For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నారింజ పండ్లు అధిక బరువు తగ్గించుటలో సహాయం చేస్తాయని మీకు తెలుసా?

|

నారింజ పండ్లు అధిక బరువు తగ్గించుటలో, కడుపులో అధిక క్రొవ్వు నిలవలను కరిగించుటలో సహాయం చేస్తాయని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉందా? ఈ వ్యాసంలో నారింజపండ్లు యే రకంగా మీ ఉదర భాగంలోని కొవ్వుని తగ్గించగలదో మీకు వివరిస్తాము.

మీ ఆహారంలో నారింజ ఒక భాగంగా తీసుకోవడం మంచిదే, కానీ నారింజపండు కేలరీలు కలిగి ఉండటం వలన వాటిని తినడం వలన కొవ్వును ఉన్నపళంగా కోల్పోవడం జరగదు. అయితే, సిట్రస్ పండ్లలో తక్కువ సంఖ్యలో కేలరీలు ఉంటాయి, కావున బరువు తగ్గడానికి ఇది ఒక ఆరోగ్యకరమైన ఎంపిక.

నారింజ పండ్లు విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ B6 మరియు మెగ్నీషియంతో నింపబడి ఉంటాయి. ఈ నారింజ పండ్లు తినడానికి రుచిగా ఉండడమే కాకుండా, అనేకములైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి అనడంలో సందేహమే లేదు.

నారింజ పండ్లు మీ చిగుళ్లను, నాలిక ను శుభ్రపరచుటలో సహాయం చేస్తుంది. గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాకుండా పోరాడుతుంది, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, మరియు పెద్ద పేగును శుభ్రపరుస్తుంది.

నారింజ పండులో పుష్కలంగా ఫైబర్ లభిస్తుంది. ఒక నారింజ పండులో అధికంగా ఫైబర్ 3.1 గ్రాములుగా ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ మీ కడుపుని ఎక్కువ సమయం పాటు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. కావున భోజనానికి ముందు ఒక నారింజ పండును తినడం మూలంగా ఆకలి నశించి, తక్కువ తినేలా ప్రోత్సహిస్తుంది. తద్వారా బరువు తగ్గుటలో కీలకపాత్ర పోషిస్తుంది.

నారింజ పండ్లను స్నాక్స్ గా తీసుకోండి:

నారింజ పండ్లను స్నాక్స్ గా తీసుకోండి:

ఇతర స్నాక్స్ కన్నా నారింజ పండులో తక్కువ కాలరీలు ఉంటాయి. సాదా సాల్టెడ్ బంగాళాదుంప చిప్స్లో 154 కేలరీలు ఉంటాయి, కానీ నారింజ పండులో ఈ సంఖ్య రెండు కేలరీలు. కావున , ఒక ఆరోగ్యకరమైన అల్పాహారం గా మీరు నారింజ ను తీసుకొనవచ్చును.

బరువు కోల్పోవడం కోసం ఆరెంజ్ డైట్ :

బరువు కోల్పోవడం కోసం ఆరెంజ్ డైట్ :

వీలైతే రోజుకు రెండు లీటర్ల నారింజ రసం తీసుకోవలసినది గా డైటీషియన్లు సూచిస్తుంటారు. పరగడుపునే ఒకసారి, మద్యాహ్నంగా ఒక సారి తీసుకోవలసినదిగా సూచిస్తారు. ఉదయం జ్యూస్ అల్పాహారానికి ముందు ఒకటిన్నర గంట ముందు ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా మద్యాహ్నం భోజనం అయిన రెండుగంటల తర్వాత జ్యూస్ తాగాల్సి ఉంటుంది.

తాజాగా సహజ సిద్దంగా :

తాజాగా సహజ సిద్దంగా :

నారింజ రసం తాజాగా తీసినదై ఉండాలి. పాక్ చేసిన లేదా బాటిల్ లో నిలువ ఉంచిన నారింజ రసం త్రాగకూడదు, అది 100 శాతం సహజ రసం అని ప్యాకేజింగ్ లో పేర్కొన్నా కూడా ఇంట్లో సహజంగా తీసిన నారింజ రసం తీసుకోవడమే ఉత్తమం. మిగిలిన పండ్ల విషయంలో కూడా ఇదే పాటించాల్సి ఉంటుంది.

బరువు తగ్గాలన్న ఆలోచన ఉన్నవారు తినదగిన ఇతర ఆహారాలు:

బరువు తగ్గాలన్న ఆలోచన ఉన్నవారు తినదగిన ఇతర ఆహారాలు:

బరువు కోల్పోవడానికి నారింజ రసం మాత్రమే సరిపోదు. దీనితో పాటుగా ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారాన్ని అనుసరించాలి.

తినవలసిన కొన్ని ఆహారాలు:

తినవలసిన కొన్ని ఆహారాలు:

బీన్స్ మరియు గింజలు తినండి

కూరగాయలు మరియు పండ్లు తినండి

పిండి పదార్ధాలు మరియు ముడి చక్కెర ఎంచుకోండి

సోడా, లేదా కాఫీ త్రాగడం తగ్గించాలి.

కాఫీ కన్నా బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ ఎంచుకోండి

స్వీట్స్ నిషిద్దం.

మీ భోజన సమయంలో పండ్లు మరియు కూరగాయలతో మీ ప్లేట్ సగం నింపి ఉండటం చాలా ముఖ్యమైనది. ఇందులో నారింజపండులో ఉన్న ఫైబర్ మీకు ఎంతగానో సహాయం చేస్తుంది. కావున నారింజను ఆహారంలో భాగం చేయండి.

ఈ కథనాన్ని మీ ప్రియమైన వారికోసం భాగస్వామ్యం చేయండి!


English summary

How Do Oranges Help You Lose Weight

How Do Oranges Help You Lose Weight,The health benefits of oranges are that it cleans your gums and tongue, it fights throat infections, boosts immune system, and cleanses the intestine to name a few.
Story first published:Friday, March 23, 2018, 13:06 [IST]
Desktop Bottom Promotion