For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మద్యం వాసన మిమ్ములను అసౌకర్యానికి గురిచేస్తుందా? అయితే ఈ పద్దతులు పాటించండి.

|

కొందరు మద్యానికి ఎంతదూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా, వారాంతాల్లో పార్టీల సందర్భంలో అయినా కొన్ని కారణాల దృష్ట్యా మద్యాన్ని స్వీకరిస్తుంటారు. ఎంతోమంది స్వతహాగా, శరీరానికి అవసరంలేని పదార్ధంగా మద్యాన్ని గుర్తించిన కారణాన, ఈ వ్యసనాన్ని వీడుతున్నారు. అయినాకూడా కొందరి ప్రోద్భలం కారణంగా కొద్దో గొప్పో అన్నట్లుగా తీసుకుంటూ ఇబ్బందులకు గురవుతున్నారు అన్నది వాస్తవం. క్రమంగా ఆల్కహాల్ దుర్వాసన కారణంగా ఇంటికి, లేదా కార్యాలయానికి వెళ్ళడం సరైన ఎంపిక కానేరదు. అవునా?

నోటిలో మిగిలిపోయిన కొన్ని అస్థిరమైన ఆహార అవశేషాలు, హాలిటోసిస్ లేదా చెడుశ్వాసకు దారితీస్తుంది. 2013లో, జర్నల్ ఆఫ్ నేచురల్ సైన్స్, బయాలజీ అండ్ మెడిసిన్ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో, ఆల్కహాల్లోని అధికమోతాదులో ఉన్న అస్థిరమైన అణువులు, నోటి దుర్గంధానికి దారితీస్తుందని తెలిపింది. అంతేకాకుండా, ఆల్కహాల్ శరీరానికి ఏమాత్రం ఉపయోగపడని పదార్ధంగా కూడా తేల్చింది.

ఆల్కహాల్ అంత సులభంగా జీర్ణంకానిదిగానే కాకుండా, శరీరంలో విషపదార్ధాలను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది కాలేయం ద్వారా శోషించబడి, ప్రాసెస్ చేయబడుతుంది. కానీ కాలేయం గంటలో కొంత ద్రావణాన్ని మాత్రమే ప్రాసెస్ చేసేలా జీవక్రియలను జరుపుతుంది. క్రమంగా, నెమ్మదిగా మీ రక్తప్రవాహంలోకి మరియు మీ ఊపిరితిత్తులతో సహా, శరీర కణజాలాలలోనికి ఆల్కహాల్ శోషించబడుతుంది. కానీ శరీరంలో ప్రాసెస్ చేయని ఆల్కహాల్ కూడా పేరుకుంటూ పోతుంది. తద్వారా, దుర్వాసన అధికమవుతుంది. రానురాను, అంతర్గత అవయవాలను దెబ్బతీయడం, వాటి పనితీరు మందగించడం వంటివి కూడా చేస్తుంది.


ఈ సమస్య అధికంగా మద్యపానం సేవించే వారిలో సర్వసాధారణంగా ఉంటుంది. దుర్వాసన మాత్రమే కాకుండా, మీరు మద్యపానం సేవించని సమయాల్లో కూడా, మీ శరీరంలోని ఆల్కహాల్ అవక్షేపాలు, మరియు అస్థిరమైన ఆల్కహాల్ అణువుల నిక్షేపాల మోతాదులు స్పష్టంగా ఉన్నందున, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్ములను తాగుబోతులుగానే భావిస్తారు.
మీరు పచ్చితాగుబోతు కాదు, అని ప్రజలకు తెలియజేయడానికి ఆల్కహాల్ త్యజించడంతో పాటు, దుర్వాసనని వదిలించుకోవడానికి కొన్ని సరళమైన మరియు సులభమైన ఉపాయాలను అనుసరించవలసి ఉంటుంది.

ఇక్కడ ఆల్కహాల్ దుర్గంధాన్ని వదిలించుకోవటానికి సూచించబడిన కొన్ని మార్గాలు:

1. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు, ఏదో ఒకటి తినండి:

1. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు, ఏదో ఒకటి తినండి:

ఆల్కహాల్ శ్వాస తీవ్రతను తగ్గించడానికి, ఆల్కహాల్ తీసుకునే ముందు లేదా, తీసుకునేటప్పుడు ఏదైనా ఆహార పదార్దాలను తీసుకోవడం మేలు. ఆహారాన్ని నమలడం, లాలాజల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, మరియు మీ కడుపులోని ఆహారం మీరు తీసుకునే మద్యంలో కొంతభాగాన్ని సంగ్రహించడంలో సహాయపడుతుంది.

ఆల్కహాల్ శ్వాసను నివారించడానికి మద్యంతో పాటు తీసుకోదగిన స్నాక్స్ :

వేరుశెనగ పప్పు, జీడిపప్పు, పాప్ కార్న్, బంగాళాదుంప చిప్స్ వంటి స్నాక్స్ మంచి ఎంపికలుగా ఉంటాయి.

ఆల్కహాల్ తక్కువగా ఉండే బీర్ లేదా కాక్టెయిల్ తీసుకునేటప్పుడు కూడా స్నాక్స్ తరచుగా తీసుకుంటూ ఉండండి.

2. నీరు ఎక్కువగా తీసుకోండి:

2. నీరు ఎక్కువగా తీసుకోండి:

ఆల్కహాల్ తీసుకునేటప్పుడు స్నాక్స్ ఎంత ముఖ్యమో, అధికంగా నీటిని తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆల్కహాల్ సాంద్రత ఎక్కువగా ఉన్న కారణాన, త్వరగా జీర్ణం కాదు, మరియు శరీరాన్ని నిర్జలీకరణం(డీహైడ్రేషన్) గావిస్తుంది. క్రమంగా నోటిలో బాక్టీరియా అధికమై, దుర్వాసనకు దారితీస్తుంది. కావున వీలైనంత అధికంగా నీటిని తీసుకోవలసి ఉంటుంది.

ఆల్కహాల్ తీసుకునే కార్యక్రమం ముగించినా కూడా, నీటిని మాత్రం తరచుగా తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి. ఇలా నీటిని తీసుకోవడం, ఆల్కహాల్ వలన కలిగే దుర్వాసన తగ్గించడంతో పాటు, హ్యాంగోవర్ యొక్క తీవ్రతను కూడా తగ్గిస్తుంది.

సాదా నీటితో పాటు, నిమ్మరసం కలిపిన నీరు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

3. బ్లాక్-కాఫీ తీసుకోండి:

3. బ్లాక్-కాఫీ తీసుకోండి:

ఆల్కహాల్ దుర్గంధాన్ని దూరంచేసే చిట్కాలలో ఉత్తమ చిట్కాగా బ్లాక్ కాఫీ ఉంటుంది. ఇది రెండు విధాలుగా మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

అన్నిటికన్నా ముఖ్యంగా, కాఫీ మీ శరీరాన్ని అప్రమత్తం చేస్తుంది మరియు వికారం కలుగకుండా సహాయం చేస్తుంది. ముఖ్యంగా కార్యాలయానికి వెళ్ళడం, లేదా ముఖ్యమైన సమావేశానికి హాజరు కావలసిన సమయాల్లో ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక రెండవ ప్రయోజనం, కాఫీ కాంపౌండ్స్ మద్యం వాసన కన్నా మెరుగైన మంచి సువాసనను మీనోటికి అందిస్తాయి.

తరచుగా విరామాలలో, కనీసం 3-4 కప్పుల బ్లాక్ కాఫీ తీసుకునేలా ప్రణాళిక చేసుకోండి. ఎటువంటి అదనపు పదార్ధాలను బ్లాక్ కాఫీలో జోడించడం లేదని నిర్ధారించుకోండి. సాధారణ బ్లాక్ కాఫీతో పోలిస్తే, క్రీం, షుగర్ వంటి పదార్ధాలు కలిపిన బ్లాక్ కాఫీ దుర్వాసనను ప్రభావవంతంగా తగించవని గుర్తుంచుకోండి. ఏదిఏమైనా రోజులో 400మిల్లీగ్రాముల కెఫీన్ దాటకూడదని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి మరియు రక్తపోటు సమస్య ఉన్నవాళ్ళకు ఆల్కహాల్, కెఫీన్ రెండూ ప్రమాదమే అని మరువకండి.

Most Read:బరువు తగ్గడంలో చెరకు రసం సహాయపడుతుందనడానికి గల 7 ప్రధాన కారణాలు

4. మీ పళ్ళను బ్రష్ చేయండి:

4. మీ పళ్ళను బ్రష్ చేయండి:

మౌఖిక శ్వాసను ఎదుర్కొనేందుకు, మరియు మీ శ్వాసను తాజాగా ఉంచుటకు సరైన ఓరల్ కేర్ మరియు పరిశుభ్రత అవసరం. ఇది మీ నోటి లోపలి దుర్వాసన కారక బాక్టీరియాను నాశనం చేయడంలో సహాయం చేస్తుంది. అయితే, ఇది మీ కడుపు, గొంతు మరియు చర్మం నుండి వచ్చే మద్యం వాసనను తొలగించదని గుర్తుంచుకోండి.

దుర్వాసనను అధికస్థాయిలో తొలగించేందుకు, మింట్ ఫ్లేవర్ కలిగిన టూత్పేస్ట్ వినియోగించడం మంచిది. మరియు మీ పళ్ళతో పాటుగా నాలుకను కూడా బ్రష్ చేయండి.

ఒకసారి మీ బ్రషింగ్ పూర్తయిన తర్వాత, ఫ్లాసింగ్ చేయడం మరచిపోకండి. మీ దంతాల మధ్య చేరిన మద్యంతో కూడిన ఆహార పదార్ధాలను తొలగించడం కష్టతరం అవుతుంది. ఈ అవశేషాలను, తొలగించుటకు ఫ్లాసింగ్ సహాయం చేస్తుంది. చివరగా ఆల్కహాల్ రహిత మౌత్-వాష్ వినియోగించి, నోటిని శుభ్రపరచుకోండి.

5. మూలికలు నమలండి:

5. మూలికలు నమలండి:

రోజ్మేరీ, పార్స్లీ, స్పియర్మింట్ లేదా టార్రాగాన్ వంటి బలమైన సువాసనలు కలిగిన మూలికలు ఆల్కహాల్ దుర్గంధాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ మూలికలు మీ నోరు మరియు కడుపు నుండి వచ్చిన ఇబ్బందికరమైన దుర్వాసనను తొలగించటానికి సహాయపడే, డీ-ఓడరైసింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి.

కొన్ని తాజా రోజ్మేరీ, పార్స్లీ, స్పియర్మింట్ లేదా టార్రాగాన్ ఆకులను కనీసం 2-3గంటలకు ఒకసారి నమలడం చేయండి.

మీరు మీ సలాడ్లలో సైతం, ఈ మూలికలను జోడించుకోవచ్చు. ఇవి మీ శరీరాన్ని ఉత్తేజితం చేయడమే కాకుండా, దుర్వాసనను కూడా దూరం చేస్తుంది.

6. చూయింగ్-గమ్:

6. చూయింగ్-గమ్:

ఆల్కహాల్ దుర్గంధాన్నితొలగించడానికి సూచించబడిన సరళమైన మార్గాల్లో ఒకటి, చక్కెర రహిత చూయింగ్ గమ్ నమలడం. మింట్ లేదా పుల్లనిరుచి కలిగిన చూయింగ్-గమ్ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.

మొదటగా, చూయింగ్-గమ్ యొక్క బలమైన సువాసన ఆల్కహాల్ దుర్గంధాన్ని కప్పివేయటానికి సహాయపడుతుంది. అలాగే, ఇది లాలాజల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, క్రమంగా ఆమ్లాలు, బ్యాక్టీరియా మరియు ఏ వాసన కలిగించే కణాలనైనా దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మద్యపానం కార్యక్రమం పూర్తైన తరువాత, వీలైనంత ఎక్కువసేపు చూయింగ్-గమ్ నమలడం చేయండి. తర్వాత, పూర్తిగా మీ నోటిని శుభ్రం చేయండి. అవసరమైతే, 2-3 గంటలకు ఒకసారి చూయింగ్-గమ్ నమిలి, నోటిని శుభ్రపరచండి.

Most Read:ఆమెను కలిసేందుకు భర్తనే సహకరించేవాడు, అతనికి అసలు విషయం తెలిసి కలవకుండా చేశాడు #mystory300

7. ముడి వెల్లుల్లిని నమలడం:

7. ముడి వెల్లుల్లిని నమలడం:

వెల్లుల్లి వంటి బలమైన సువాసన కలిగిన పదార్ధoగా ఉన్న కారణాన, ఆల్కహాల్ దుర్గంధాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. నిజానికి, వెల్లుల్లి వాసన బలంగా ఉంటుంది, క్రమంగా ఆల్కహాల్ వాసనను వెలుల్లి ఆక్రమిస్తుంది.

వీలైతే, 1-2 ముడి వెల్లుల్లి రెబ్బలు నమిలి, గ్లాసుడు నీళ్ళు తీసుకోండి. కష్టతరం అనిపించిన ఎడల, సూప్, డిప్ లేదా స్ప్రెడ్ వంటి వెల్లుల్లి రెసిపీలను అనుసరించండి.

వెల్లుల్లి శ్వాసను ఎదుర్కొనేందుకు, పుదీనా-టీ త్రాగడం లేదా పుదీనా రుచిగల చూయింగ్-గమ్ నమలడం చేయండి.

8. ఉల్లిపాయలు:

8. ఉల్లిపాయలు:

వెల్లుల్లి మాదిరిగానే, ఉల్లిపాయలు కూడా బలమైన వాసనను కలిగి ఉంటాయి. క్రమంగా ఆల్కహాల్ దుర్గంధాన్ని సులభంగా తొలగించవచ్చు. తెలుపు ఉల్లిపాయలకు బదులుగా, ఎరుపు ఉల్లిపాయలనే ఎన్నుకోండి. వీటి వాసన దృఢoగా ఉంటుంది.

ముడి ఉల్లిపాయలు ప్రధానంగా ఉండేలా సలాడ్, బర్గర్ లేదా శాండ్విచ్ వంటివాటిని తీసుకోండి.

ఉల్లిపాయల వాసన బలంగా ఉంటుంది కాబట్టి, ఈ పద్దతిని అనుసరించిన తర్వాత, పూర్తిగా మీపళ్ళను బ్రష్ చేసి, మంచినీటిని తీసుకోవడం మంచిది.

9. నిమ్మకాయ:

9. నిమ్మకాయ:

సిట్రస్ సమ్మేళనాల ఉనికిని కలిగిఉన్న కారణాన, నిమ్మకాయ ఆల్కహాల్ దుర్గంధాన్ని తొలగించుటకు సహాయపడే మరొక ఉపయోగకరమైన పరిహారంగా చెప్పబడుతుంది. అదనంగా, నిమ్మకాయ శరీరం నుండి సేకరించిన విషాన్ని తొలగిస్తుంది, తద్వారా మద్యం వాసనను తగ్గిస్తుంది.

Most Read:నా భార్య బొమ్మలా పడుకుంటుంది, నేను ఏమీ చేసినా తనలో ఎలాంటి ఫీలింగ్స్ రావు


English summary

How to Get Rid of Alcohol Breath

You may not realize it, but when you party hard on the weekends, chances are high that you may have annoying and embarrassing alcohol breath come Monday. Going to class or the office with alcohol breath is not a good choice.Certain volatile molecules in the mouth lead to halitosis or bad breath, according to a 2013 study published in the Journal of Natural Science, Biology and Medicine. Alcohol is one such volatile molecule that it can make your breath stink real bad.
Story first published: Friday, November 9, 2018, 16:38 [IST]