For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోని పరిసరాలను పరిశుభ్రపరుచుకోవడం ఎలా?

యోని పరిసరాలను పరిశుభ్రపరుచుకోవడం ఎలా?

|

శరీరంలో మిగిలిన భాగాలకు మల్లే యోనిని కూడా ఇన్ఫెక్షన్లకు దూరంగా, పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. యోనిలో భాగానికి సోకే ఇన్ఫెక్షన్లను తీవ్రంగా పరిగణించి తగు నివారణ చర్యలు తీసుకోకపోతే, ఇంకా ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది.

యోని పరిసరాలలో దురద మరియు ఇన్ఫెక్షన్ కలగడానికి వివిధ కారణాలుంటాయి. ఋతుస్రావం, యాంటీబయాటిక్స్, సానిటరీపేడ్స్ మరియు అతిగా పంచదారను సేవించడం వలన వలన ఇలా జరగవచ్చు. కొన్నిసార్లు వాతావరణంలో మార్పుల వల్ల కూడా జరుగుతుంది.

How To Keep Your Vagina Clean And Healthy?

కారణమేమైనప్పటికి, పరిష్కరించడం మాత్రం తప్పనిసరి. యోని భాగం చుట్టూ ఉండే చర్మం సున్నితంగా ఉండటం వలన మార్కెట్లో లభించే రసాయన ఉత్పత్తులు వాడటం కన్నా, గృహవైద్య చిట్కాలను పాటించడం శ్రేయస్కరం.


కనుక, మీకోరకు ఇప్పుడు యోనిలో దుర్వాసన మరియు ఇన్ఫెక్షన్లు ప్రభావవంతంగా పారద్రోలే వెజైనల్ వాష్ గా పనిచేసే పదార్థాలను గురించి తెలియజేస్తున్నాం. చదివేయండి ఇక !

1. పెరుగు:

1. పెరుగు:

యోనిని పరిశుభ్రంగా, బాక్టీరియా అభివృద్ధి చెందకుండా చేయడంలో పెరుగు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఏ రకమైన ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికైనా పెరుగు దోహదపడుతుంది. మీరు చేయవలసినదల్లా, ఎటువంటి సువాసనలు లేని పెరుగును యోని భాగంలో రాసుకుని, గంటసేపు వదిలేయండి. తరువాత నీటితో శుభ్రపరచుకోండి. ఇది వెజైనల్ వాష్ గానే పనిచేయడమే కాక దుర్వాసనను కూడా అరికడుతుంది.

2. కలబంద గుజ్జు:

2. కలబంద గుజ్జు:

కలబంద గుజ్జు మన చర్మంలో తేమను పునరుద్ధరించి, చల్లదనం చేకూరుస్తుంది. మీ యోని చుట్టూ ఉండే చర్మం పొడిబారినప్పుడు, కలబంద గుజ్జు వాడితే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఒక తాజా కలబంద ఆకును తీసుకోండి. దానిని కట్ చేది, లోపల నుండి గుజ్జును వెలికితీయండి. దీనికి అరకప్పు నీటిని కలిపి పలుచన చేయండి.

ఈ మిశ్రమంతో యోని పరిసరాలను మృదువుగా పరిశుభ్రం చేసుకోండి. ఆఖరుగా గోరువెచ్చని నీళ్లతో కడగండి. మార్కెట్లో లభించే కలబంద గుజ్జు కాకుండా తాజాగా ఆకు నుండి తీసినది మాత్రమే వాడండి. ఎందుకంటే, యోని భాగం చుట్టూ ఉండే చర్మం సున్నితంగా ఉంటుంది.

3. తెల్లని వెనిగర్:

3. తెల్లని వెనిగర్:

తెల్లని వెనిగర్ యోని దుర్వాసనను పోగొట్టడమే కాక యోని చుట్టూ ఉండే చర్మంను పరిశుభ్రంగా, తాజాగా ఉంచుతుంది. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు కలిగి ఉండదు పైగా చర్మం పై వచ్చే దద్దుర్లు, దురదను నివారిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తెల్లని వెనిగర్ ను తీసుకుని, ఒక కప్పు నీటిని కలిపి పలుచన చేయండి. ఈ ద్రావణంతో యోని పరిసరాలను పరిశుభ్రం చేసుకోండి. తరువాత మామూలు నీటితో శుభ్రపరచుకోండి. ఇలా వారానికి ఒకసారి చేయండి.

4. నిమ్మ ఆకులు:

4. నిమ్మ ఆకులు:

నిమ్మ ఆకులలో యాంటిబయోటిక్ మరియు యాంటిఅలెర్జీ గుణాలుంటాయి. ఇవి యోని దుర్వాసనను పోగొట్టడమే కాక , ఆ భాగంలో pH ను సమతులంగా ఉండేలా నియంత్రిస్తుంది. దీనికై మీరు చేయవలసినదల్లా, కొన్ని నిమ్మ ఆకులను తీసుకుని,ఒక కప్పుడు నీళ్లలో వేడి మరిగించాలి. ఈ ద్రావణాన్ని చల్లార్చి, యోని పరిసరాలను పరిశుభ్రం చేసుకోడానికి వినియోగించండి.

5. వంట సోడా:

5. వంట సోడా:

వంట సోడా కూడా యోని పరిసరాలలో ఉండే చర్మం యొక్క pH ను సమతులంగా ఉండేలా నియంత్రించడానికి సహాయపడుతుంది.ఒక బకెట్ లో నీరు తీసుకుని అర కప్పు వంట సోడాను బాగా కలపండి. ఈ నీటితో స్నానం చేయండి. వంట సోడాను అధిక మోతాదులో కలిపినట్లైతే చర్మం పై దురద, మంట కలిగే అవకాశం ఉంది.

6. ఆపిల్ సిడర్ వెనిగర్:

6. ఆపిల్ సిడర్ వెనిగర్:

ఆపిల్ సిడర్ వెనిగర్ వెజైనల్ వాష్ గా పనిచేసే ఇంకొక సహజ పదార్థం. మీరు చేయవలసినదల్లా, బాత్ టబ్ నీటిలో కొన్ని చుక్కల ఆపిల్ సిడర్ వెనిగర్ ను కలిపి పదిహేను నిమిషాల పాటు అందులో ఉండండి. ఇలా చేస్తే యోని శుభ్రపడుతుంది. ఆపిల్ సిడర్ వెనిగర్ యోని వద్ద ఉండే ఫ్లోరా యొక్క ఆమ్ల తత్వాన్ని పునరుద్ధరిస్తుంది.

English summary

How To Keep Your Vagina Clean And Healthy?

Like any other part of our body, it is important to keep our vaginal areas clean and healthy and away from infections. Infections in the vaginal area should be taken seriously, as this may lead to further health issues. There are simple homemade remedies for this. Using ingredients like aloe vera, baking soda, white vinegar, etc., can help you.
Story first published:Saturday, May 26, 2018, 16:28 [IST]
Desktop Bottom Promotion