For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెంపుడు జంతువులను కలిగి ఉండడం మీ ఆరోగ్యానికి మంచిదా?

పెంపుడు జంతువులను కలిగి ఉండడం మీ ఆరోగ్యానికి మంచిదా?

|

మీరు ఇంట్లో పెంపుడు జంతువులను కలిగి ఉండి, మీ తల్లిదండ్రులు వాటిని మీతో అనుమతించకుండా బాధపెడుతున్నారా? నేడు, ఈ వ్యాసంలో పెంపుడు జంతువులు మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో చెప్పబోతున్నాము. ఈ వ్యాసం చదివిన తర్వాత, మీ తల్లిదండ్రులు మీ ఆలోచనను ఎప్పటికీ నిరాకరించరు.

మానవుని ఏకైక విశ్వసనీయ సహచరునిగా పెంపుడు కుక్కకు పేరుంది, మరియు ప్రపంచంలో ఏ ఇతర అంశమూ పెట్స్ కలిగి ఉన్నంత ఆనందాన్ని ఇవ్వలేదు.

పెంపుడు కుక్కలు లేదా పిల్లులు ఏవైనా సరే, మీ కుటుంబంలో అదనపు వ్యక్తి అన్న భావనను కలిగిస్తాయి. ఇవి మీకు తోడుగా ఉండడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని పెంచే క్రమంలో భాగంగా అదనపు ప్రయోజనాలను కలిగి ఉంటాయి..

How Can Pets Improve Your Health

అనేక అధ్యయనాల సారాంశం ప్రకారం, పెంపుడు జంతువులతో సావాసం మానసిక ఆరోగ్య ఎదుగుదలకు కారణమవుతుందని తేలింది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంతో పాటు బుద్ది మాంద్యం వంటి సమస్యలు కూడా మటుమాయం అవుతాయని తేలింది.

పెంపుడు జంతువులు మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయి?

పెంపుడు జంతువులు మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయి?

జంతువులతో సాన్నిహిత్యం శరీరంలోని కార్టిసాల్ హార్మోన్ లెవల్స్ తగ్గిస్తుంది, క్రమంగా రక్తపోటు కూడా తగ్గించగలదు, ఒంటరితనాన్ని తగ్గించడమే కాక, మీ మానసిక స్థితికి సాంఘిక మద్దతును పెంచుతుంది.

మానసిక ఆరోగ్య సంస్థల ప్రకారం, పెంపుడు జంతువులు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చగల ఉత్తమమైన మార్గంగా ఉంది.

1. పెంపుడు జంతువులు మరియు డిప్రెషన్

1. పెంపుడు జంతువులు మరియు డిప్రెషన్

పెంపుడు జంతువులు, ముఖ్యంగా కుక్కలు బుద్దిమాంద్యంతో బాధపడుతున్న వారికి వ్యాయామం చేసే క్రమంలో యజమానులను ప్రోత్సహించడంలో ముందంజలో ఉన్నాయి. ఇవి యజమానులపై ఒకరకమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి మరియు మీరు ఎంత ప్రేమను అందిస్తారో అంతకు పదిరెట్లు ఎక్కువ ప్రేమను, విశ్వాసాన్ని కనపరచే జీవులుగా కుక్కలు ఉన్నాయి.

2.పెంపుడు జంతువులు మరియు ఒంటరితనం

2.పెంపుడు జంతువులు మరియు ఒంటరితనం

ఒక పెంపుడు జంతువు మీకు ఒక తోడును అందించగలదు, మరియు ఒంటరిగా ఉన్నప్పుడు భద్రతా భావాన్ని ఇవ్వడంలో, పెద్ద వారికి తోడుగా వారి పట్ల విధేయతా, విశ్వాసాలను కలిగి వారికి మానసిక సంతోషాన్ని కలిగించే క్రమంలో ఈ పెంపుడు జంతువులు తమ ప్రభావాలను కలిగి ఉంటాయి.

3.పెంపుడు జంతువులు మరియు సాంఘిక సహాయం

3.పెంపుడు జంతువులు మరియు సాంఘిక సహాయం

మీరు ఒక పెంపుడు జంతువును కలిగి ఉంటే, మీరు రోజువారీ నడక కలిగ ఉండక తప్పదు. క్రమంగా ఇతర కుక్కల యజమానులతో సంభాషణలు కొనసాగడం, తద్వారా సామాజిక సంబంధాలు మెరుగవ్వడంలో దోహదం చేస్తుంది.

4. పెంపుడు జంతువులు మరియు ఏ.డి.హెచ్.డి కలిగిన పిల్లలు

4. పెంపుడు జంతువులు మరియు ఏ.డి.హెచ్.డి కలిగిన పిల్లలు

ఏ.డి.హెచ్.డి(అటెన్షన్-డెఫిషిట్-హైపర్యాక్టివిటీ-డిజార్డర్) కలిగిన పిల్లలు ఒక పెంపుడు జంతువును కలిగి ఉండడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. తినడం, స్నానంచేయడం, వాకింగ్ వంటి పెంపుడు జంతువుల బాధ్యతల ద్వారానే పిల్లవానికి కూడా సదరు బాధ్యతల గురించిన అవగాహన వస్తుంది.

ఈ పెంపుడు జంతువులు మీ ఆరోగ్యానికి మంచివని చెప్పడానికి గల కారణాలు:

పెంపుడు జంతువులు ఆరోగ్యకరమైన అలవాట్లను అందివ్వగలవు మరియు సానుకూల జీవనశైలిని కలిగి ఉండడంలో సహాయం చేయగలవు.

1. భౌతిక కార్యాచరణను పెంచుతుంది

1. భౌతిక కార్యాచరణను పెంచుతుంది

అనేక పరిశోధనల ప్రకారం, కుక్కలతో కలిసి రోజువారీ వ్యాయామానికి వెళ్ళే వ్యక్తులు, కుక్కలు లేని వ్యక్తులతో పోలిస్తే వారి వ్యాయామ ప్రణాళికకు ఎక్కువగా కట్టుబడి ఉండే అవకాశాలు ఉన్నాయి. జంతువులకు నడక ముఖ్యం, క్రమంగా వాటితో పాటు నడవాల్సి వస్తుంది. ఎటువంటి వ్యాయామమూ చేయకపోయినా, నడక ద్వారా అయినా వ్యాయామం ఉంటుంది.

2. గుండె ఆరోగ్యము

2. గుండె ఆరోగ్యము

పెంపుడు జంతువుల కారణంగా హృదయ సంబంధిత వ్యాధులు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీటిని బయట తిప్పుటలో భాగంగా నడకకు పూనుకోవడం, క్రమంగా రక్తపోటు వంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. మరియు హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది కూడా.

3.ధూమపానం అలవాటు తగ్గుముఖం పడుతుంది

3.ధూమపానం అలవాటు తగ్గుముఖం పడుతుంది

పెంపుడు జంతువుల మీద ప్రేమ పెరిగేకొద్దీ వాటికి సమస్య కలగకుండా ఉండే క్రమంలో భాగంగా మీ జీవనశైలిలో ఆరోగ్యకరమైన అలవాట్లను తీసుకుని వచ్చేలా మిమ్మల్ని ప్రేరేపించగలవు. టొబాకో కంట్రోల్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో పెంపుడు జంతువుల యజమానులు వారి జంతువులపై పరోక్షధూమపాన ప్రభావాలు పడకూడదన్న కారణంగా ధూమపానం విడిచిపెడుతున్నట్లు కనుగొన్నారు. ఈ పరోక్ష-ధూమపానం పెట్స్ లో క్యాన్సర్ సమస్యలను పెంచే అవకాశాలు ఉన్నాయి, అంతేకాకుండా కుక్కలలో అలెర్జీ రియాక్షన్స్, పక్షులలో చర్మం మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తలెత్తడానికి ప్రధాన కారకంగా ఉంది.

4. మీ బిడ్డ రోగనిరోధక వ్యవస్థ ప్రయోజనాలు

4. మీ బిడ్డ రోగనిరోధక వ్యవస్థ ప్రయోజనాలు

పెంపుడు జంతువులను కలిగి ఉన్న కుటుంబాలలోని పిల్లలు అలెర్జీలు మరియు ఉబ్బసం వంటి రోగాల బారినపడే అవకాశాలు కాస్త తక్కువే. శిశువుకు 6నెలల వయస్సు వచ్చేలోపే, పెంపుడు జంతువులు ఇళ్ళలో ఉండేలా చూసుకోవాలి. అటువంటి కుటుంబాలలోని పిల్లలు తక్కువగా జలుబు మరియు చెవి సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని కూడా తేలింది.

5. హార్మోన్లను శాంతపరచడం

5. హార్మోన్లను శాంతపరచడం

మీరు ఆవేశభరితంగా మరియు విసుగుచెందిన మూడ్లో ఉన్నారా? మీ పెంపుడు జంతువుతో కాసేపు కాలక్షేపం చేయండి; వీటితో సావాసం మీ మెదడులోని రిలాక్సింగ్ హార్మోన్ అయిన ఆక్సిటోసిన్ విడుదల చేస్తుంది, క్రమంగా ఒత్తిడి మరియు ఆందోళనలు తగ్గుముఖం పడుతాయి.

6. దీర్ఘకాలిక నొప్పుల తగ్గుదల

6. దీర్ఘకాలిక నొప్పుల తగ్గుదల

మీరు పిల్లిని పెంపుడు జంతువుగా కలిగి ఉంటే, వాటితో ఆడుతున్నప్పుడు, వాటి బొచ్చు నిమరడం, వంటివి చేస్తుంటారు. అవి కూడా మీకు అలసట వచ్చే దాకా ఆటలకు పూనుకుంటూ ఉంటాయి. క్రమంగా దీర్ఘకాలిక నొప్పులు తగ్గడం వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.

7. వ్యాధులు మరియు గాయాలను గుర్తించడంలో

7. వ్యాధులు మరియు గాయాలను గుర్తించడంలో

అనారోగ్యాలను గుర్తించడంలో చికిత్సలలో కూడా కుక్కలు సహాయపడగలవంటే నమ్మశక్యం కాదు అనేకులకు. ఉదాహరణకు, బ్లాడర్-క్యాన్సర్, చర్మక్యాన్సర్ మరియు ప్రోస్టేట్-క్యాన్సర్లను కనుక్కునే క్రమంలో కొన్ని కుక్కలు శిక్షణ పొందగలవు కూడా. ఈ సర్వీస్-డాగ్స్, మెదడు సంబంధిత గాయాలు, ఆటిజం మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు అదనపు ప్రయోజనాలను కలిగించగలవు.

8.డిప్రెషన్ మీ చాయలకే రాదు

8.డిప్రెషన్ మీ చాయలకే రాదు

పెంపుడు జంతువుల యజమానులు ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మీరు మీ పెట్స్ పట్ల సంరక్షణ కలిగి ఉంటే, ఇవి మీపట్ల కూడా అంతే ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బుద్దిమాంద్యం యొక్క లక్షణాలకు ఉపశమనం కలిగించడమే కాకుండా, మీ ఆందోళన మరియు రక్తపోటులను కూడా తగ్గించగలవు. డోపమైన్, సెరోటోనిన్ వంటి హాపీ హార్మోన్ స్థాయిలు పెరగడంలో దోహదం చేస్తాయి.

English summary

How Can Pets Improve Your Health

Studies have shown that spending quality time with a dog, cat or other animals can have a positive impact on your mood and health and can help fight depression and anxiety. Pets provide relief from depression and loneliness, help in social engagement, boost physical activity, keep you heart healthy, release calming hormones, lessen chronic pain, etc.
Desktop Bottom Promotion