For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్యాడ్ ర్యాష్ ని త్వరగా తొలగించుకునేందుకు 10 హోమ్ రెమెడీస్

|

తన జీవితంలోకి పీరియడ్స్ అనేవి రాగానే హార్మోన్స్ స్మూత్ గా పనిచేయడానికి మగువ అనేక జాగ్రత్తలను తీసుకోవడం మొదలుపెడుతుంది. అయితే, కొంతమందికి పీరియడ్స్ అనేవి తీవ్రమైన అసౌకర్యాన్నికలుగచేస్తాయి. ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.

నెలసరి మెన్స్ట్రువల్ ఫ్లోను మేనేజ్ చేయడానికి పీరియడ్ ప్యాడ్స్ అనేవి ఉపయోగకరంగా మారతాయి. ప్యాడ్స్ అనేవి ఎంత ఉపయోగకరంగా ఉన్నా వీటివలన కూడా కొంత అసౌకర్యం కలదు. వెజీనల్ ఏరియాలో వీటివలన వెజీనల్ రాష్ అనేది ఏర్పడుతుంది. ఇది నొప్పిని అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ప్యాడ్స్ తయారీలో వాడే కెమికల్స్, ఫ్రాగ్నేన్సెస్, సింథటిక్ మెటీరియల్స్ వలన ఇలా జరగవచ్చు. తొడలకు లోపల భాగంలో కూడా రాషెస్ ఏర్పడతాయి.

How To Get Rid Of Pad Rash Fast: 10 Home Remedies

ప్యాడ్ రాష్ అనేది తొడలు రాసుకోవడం వలన అలాగే తేమ వలన తలెత్తుతుంది. ప్యాడ్స్ ను రెగ్యులర్ గా మార్చుకోవడం వలన కొంత ఉపయోగం ఉంటుంది. అలాగే, ప్యాడ్ రాష్ నుంచి ఉపశమనం కోసం కొన్ని హోమ్ రెమెడీస్ ను ప్రయత్నించవచ్చు.

ప్యాడ్ రాష్ నుంచి ఫాస్ట్ గా రిలీఫ్ ను పొందేందుకు ఈ చిట్కాలను పాటించండి.

ఆపిల్ సిడర్ వినేగార్:

ఆపిల్ సిడర్ వినేగార్:

చర్మ సంరక్షణకై ఆపిల్ సిడర్ వినేగార్ అద్భుతంగా పనిచేస్తుంది. పీరియడ్స్ సమయంలో దీనిని వాడటం ద్వారా ప్యాడ్ రాష్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

కొంత ఆపిల్ సిడర్ వినేగార్ లో కాటన్ బాల్ ను ముంచండి.

రాషెస్ అన్నింటిపై ఈ కాటన్ బాల్ తో రుద్ది ఈ సొల్యూషన్ ను ఆరనివ్వండి.

రోజుకు మూడుసార్లు ఈ పద్దతిని పాటించండి.

ఐస్:

ఐస్:

ఐస్ అనేది తొడల లోపలి భాగాలలో పెయిన్ ను అలాగే ఇంఫ్లేమేషన్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది. ప్రభావిత ప్రాంతాన్ని సూత్ చేసి మొద్దుబార్చే లక్షణం ఐస్ కు ఉంది. ఆ విధంగా ఇబ్బందిని తగ్గిస్తుంది.

కొన్ని ఐస్ క్యూబ్స్ ను తీసుకుని శుభ్రమైన వస్త్రంలో ఉంచండి.

ఈ వస్త్రంతో ప్రభావిత ప్రాంతంపై రుద్దండి.

వేపాకులు:

వేపాకులు:

వేపాకులలో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు కలవు. ఇవన్నీ ప్యాడ్ ర్యాష్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

20 వేపాకులను మరుగుతున్న నీటిలో వేయండి.

బాగా మరగనిచ్చిన తరువాత చల్లారనివ్వండి.

ప్రభావిత ప్రాంతాన్ని ఈ నీటితో శుభ్రం చేయండి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీలు కలవు. ఇవి ప్యాడ్ ర్యాష్ ను తగ్గించి చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తాయి.

ప్రభావిత ప్రాంతాన్ని చల్లటి నీటితో శుభ్రపరచండి.

ఇప్పుడు కొబ్బరి నూనెను కాటన్ బాల్ సహాయంతో అప్లై చేయండి.

రాత్రంతా అలాగే ఉండనివ్వండి.

పెరుగు:

పెరుగు:

ప్యాడ్ ర్యాష్ వలన ఇరిటేట్ అయిన చర్మాన్ని సూత్ చేయడానికి పెరుగు తోడ్పడుతుంది. ఇందులో, యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు కలవు. ఇవి ప్యాడ్ రాష్ నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.

స్నానం చేయండి.

పెరుగులో ఒక కాటన్ బాల్ ను ముంచండి.

ఈ కాటన్ బాల్ తో పెరుగుని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి.

దీనిని ఆరనివ్వండి. ఈ పద్దతిని రోజుకు మూడు సార్లు రిపీట్ చేయండి.

కొత్తిమీర

కొత్తిమీర

వంటకాలలో కొత్తిమీరను ఎక్కువగా వాడతారు. అలాగే, ప్యాడ్ రాష్ ను తొలగించేందుకు కూడా కొత్తిమీర ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభావిత ప్రాంతంపై దురదను తగ్గిస్తుంది.

కొత్తిమీరను బాగా శుభ్రంచేయండి.

కొత్తమీరను క్రష్ చేసి పేస్ట్ ను తయారుచేయండి.

ప్రభావిత ప్రాంతంపై ఈ పేస్ట్ ను అప్లై చేయండి.

20 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రపరచండి.

అలో వెరా:

అలో వెరా:

ప్యాడ్ రాష్ ను తగ్గించేందుకు అలోవెరా తోడ్పడుతుంది. దురద నుంచి ఉపశమనం కలిగించి చర్మన్ని ప్రశాంతపరుస్తుంది.

అలోవెరా ఆకుల నుంచి జెల్ ను తీసుకోండి.

ప్రభావిత ప్రాంతంపై ఈ జెల్ ను అప్లై చేయండి.

పెప్పెర్మింట్ టీ:

పెప్పెర్మింట్ టీ:

పెప్పెర్మింట్ టీ లో కూలింగ్ ఎఫెక్ట్స్ కలవు. ఇవి దురదనుంచి ఆలాగే ప్యాడ్ రాష్ వలన కలిగే ఎర్రదనం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

పెప్పెర్మింట్ టీ బ్యాగ్స్ ను కప్పుడు నీళ్ళలోకి తీసుకోండి.

మరగనివ్వండి.

ఇప్పుడు ఈ నీటితో ప్రభావిత ప్రదేశాన్ని శుభ్రపరుచుకోండి.

ఒక టవల్ తో వైప్ చేయండి.

English summary

How To Get Rid Of Pad Rash Fast: 8 Home Remedies

How To Get Rid Of Pad Rash Fast: 8 Home Remedies,Pad rash is caused because of dampness and grazing of the thighs. Read the article to know how to get rid of a pad rash fast.
Desktop Bottom Promotion