For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొలెస్ట్రాల్ సమస్యతో భాధపడుతున్నారా? అయితే మీ ఆహార ప్రణాళికలో ఈ పండ్లను చేర్చండి.

కొలెస్ట్రాల్ సమస్యతో భాధపడుతున్నారా? అయితే మీ ఆహార ప్రణాళికలో ఈ పండ్లను చేర్చండి.

|

ఈరోజుల్లో, అధిక కొలెస్ట్రాల్ మరియు దానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య అసాధారణంగా పెరుగుతూ ఉంది. దీనికి కారణాలు అనేకం ఉండవచ్చు. కానీ దీని చికిత్సకు జీవనశైలిలో మార్పులు తీసుకుని రావడం ఎంత ముఖ్యమో, ఆహారంలో మార్పులు కూడా అంతే ముఖ్యం. ఒక్కోసారి అవసరాన్ని బట్టి వైద్యుని సంప్రదించి మందులు కూడా తీసుకోవలసిన పరిస్థితులు వస్తుంటాయి.

మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నా, లేదా మీరు కొలెస్ట్రాల్ బారిన పడకూడదు అని భావిస్తున్న ఎడల, మీ రోజువారీ జీవితంలో కొన్ని అంశాలను జోడించడం లేదా మార్పులు చేయడం ద్వారా, ఖచ్చితంగా కొలెస్ట్రాల్ను నియంత్రించగలరు.

Include These Fruits In Your Diet To Control Cholesterol

ఆసక్తికరంగా, కొలెస్ట్రాల్ తగ్గించే క్రమంలో ఉత్తమ ఫలితాలకై ఆహారంలో చేర్చదగిన కొన్ని పండ్లు కూడా ఉన్నాయి.

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?

టెస్టోస్టెరోన్ మరియు ఈస్ట్రోజెన్ వంటి వివిధ హార్మోన్లను నిల్వ చేసుకునే కణ త్వచ నిర్మాణంలో శరీరానికి అవసరమయ్యే ఒక రసాయన సమ్మేళనమే కొలెస్ట్రాల్.

శరీరంలోని 80% కొలెస్ట్రాల్ కాలేయం చేత ఉత్పత్తి చేయబడుతుంది, మిగిలినవి పాలు మరియు పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం మొదలైన ఆహార పదార్ధాల ద్వారా వస్తుంది. కొన్ని నిర్దిష్టమైన మొక్క ఆధారిత ఆహారాలు కొలెస్ట్రాల్ కలిగి ఉండవు.

1.ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక -

1.ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక -

ఆరోగ్యకర కొవ్వులకై మీ ఆహారప్రణాళికలో తక్కువ కొవ్వు కలిగిన పాల పదార్ధాలు మరియు తక్కువ కొవ్వు కలిగిన మాంసాహారం, ఆలివ్ నూనె, మొదలైన వాటిని చేర్చండి మరియు రెడ్ మీట్, పాల ఉత్పత్తులు, మొదలైన వాటిలో సంతృప్త కొవ్వులని(సాచురేటేడ్ )నివారించండి. అలాగే వేయించిన ఆహారాలు, కేకులు, కుకీలలో మొదలైనవి కూడా తగ్గించండి.

సులభంగా జీర్ణమయ్యే, ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోండి. ఇవి అన్నవాహిక, కొలెస్ట్రాల్ ను గ్రహించడానికి అనుమతించవు. పండ్లు మరియు కూరగాయలు, ఒమేగా-3 అధికంగా ఉండే చేపలు మీ ఆహార ప్రణాళికలో చేర్చుకోవడం మంచిది మరియు ఉప్పు వినియోగం తగ్గించాలి.

2.వ్యాయామం-

2.వ్యాయామం-

రోజూ కనీసం ఒక్క గంటైనా వ్యాయామం చేయటానికి సమయాన్ని కేటాయించడం మంచిది. వ్యాయామం చెడు కొలెస్ట్రాల్ తగ్గుదలలో సహాయపడుతుంది. వేగంగా నడవడం, మెట్ల పైకి ఎక్కి దిగడం, క్రీడలు, స్విమ్మింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, యోగా మొదలైనవి చేయడం మంచిది.

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం, సరైన బరువును కలిగి ఉండడం కొలెస్ట్రాల్ స్థాయిలను ఆరోగ్యంగా ఉంచగలిగే ప్రధాన అంశాలు. కనీసం 10-15 నిమిషాల శారీరక శ్రమను రోజులో కనీసం ఒకటి లేదా రెండుసార్లు చేర్చడం ద్వారా కొలెస్ట్రాల్ పెరుగాకుండా జాగ్రత్తపడవచ్చునని వైద్యులు సూచిస్తుంటారు.

3.ధూమపానం శ్రేయస్కరం కాదు-

3.ధూమపానం శ్రేయస్కరం కాదు-

ధూమపానం అలవాటు హెచ్.డి.ఎల్ పెరుగుదలను నియంత్రిస్తుంది మరియు క్రమంగా గుండె సమస్యలు అధికమవుతాయి. కావున ధూమపానానికి చెక్ పెట్టడం అన్నివిధాలా మంచిది.

4.మద్యం వినియోగం తగ్గించండి–

4.మద్యం వినియోగం తగ్గించండి–

మద్యానికి వీలైనంత దూరంగా ఉండేలా ప్రయత్నించాలి. లేని పక్షాన అధిక ఎల్.డి.ఎల్ కొలెస్టరాల్ పెరుగుటలో ప్రభావం చూపిస్తుంది.

5. వైద్య చికిత్స-

5. వైద్య చికిత్స-

కొన్ని సందర్భాల్లో, అధిక కొలెస్ట్రాల్ తగ్గించే దిశగా, పరిస్థితులు తీవ్రమైన పక్షాన వైద్యుని సంప్రదించాల్సి వస్తుంది కూడా. వైద్యునిచే సూచించబడిన మందులను జీవనశైలి మరియు ఆహారం మార్పులతో తేడాలు రాకుండా, క్రమం తప్పకుండా తీసుకోవాలి.

కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచడానికి ఏ పండ్లు తీసుకోవాలి?

కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచడానికి ఏ పండ్లు తీసుకోవాలి?

1.టొమాటో

2.బొప్పాయి

3.యాపిల్స్

4.సిట్రస్ ఫలాలు

5.అవకాడోలు

6.స్ట్రాబెర్రీలు

7.ద్రాక్ష

• టొమాటో:

• టొమాటో:

కొలెస్ట్రాల్ తగ్గించుటలో, హృదయ సంబంధిత సమస్యలు, లేదా అధిక రక్తపోటు తగ్గించడం కోసం టొమాటో చక్కని ఎంపికగా ఉంటుంది. ఇవి విటమిన్ ఏ, బి, సి, మరియు విటమిన్-కె లో అధికంగా ఉంటాయి. ఇవి కళ్ళకు, గుండెకు మరియు చర్మానికి కూడా మంచి ప్రయోజనాలను అందిస్తుంది. రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా ఆహారంలో వీటిని చేర్చడం అన్నిటా ఉత్తమం.

• బొప్పాయి:

• బొప్పాయి:

ఈ పండులో అద్భుతమైన ఫైబర్ కంటెంట్ ఉండడమే కాకుండా జీరో కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. ఇది ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ నియంత్రించడంలో మరియు రక్తపోటును తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, ఒక పెద్ద బొప్పాయి (సుమారు 750 గ్రాములు) సుమారు 14 గ్రాముల ఫైబర్ కలిగి ఉంటుంది, ఇది శరీరానికి చక్కగా సరిపోతుంది. మీరు మీ సలాడ్లో కానీ ముడి రూపంలో కానీ ఒక మిల్క్ షేక్ రూపంలో అయినా బొప్పాయిని తీసుకోవచ్చు.

• యాపిల్స్:

• యాపిల్స్:

రోజుకో ఆపిల్ వైద్యుని దూరంగా ఉంచుతుంది! అని నానుడి. సరిగ్గా చెప్పాలంటే, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించగల సామర్ధ్యంతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ఆపిల్ నిండి ఉంటుంది. ఆపిల్లోని ప్రతిక్షకారిణి అయిన పాలీఫెనోల్స్ మరియు పెక్టిన్ ఫైబర్ ఉండటం వలన ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.

•సిట్రస్ పండ్లు:

•సిట్రస్ పండ్లు:

నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో హెస్పెరిడిన్ నిల్వలు ఉండటం వలన హైపర్ టెన్షన్ తగ్గుతుంది. మరియు పెక్టిన్ ఫైబర్ ఇవి ధమనులు గట్టిపడేందుకు అనుమతించవు క్రమంగా చెడు కొలెస్ట్రాల్ ఎల్.డి.ఎల్ తగ్గుముఖం పడుతుంది. సిట్రస్ పండ్లు రోజూ తినడం మూలంగా కొలెస్ట్రాల్ సమస్య నిరోధించవచ్చు.

• అవకాడోస్:

• అవకాడోస్:

అధిక రక్తపోటు ఉన్న రోగుల చికిత్సలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. అవి మోనోసాచురేటేడ్ కొవ్వులు మరియు విటమిన్-సి, బి5, బి6,ఇ మరియు కె నిల్వలను కలిగి ఉంటాయి. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, స్ట్రోక్ అవకాశాలను తగ్గించటానికి మరియు ఎల్.డి.ఎల్ మరియు హెచ్.డి.ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో సహాయం చేస్తాయి.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీలో పెక్టిన్ ఫైబర్ నిల్వలు అధికంగా ఉంటాయి. మరియు ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి అద్భుతమైన ఎంపికగా ఉంటుంది.

• ద్రాక్ష:

• ద్రాక్ష:

ఇవి పెక్టిన్ ఫైబర్ తో పాటు ప్టెరోస్టిల్బెనే కాంపౌండ్స్ కలిగివుంటాయి, ఇవి అధిక ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను మరియు శరీరంలో ట్రైగ్లిజెరైడ్లను తగ్గించగలవు.

మన శరీరంలోని ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడం సులభమైన విషయమే, కాకపోతే సరైన అలవాట్లను లేదా జీవనశైలిని పాటించవలసి ఉంటుంది.

English summary

Include These Fruits In Your Diet To Control Cholesterol

Nowadays, we get to read and hear about a lot of people suffering from high cholesterol and issues related to it. The reasons could be many, and the treatment would majorly involve making changes to the lifestyle and diet, sometimes along with a doctor-prescribed medication.If your cholesterol level is high, or you don't want it to be high, you could ensure some regular habits in your daily life that would definitely help keep the cholesterol in control.
Desktop Bottom Promotion