For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హార్మోన్స్ ఆధారిత తలనొప్పుల గురించి తెలుసుకోవలసిన పూర్తి వివరములు

|

ఒక మహిళగా ఉండడం వలన శారీరిక మానసిక సమస్యల నందు ఓర్పు, సహనం వంటి ఆరోగ్య ప్రయోజనాలు కొంతమేర ఉండవచ్చు. కానీ ఆ ఓర్పులు, సహనాలు హార్మోన్ ఆధారిత తలనొప్పి వచ్చినప్పుడు భూతద్దంలో కూడా కనపడవు. హార్మోన్ల అసమతుల్యత అనేది మైగ్రేన్లు మరియు దీర్ఘకాలిక తలనొప్పులకు ప్రధాన కారకంగా ఉంటుంది. ఋతు చక్రం, గర్భం దాల్చడం మరియు రుతువిరతి సమయాలలో హార్మోన్ స్థాయిలలో మార్పులు సంభవిస్తూ అసమతుల్యతకు లోనవుతూ ఉంటాయి.

ఈస్ట్రోజెన్ హార్మోన్, ఋతు చక్రం మరియు గర్భధారణ సంబంధించిన అంశాలలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మరియు మెదడులో తలనొప్పి సంబంధిత రసాయనాలను సైతం నియంత్రిస్తుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోయినప్పుడు, క్రమంగా అది తలనొప్పికి దారితీస్తుంది. దీనినే హార్మోనల్ హెడ్ఏక్స్ అని వ్యవహరిస్తారు.

What You Need To Know About Hormonal Headaches
హార్మోన్ల తలనొప్పికి గల కారణాలు ఏమిటి ?

హార్మోన్ల తలనొప్పికి గల కారణాలు ఏమిటి ?

1. రుతు చక్రం :

ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ స్థాయిలలో అసాధారణ మార్పులు జరిగినప్పుడు, ముఖ్యంగా ఋతు చక్రానికి ముందు సమయాల్లో హార్మోన్ల తలనొప్పులు సంభవించవచ్చు.

2. పెరిమెనోపాజ్ మరియు మెనోపాజ్ :

2. పెరిమెనోపాజ్ మరియు మెనోపాజ్ :

పెరిమెనోపాజ్ (40 పైన కలిగే ఋతువిరతి 30వ దశకంలోనే కలగడం) మరియు సాధారణ రుతు విరతి సమయాలలో కూడా హార్మోన్ స్థాయిలలో మార్పుల కారణంగా కొందరు మహిళలు హార్మోన్ తలనొప్పులను ఎదుర్కోవడం జరుగుతుంది.

3. గర్భధారణ :

3. గర్భధారణ :

గర్భధారణ సమయంలో, ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం జరుగుతుంది మరియు శిశువుకి జన్మనిచ్చిన తర్వాత, వేగంగా స్థాయిలు పడిపోవడం జరుగుతుంది. అందువల్ల, గర్భధారణ సమయంలో మహిళలు తలనొప్పిని ఎదుర్కొనకపోయినా కూడా, ప్రసవం తరువాత కలిగి ఉండే సూచనలు ఉన్నాయి.

Most Read: సెక్స్ అడిక్ట్, పరిచయం ఉన్న అమ్మాయిల్లో ఎవ్వరినీ వదల్లేదు, కండోమ్స్ అందులో పెట్టేవాణ్ని #mystory246

4. హార్మోన్ పునఃస్థాపన చికిత్స మరియు గర్భ నిరోధక మాత్రలు :

4. హార్మోన్ పునఃస్థాపన చికిత్స మరియు గర్భ నిరోధక మాత్రలు :

జనన నియంత్రణ మాత్రలు మరియు హార్మోన్ పునఃస్థాపన చికిత్స తీసుకోవడం కారణంగా హార్మోన్ స్థాయిలలో మార్పులు చోటుచేసుకోవడం మూలంగా హార్మోన్ల తలనొప్పికి దారితీస్తుంది .

ఇతర కారణాలుగా శరీరానికి అవసరమైన సమయంలో భోజనం తీసుకోకపోవడం, లేదా తీవ్రమైన వాసన లేదా ధ్వని, అధిక నిద్ర లేదా నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి, ఇతర మానసిక పరిస్థితులు, తీవ్రమైన వాతావరణ మార్పులు, మద్యపానం, అధిక మోతాదులో కెఫీన్ తీసుకోవడం, ఎంఎస్జి (మోనోసోడియం గ్లుటామాట్), సోయా ఉత్పత్తులు మొదలైనవిగా ఉన్నాయి.

హార్మోన్ల తలనొప్పి యొక్క లక్షణాలు ఏమిటి?

హార్మోన్ల తలనొప్పి యొక్క లక్షణాలు ఏమిటి?

హార్మోన్ల తలనొప్పి ప్రధాన లక్షణం తలనొప్పి లేదా పార్శ్వపు తలనొప్పి (మైగ్రేన్). ఈ తలనొప్పిని అనుసరించే ఇతర లక్షణాలుగా వికారమైన ఆకలి, వికారం (ఫెటీగ్), జాయింట్ పెయిన్స్, మొటిమలు, తక్కువ మూత్రవిసర్జన, సమన్వయం లోపించడం, చాక్లెట్ లేదా మద్యపానం మీదకు మనసు మళ్లడం, మరియు మలబద్ధక సమస్యలుగా ఉన్నాయి

హార్మోన్ల తలనొప్పికి చికిత్స ఏమిటి ?

 1. ఈస్ట్రోజెన్ థెరపీ లేదా హార్మోన్ థెరపీ :

1. ఈస్ట్రోజెన్ థెరపీ లేదా హార్మోన్ థెరపీ :

సమయానుసారం పార్శ్వపు తలనొప్పి వలన బాధపడుతుంటే, మీ ఋతుచక్రానికి కొన్ని రోజుల ముందు నుండే ఈస్ట్రోజెన్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చికిత్సను తీసుకోవచ్చు. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఒక మాత్రరూపంలో లేదా మీ చర్మంపై రుద్దేలా ఉండే ఒక జెల్ రూపంలో తీసుకోవచ్చు.

గమనిక: ఈస్ట్రోజెన్ సప్లిమెంట్స్ తీసుకోవడానికి ముందు మీ వైద్యుని సంప్రదించడం మంచిది.

Most Read: నా భార్య కాళ్లతో పెనవేసుకుని ఎంజాయ్ చేస్తుంది, సెక్స్ పూర్తయ్యాక ఏడుస్తుంది, తెలియని ఆనందమట

2. కొన్ని రకాల మందులు

2. కొన్ని రకాల మందులు

ఇబూప్రోఫెన్ మరియు ట్రిప్టాన్స్ వంటి మందులు మైగ్రెయిన్-నిర్దిష్ట మందులుగా ఉన్నాయి. ఇవి మైగ్రెయిన్ దాడి యొక్క తీవ్రతను తగ్గించగలవు. పార్శ్వపు నొప్పి లేదా తలనొప్పి ప్రారంభమయ్యాక ఈ మందులను తీసుకోవాలి. ముందుగా తీసుకోరాదు.

తరచుగా హార్మోన్ల తలనొప్పి ఎదుర్కొనే మహిళలు, యాంటీకన్వల్సెంట్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, యాంటిడిప్రెసెంట్స్ మరియు బీటా బ్లాకర్స్ వంటి మందులను రోజువారీ లేదా మీ ఋతుచక్రం ముందు వైద్యుని సూచనల మేరకు, పరీక్షల అనంతరం తీసుకోవలసి ఉంటుంది.

3. ఇతర నివారణా చర్యలు

3. ఇతర నివారణా చర్యలు

మందులు మరియు హార్మోన్ చికిత్సలు మాత్రమే కాకుండా, గృహ నివారణలను సైతం పాటించవచ్చు.

• మీ శరీరాన్ని డీహైడ్రేషన్ గురికాకుండా నీటిని పుష్కలంగా తాగడం.

• వెలుతురు తక్కువగా ఉన్న, లేదా ఒక చీకటి గదిని ఎంచుకుని నిద్రపోవడం.

• నొప్పి గల ప్రాంతంలో మసాజ్.

• డీప్ బ్రీథ్ (శ్వాస సంబంధిత) వ్యాయామాలు.

 హార్మోన్ల తలనొప్పి నివారించడం ఎలా?

హార్మోన్ల తలనొప్పి నివారించడం ఎలా?

మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచుకునే క్రమంలో భాగంగా, తరచుగా తక్కువ మోతాదుల్లో భోజనాన్ని తీసుకోండి. తలనొప్పిని ప్రేరేపించే విధంగా మీ భోజనాన్ని మిస్ చేయవద్దు.

ఒక సాధారణ నిద్రక్రమాన్ని అనుసరించడం మంచిది. అధికనిద్ర మరియు నిద్రలేమి రెండూ మంచిది కాదు.

అధిక ఒత్తిడిని తగ్గించడం మంచిది. ఒత్తిడి కారకాల మీద దృష్టి సారించి, సమస్య జఠిలం కాకుండా చూసుకోవడం మంచిది. మరియు సడలింపు వ్యాయామాలను ప్రయత్నించి ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలను ప్రయత్నించండి.

Most Read:ఏ డేట్ లో పుట్టిన వాళ్ల స్వభావం ఎలా ఉంటుంది ?

డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి ?

డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి ?

అధిక జ్వరం, మెడ గట్టి పడడం, దృష్టి సంబంధిత సమస్యలు(ముఖ్యంగా వస్తువులు రెండుగా కనపడడం), బలహీనత లేదా ఎన్నడూ లేని విధంగా తలనొప్పి వంటి అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎడల తక్షణమే వైద్యుని సంప్రదించడం మంచిది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈవ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

What You Need To Know About Hormonal Headaches

Being a woman could have health advantages like longevity and higher pain tolerance, but not when it comes to hormonal headaches. Fluctuating hormones is a major contributing factor in migraines and chronic headaches. The hormone levels keep changing during the menstrual cycle, pregnancy and menopause.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more