For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లో-బీపీ తో అవ‌స్థ‌లా? ఇంట్లోనే ఉందిగా దీనికి ప‌రిష్కారం!

లో-బీపీ తో అవ‌స్థ‌లా? ఇంట్లోనే ఉందిగా దీనికి ప‌రిష్కారం!

By Sujeeth Kumar
|

పొద్దున్నే లేస్తూనే ఏదో అస‌హ‌నంగా, బ‌ద్ద‌కంగా అనిపిస్తోందా? అదే అల‌స‌ట కుర్చీలోంచి లేచిన‌ప్పుడు కూడా అనిపిస్తుందా? శ‌రీరంలోని ర‌క్త‌మంతా మెదడుకు వెళ్లిపోయి, ఇంకెక్క‌డా లేని భావ‌న క‌లుగుతుందా? ఇలాంటి ల‌క్ష‌ణాలు శ‌రీరంలో అనిపిస్తుంటే మీ బీపీ సాధార‌ణ స్థాయి క‌న్నా త‌క్కువున్న‌ట్టే. దీనికి స‌త్వ‌ర చికిత్స అవ‌స‌రం. ఇందుకోసం మేము మీకు అందిస్తున్నాం.. కొన్ని మంచి మంచి గృహ చిట్కాలు... అవేమిటో చ‌దివేయండి మ‌రి...

How To Raise Low Blood Pressure – Remedies + Diet Tips

లో బీపీ అంటే....
హై బీపీ స‌ర్వ సాధార‌ణం. మ‌రి లో బీపీ కూడా ఉంటుందా అనేగా మీ సందేహం. అవును దీనినే హైపో టెన్ష‌న్ అని అంటారు. శ‌రీరంలోని అన్ని అవ‌యవాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా ఒక్క‌సారిగా ప‌డిపోయి బాడీ షాక్‌కు గురైన‌ట్టుగా అవుతుంది.

మ‌రి దీనికి కార‌ణాలు ఏమై ఉంటాయ‌బ్బా...

లో బీపీకి కార‌ణాలు

లో బీపీకి కార‌ణాలు

లో బీపీకి కార‌ణాలు అనేకం ... వీటిలో ముఖ్య‌మైన‌విః

* డీహైడ్రేష‌న్‌- త‌ద్వారా వాంతి, విరేచ‌నాలు

* బ్లీడింగ్‌- మంద్ర‌స్థాయి నుంచి తీవ్ర స్థాయి దాకా

* అవ‌యవాల వాపు, నొప్పి

* గుండె రుగ్మ‌త‌లు- గుండె కొట్టుకునే వేగం త‌గ్గ‌డం, గుండెలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం లాంటివి

* హై బీపీ కోసం మందులు వేసుకోవ‌డం మూలాన‌

* బీ 12 విట‌మిన్ లోపం వ‌ల్ల‌

* అడ్రిన‌లైన్ హార్మోన్ స‌రైన మోతాదులో లేనందు వ‌ల్ల‌

* సెప్టిసీమియా

* వేసో వ్యాగ‌ల్ రియాక్ష‌న్ల వ‌ల్ల‌

* పోస్టుర‌ల్ హైపోటెన్ష‌న్ వ‌ల్ల‌

* మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల‌

* మాద‌క‌ద్ర‌వ్యాల‌ను అతిగా సేవించ‌డం వ‌ల్ల‌

పైన తెలిపిన‌వ‌న్నీ లో బీపికి గ‌ల కార‌ణాలు. మ‌రి వాటి ల‌క్ష‌ణాలు ఏమిటో తెలుసుకుందామా?

లో బీపీ ల‌క్ష‌ణాలు

లో బీపీ ల‌క్ష‌ణాలు

* మూర్ఛ‌

* స్వ‌ల్ప త‌ల‌నొప్పి

* క‌ళ్లు తిరిగిన‌ట్టు అనిపించ‌డం

ఏదైనా వ్యాధి మూలంగా బీపీ విప‌రీతంగా ప‌డిపోతే.. ల‌క్ష‌ణాలు ఈ విధంగా ఉంటాయి...

ఏదైనా వ్యాధి మూలంగా బీపీ విప‌రీతంగా ప‌డిపోతే.. ల‌క్ష‌ణాలు ఈ విధంగా ఉంటాయి...

* కూర్చున్నా, నిల్చున్నా లో బీపీ ల‌క్ష‌ణాలు ఉంటాయి.

* గుండె స‌మ‌స్య‌లు- ఛాతీలో, గుండెలో నొప్పి క‌లుగుతుంది.

* కిడ్నీ స‌మ‌స్య‌లు- ర‌క్తంలో యూరియా స్థాయిలో పెర‌గ‌డం

* షాక్ వ‌ల్ల గుండె, కిడ్నీ, మెద‌డు లాంటి సాధార‌ణంగా ప‌నిచేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతాయి.

పై ల‌క్ష‌ణాల‌న్నీ చ‌దువుతుంటే కాస్త గాభ‌రాగా అనిపిస్తుందా? మ‌రి ఎందుకు ఆల‌స్యం చేస్తారు. ఒక‌సారి వెళ్లి డాక్ట‌రుకు చూపించుకొని రండి.

ఈ కింద చార్టు చూస్తే ఏది సాధార‌ణ స్థాయో, అసాధార‌ణ స్థాయో తెలుస్తుంది.

ఈ కింద చార్టు చూస్తే ఏది సాధార‌ణ స్థాయో, అసాధార‌ణ స్థాయో తెలుస్తుంది.

ర‌క్తం అనేదిద ర‌క్త‌పు నాళాల‌పైన ఒక ఫోర్స్‌తో ప్ర‌వ‌హిస్తుంది. దీన్నే బ్ల‌డ్ ప్రెష‌ర్ అంటారు. దీన్ని బ‌ట్టే గుండె వేగం, శ్వాస‌, శ‌రీర ఉష్ణోగ్ర‌త ఆధార‌ప‌డి ఉంటుంది.

బీపీని సిస్టోలిక్‌, డ‌యాస్టోలిక్ బీపీగా కొలుస్తార‌న్న సంగ‌తి తెలిసే ఉంటుంది.

సిస్టోలిక్ బ్ల‌డ్ ప్రెష‌ర్ అంటే గుండె కండ‌రాలు ర‌క్తాన్ని పంప్ చేస్తాయి. ఇది గ‌రిష్ట సంఖ్య‌. మ‌రో వైపు డ‌యాస్టోలిక్ ప్రెష‌ర్ అంటే క‌నిష్ట సంఖ్య‌. ఈ ద‌శ‌లో గుండె కండరాలు రిలాక్స్ అవుతూ ఉంటాయి.

గుండె ముడుచుకున్న‌ప్పుడు బీపీ ఎక్కువ‌గా ఉంటుంది. అదే రిలాక్స్ అవుతున్న‌ప్పుడు బీపీ త‌క్కువ‌గా ఉంటుంది.

సిస్టోలిక్ బీపీ ఒక సాధార‌ణ ఆరోగ్య‌వంతుడైన వ్య‌క్తిలో 90 నుంచి 120 ఉండాలి. అదే డ‌యాస్టోలిక్ బీపీ 60- 80 మ‌ధ్య‌లో ఉంటే స‌రిపోతుంది. ఇది కొల‌వ‌డానికి బీపీ మెషిన్ ఉంటుంది. అందులో పాద‌ర‌సం ఈ కొల‌త‌ల‌ను చూపిస్తుంది.

సాధార‌ణ బీపీ అంటే 120/80 గా ఉంటే చాలు. 130/80 బీపీ ఉంటే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు అర్థం. లో బీపీలో ఈ సంఖ్య‌ల క‌న్నా ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టే నిర్ధారిస్తారు. అయితే 100/60 క‌న్నా త‌క్కువ ఉంటే లో బీపీగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు.

బీపీని ఎప్పుడు సాధార‌ణ స్థాయిలో ఉండేలా చేసుకోవ‌డం అన్ని విధాలా శ్రేయ‌స్క‌రం. లో బీపీ స‌మ‌స్య త‌ర‌చు ఎదుర్కోంటుంటే దాన్ని సాధార‌ణ స్థాయికి తీసుకురావ‌డం అనివార్యం. కొన్ని స‌హ‌జ‌మైన చిట్కాల‌తో బీపీని సాధార‌ణ స్థాయికి తీసుకురావ‌డం చాలా సుల‌భం.

లో బీపీని స‌హ‌జ ధోర‌ణ‌లో తీసుకువ‌చ్చే విధానం

లో బీపీని స‌హ‌జ ధోర‌ణ‌లో తీసుకువ‌చ్చే విధానం

* విట‌మిన్లు

* కాఫీ

* గ్రీన్ టీ

* రోజ్‌మేరీ నూనె

* ఉప్పు నీరు

* జిన్‌సెంగ్

* తుల‌సి నీరు, తేనె

* లైకో రైస్

1. విట‌మిన్లు

1. విట‌మిన్లు

విట‌మిన్ బీ12, మ‌రియు ఇ - లో బీపీని సాధార‌ణ స్థాయికి తీసుకురావ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. హై బీపీ ఉన్న‌వారు ఎట్టిప‌రిస్థితుల్లోనూ విట‌మిన్ ఇ తీసుకోకూడ‌దు. విట‌మిన్ బి 12 అనీమియా చికిత్స‌లో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక ఇదే బీపీని పెంచ‌డంలోనూ స‌హ‌క‌రిస్తుంది.

ఈ విట‌మిన్ల‌ను కోరుకునే వారు బాదంప‌ప్పు, పాల‌కూర‌, స్వీట్ పొటాటో, గుడ్లు, పాలు, చీజ్‌, చేప‌లు తినాలి. దీనికి అద‌నంగా వైద్యుడి స‌లహాతో విట‌మిన్ ట్యాబ్లెట్ల‌ను కూడా మింగొచ్చు.

2. కాఫీ

2. కాఫీ

ఏమేం కావాలంటే...

1-2 టీస్పూన్ల కాఫీ పౌడ‌ర్‌

1 క‌ప్పు నీరు

చ‌క్కెర - స‌రిప‌డినంత‌

ఏం చేయాలంటే...

ఒక క‌ప్పు నీటికి 1 లేదా 2 టీ స్పూర్ల కాఫీ పౌడ‌ర్ వేయాలి. దీన్ని మ‌ర‌గ‌నివ్వాలి. ఆ త‌ర్వాత సిమ్‌లో ఉంచి కావ‌ల‌సినంత చ‌క్కెర వేసుకోవాలి. కాస్త చ‌ల్లార‌క అప్పుడు తాగాలి.

ఇలా ఎన్నిసార్లు చేయాలి...

ఇలా రోజుకు రెండు క‌ప్పుల కాఫీ తాగాలి.

ఎలా ప‌నిచేస్తుందంటే...

కాఫీలో కెఫీన్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది బీపీని తాత్కాలికంగ పెంచ‌డంలో స‌హ‌క‌రిస్తుంది.

3. గ్రీన్ టీ

3. గ్రీన్ టీ

ఏమేం కావాలంటే...

ఒక టీ స్పూన్ గ్రీన్ టీ

ఒక క‌ప్పు వేడి నీరు

తేనె

ఏం చేయాలంటే..

ఒక క‌ప్పు వేడి నీటిలో ఒక టీ స్పూన్ గ్రీన్ టీ వేయాలి

5 లేదా 10 నిమిషాల త‌ర్వాత వ‌డ‌క‌ట్టాలి

కాస్తంత తేనె క‌లుపుకొని గ్రీన్ టీ తాగాలి.

ఇలా ఎన్నిసార్లు చేయాలి...

గ్రీన్ టీ రోజుకు 2 లేదా 3 సార్లు తాగితే చాలు.

ఎలా ప‌నిచేస్తుందంటే...

కాఫీ త‌ర‌హాలోనే గ్రీన్ టీ లోనూ కెఫీన్ స‌మృద్ధిగా ఉంటుంది. కెఫీన్ లో బీపీని ఎలా త‌గ్గిస్తుందో క‌చ్చితంగా తెలియ‌దు కానీ ఇది ఒక ధ‌మ‌నుల‌ను వెడ‌ల్పు చేసే ఒక హార్మోన్‌ను ఉత్తేజ‌ప‌రుస్తుంద‌న్న విష‌యం మాత్రం అర్థ‌మ‌వుతుంది.

4. రోజ్‌మేరీ నూనె

4. రోజ్‌మేరీ నూనె

కావ‌ల‌సిన‌విః

6 చుక్క‌ల రోజ్‌మేరీ నూనె

1 టేబుల్ స్పూన్ కొబ్బ‌రి లేదా ఆలివ్ నూనె

ఏం చేయాలంటే...

6 చుక్క‌ల రోజ్‌మేరీ నూనెను ఒక టేబుల్ స్పూన్ కొబ్బ‌రి లేదా ఆలివ్ నూనెలో క‌ల‌పాలి. దీంతో ఒళ్లంతా మ‌సాజ్ చేసుకోవాలి. లేదా స్నానం చేసే నీటిలో రోజ్‌మేరీ నూనెను క‌లుపుకోవాలి.

ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే మంచి ఫ‌లిత‌ముంటుంది.

ఇదెలా ప‌నిచేస్తుందంటే...

రోజ్ మేరీ నూనెలో క‌ర్పూరం ఉంటుంది. ఇది శ్వాస వ్య‌వ‌స్థ‌ను ఉత్తేజ‌ప‌రుస్తుంది. దీని వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా స‌జావుగా సాగుతుంది. అందుకే రోజ్ మేరీ నూనె లో బీపీని త‌గ్గించ‌డంలో స‌హ‌క‌రిస్తుంది.

5. ఉప్పు నీరు

5. ఉప్పు నీరు

కావ‌ల‌సిన‌వి-

అర టీ స్పూన్ ఉప్పు

ఒక గ్లాసు నీరు

ఏం చేయాలంటే...

ఒక గ్లాసు నీటిలో అర టీ స్పూన్ ఉప్పు క‌ల‌పాలి. దీన్ని సెలైన్ సొల్యూష‌న్ అంటారు. దీన్ని తాగాలి.

ఇలా ఎన్నిసార్లు తాగాలంటే-

బీపీ ప‌డిపోయిన‌ట్టు అనిపించిన‌ప్పుడ‌ల్లా ఇది తాగండి.

ఎలా ప‌నిచేస్తుందంటే-

ఉప్పులో ఉండే సోడియం బీపీని పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. అయితే ఎక్కువ మొత్తంలోనూ ఉప్పు నీరు తాగ‌కూడ‌దు. ఎక్కువ ఉప్పు శ‌రీర ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.


English summary

How To Raise Low Blood Pressure – Remedies + Diet Tips

Do you feel dizzy or nauseous while doing something as simple as getting up from the bed or standing up from a chair? Does it feel as if all the blood is rushing to your brain and leaving you off balance? If you answered yes to these questions, the chances are that your blood pressure is way below normal. And it needs to be treated immediately. To help you, we have come up with a set of the best home remedies. Keep reading to know more.
Story first published:Tuesday, June 19, 2018, 11:27 [IST]
Desktop Bottom Promotion