For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీఘ్ర స్ఖలన సమస్యలను పరిష్కారించడం ఎలా !

శీఘ్ర స్ఖలన సమస్యలను పరిష్కారించడం ఎలా !

|

మీ భాగస్వామి శీఘ్ర స్ఖలన సమస్యతో భాదపడుతున్నారా ? అయితే, ఈ వ్యాసం శీఘ్రస్ఖలన సమస్యను నిరోధించడానికి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. లైంగిక సంభోగం సందర్భంగా ఉద్దేశించిన సమయం కన్నా ముందుగానే స్ఖలనం జరగడాన్ని శీఘ్రస్ఖలనంగా వ్యవహరిస్తారు. మరియు ఇది మీకు, మీ భాగస్వామికి ఇద్దరికీ భాధగాను, అసౌకర్యంగాను ఉంటుంది.

ఈ శీఘ్రస్ఖలన సమస్య కారణంగా సంభోగ సమయాన్ని కొనసాగించలేకపోవడం, భావప్రాప్తి చేరుకోలేకపోవడం వంటి అనేక అసౌకర్యాలకు కారణమవుతుంది. ఇది భాగస్వాములకు నరకప్రాయమే. ఒక్కోసారి సంభోగం ప్రారంభానికి ముందే స్ఖలనo జరగడం అనేక మంది వయసుతో సంబంధంలేకుండా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి.

How To Prevent Premature Ejaculation

ఇది మనిషి యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది మరియు ఆందోళన స్థాయిలను పెంచడమే కాక, బుద్దిమాంద్యం వంటి మానసిక సమస్యలకు కూడా దారితీయవచ్చు. పరిశోధనలో కనీసం 29 శాతం పురుషులు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ శీఘ్ర స్ఖలన సమస్యను ఎదుర్కొంటున్నారు.

కావున ఈ వ్యాసంలో ఈ శీఘ్ర స్ఖలన సమస్యలను అధిగమించే ప్రక్రియలో భాగంగా కొన్ని గృహ చిట్కాలను మీముందు ఉంచబోతున్నాం.

1.అశ్వగంధ :

1.అశ్వగంధ :

అశ్వగంధ అనేది సమర్థవంతమైన ఔషధ మూలిక. పురుషులలో లైంగిక సమస్యలకు చికిత్స చేయటానికి ఆయుర్వేద మందులలో ఎక్కువగా ఇది ఉపయోగించబడుతుంది. అశ్వగంధం అవయవాల యొక్క బలాన్ని పెంచుతుంది మరియు పురుషులలో సత్తువ మరియు నియంత్రణను పెంచుతుంది.

అశ్వగంధ పొడిని సగం టీస్పూన్ తీసుకొని, మేక పాలలో కలిపి తీసుకోవలసి ఉంటుంది.

ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు కనీసం ఒక గ్లాస్ త్రాగాలి.

గమనిక: ఆవు పాలు కంటే మేక పాలు ప్రభావవంతంగా ఉంటాయి.

2.కుంకుమ పువ్వు మరియు బాదం :

2.కుంకుమ పువ్వు మరియు బాదం :

మీకు కుంకుమ పువ్వు తేలికపాటి కామోద్దీపన శక్తిని పెంచగలదని మరియు లిబిడోను మెరుగుపరుస్తుందని తెలుసా? . బాదంలో సెలినియం, జింక్ మరియు విటమిన్-ఇ ఉంటుంది. ఇవి లైంగిక ఆరోగ్యం మరియు పునరుత్పత్తి కోసం సూచించబడిన ఉన్నతమైన గృహచిట్కా. సెలీనియం వంధ్యత్వ సమస్యలను తగ్గించగా, జింక్ పురుషుల సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిలోను మరియు లిబిడో పెంచడానికి సహాయపడుతుంది.

ఒక బ్లెండర్లో, 10 బాదం మరియు 1 కప్పు పాలు, అల్లం, ఏలకులు మరియు కుంకుమ పువ్వును వేసి మిశ్రమంగా చేయండి .

నిద్రించే ముందు ప్రతి రోజు ఈ మిశ్రమాన్ని సేవించండి.

3.అల్లం మరియు తేనె:

3.అల్లం మరియు తేనె:

అల్లం మరియు తేనె శీఘ్ర స్ఖలన సమస్య నిరోధించే మరొక గృహ చికిత్స. పాలిపోయిన ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పెంచడంలో అల్లంలోని ఖనిజాలు సహాయం చేస్తాయి. తద్వారా స్ఖలన సమస్యలను దూరం చేయగలదు. మరోవైపు తేనె, కామోద్దీపనం పెంచడంలో సహాయం చేస్తుంది. తద్వారా అల్లం తేనె రెండూ కలిపి తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

నిద్రవేళ ముందు అల్లం మరియు తేనె కలిపి అర టీస్పూన్ తీసుకోండి.

4.వెల్లుల్లి:

4.వెల్లుల్లి:

శీఘ్ర స్ఖలన సమస్య అధిగమించడం ఎలా? అనే ప్రశ్నకు ప్రధానంగా సూచించే గృహవైద్యం వెల్లుల్లి. ఇది పురుషాంగం రక్త ప్రవాహం పెంచడoలో సహాయపడుతుంది మరియు వెల్లుల్లి మీ శరీరం వేడిని పెంచడంలో సహాయపడుతుంది.

బంగారు లేదా గోధుమ రంగులో మారే వరకు, స్వచ్ఛమైన నెయ్యిలో వెల్లుల్లిని వేయించి, ప్రతిరోజూ క్రమంగా తీసుకోండి. లేదా మీరు శీఘ్ర స్ఖలనాన్ని తగ్గించడానికి 3-4 వెల్లుల్లి రెబ్బలను తరచుగా నమలడం చేయవచ్చు.

5.ఆకుపచ్చ ఉల్లిపాయల విత్తనాలు:

5.ఆకుపచ్చ ఉల్లిపాయల విత్తనాలు:

ఆకుపచ్చ ఉల్లిపాయలు విత్తనాలు శీఘ్ర స్ఖలన సమస్యలు నివారించడానికి మరొక ఉత్తమ మార్గం. పురుషులలో లైంగిక సమస్యలను నివారించడానికి ఈ విత్తనాలు ఉత్తమమైన లక్షణాలను కలిగి ఉంటాయి. సాధారణంగా, వీలైనన్ని ఉల్లిపాయలు తీసుకోవడం ద్వారా మీ లైంగిక శక్తిని మరియు నియంత్రణను మెరుగుపరచుకోవచ్చు.

ఈ విత్తనాలను నలిపి, నీటితో బాగా కలపాలి. రోజులో మూడు సార్లు భోజనానికి ముందు ఈ నీటిని త్రాగాలి.

6.బెండకాయలు మరియు షుగర్ కాండీ:

6.బెండకాయలు మరియు షుగర్ కాండీ:

బెండకాయలు కొన్ని శక్తివంతమైన లక్షణాలను కలిగి ఉన్న కారణంగా శీఘ్రస్ఖలన సమస్యలను నివారించాగలదు.

పది గ్రాముల బెండకాయల వేరు పొడి మరియు 2 టీస్పూన్ల పంచదారను లేదా షుగర్ కాండీని పాలతో కలిపి తీసుకోండి

7.క్యారట్లు, గుడ్డు మరియు తేనె:

7.క్యారట్లు, గుడ్డు మరియు తేనె:

క్యారట్లు, తేనె మరియు గుడ్డు, ఈ మూడు పదార్థాలు శీఘ్ర స్ఖలన సమస్యను నిరోధించడానికి ఉత్తమమైనవి. తేనెను ఒక కామోద్దీపన ఆహారంగా పరిగణిస్తారు. లైంగిక సంపర్క సమయంలో, కణజాలంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు క్యారట్లు సహాయపడతాయి. తద్వారా శీఘ్ర స్ఖలన సమస్యలను తగ్గించవచ్చు. మరియు గుడ్డులోని పచ్చసొన పురుషుల టెస్టోస్టెరాన్ స్థాయిలు మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి.

సగం ఉడికించిన గుడ్డు(హాఫ్ బాయిల్డ్)ను తురిమిన క్యారెట్లతో తీసుకోండి. 3టేబుల్ స్పూన్ల తేనెను నేరుగా తీసుకోండి.

సుమారు మూడు నెలల పాటు రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా తీసుకోండి.

8.ఆస్పరాగస్:

8.ఆస్పరాగస్:

ఆస్పరాగస్ వేర్లు పురుచులలో శీఘ్ర స్ఖలన సమస్యను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఆస్పరాగస్ ఫోలేట్, విటమిన్-బి లో అధికంగా ఉంటుంది. ఇది హిస్టామిన్ యొక్క ఉత్పత్తిని పెంచుతుంది, ఇది పురుషులలో ఆరోగ్యకరమైన లైంగిక సామర్ధ్యానికి ముఖ్యమైనది.

ఒక గ్లాస్ పాలలో 3 నుండి 4 టేబుల్ స్పూన్లు ఆస్పరాగస్ పొడిని కలపండి.

ఈ మిశ్రమాన్ని ఒక రోజులో రెండుసార్లు త్రాగాలి.

9. పండ్లు మరియు లిబిడో సామర్ధ్యం పెంచే ఇతర ఆహారాలు :

9. పండ్లు మరియు లిబిడో సామర్ధ్యం పెంచే ఇతర ఆహారాలు :

అరటి వంటి పండ్లు, ఆకుకూరలు, క్యారెట్, ఫెన్నెల్ మరియు ఉల్లిపాయలు వంటి ఇతర పదార్ధాలు సహజ కామోద్దీపన ఆహారాలుగా ఉండి కామేచ్ఛను మరియు సహనశక్తిని పెంచే గుణాలను కలిగి ఉంటాయి. సలాడ్ల రూపంలో గానీ లేదా వంటలో గానీ వీటిని క్రమంగా చేర్చండి. ఓట్మీల్, సలాడ్లలో అరటి పండు జోడించడం ద్వారా, మరియు ఫెన్నెల్, సెలెరీ, ఉల్లిపాయలను వంటలో జోడించడం ద్వారా రోజూ వారీ ప్రణాళికలలో భాగంగా తీసుకోనవచ్చు.

10. వ్యాయామాలు:

10. వ్యాయామాలు:

శీఘ్ర స్ఖలన నివారణ కోసం మరొక గృహ చికిత్స వ్యాయామం. శ్వాస కు సంబంధించిన వ్యాయామాలు, యోగా, ధ్యానం ఇటువంటివి శరీరాన్ని ఉల్లాసంగా ఉంచడంతో పాటు, మానసిక, శారీరిక సమస్యలతో పాటు శీఘ్ర స్ఖలన సమస్యలను కూడా తొలగిస్తుంది. అంతేగాక, పబ్లోక్సైకిల్ కండరాలను పటిష్టపరచడం మరియు శీఘ్ర స్ఖలనాన్ని నియంత్రించడానికి వ్యాయామం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజులో కనీసం అరగంట వ్యాయమం చేయడం, వ్యాయామానికి తగ్గట్లు సమయాన్ని కేటాయించడం అన్నిటికన్నా ముఖ్యం. వ్యాయమoలో భాగంగా స్విమ్మింగ్, నడక, పరుగు, ఏరోబిక్స్ ను జోడించండి.

ఈ పై పద్దతులను, ఆహారపు అలవాట్లను అవలభించడం ద్వారా శీఘ్ర స్ఖలన సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఈ కథనం మీకు నచ్చినట్లయితే, భాగస్వామ్యం చేయండి!. ఇటువంటి ఆరోగ్య సంబంధిత వివరాల కోసం మా పేజీని తరచూ సందర్శిస్తూ ఉండండి.


English summary

How To Prevent Premature Ejaculation

Premature ejaculation is an inability to delay ejaculation until it's desirable for both the partners. It occurs before 1 minute of penetration and this is one of the most common sexual problems affecting men of all ages. The home remedies for premature ejaculation are ashwagandha, saffron & almonds, ginger & honey, garlic, carrots, eggs and honey, etc.
Story first published:Monday, May 21, 2018, 15:12 [IST]
Desktop Bottom Promotion