For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్కహాల్ గురించి ఆసక్తికరమైన ఈ వాస్తవాలు మీకు తెలుసా!

ఆల్కహాల్ గురించి ఆసక్తికరమైన ఈ వాస్తవాలు మీకు తెలుసా!

|

నేటి కాలంలో మద్యమనేది విరామాలలో ఆస్వాదించే పానీయంగా మారిపోయింది, కొంత మొత్తంలో మీరు మద్యమును తీసుకోవటమనేది చాలా సాధారణమైన విషయం. మీరు మద్యం తాగే అలవాటును కలిగి ఉన్నట్లయితే భవిష్యత్తులో మీరు క్యాన్సర్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అయితే కొద్ది మొత్తంలో మద్యాన్ని తీసుకునేవారికి ఈ క్యాన్సర్ వస్తుందా? లేదా? అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.

చాలామంది ఆరోగ్యమైన ఆహారాన్ని తింటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వారి శరీరంలోని విష రసాయనాలు వ్యాప్తిచెందకుండా ఉండటంవల్ల క్యాన్సర్ కణాల బారిన పడకుండా ఉంటారు. కానీ వాస్తవానికి, మీరు ఈ మధ్యపానాన్ని అధికంగా కలిగి ఉన్నట్లయితే అది మీకు క్యాన్సర్ని కలుగజేయవచ్చు.

Interesting Facts About Alcohol You Need to Know!

PLOS మెడిసిన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో 9 సంవత్సరాల పాటు మద్యపాన అలవాట్లను కలిగి ఉన్న 99,000 మంది వయోజనులు పాల్గొన్నారు. రోజుకి 2-3 గ్లాసుల ఆల్కహాల్ను తీసుకునేవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాద తీవ్రత బాగా పెరిగింది.

ఈ అధ్యయనం చిట్టచివరిలో, మొత్తం క్యాన్సర్ బాధితుల్లో మద్యపానం కారణంగా 5 నుంచి 6 శాతం మంది ప్రజలు కాన్సర్ బారిన పడుతున్నారని గుర్తించబడింది. PLOS మెడిసిన్ అందించిన నివేదిక ప్రకారం, ఒక వారంలో 3 గ్లాసుల మద్యం తీసుకోవడం చాలా ఆరోగ్యకరమైనదే, కానీ అంతకుమించి మీరు మద్యాన్ని తీసుకున్నట్లయితే అది మీకు మరిన్ని ప్రతికూల ప్రభావాలను కలుగజేసేదిగా ఉంటుంది.

తక్కువ మోతాదులో తీసుకునే మద్యం ఆరోగ్యకరమా ?

తక్కువ మోతాదులో తీసుకునే మద్యం ఆరోగ్యకరమా ?

వారానికి కేవలం 1-3 గ్లాసుల మద్యాన్ని సేవించేవారిలో క్యాన్సర్ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఈ అధ్యయనంలో కనుగొనబడింది.

అయితే, విస్కాన్సిన్ కార్బోన్ క్యాన్సర్ విశ్వవిద్యాలయంలో, నోయెల్ LoConte, MD గా పని చేస్తున్న ఒక ఆంకాలజిస్ట్ వాదన ప్రకారం, మద్యాన్ని సేవించేవారిలో క్యాన్సర్ తగ్గే ప్రమాదం 0 (జీరో) గా ఉండదని అతను అభిప్రాయపడ్డాడు.

ఈయన తెలియపరచిన అధ్యయనం ప్రకారం, ఏ చిన్న మొత్తంలో కూడా మద్యపానాన్ని ప్రోత్సహించకూడదని పేర్కొన్నారు. తక్కువ మొత్తంలో మద్యాన్ని సేవించేవారిని - ఎక్కువ మొత్తంలో మద్యాన్ని సేవించేవారితో పోలిస్తే, తక్కువ మొత్తంలో మద్యాన్ని సేవించేవారి గుండెకు ఇది సహాయకారిగా ఉంటూ, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తీవ్రత తక్కువగా ఉంటుందే గానీ, అధిక మొత్తంలో మద్యాన్ని సేవించేవారిలో ఉన్నంత క్యాన్సర్ ప్రమాద తీవ్రత మాత్రం ఉండదని చెప్పారు.

మద్యం వల్ల కలిగే ప్రయోజనాలు :-

మద్యం వల్ల కలిగే ప్రయోజనాలు :-

తక్కువ మద్యం సేవించే వారిని - అసలు మద్యం సేవించని వారితో పోలిస్తే బలమైన ఎముకలు, మెరుగైన రోగనిరోధక శక్తిని & తక్కువ డయాబెటిస్ ప్రమాదాన్ని కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది.

తక్కువ మోతాదులో ఆల్కహాలను తీసుకోవడం వల్ల అది మీ గుండెను కాపాడుతుందనేది ప్రధాన కారణం ! 2015 లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, కొరోనరీ ఆర్టరీ వ్యాధుల నుంచి గుండెను కాపాడటానికి, తక్కువ మోతాదులో మీరు తీసుకునే మద్యానికి సంబంధం కలిగి ఉందని వెల్లడించబడింది.

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఎలా ఉంటామో ఇప్పుడు మనం తెలుసుకుందాం :-

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఎలా ఉంటామో ఇప్పుడు మనం తెలుసుకుందాం :-

పరిమితమైన మోతాదులో ఆల్కహాల్ను రోజుకి, వారానికి తీసుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి లాభదాయకంగా ఉండటమే కాక, మీకు ఎలాంటి హానిని కలుగజేయదు.

అమెరికన్స్ డైటరీ గైడ్లైన్స్ ప్రకారం, స్త్రీలు రోజుకు ఒక గ్లాసు ఆల్కహాల్ను & పురుషులు రోజుకు రెండు గ్లాసుల ఆల్కహాల్ను మాత్రమే తీసుకోవాలి. ఈ మోతాదుకు మించి ఎక్కువ ఆల్కహాలు తీసుకోవడం వల్ల మీకు కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ఇతర అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.

ఒక పరిశోధనలో చెప్పినదాని ప్రకారం, అతిగా మద్యం సేవించడం వల్ల మీ ప్రేగులలోకి బ్యాక్టీరియా లీక్ కారణం కావచ్చు, అలా చివరికి అది మీ శరీరంలోకి విషవ్యర్థాల స్థాయిని పెంచి మీ రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది తద్వారా మీరు త్వరగా జబ్బుపడతారు.

సిఫారసు చేయబడిన మోతాదు ప్రకారం, పురుషుల కంటే మహిళలు తక్కువ మద్యాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మహిళలకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఇది రెండు లింగాల శరీర పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఒకే వయస్సులో ఉన్న స్త్రీల కంటే పురుషులు ఎక్కువ బరువు కలిగి ఉంటారు, అంతేకాకుండా పురుషులు వారి శరీరంలో తక్కువ నీటిని కలిగి ఉంటారు.

ఈ మద్యపానం ప్రభావం కారణంగా పురుషుల కంటే స్త్రీల శరీరం చాలా బలహీనంగా మారతారు. ఎందుకంటే మద్యంలో ఉన్న విష రసాయనాలు పురుషుల కంటే మహిళల పైన ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

మీరు తీసుకునే మద్యం మీ ఆరోగ్యానికి పరిరక్షిస్తుందని ఎలా నిర్ధారిస్తారు ?

మీరు తీసుకునే మద్యం మీ ఆరోగ్యానికి పరిరక్షిస్తుందని ఎలా నిర్ధారిస్తారు ?

* రోజుకి 2,3 డ్రింక్స్ కి మించి ఆల్కహాల్ ను తీసుకోకూడదు. అంతకు మించి తీసుకుంటే మీకు గుండెజబ్బులు & క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.

* క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి, స్త్రీలు రోజుకు 1 డ్రింకును & పురుషులు రోజుకు 2 డ్రింకులకు మాత్రమే పరిమితం కండి. ఈ పరిమితిని మీరు ఇలాగే కొనసాగించండి. మీ స్నేహితులతో కలిసి ఎక్కువ రోజులు మధ్య పనులు చేయడానికి ప్రయత్నించవద్దు.

* ఒక డ్రింకు అనగా 12 ఔన్సుల బీరు, 5 ఔన్సుల వైన్ (లేదా) 1.5 ఔన్సుల లిక్కర్.

BMJ నివేదికలో ఒక అధ్యయనం ప్రకారం గత 25 సంవత్సరాలలో వైన్ యొక్క సగటు పరిమాణం రెట్టింపు అయింది.

మీరు తక్కువగా తాగటాన్ని ఎలా నిర్ధారించాలి?

మీరు తక్కువగా తాగటాన్ని ఎలా నిర్ధారించాలి?

పెద్ద వైన్ గ్లాసును కొనే కన్నా చిన్నవాటిని కొనండి. మీరు రెండవ సారీ మద్యాన్ని కొనసాగించేటప్పుడు మీ పరిమితిని అలానే కొనసాగించేలా చేస్తుంది. అందుకోసం మీరు మరింత నెమ్మదిగా తాగాలి.

ఒక సర్టిఫికేట్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ మరియు రెసిపీ డెవలపర్ ప్రకారం, మీ మద్యాన్ని కాక్టెయిల్గా మార్చడం వలన మీరు తక్కువ త్రాగడానికి & మీ గ్లాసులో ఎక్కువ కాలంగా వుండటానికి సహాయపడుతుంది. ఒక కాక్టెయిల్తో మీరు ఒక పూర్తి గ్లాసు మద్యాన్ని ఆస్వాదించిన అనుభూతిని కలిగి ఉంటారు.

కాక్టెయిల్ను తయారుచేయడానికి చక్కెర-లేని నీటిని తీసుకోండి, అలాగే పుదీనా, రోజ్మేరీ (లేదా) లావెండర్ వంటి తాజా మూలికలను ఉపయోగించుకోండి. మీరు రుచిని మెరుగుపర్చాలని కోరుకుంటే తాజాగా పిండిన పండ్ల రసాలను కూడా ఉపయోగించవచ్చు.

ఆరోగ్యకరమైన మద్యపానానికి పాటించవలసిన చిట్కాలు :-

ఆరోగ్యకరమైన మద్యపానానికి పాటించవలసిన చిట్కాలు :-

* మీరు తీసుకునే మద్యం పరిమానాన్ని నిర్ధారించుకోండి.

* వైన్ని తాగేటప్పుడు చిన్న గ్లాసులను ఉపయోగించండి. పెద్ద గ్లాసులయితే మిమ్మల్ని ఎక్కువ తాగడానికి ప్రేరేపిస్తాయి.

* మీ క్లాసులో మద్యము ఎక్కువగా ఉంచేందుకు కొంత నీటిని జోడించాలి.

నిర్ణీతమైన మోతాదులో మద్యాన్ని తీసుకోవడం ఏమాత్రం హానికరం కాదు. అంతకుమించిన ఎక్కువ మోతాదును తీసుకోవడం వల్ల మీరు అనారోగ్యకరమైన వ్యాధులు సంక్రమించే అవకాశాలను ఎక్కువ శాతం వరకూ కలిగి ఉంటారు.

English summary

Interesting Facts About Alcohol You Need to Know!

Alcohol has wide-ranging effects in the body. There are purported benefits, as well as pitfalls, to consuming alcohol. Once it enters your system, it triggers immediate physiological changes in the brain, heart, and liver, among other organs. Over time, these changes can lead to long-term health complications if you’re drinking too much.
Story first published:Sunday, July 15, 2018, 12:18 [IST]
Desktop Bottom Promotion