For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భుజం నొప్పిని గృహవైద్య పరిష్కారాలతో ఎలా నివారించుకోవచ్చు?

భుజం నొప్పిని గృహవైద్య పరిష్కారాలతో ఎలా నివారించుకోవచ్చు?

|

భుజాల నొప్పి గాయాల వలన లేదా అనుకోకుండా జరిగిన ప్రమాదాల వల్ల కలుగుతుంది. ఆర్ధ్రైటీస్ వంటి కొన్ని అనారోగ్యాల వలన కూడా భుజం నొప్పి కలుగుతుంది. ఈ వ్యాసంలో మీకు భుజాల నొప్పిని ఇంట్లోనే కూర్చుని ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేస్తున్నాం.

భుజం నొప్పి మీ భుజం చుట్టూ ఉండే మరియు కండరాలు, లిగమెంట్లు లేదా టెండాన్లలో సంభవిస్తుంది. దీనికి ముఖ్య కారణం భుజము లోపల ఉండే కండరాలు, లిగమెంట్లు మరియు టెండాన్ల వంటి మృదు కణజాలాలకు కలిగే గాయాలు.

How To Treat Shoulder Pain At Home

భుజం నొప్పికి, ఆర్థరైటిస్, ఎముక స్పర్స్, నలిగిన మృదులాస్థి, విరిగిన భుజ ఎముక, వెన్నెముకలో గాయం, పెట్టేసిన భుజం మొదలైన అనారోగ్యాలు కూడా కారణమవుతాయి.

కొన్ని వ్యాధుల వలన మెడ భాగంలో సెర్వైకల్ స్పాండిలైటిస్ సమస్య తలెత్తుతుంది.

భుజం నొప్పి నివారణకు ఇంట్లో అనుసరించగలిగే గృహవైద్య చిట్కాలను మీకోరకు మేమిప్పుడు తెలియజేయబోతున్నాము.

1. పసుపు

1. పసుపు

భుజం నొప్పి నివారణకు పసుపు అత్యద్భుతమైన గృహవైద్య పరిష్కారం. పసుపులోని ఉండే కుర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపు మరియు నొప్పిని పోగొడతాయి.

2 టేబుల్ స్పూన్ల పసుపు మరియు 1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె కలిపి ముద్దగా చేయండి. దీనిని నొప్పిగా ఉన్న కాండరాలపై పూసుకుని ఆరనివ్వాలి.

2. అల్లం టీ

2. అల్లం టీ

అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, భుజాల వాపు మరియు నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాకుండా, అల్లం రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది.

1 టేబుల్ స్పూన్ అల్లం తరుగును 11/2 నుండి 2 కప్పుల నీటిలో వేసి 10 నిమిషాలు పాటు మరిగించండి.

వడగట్టి దీనికి తేనెను కలపండి.

ప్రతిరోజూ రెండు మూడు కప్పుల అల్లం టీ తాగండి.

3. యాపిల్ సిడర్ వెనిగర్

3. యాపిల్ సిడర్ వెనిగర్

భుజాల నొప్పిని ఎలా నివారించాలి? దీనికి యాపిల్ సిడర్ వెనిగర్ ఒక ప్రభావవంతమైన పరిష్కారం. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు క్షారీకరణ లక్షణాలు, నొప్పిని, వాపును తగ్గించే గుణం కలిగి ఉంటాయి.

ఒక గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ వడగట్టని యాపిల్ సిడర్ వెనిగర్ ను కలపండి. దీనికి కొంచెం తేనెను కలిపి రోజుకు రెండుసార్లు చొప్పున వారం రోజుల పాటు తాగండి.

4. లావెండర్ తైలం

4. లావెండర్ తైలం

లావెండర్ తైలం అలసిన కండరాలకు విశ్రాంతిని చేకూర్చే ఒక అత్యద్భుతమైన తైలం. ఇది కండరాల నొప్పి మరియు వాపును తగ్గిస్తుంది.

మీరు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల లావండర్ తైలం కలిపి ముప్పై నిమిషాలు పాటు అందులో నానండి.

మీరు కొన్ని చుక్కల లావెండర్ తైలాన్ని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వెచ్చని ఆలివ్ నూనెలో కలిపి మీ భుజానికి ఆ మిశ్రమంతో మర్దన చేసుకోండి.

5. మర్దన

5. మర్దన

భుజం నొప్పిని తగ్గించడానికి, మర్దన చేసుకోవడం ఒక ఉత్తమ మార్గం. మృదువుగా మర్దన చేసుకోవడం వలన భుజాల కండరాల బిగుతు సడలి ఒత్తిడి తగ్గుతుంది. దీనివలన రక్తప్రసరణ మెరుగై వాపు తగ్గుతుంది.

కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెను వేడి చేసి భుజానికి రాసుకోండి.

భుజాల వద్ద కండరాలను మృదువుగా పిసికితే, రక్తప్రసరణ ప్రేరేపింపబడుతుంది.

పది నిమిషాల పాటు మర్దన చేసుకుని భుజంపై వెచ్చని తువ్వాలను కప్పుకోండి.

6. హాట్ కంప్రెస్

6. హాట్ కంప్రెస్

హాట్ కంప్రెస్ కూడా భుజం నొప్పి మరియు వాపు యొక్క చికిత్సలో సహాయపడుతుంది. గాయం సంభవించిన 48 గంటల తరువాత మాత్రమే హాట్ కంప్రెస్ చేయాలి.

వేడి నీటి బ్యాగ్ ను నీటితో నింపి, దానితో 10 నుండి 15 నిమిషాలు పాటు భుజంపై ఒత్తండి. అంతేకాక, మీరు వేడి నీటి షవర్ కింద కొద్దిసేపు నిలబడి ఉండటం వల్ల కూడా ప్రయోజనం కలుగుతుంది.

7. కోల్డ్ కంప్రెస్

7. కోల్డ్ కంప్రెస్

కోల్డ్ కంప్రెస్ వలన కలిగే చల్లని ఉష్ణోగ్రత, భుజం నొప్పిని తెలియనివ్వకుండాజేసి తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది నొప్పి మరియు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఒక టవల్ లో కొన్ని మంచు ముక్కలను చుట్టి ఉంచండి.

దీన్ని మీ భుజంపై 10 నిమిషాలు ఉంచండి.

ఇలా కొన్ని రోజులపాటు, రోజుకు కొన్నిసార్లు తరచుగా చేస్తుండండి.

8. ఎప్సోమ్ ఉప్పుతో స్నానం

8. ఎప్సోమ్ ఉప్పుతో స్నానం

మెగ్నీషియం సల్ఫేట్ తో తయారు చేయబడిన ఎప్సోమ్ ఉప్పు నొప్పిని తగ్గిస్తుంది. ఇది భుజాలలోని కండరాల యొక్క ఒత్తిడిని తగ్గించి మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

మీ బాత్ టబ్ వెచ్చని నీటితో నింపి, 2 కప్పుల ఎప్సోమ్ ఉప్పును కలపండి.

దీనిని బాగా కలిపి అందులో మీరు 20 నుండి 25 నిముషాల వరకు నానండి.

ఇలా వారానికి మూడు సార్లు చేయండి.

మీ భుజం నొప్పి పుడుతున్నప్పుడు, మీరు ఎలా పడుకోవాలి?

మీ మెడ కింద ఒక దిండును పెట్టుకుని, ఒక వైపునకు తిరిగి పడుకోండి.

మీ నొప్పెడుతున్న మీ చేతికి ఆధారంగా, మడతపెట్టిన దిండును ఉపయోగించండి.

మీ వెనుక వైపుగా మరొక దిండు పెడితే, మీ శరీరం అటువైపుగా ఒరగదు.

English summary

How To Treat Shoulder Pain At Home

Shoulder pain occurs in the muscles, ligaments or tendons in and around your shoulder. The most common cause is injury to the soft tissues, including the muscles, tendons and ligaments within the shoulder.
Desktop Bottom Promotion