారణంగా నిర్వహించుకునేందుకు కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మైనంలా ఉండే పదార్థం.

Ancient Kitchen Remedy To Reduce Cholesterol

డైజెస్టివ్ బైల్ యాసిడ్స్ ఉత్పత్తి, విటమిన్ డి ని శరీరంలోని సెల్స్ గ్రహించేందుకు తోడ్పడటం అలాగే కొన్ని రకాల హార్మోన్ ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటివి శరీరం ప్రతిరోజూ నిర్వహించుకునే పనులు. కొలెస్ట్రాల్ స్థాయిలో హెచ్చుతగ్గుల వలన ఈ పనులకు అంతరాయం ఏర్పడుతుంది.

శరీరంలోని కొలెస్ట్రాల్ సాధారణం కంటే ఎక్కువగా పెరిగినప్పుడు ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి.

శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, ఆర్టెరీస్ లో ఇవి పేరుకుపోయి వాటిని మూసివేస్తాయి. ఆ విధంగా శరీరంలోని కొన్ని అవయవాలకు రక్తసరఫరాను నిలిపివేస్తాయి.

Ancient Kitchen Remedy To Reduce Cholesterol

రక్తసరఫరా అడ్డుకోబడినప్పుడు అనేకరకాల అనారోగ్య సమస్యలుతలెత్తుతాయి. చిన్నపాటి అనారోగ్య దగ్గరనుంచి ప్రాణాంతక సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.

చక్కెర శాతం అధికంగా కలిగిన వాటిని తీసుకోవడంతో పాటు ఫ్యాటీ ఫుడ్స్ ని అమితంగా తీసుకునేటప్పుడు కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతాయి.

ఒబేసిటీ, తగినంత వ్యాయామం లేకపోవటం, ఆల్కహాల్ ని ఎక్కువగా తీసుకోవటం, స్మోకింగ్ వంటివి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. సహజంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాలంటే ఈ ప్రాచీన హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

Ancient Kitchen Remedy To Reduce Cholesterol

కావలసిన పదార్థాలు

ఆర్గానిక్ క్రేన్ బెర్రీ జ్యూస్ - 1 గ్లాస్

పసుపు పొడి - 1 టీస్పూన్

ఈ నేచురల్ రెమెడీ అనేది కొలెస్ట్రాల్ ను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఈ రెమెడీని క్రమ పద్దతిలో పాటించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను ఎంతో మంది పొందారు.

కొలెస్ట్రాల్ ను తగ్గించే హోమ్ రెమెడీ

ఈ రెమెడీ ద్వారా మీకు ఆశించిన ఫలితం దక్కాలంటే మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే, ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. తద్వారా, కొలెస్ట్రాల్ తో పాటు దానికి అనుసంధానమైన సమస్యలు కూడా తొలగిపోతాయి.

ఫినోలిక్ యాసిడ్స్ క్రేన్ బెర్రీ జ్యూస్ లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆర్టెరీస్ లైనింగ్ లోనున్న అధిక కొలెస్ట్రాల్ ను తొలగించి సమస్యను పరిష్కరిస్తాయి.

పసుపులో లభ్యమయ్యే కుర్కుమిన్ అనే పదార్థానికి శరీరంలోనున్న అధిక కొలెస్ట్రాల్ ను కరిగించే సామర్థ్యం కలదు. తద్వారా, అధిక కొలెస్ట్రాల్ మీ శరీరం నుంచి బయటకు పోతుంది.

Ancient Kitchen Remedy To Reduce Cholesterol

తయారుచేసే విధానం:

ఒక టీస్పూన్ పసుపు పొడిని ఒక గ్లాసుడు క్రేన్ బెర్రీ జ్యూస్ లో జోడించాలి.

ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి.

రెండు నెలలపాటు ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని భోజనం తరువాత క్రమం తప్పకుండా తీసుకోవాలి.

సుదీర్థ ఫలితాలను అందుకోవటం కోసం రెండునెలలు దాటిన తరువాత కూడా ఈ మిశ్రమాన్ని తీసుకోవటం కంటిన్యూ చేయవచ్చు.

English summary

Ancient Kitchen Remedy To Reduce Cholesterol

Ancient Kitchen Remedy To Reduce Cholesterol, If you want to reduce cholesterol levels naturally, then try this ancient home remedy!
Desktop Bottom Promotion