For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజులో ఎంత తరచుగా ప్యాడ్స్ ను మార్చుకుంటూ ఉండాలి?

|

మీరు బ్లీడింగ్ హెవీగా అవుతున్న రోజులలో ప్రతి మూడు గంటలకి ఒకసారి ప్యాడ్స్ ను మార్చుకుంటూ ఉంటారా? తక్కువగా బ్లీడింగ్ అవుతున్న రోజులలో ప్యాడ్స్ ను మార్చకుండా ఉంటారా? ఈ ప్రశ్నలకు మీరు అవునని సమాధానమిస్తే మీరు ఈ ఆర్టికల్ ను తప్పక చదివి తీరాలి. ప్యాడ్స్ ను ఎంత తరచుగా మార్చుకోవాలో మీరు తెలుసుకుని తీరాలి.

పీరియడ్స్ లోని బ్లీడింగ్ కు తగిన విధంగా ప్యాడ్స్ ను ఎంచుకోవాలి. ఈ సమయంలో మరింత హైజీన్ గా ఉండడం ముఖ్యమైన విషయం. పీరియడ్స్ సమయంలో హైజీన్ ను పాటించకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

ఈ స్టేజ్ లో, మహిళలు తమ బ్లీడింగ్ అవసరానికి తగిన ప్యాడ్ ను ఎంచుకోవాలి. కాబట్టి, ప్యాడ్ ను ఎంత తరచుగా మార్చుకోవాలో వారు తెలుసుకోవాలి.

పీరియడ్స్ ఎంతకాలం ఉంటాయి?

పీరియడ్స్ ఎంతకాలం ఉంటాయి?

ప్రతి మహిళ యొక్క పీరియడ్ డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది.

కొంతమంది మహిళల్లో, పీరియడ్స్ అనేవి మూడు లేదా నాలుగు రోజుల పాటు ఉంటాయి. కొంతమందికి ఎనిమిది రోజుల పాటు ఉంటాయి.

పీరియడ్స్ డ్యూరేషన్ లాగానే, ఫ్లో మరియు బ్లడ్ మోతాదు అనేది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. ప్రతి నెల మహిళలు దాదాపు 40 మిల్లీలీటర్ల బ్లడ్ ను కోల్పోతారు.

ప్యాడ్స్ లో వివిధ రకాలు

ప్యాడ్స్ లో వివిధ రకాలు

ప్యాడ్స్ ని వివిధ మహిళల అవసరాలను బట్టీ తయారుచేస్తారు. అవి ఈ విధంగా ఉంటాయి:

వింగ్స్ కలిగిన ప్యాడ్స్ అలాగే వింగ్స్ లేని ప్యాడ్స్

ఉదయం పూట వాడేందుకు నార్మల్ ఫ్లో ప్యాడ్స్.

ఓవర్నైట్ ప్యాడ్స్.

సెంటెడ్ మరియు అన్ సెంటెడ్ ప్యాడ్స్.

మీ ఫ్లోని బట్టి మీరు ప్యాడ్స్ ను ఎంచుకోవడం ఆధారపడి ఉంటుంది.

ఎటువంటి ప్యాడ్స్ ను వాడాలి.?

ఎటువంటి ప్యాడ్స్ ను వాడాలి.?

సాధారణంగా, మహిళలు వంద శాతం కాటన్ ప్యాడ్స్ ను వాడాలి. సెంటెడ్ కాని ప్యాడ్స్ ను వాడాలి. ఈ ప్యాడ్స్ దొరకడం కష్టం. ఎందుకంటే, ఆర్గానిక్ ప్యాడ్స్ అనేవి ఎక్కువగా మార్కెట్ లో లభ్యమవవు.

కాటన్ ప్యాడ్ ను వాడితే ఆరోగ్యానికి మంచిది కూడా. ఎటువంటి స్కిన్ ఇరిటేషన్ సమస్యలు తలెత్తవు.

పీరియడ్ సమయంలో హైజీన్ ను మెయింటెయిన్ చేయడమెలా?

పీరియడ్ సమయంలో హైజీన్ ను మెయింటెయిన్ చేయడమెలా?

మీ ఫ్లో రెగ్యులర్, హెవీ లేదా మోడరేట్ అయినా మీరు మీ ఇంటిమేట్ ఏరియాను ప్యాడ్ ను మార్చే ప్రతిసారి శుభ్రం చేసుకోవాలి. కొత్త ప్యాడ్ ను మార్చుకునే ముందు ఇంటిమేట్ ఏరియాను తేలికపాటి సోప్ తో శుభ్రం చేసుకోవాలి. అప్పుడు ర్యాషెస్ సమస్య తలెత్తదు. ఈ ఏరియాను ఎంత వీలయితే అంత పొడిగా ఉంచుకోవాలి.

మెన్స్ట్రువల్ బ్లడ్ అనేద కంటామినేట్ అయి ఉంటుంది. తడి ప్యాడ్ ను ఎక్కువసేపు ఉంచుకోవడం వలన స్కిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ర్యాషెస్, వెజీనల్ ఇన్ఫెక్షన్స్ మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తవచ్చు.

అంతేకాక, వాడిన ప్యాడ్ ను సరిగ్గా డిస్పోజ్ చేయడం ముఖ్యం. ప్యాడ్స్ ను టాయిలెట్ లో ఫ్లష్ చేయకండి. వాటిని ట్రాష్ క్యాన్స్ లోనే డిస్పోజ్ చేయాలి. లేదంటే, పర్యావరణానికి ప్రమాదం.

కాబట్టి, పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ ను ఎంత తరచుగా మార్చుకోవాలో మీరు తెలుసుకోవాలి.

ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానం లభిస్తుంది. నార్మల్ నుంచి మోడరేట్ ఫ్లో కలిగిన మహిళలు ప్యాడ్స్ ను ప్రతి నాలుగు గంటలకు ఒకసారి మార్చుకోవాలి. ప్యాడ్ ఒకవేళ క్లీన్ గా అలాగే డ్రైగా కనిపించినా కూడా ప్యాడ్ ను మార్చుకోవడం ముఖ్యమన్న విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే, ప్యాడ్ డిజైన్ లో మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది స్ట్రక్ అయి ఉంటుంది. ఎక్కువ సేపు ప్యాడ్ ను మార్చకుండా ఉంచడం ఆరోగ్యకరం కాదు.

ఈ బ్లడ్ వలన ఇన్ఫెక్షన్స్ సమస్య తలెత్తదని మీరు భావించవచ్చు. కానీ, తడి వాతావరణంలో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పేరుకుపోవడం ప్రారంభిస్తాయి.

హెవీ ఫ్లో ను ఎక్స్పీరియన్స్ చేసే మహిళలు ప్రతి రెండు గంటలకు ఒకసారి ప్యాడ్స్ ను మార్చుకోవాలి. అప్పుడే, ఇంటిమేట్ ఏరియా మైక్రో ఆర్గనిజమ్స్ లేకుండా పరిశుభ్రంగా ఉంటుంది.

అలాగే, పేరుకుపోయిన బ్లడ్ అనేది దుర్వాసన కలిగిస్తుంది. ఇది సాధారణమే. చింతించవలసిన అవసరం లేదు. ఒకవేళ ఈ వాసన మరింత ఘాటుగా వస్తే మాత్రం మీరు తగిన చర్యలు తీసుకోవాలి.

కొన్ని రకాల స్మెల్స్ అనేవి ప్యాడ్ పై వేగవంతమైన వృద్ధి చెందిన బాక్టీరియా వలన తలెత్తుతాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మరియు బాక్టీరియా అనేవి ప్యాడ్ లోని ఉష్ణోగ్రత కు అలాగే తడికి వేగంగా వృద్ధి చెందుతాయి .

ఆసక్తికరమైన వాస్తవం

ఆసక్తికరమైన వాస్తవం

మహిళ తన జీవితకాలంలో దాదాపు 12,000 ప్యాడ్స్ ను లేదా టాంపన్స్ ను వాడుతుంది. శానిటరీ ప్యాడ్స్ వలన మహిళలు కొంత సౌకర్యాన్ని పొందుతున్నారు. అంతకు ముందు, క్లాత్ ప్యాడ్ నే మళ్ళీ మళ్ళీ వాడేవారు. ఇది అనారోగ్యకరం అలాగే అన్ హైజినిక్ కూడా.

English summary

How Often Should You Change Pads A Day

Every woman should choose pads that best suit their needs at all times when they are on their periods. Taking care of your intimate area and your body is extremely important. Women who have a normal to moderate flow during their periods should change pads every four hours. And women who experience a heavy flow should change every two hours.
Story first published: Thursday, July 12, 2018, 19:00 [IST]