For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెన్ను నొప్పి ఉపశమనానికి అల్లం ఎలా సహాయపడుతుంది?

వెన్ను నొప్పి ఉపశమనానికి అల్లం ఎలా సహాయపడుతుంది?

|

ప్రజలు అధికంగా గురవుతున్న మరియు భాదపడుతున్న అత్యంత సాధారణ సమస్యలలో ఈ వెన్ను నొప్పి కూడా ఒకటని మీకు తెలుసా? కనీసం 30 మందిలో ఒక్కరైనా ఈ వెన్ను నొప్పితో ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నారని అంచనా వేయబడింది. వయసు, లింగ భేదం లేకుండా.

ముఖ్యంగా 40 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తులలో విస్తృతంగా ఈ వ్యాధి వ్యాపించి ఉంది. వ్యాధి అని కాదు కానీ, సగానికి సగం జీవన ప్రమాణాలు, జీవనశైలి, ఆహార ప్రణాళికలు ప్రధాన కారణంగా ఉన్నాయి.

How To Use Ginger For Back Pain Relief

ఎటువంటి శారీరిక నొప్పైనా అనగా, తలనొప్పి, కడుపు నొప్పి లేదా ఇతర భాగాలలో నొప్పి వంటి ఏ ఇతర నొప్పి కూడా ఒక వ్యక్తి జీవితాన్ని నిరాశపరచగలదని మనకు తెలుసు. ఇటువంటి సాధారణ నొప్పులు కూడా అనేక కార్యకలాపాలను అడ్డుకోగలదు, మరియు అసౌకర్యానికి దారితీస్తుంది.

నొప్పి యొక్క తక్కువ స్థాయి రూపాలు, కేవలం అసౌకర్యం మరియు అలసట వంటి సమస్యలకు కూడా కారణం కావచ్చు. ఒక చిన్న గోరు చుట్టు శరీరాన్నంతా ఎంతటి ప్రభావానికి గురిచేస్తుందో తెలియనిది కాదు. మరియు కొన్ని చిన్ని చిన్ని నొప్పులే దీర్ఘకాలిక నొప్పులుగా పరిణమించి వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవలసిన అవసరాలను కూడా కలిగిస్తుంటాయి.

వెన్నునొప్పికి ప్రధాన కారణాలు ప్రధానంగా వయస్సు, కాల్షియం లోపం, బోలు ఎముకల వ్యాధి, అధిక బరువు లేదా ఊబకాయం, గాయాలు, శస్త్రచికిత్సలు, వెన్నెముక సంక్రమణ వ్యాధులు మొదలైనవిగా ఉన్నాయి. క్రమంగా ఎముకలు బలహీనపడడం మూలంగా వెన్ను నొప్పి కలిగే సూచనలు ఉన్నాయి కూడా.

వెన్నునొప్పికి కారణం ఏమైనప్పటికీ, జీవితంలో దీని ప్రభావం మాత్రం అత్యంత ప్రతికూలంగా ఉంటుంది.

వెన్నునొప్పి, తేలికపాటిది అయినా, తీవ్రంగా ఉన్నా, భౌతిక కార్యాచరణలకు ప్రధాన అడ్డంకిగా పరిణమిస్తుంది. ఉదాహరణకు నడవడం, పరుగు, వ్యాయామం చేయడం వంటి వాటికే కాకుండా ఒక్కోసారి కదలడానికి, తిరగడానికి కూడా సమస్యగా ఉంటుంది.

క్రమంగా జీవితాన్ని నడపడం కష్టతరం చేస్తుంది, ఎందుకంటే వెన్నునొప్పితో బాధపడుతున్న వ్యక్తికి నిరంతరం మరొకరి సహాయం అవసరమవుతుంది.

కావున, ప్రజలు వారి వెన్నునొప్పిని తగ్గించగలిగేలా చేయగలిగే ప్రతి అంశాన్ని పాటించడానికి సిద్దంగా ఉంటారు. మరియు సహజరీతిలో తగ్గాలని భావిస్తుంటారు. వెన్నునొప్పి యొక్క రకాన్ని బట్టి, సాధారణంగా శస్త్రచికిత్సలు, ఫిజియోథెరపీ మరియు పెయిన్ కిల్లర్లు చికిత్సగా సూచించబడతాయి.

అయినప్పటికీ, పెయిన్ కిల్లర్లను తీసుకోవడం వలన మీ కాలేయ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు మరియు సుదీర్ఘకాలంలో పూర్తిగా వాటిమీదనే ఆధారపడవలసి ఉంటుంది. అందువల్ల, పెయిన్ కిల్లర్స్ కాకుండా, నొప్పిని తగ్గించడానికి సహజ సిద్దమైన పద్దతులపై, లేదా గృహ వైద్యానికి ఆధారపడటం మంచిది.

మన సొంత పెరడులో మరియు వంటగదిలో కనిపించే పలు సహజ పదార్ధాలు చికిత్సకు దోహదపడేవిలా ఉన్నాయి. అవి నొప్పితో సహా, రోగాలకు సైతం చికిత్స చేయగలవు. ఆ క్రమంలో భాగంగానే అల్లం కూడా ఎంతగానో సహాయం చేస్తుందని మీకు తెలుసా? మరియు, నొప్పిని తగ్గించడమే కాకుండా శాశ్వత నివారణలో కూడా గొప్ప చికిత్సగా ఉపయోగపడుతుందని తెలుసా? ఎలాగో, క్రింది వ్యాసంలో తెలుపబడింది.

How To Use Ginger For Back Pain Relief

అల్లం మరియు దాని ఔషధ గుణాలు:

మనలో చాలామంది పురాతన ఆయుర్వేద భారతీయ వైద్య వ్యవస్థ గురించిన అవగాహన కలిగి ఉన్నారు, వ్యాధులు నిరోధించడానికి మరియు చికిత్స కోసం సహజ నివారణా పద్దతులను కలిగి ఉన్న గొప్ప శాస్త్రంగా ఆయుర్వేదం ఉంది.

వాస్తవానికి, అనేకములైన ఆయుర్వేద నివారణా మార్గాలు సైన్స్ చేత కూడా సమర్ధించబడుతున్నాయి, మరియు సమర్థవంతమైనవిగా నిరూపించబడ్డాయి కూడా.

అల్లం, అనారోగ్య నివారణలలో మంచి గృహవైద్యంగా అత్యంత ప్రజాదరణ పొందిన వంటింటి పదార్ధంగా ఉంది. అనేక వ్యాధుల చికిత్సలోనే కాకుండా వ్యాధుల నివారణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది అల్లం.

మీ వంటకాలకు గొప్ప రుచిని జోడించడంతోపాటు, జీర్ణ వ్యాధులు, మలబద్ధకం, కడుపు నొప్పి, వికారం మొదలైన అంశాల చికిత్సలో ప్రధానంగా సహాయం చేస్తుంది. అల్లం అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది, ఊబకాయం తగ్గించడంలో సహాయం చేస్తుంది మరియు క్యాన్సర్ వంటి రోగాలని నిరోధించడంలో కూడా సహాయం చేస్తుంది.

అయితే, అల్లం వెన్ను నొప్పిని తగ్గించే సామర్థ్యం కూడా కలిగి ఉన్నదని అతి కొద్దిమందికే తెలిసిన నిజం.

How To Use Ginger For Back Pain Relief

అల్లంలో నొప్పిని తగ్గించే లక్షణాలు:

అల్లం జింజరోల్, పోలిఫెనోల్స్, ఫ్లేవనోయిడ్స్ మరియు టానిన్లు వంటి శక్తివంతమైన సమ్మేళనాలలో పుష్కలంగా ఉంటుంది. అదనంగా, అల్లం అనామ్లజనకాలు మరియు విటమిన్-సి ని కలిగి ఉంటుంది.

అల్లం పైన పేర్కొన్న అన్నీ అంశాల కలయిక మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. వాపు మరియు నొప్పి తగ్గించే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

ఇటీవల మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశోధనా అధ్యయనంలో, రోజుకు కనీసం 2-4 గ్రాముల అల్లం తినడం ద్వారా, వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చని తేలింది.

అల్లంలోని నొప్పి తగ్గించే లక్షణాలు వెన్నునొప్పితో భాదపడుతున్న వారికి, ఒక అద్భుతమైన సహజ సిద్దమైన పరిహారంగా ఉంది. మరియు పూర్తి సహజ సిద్దమైన సమ్మేళనాలను కలిగి ఉన్న కారణాన దుష్ప్రభావాలు గురించిన ఆందోళన అవసరం లేదు.

అయినప్పటికీ, ఆరోగ్యవంతమైన ఆహార ప్రణాళిక, సాధారణ వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం కూడా వెన్ను నొప్పి చికిత్సకు సమర్థవంతంగా సహాయపడగలవు .

How To Use Ginger For Back Pain Relief

తయారీ పద్ధతి:

2-4 గ్రాముల శుభ్రం చేసిన తాజా మరియు తురిమిన అల్లం తీసుకోండి, ఆపై మీ భోజనానికి జోడించండి. పాలు, టీ లేదా వేడి నీటిలో కూడా జోడించి తీసుకోవచ్చు. ద్రవ రూపంలో, నీటిలో తేనెతో కలిపి తీసుకోవచ్చు కూడా.


గమనిక: మీ వెన్నునొప్పి తీవ్రంగా ఉన్న ఎడల, మరియు గాయాలు లేదా సంక్రమణ రోగాల సమస్యలు ఉంటే, వెంటనే వైద్య సహాయాన్ని తీసుకోవాలి, ఆపై అల్లం కూడా మీకు చికిత్సలో సహాయపడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి , ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How To Use Ginger For Back Pain Relief

Any type of body pain can make life harder for people, as it can cause a lot of discomfort, fatigue & restrict activities. Back pain is one such common type of pain which is experienced by many due to various root causes. Pain killers can harm your health in the long run. Ginger is a natural remedy for back pain which you can consume with hot water or tea.
Desktop Bottom Promotion