For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చక్కెర పదార్థాలను తినే వ్యసనం నుండి బయటపడటానికి 10 నమ్మలేని చిట్కాలు

By R Vishnu Vardhan Reddy
|

అందరికీ ప్రధానమైన చెత్త శత్రువు ఏమైనా ఉంది అంటే అది చక్కెర. అందరు ఈ చక్కెరతో కూడిన ఆహారాన్ని ద్వేషిస్తారు. కానీ, వాటి నుండి దూరంగా మాత్రం ఉండలేరు. అన్నింటికంటే చెండాలమైన కల ఏమిటంటే చక్కెర కోసం పరితపించడం. సాధారణంగా మద్యం తాగటానికి లేదా పొగతాగడానికి ఎలా బానిసలూ అవుతారో అలానే, చక్కెరకు కూడా బానిసలు అవుతారు.

సాధారణంగా అవసరమైన మేర చక్కెరను స్వీకరించడంలో ఎటువంటి తప్పు లేదు. కొన్ని సందర్భాల్లో అది ఆరోగ్యానికి అవసరం కూడా. కానీ, ఎప్పుడైతే చక్కెరను మోతాదుకు మించి తీసుకుంటారో అటువంటి సమయంలో మీ యొక్క ఆరోగ్యం పై అది తీవ్రమైన వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. మోతాదుకు మించి చక్కెరను తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులతో పాటు మరెన్నో భయంకరమైన వ్యాధులు మనల్ని చుట్టు ముట్టేసే అవకాశం ఉంది.

how to beat sugar addiction

ప్రస్తుతం మనం వాడే చక్కెరను నిల్వ ఉంచడం కోసం కొన్ని రసాయనాలను వాడతారు. ఈ చక్కెరలో ఎన్నో రిఫైన్డ్ కేలరీలు ఉంటాయి. ఇటువంటి చక్కెరను స్వీకరించడం వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురి అవుతారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిసినప్పటికీ కూడా చక్కెర పై ఉన్న కోరికని చంపుకోలేక, ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోలేక చేజేతులా తమ ఆరోగ్యాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు.

పంచదారను వాడకాన్ని..స్వీట్స్ తినడం తక్షణం మానేయాలని తెలిపే కొన్ని లక్షణాలు

క్రింద చెప్పబడే సాధారణమైన, సులభమైన, ప్రభావవంతమైన మార్గాల ద్వారా ఎలా చక్కెర వ్యసనం నుండి బయటపడవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం...

#1 కృత్రిమ తీపిపదార్ధాలకు దూరంగా ఉండండి :

#1 కృత్రిమ తీపిపదార్ధాలకు దూరంగా ఉండండి :

కృత్రిమ తీపిపదార్ధాలను ఎవరైతే స్వీకరిస్తారో అటువంటి వ్యక్తులు తీవ్ర అనారోగ్యం పాలవుతారు. వీటిని తీసుకోవడం అనేది ఆరోగ్యవంతమైన చర్యకాదు. కృత్రిమ తీపిపదార్ధాలను తీసుకోవడం వల్ల అనారోగ్యకరమైన కార్బోహైడ్రేట్లకు మీరు వ్యసన పరులుగా మారుతారు. అంతే కాకుండా మీరు అధికంగా బరువు కూడా పెరిగిపోతారు. దీంతో మీరు ఉబకాయులుగా మారిపోయే అవకాశం ఉంది. వీటి వల్ల మరెన్నో వ్యాధులు మిమ్మల్ని చుట్టు ముట్టి, మీ ఆరోగ్యాన్ని అవి దెబ్బతీస్తాయి. కృత్రిమ తీపి పదార్ధాలు శరీరంలో జరిగే జీర్ణ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి. ఇందువల్ల బరువు పెరుగుతాము.

కృత్రిమ తీపి పదార్ధాలకు బదులుగా తేనె లేదా బెల్లాన్ని వాడితే మంచి ఫలితాలు లభిస్తాయి.

#2 ఆరోగ్యవంతమైన చిరుతిళ్ళను అలవర్చుకోండి :

#2 ఆరోగ్యవంతమైన చిరుతిళ్ళను అలవర్చుకోండి :

చక్కెరను ఎప్పుడైతే మీరు పూర్తిగా తినడం మానివేస్తారో అటువంటి సమయంలో మీ యొక్క శరీరం ఒకింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. వీటన్నింటికి మీరు సిద్ధంగా ఉండాలి. మీకు ఎప్పుడైతే చక్కెర తినాలి అని అనిపిస్తుందో అటువంటి సమయంలో మంచి ఆరోగ్యవంతమైన చిరుతిళ్ళకు తినడం అలవాటు చేసుకోండి. మీరు చక్కెర తినాలి అనే ఆలోచన నుండి బయటపడాలి అని అనుకుంటే ఏదైనా ఆరోగ్యవంతమైన అలవాట్లను అలవర్చుకోండి. అనారోగ్యం బారిన పడేసే కేలరీలను అధికంగా సేవించకండి. పాప్ కార్న్ దగ్గర నుండి దోసకాయ వరకు ఇవన్నీ ఆరోగ్యవంతమైన ఆహారమే. వీటిల్లో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచివి. ఇవన్నీ ఆరోగ్యవంతమైన చిరుతిళ్ల జాబితాలోకి వస్తాయి.

#3 ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి :

#3 ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి :

తరచూ ఆకలివేయడం వల్ల చాలా మంది వ్యక్తులు తమ ఆకలిని తీర్చుకోవడానికి ఎక్కువగా చక్కెర తో చేసిన పదార్ధాలను తింటుంటారు. చక్కెర వ్యసనం నుండి మీరు దూరంగా ఉండదలిస్తే అందుకోసం మీరు చేయవల్సిన పని ఏమిటంటే, ఎప్పుడు మీ పొట్టని నిండుగా ఉంచుకోండి. ఇందువల్ల మీకు ఆకలి ఎక్కువగా వేయదు. దీంతో మీకు చక్కెరతో చేసే పదార్ధాలను తినాలి అనే ఆలోచన కూడా రాదు. మీరు తినే ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోండి. ఇందువల్ల అవి మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతే కాకుండా చాలా ఎక్కువ సమయం పాటు ఆకలి కాకుండా మీకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి. పోటీన్లు జీర్ణం కావాలంటే చాలా అధిక సమయం పడుతుంది. ఇందువల్ల ఎప్పుడు మీ కడుపు నిండుగానే ఉన్నట్లు అనిపిస్తుంది. చికెన్, గుడ్లు, పెరుగు మొదలగు ఆహారాల్లో ప్రోటీన్లు చాలా అధికంగా ఉంటాయి.

#4 సరైన పద్దతిలో నీళ్లు త్రాగండి :

#4 సరైన పద్దతిలో నీళ్లు త్రాగండి :

మీకు గనుక ఆకలిగా ఉంటే, అదే సంజ్ఞను మీ శరీరం మీ మెదడుకి పంపిస్తుంది. మీకు దాహంగా ఉంటే కూడా అదే సంజ్ఞను పంపిస్తుంది. అందుచేత ఒక వ్యక్తి తనకు దాహంగా ఉన్నా కూడా ఆ విషయం తెలియక ఎక్కువగా అవసరానికి మించి ఆహారాన్ని తినేస్తుంటారు.

ఎప్పుడైతే మీకు అనూహ్యంగా ఒక ప్రత్యేక ఆహారాన్ని ఇప్పుడే తినాలి అనే కోరిక కలుగుతుందో, అటువంటి సమయంలో ఒక గ్లాస్ నీళ్లు తాగి కొద్దిసేపు వేచి చూడండి. నీరు త్రాగటం ద్వారా మనం ఎదో ఆహారం తిణ్ణం అని, మన మెదడుని మాయ చేయవచ్చు. అనవసరమైన ఆహారం తినకుండా ఉండటానికి ఇది ఒక్క గొప్ప మార్గం. మీకు గనుక ఎక్కువగా చక్కెర ఆహారాలను తినాలని అనిపిస్తుంది అంటే, మీ శరీరంలో తగినంత నీరు శాతం లేదని అర్ధం. అందువల్ల మీరు ఎప్పటికప్పుడు అవసరమైన మేర నీళ్లు త్రాగుతూ ఉండండి.

#5 దాల్చిన చెక్క :

#5 దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క ఒక మసాలా దినుసు మాత్రమే కాదు అది ఒక దివ్య ఔషధం. దీని వల్ల ఎన్నో రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. చక్కెర తో కూడిన ఆహారాలకు దూరంగా ఉండటానికి దీనిని ఉపయోగించడం ఒక మార్గం. రక్తంలో ఉన్న గ్లూకోస్ స్థాయిలను నిలువరించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఎప్పుడైతే రక్తంలో ఉన్న గ్లూకోస్ స్థాయిలు సరైన క్రమంలో ఉంటాయో అప్పుడు చక్కెర తినాలి అనే కోరిక అదుపులో ఉంటుంది.

స్వీట్ తినాలనే కోరిక గాఢంగా వుంటే...?

#6 ఎల్ - గ్లుటమైన్ :

#6 ఎల్ - గ్లుటమైన్ :

గ్లుటమైన్ అనేది ఒక ప్రకృతిసిద్ధమైన ఆమ్లం. ఇది మన శరీరంలోనే లభిస్తుంది. శరీరంలో ఉన్న చక్కెరను గ్లూకోస్ గా మార్చడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. దీనితో పాటు శరీరంలో ఎన్నో ఎమినో ఆమ్లాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఒక విజయవంతమైన ప్రస్థానాన్ని ప్రారంభించడానికి, చక్కెర వ్యసనాన్ని తగ్గించుకోవడానికి మనం గ్లుటమైన్ మందుల్ని కూడా తగిన మోతాదులో వాడవచ్చు. వీటిని మీరు కొన్ని నెలల పాటు తీసుకోవడం వల్ల మీరు అన్ని రకాల లోపాలను అధికమిస్తారు.

#7 మంచి నిద్ర చేయండి :

#7 మంచి నిద్ర చేయండి :

మనం అందరం బాగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే నిద్ర అనేది చాలా అవసరం. మంచి నిద్ర వల్ల మనకు చక్కెరను తినాలి, అనే కోరికను ప్రభావవంతంగా అదుపులో పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే నిద్ర తక్కువ అవుతుందో అటువంటి సమయం లో ప్రాణాంతకమైన వ్యాధుల భారిన పడే అవకాశం పెరుగుతుంది. అంతే కాకుండా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని మరియు చక్కెర ఎక్కువ ఉన్న ఆహారాన్ని తినాలనే కోరిక ఎక్కువవుతుంది. నిద్ర తక్కువ అవడానికి మరియు జంక్ ఫుడ్ కి ఏవో అవినాభావ సంబంధం ఉంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్లలో సమతుల్యత దెబ్బతిని, వాటి యొక్క పనితీరు పై ప్రభావం చూపుతుంది. కాబట్టి మనం అందరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రోజులో ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి.

#8 చక్కెర లేని బుబుల్ గమ్ తినండి :

#8 చక్కెర లేని బుబుల్ గమ్ తినండి :

మీకు దగ్గరలోని కిరానా షాప్ కి వెళ్లి చక్కెరలేని కొన్ని బబుల్ గమ్ లని తెచ్చుకోండి. మీకు ఎప్పుడైతే చక్కెర పదార్ధాలు తినాలి అనిపిస్తుందో అప్పుడు ఒక బబుల్ గమ్ ని నోట్లో వేసుకోండి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఆహారం తిన్న, తర్వాత బబుల్ గమ్ తింటే తీపితో కూడిన ఆహారం తినాలి అనే ఆలోచన తక్కువ అవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా మధ్యాహ్నం పూట ఆహారం తిన్న తర్వాత బబుల్ గమ్ తినడం వల్ల మనకు మత్తు నిద్ర కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందట.

#9 సరైన సమయంలో సరైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోండి :

#9 సరైన సమయంలో సరైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోండి :

పోషకాహార లోపం వల్ల చక్కెర తో కూడిన ఆహారాలు ఎక్కువగా తినాలని మరియు ఆకలి కూడా ఎక్కువగా వేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పోషకాహార లోపమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనిని అరికట్టడానికి మీరు సరైన సమయంలో క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు పోషకాహారంతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ శరీరం ఆరోగ్యవంతమైన సమతుల్యతతో ఉంటుంది. అంతేకాకుండా చక్కెర తో కూడిన ఆహారాన్ని తినాలి అనే ఆశ మీలో కలగ కుండా చేస్తుంది. ప్రతి మూడు గంటలకు ఒకసారి ఎదో ఒక ఆరోగ్యవంతమైన ఆహారం తింటూ ఉండండి. దీని వల్ల మీ శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కానీ, మరీ ఎక్కువగా ఎప్పుడూ ఆహారాన్ని తింటూనే ఉండటానికి కూడా దూరంగా ఉండండి. అలా ఆహారం తింటూనే ఉంటే గనుక బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంది.

#10 కొద్దిసేపు నడవండి :

#10 కొద్దిసేపు నడవండి :

ఆకలిని అదుపులో ఉంచుకోవడానికి మరియు చక్కెర తో కూడిన ఆహారాలను తినాలి అనే ఆలోచనలను అరికట్టడానికి వేగంగా నడవటం అనేది ఉత్తమమైన మార్గంగా సూచిస్తున్నారు. ఇలా నడవటం అనేది మొదట్లో చాలా కష్టం అని అనిపించవచ్చు. కానీ, ఎప్పుడైతే మీరు అలవాటు పడతారో, ఇక అప్పటి నుండి మీరు చేసే ఈ పనిని ఎంతగానో ఆనందిస్తారు. ఎదో ఒక శారీరిక వ్యాయామాన్ని ప్రతి రోజు చేయడం ద్వారా చక్కెర తో కూడిన ఆహారాన్ని తినాలి అనే ఆలోచన నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా ఇలానే చేయడం ద్వారా కొద్ది రోజులకు చక్కెర పదార్ధాలు తినాలి అనే ఆలోచన నుండి పూర్తిగా బయటపడవచ్చు.

పైన చెప్పబడిన కొత్త మార్గాల ద్వారా ప్రభావవంతంగా మీలో ఉన్న చక్కెర పదార్థాలను తినాలి అనే ఆశను అరికట్టవచ్చు. ఆరోగ్యవంతమైన మరియు మంచి జీవితాన్ని జీవించడానికి మొదటి అడుగు వేయండి. మీ జీవితాన్ని కాపాడుకోండి.

ఈ వ్యాసాన్ని షేర్ చేయండి.

English summary

10 Incredible Tips As to How To Beat Sugar Addiction

Sugar is the worst enemy. Everyone dreads this, but just can't stay away from it. Sugar cravings are the worst nightmare and it is almost as addictive as drinking alcohol or smoking. A moderate amount of sugar is acceptable and sometimes needed for the health. But when you overdose on sugar, you will have to face various negative health consequences.
Story first published: Thursday, January 4, 2018, 14:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more