For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్క్ ప్లేస్ లో బ్యాక్ పెయిన్ ను డీల్ చేయడమెలా?

వర్క్ ప్లేస్ లో బ్యాక్ పెయిన్ ను డీల్ చేయడమెలా?

|

మీ చిన్నతనంలో మీ తల్లిదండ్రులు అలాగే టీచర్లు మిమ్మల్ని నిటారుగా కూర్చోమని చెప్పడం మీకు గుర్తుందా? బ్యాక్ ప్రాబ్లెమ్స్ ని అరికట్టేందుకు వారు మిమ్మల్ని నిటారుగా కూర్చోమని చిన్నప్పటి నుంచే హెచ్చరిస్తూ వచ్చారు.

ఈ టీచింగ్స్ అనేవి మీ మంచికే వారు చెప్పారు. వర్క్ ప్లేస్ లో కూడా చాలా మంది తమకు తెలియకుండానే నిటారుగా కూర్చోరు. రిలాక్స్ అయిపోయినట్టు కూర్చుంటారు. అయితే, నిటారుగా కూర్చోకపోవటం వలెనే అనేక బ్యాక్ ప్రాబ్లెమ్స్ తలెత్తుతాయి. ఈ ఆర్టికల్ లో వర్క్ ప్లేస్ లో బ్యాక్ పెయిన్ ను ఎలా డీల్ చేయాలో వివరిస్తాము.

How To Deal With Back Pain At Work

సరైన పోశ్చర్ కి సంబంధించిన కొన్ని అపోహలను ఇక్కడ ప్రస్తావించాము.

అపోహ: నిటారుగా కూర్చోండి లేదంటే బ్యాక్ పెయిన్ సమస్య వేధిస్తుంది

నిటారుగా కూర్చోవడం వలన బ్యాక్ కు మంచిది. ఇది ప్రజలలో ఎక్కువగా ఆదరణ పొందిన నమ్మకం. తల్లిదండ్రులు తమ పిల్లలను నిటారుగా కూర్చోమని చెప్తూ ఉంటారు. అప్పుడే, పోశ్చర్ సరిగ్గా ఉంటుందని వారు చెప్తారు. ఇది పిల్లలకు సరైన పోశ్చర్ ని అందించేందుకు తల్లిదండ్రుల ప్రయత్నం.

అపోహ: వంగినట్టుగా కూర్చోవటం వలన వెన్ను నొప్పి వస్తుంది

వంగేటప్పుడు బ్యాక్ ను స్ట్రెయిట్ గా ఉంచడం సాధ్యం కాదు. నిజమే కదా? మీరు కొంచెం అసౌకర్యంగా అలాగే ఇబ్బందికరంగా ఫీల్ అవవచ్చు. నిపుణుల ప్రకారం కొన్ని సందర్భాలలో అప్పుడప్పుడూ వంగి రిలాక్స్డ్ గా కూర్చోవడం వలన బ్యాక్ కు మంచి జరుగుతుంది. ఎందుకంటే బ్యాక్ కు రిలాక్సేషన్ అందుతుంది.

 1. శరీరాన్ని అర్థం చేసుకోండి:

1. శరీరాన్ని అర్థం చేసుకోండి:

ఏదైనా ఒక కదలిక మీకు నొప్పిని కలిగిస్తే కాసేపు ఆగి మీరు చేసే పనికి బ్రేక్ ఇచ్చి, మీ శరీరం మీకేం చెప్పదలచుకుందో వినండి. వైద్యునితో మీ సమస్య గురించి చర్చించి మీ శరీరానికి సరిపడే వ్యాయామాలను తెలుసుకోండి. తద్వారా, శరీరంలోని ఫ్లెక్సిబిలిటీను పెంపొందించుకోండి.

2. ఎక్కువగా విశ్రాంతిలో ఉండకండి:

2. ఎక్కువగా విశ్రాంతిలో ఉండకండి:

తీవ్రమైన గాయం తరువాత బెడ్ పై ఒకటి లేదా రెండు రోజులకంటే ఎక్కువగా విశ్రాంతిని పొందకండి. ఎక్కువ రోజులు బెడ్ పై విశ్రాంతి పొందితే మీ మజిల్స్ అనేవి తన సామర్థ్యాన్ని అలాగే బలాన్ని కోల్పోయి బలహీనంగా మారతాయి. మీ బ్యాక్ కు సపోర్ట్ ని ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోతాయి. కాబట్టి, వీలైనంత వరకూ యాక్టివ్ గా ఉండండి.

3. కూర్చోవడం అలాగే నిల్చోవడంలో జాగ్రత్తలు పాటించండి:

3. కూర్చోవడం అలాగే నిల్చోవడంలో జాగ్రత్తలు పాటించండి:

మీ లోయర్ బ్యాక్ ను మంచి పోశ్చర్ తో సంరక్షించుకోండి. కూర్చునేటప్పుడు అలాగే నిల్చునేటప్పుడు మీ బ్యాక్ ని దృష్టిలో పెట్టుకోండి. ఈ చిట్కాలని నించునేటప్పడు అలాగే కుర్చునేటప్పుడు పాటించండి.

డ్రైవ్ చేస్తున్నప్పుడు సరైన పోశ్చర్ లో కూర్చోండి. లో కౌచెస్ పై కూర్చోవడాన్ని అవాయిడ్ చేయండి.

వర్క్ లో కూర్చున్నప్పుడు మీ వర్క్ సర్ఫేస్ అనేది మీకు సౌకర్యవంతమైన ఎత్తులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

చక్కటి సపోర్ట్ నిచ్చే ఛైర్ ను ఎంచుకోండి. సపోర్ట్ కోసం ఛెయిర్ పై పిల్లోను వినియోగించండి.

మీ టాస్క్ కి తగినట్టుగా ఛైర్ ను సరైన ఎత్తులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. మీ పాదాలను స్టూల్ పై పెట్టండి.

కుర్చున్న పొజిషన్ నుంచి నిల్చునేటప్పుడు మెల్లగా సీట్ చివరకి వచ్చి మీ పాదాలను నెలకు ఆనించి లేవండి. డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ సీట్ ను డ్రైవింగ్ కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోండి. మీ లోయర్ బ్యాక్ అనేది సరైన విధంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. మీ హిప్స్ అనేవి మోకాళ్ళ కంటే కిందకు ఉండేలా చూసుకోండి.

లాంగ్ ట్రిప్స్ సమయంలో మధ్య మధ్యలో ఆగి రెగ్యులర్ గా బ్రేక్స్ తీసుకుంటూ చుట్టూ కొన్ని నిమిషాల పాటు నడవండి.

4. పొజిషన్స్ ను తరచూ మార్చండి:

4. పొజిషన్స్ ను తరచూ మార్చండి:

మీది డెస్క్ జాబ్ అయితే మీ పొజిషన్స్ ను తరచూ మార్చడాన్ని విస్మరించవద్దు. లేచి స్ట్రెచ్ చేసుకోండి. కొన్ని అడుగులు వేయండి. ప్రతి గంటకు ఇలా చేయండి. బ్యాక్ పై జెంటిల్ ఆర్క్ ను మెయింటెయిన్ చేయాలి. క్లీనింగ్ తో పాటు వ్యాక్యూమింగ్ వంటి యాక్టివిటీస్ ను చేస్తున్నప్పుడు లోవర్ బ్యాక్ వద్ద ఎంత వీలయితే అంత కర్వ్ ను మెయింటెయిన్ చేసేందుకు ప్రయత్నించండి.

5. ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయండి:

5. ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయండి:

ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయండి. దాంతో లోయర్ బ్యాక్ పై ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఊబకాయంతో ఇబ్బంది పడుతూ ఉంటే మీ బ్యాక్ పై ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. అలాగే, కేల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా లభించే ఫుడ్స్ ను తీసుకోవడం ద్వారా ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు.

6. స్మోకింగ్ కు దూరంగా ఉండండి:

6. స్మోకింగ్ కు దూరంగా ఉండండి:

స్మోకింగ్ కి బ్యాక్ పెయిన్ కి సంబంధం ఏంటని మీరు ఆశ్చర్యపోతూ ఉండవచ్చు. స్మోకింగ్ వలన వెన్నుకు చేరే బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. దాంతో త్వరగా వెన్ను తన పటుత్వాన్ని కోల్పోతుంది. దాంతో, లోయర్ బ్యాక్ పెయిన్ సమస్య వేధించడం మొదలుపెడుతుంది.

English summary

How To Deal With Back Pain At Work

The idea that sitting up straight is considered good for the back, is a more cultural belief among people than a scientific one. Easy ways to deal with back pain at work are listening to your body, not resting much, sitting and standing safely, maintaining a healthy weight, avoiding smoking, etc. How To Deal With Back Pain At Work
Desktop Bottom Promotion