For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థైరాయిడ్ కార్యకలాపాలను క్రమబద్దీకరించే నట్స్ మరియు తేనెల మిశ్రమం!

|

థైరాయిడ్ గ్రంధుల యొక్క కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి మరియు దాని పనితీరును సమతుల్యం చేయడానికి, హార్మోన్ల అధికోత్పత్తిని నివారించడానికి, ఒక గృహ నివారణ ఉంది. అక్రోట్లు మరియు తేనె, థైరాయిడ్ నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి.

థైరాయిడ్, వినాళికా గ్రంధులు (వ్యవస్థఎండోక్రైన్ గ్రంధులు)ఉత్పత్తి చేసే హార్మోన్లలో ఒకటి. ఇది జీవక్రియ, హృదయ మరియు మానసిక ఆరోగ్యాలను మెరుగ్గా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది అనేక ముఖ్యమైన విధులను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కనుక, దీని పనితీరులో అవకతవకలు తలెత్తితే, మన శరీరంలో ప్రోటీన్ సంశ్లేషణ, ప్రసరణ మరియు ఆక్సిజనేషన్ ప్రక్రియలు దెబ్బతింటాయి.

Honey And Nuts Home Remedy For Treating Thyroid

కానీ కొన్నిసార్లు, థైరాయిడ్ గ్రంధి అసమానతలు అమాంతంగా తలెత్తవచ్చు. దీని వలన మన జీవిత నాణ్యతను ప్రభావితం చేసే రుగ్మతలు ప్రారంభమవుతాయి.

థైరాయిడ్ దుష్ప్రభావం యొక్క లక్షణాలు ఏమిటి?

థైరాయిడ్ దుష్ప్రభావం యొక్క లక్షణాలు ఏమిటి?

థైరాయిడ్ వలన కలిగే దుష్ప్రభావాలు, మన శరీరంలో అభివృద్ధి అయిన సమస్య యొక్క లక్షణాలపై ఆధారపడి ఉంటుంది.

మీకు థైరాయిడ్ ఉన్నట్లైతే, దీర్ఘకాలిక అలసట, ఆందోళన మరియు భయము, లైంగిక ఆసక్తి కోల్పోవడం, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, ఆకలి మరియు ఆహార రుచిలో మార్పులు, కండరాల మరియు కీళ్ళ నొప్పులు, అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్, ఋతుక్రమం అస్తవ్యస్తంగా మారడం మరియు శరీర ఉష్ణోగ్రతపై తగినంత నియంత్రణ లేకపోవడం వంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు.

థైరాయిడ్ చికిత్సకు నట్స్ మరియు తేనె ఎలా పనిచేస్తాయి?

థైరాయిడ్ చికిత్సకు నట్స్ మరియు తేనె ఎలా పనిచేస్తాయి?

అక్రోట్లు (లేదా ఏ ఇతర నట్స్ అయినా) మరియు తేనె మిశ్రమంను, థైరాయిడ్ హార్మోన్ల సంతులనాన్ని ఉద్దీపన చేసే ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. క్రమం తప్పకుండా ఈ మిశ్రమాన్ని సేవించినట్లైతే, థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉంటే దానిని క్రమబద్దం చేసుకోవచ్చు.

థైరాయిడ్ యొక్క ఆరోగ్యానికి నట్స్ వలన కలిగే ప్రయోజనాలు

థైరాయిడ్ యొక్క ఆరోగ్యానికి నట్స్ వలన కలిగే ప్రయోజనాలు

చాలామందికి నట్స్ ఏ విధంగా థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవో తెలియదు. థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును ప్రోత్సహించే పోషకాలు మరియు లక్షణాలు దీనిలో సమృద్ధిగా ఉంటాయి.

నట్స్ పెద్ద మొత్తంలో సెలీనియంను కలిగి ఉంటాయి. సెలీనియం, థైరాయిడ్ యొక్క సరైన పనితీరుకు ఉపయోగపడే ఒక సూక్ష్మ మూలకం. ఇది హార్మోన్ల యొక్క సరైన విభజనను ప్రోత్సహిస్తుంది.

మన శరీరంలో సెలీనియం స్థాయి తక్కువగా ఉంటే, అయోడిన్ లోపం తలెత్తి, చివరికి హైపో థైరాయిడిజంకు దారితీస్తుంది.

నట్స్ లో అత్యవసర కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నందున, అవి థైరాయిడ్ గ్రంధిలో తాపజనక అసమానతలను నివారిస్తాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి మరియు శరీరానికి శక్తిని అందిస్తుంది.

తేనె వలన థైరాయిడ్ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

తేనె వలన థైరాయిడ్ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

తేనెలో ఎంజైములు, ఖనిజాలు, విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. సేంద్రీయ తేనెలో, కణాలలో శక్తికి ముఖ్యమైన వనరైన సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకున్న హానికరమైన పదార్ధాలైన, శుభ్రపరచడంలో సహాయపడుతాయి.

సేంద్రీయ తేనెలో ఉండే ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, శరీర హార్మోన్ల ప్రక్రియలను నియంత్రిస్తాయి.

నట్స్ మరియు తేనెల లేహ్యాన్ని ఎలా తయారు చేయాలి?

నట్స్ మరియు తేనెల లేహ్యాన్ని ఎలా తయారు చేయాలి?

సెలీనియం సమృద్ధిగా ఉన్న వాల్ నట్స్, జీడిపప్పులు, బ్రెజిల్ నట్స్ మొదలైన నట్స్ ను ఉపయోగించండి.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

40 వాల్ నట్స్

సేంద్రీయ తేనె 3 కప్పులు

తయారీ విధానం:

తయారీ విధానం:

1. నట్స్ ను చిన్న ముక్కలుగా తరగండి.

2. ఒక గాజు సీసాలో వాటిని వేసి, తేనెలో మునిగేటట్టు వేయండి. పదార్థాలన్ని బాగా కలిసేటట్టు సీసాను కదిలించి, మూత పెట్టండి.

3. చల్లని మరియు చీకటి ప్రదేశంలో 7 నుండి 10 రోజులు ఉంచండి.

వాటిని ఎలా వినియోగించాలి?

వాటిని ఎలా వినియోగించాలి?

అల్పాహారం చేసే ముందు తేనె మరియు నట్స్ యొక్క మిశ్రమం, 2 టీస్పూన్లు తీసుకోండి. మరోసారి రాత్రివేళ కూడా తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ, మీ ఆహారప్రణాళికలో భాగంగా మార్చుకుంటే, మీ థైరాయిడ్ పనితీరు ఆరోగ్యకరంగా సాగేందుకు మద్దతును ఇస్తుంది.

English summary

Honey And Nuts Home Remedy For Treating Thyroid

The thyroid is one of the endocrine glands that produce hormones. It plays a major role in metabolic, cardiovascular and emotional health. The mixture of nuts and honey is used as a supplement to stimulate the balance of thyroid hormones. Regular consumption of this concoction can prevent the low production of hormones or overstimulate them.
Story first published: Tuesday, July 24, 2018, 19:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more