For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శరీరంలో ఇంఫ్లమేషన్ ను తగ్గించుకోవడానికి ఎనిమిది మార్గాలు

|

మీ శరీరం ప్రతీకూల పదార్థాలు, అల్లెర్జిన్లు లేదా విషపూరితమైన రసాయనాలతో సంపర్కం చెందినపుడు ఇమ్యునిటీ లేదా రోగనిరోధక శక్తి వాటితో పోరాడతాయి. దీని వలన కొన్ని శరీర భాగాలలో మంట(ఇంఫ్లమేషన్) కలుగజేస్తుంది.

ఈ ప్రతిచర్య శరీరానికి ఇన్ఫెక్షన్లు సోకకుండా, విష పదార్థాలు శరీరంలోకి ప్రవేశించకుండా మేలు చేస్తుంది. కానీ ఇది దీర్ఘకాలిక సమస్యగా పరిణామం చెందినపుడు, శరీరానికి హాని కలిగించి క్యాన్సర్ లేదా ఆటోఇమ్యూన్ వ్యాధులను కలుగజేస్తాయి.

మీరు కనుక శరీరంలో కలిగే ఈ ఇంఫ్లమేషన్ నుండి త్వరగా ఉపశమనం పొందాలంటే,మీ కొరకు ఎనిమిది మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.

 1. మీ ఆహారానికి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పదార్థాలను జోడించండి:

1. మీ ఆహారానికి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పదార్థాలను జోడించండి:

ఇంఫ్లమేషన్ వలన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అధికంగా విడుదల అవుతాయి. వీటివలన అవయవాలు వైఫల్యం చెందటం, వయసు పైబడిన ఛాయలు కనపడటం జరుగుతాయి. యాంటీఆక్సిడెంట్లు ఈ విషతుల్య పదార్థాలను శరీరం నుండి ఏరిపారేస్తాయి కనుక , అవి అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు ఆహారంలో తప్పక తీసుకోవాలి. వీటివలన ఇంఫ్లమేషన్ నుండి ఉపశమనం కలుగుతుంది.

2. మీ ఆహారం తయారీలో పసుపును వినియోగించండి:

2. మీ ఆహారం తయారీలో పసుపును వినియోగించండి:

మీరు కనుక భారతీయులు అయితే, ఈ సలహా మీకు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కానీ, పసుపును ఆహారంలో కలపడం వలన కలిగే లాభాలు ఏమిటో మీకు తెలుసా?

* పసుపు మంచి యాంటీఆక్సిడెంట్.

* పసుపులో సూక్ష్మజీవనాశక గుణాలు ఉంటాయి.

* ఇది మీ ఇమ్యునిటీ లేదా రోగనిరోధక శక్తి మరియు సామాన్య ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

మీరు కనుక ఆహారానికి లేదా కూరలకు పసుపును కలపడం ఇష్టపడనట్లైతే, ప్రతిరోజూ పడుకునే ముందు గ్లాసుడు పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

3. మీరు తాగే వైన్ గ్లాసులను లెక్కపెట్టండి:

3. మీరు తాగే వైన్ గ్లాసులను లెక్కపెట్టండి:

కొన్ని అధ్యయనాల ప్రకారం వైన్ కు ఇంఫ్లమేషన్ తగ్గించే గుణం ఉంటుంది. కానీ వైన్ గ్లాసుల సంఖ్య అధికమైనప్పుడు ఫలితం వ్యతిరేకంగా ఉంటుంది.

కనుక మీరు వైన్ తాగేటప్పుడు ఎన్ని గ్లాసులు తాగుతున్నారో మనసులో పెట్టుకోండి.

4. గ్రీన్ టీ తాగండి:

4. గ్రీన్ టీ తాగండి:

గ్రీన్ టీ లోతైన ఆరోగ్య సమస్యలను పరిష్కరించలేకపోయినప్పటికి , టీ మీ మనస్సుకు, శరీరానికి హాయినిచ్చి కొంతవరకు ఇంఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

5. ప్రోబయోటిక్ ఆహారాన్ని అధికంగా తీసుకోండి:

5. ప్రోబయోటిక్ ఆహారాన్ని అధికంగా తీసుకోండి:

ప్రోబయోటిక్ ఆహారములో మేలు చేసే బాక్టీరియా అధికంగా ఉంటాయి. ఇవి మన ఆహారనాళంలో ఆవాసం ఏర్పరుచుకుని వ్యాధి కారక బాక్టీరియా పెరుగుదలను అరికడతాయి. ఇవి ఆహారనాళ ఆరోగ్యాన్ని పెంపొందించి శరీరంలో ఇంఫ్లమేషన్ ను తగ్గిస్తాయి.

6. అనారోగ్యకర ఆహారానికి దూరంగా ఉండండి:

6. అనారోగ్యకర ఆహారానికి దూరంగా ఉండండి:

అనారోగ్యకర ఆహారమైన వేపుళ్ళు , మిఠాయిలు తినడం వలన శరీరంలో, ప్రత్యేకంగా మీ ఆహారనాళంలో దీర్ఘకాలిక ఇంఫ్లమేషన్ కలుగజేస్తాయి. కనుక, మీరు చాలా కాలం నుండి ఇంఫ్లమేషన్ తో బాధ పడుతున్నట్లైతే వీటిని అస్సలు తీసుకోకపోవడం ఉత్తమం.

7. సరిపడినంత నిద్రపోండి:

7. సరిపడినంత నిద్రపోండి:

సక్రమంగా పని చేయడానికి మీ మెదడుకు తగినంత నిద్ర అవసరం. మీరు కనుక పనులలో నిమగ్నమై లేక ఇతర ఒత్తిడుల వలన తగినంతగా నిద్రపోకపోతే మెదడులో ఇంఫ్లమేషన్ అధికమవుతుంది.

8. మీ మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి:

8. మీ మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి:

అధిక ఒత్తిడి మరియు ఆతృత వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తి మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవి కూడా దీర్ఘకాలిక ఇంఫ్లమేషన్ కు దారితీస్తాయి అని మీకు తెలుసా?

మీరు ఒత్తిడి మరియు క్రుంగబాటుకు లోనైనట్లైతే, వాటితోనే అనేక ఇతర ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. కనుక మీరు తక్షణ చికిత్స తీసుకోవడమో లేక ధ్యానం చేయడం ద్వారానో మానసిక శాంతిని పొందండి.

English summary

How To Reduce Inflammation In The Body Fast: 8 Tips

Want to know how to reduce inflammation in the body? Start by eating foods rich in antioxidants. Next, control the amount of alcohol you have, especially wine. Finally, get some good sleep at night and take care of your mental health.So, if you are wondering how to reduce inflammation in the body fast, here are 8 ways that will help you do that.
Desktop Bottom Promotion