For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆచరణయోగ్యమైన 10 ఆరోగ్యకర అలవాట్లు

|

మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం అని మనకందరికీ తెలిసిందే! మహిళల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక మరియు ఆర్ధిక విజయాలకు చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుని ఘనంగా జరుపుకుంటారు.

స్త్రీలు హుందాతనానికి ప్రతీకలు. వారు ప్రతి వ్యక్తి జీవితాన్ని ఉత్సాహంతో నింపుతారు. కానీ, అటువంటివారు జీవితంలో వ్యక్తిగత బాగోగుల విషయంలో వెనకబడిపోతే ఎలా?

కొన్ని పరిశోధనలలో తేలినదేమిటంటే, స్త్రీలు తమ జీవనసరళిలో అతిసులువైన మార్పులు చేసుకోవటం వలన మెరుగైన శారీరక మరియు మానసిక ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు.

చిన్న చిన్న దురవాట్లయినా కానీయండి లేక ప్రతికూల ఆలోచనలు అయినా కానీయండి, స్త్రీల ఆరోగ్యంపై అత్యంత దుష్పరిణామాలు చూపిస్తాయి. పురుషులతో పోల్చి చూసినట్లయితే, స్త్రీల దైనందిన కార్యక్రమాలకు

అంతు ఉండదు. కనుక వారు తమ ఆరోగ్యం మరియు శారీరక ధారుఢ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

కనుక స్త్రీలు కొన్ని మంచి అలవాట్లను తమ జీవితంలో భాగం చేసుకోవాలి. అటువంటి కొన్ని మంచి అలవాట్లు మీ కోసం!

1. ప్రతిదినము అల్పాహారం తప్పనిసరి:

1. ప్రతిదినము అల్పాహారం తప్పనిసరి:

స్త్రీలు దృఢంగా ఉండటానికి ప్రతిరోజు తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవడం చాలా అవసరం. పోషకాలతో కూడిన అల్పాహారాన్ని తినడం వల్ల మన దైనందిన కార్యకలాపాలకు అవసరమయ్యే శక్తి లభించి జీవక్రియ మెరుగవుతుంది. మీ ప్రొద్దుటి ఆహారంగా గుడ్లతో పాలకూర లేదా ఆకు కూరలు మరియు కూరగాయలతో చేసిన స్మూథీ తీసుకోవచ్చు.

2. ప్రోటీన్లతో కూడిన చిరుతిళ్ళు తినండి:

2. ప్రోటీన్లతో కూడిన చిరుతిళ్ళు తినండి:

ఆరోగ్యవంతమైన జీవితానికి ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి సమతులాహారం తీసుకోవాలి. డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకోకుండా ఆకలి కలిగినప్పుడల్లా తినాలి. ఆరోగ్యకరమైన కొవ్వులున్న, ప్రోటీన్లతో కూడుకున్న చిరుతిళ్ళు తినండి.

3. చైతన్యవంతులుగా ఉండడానికి వైవిధ్యమైన మార్గాలను ఎంచుకోండి:

3. చైతన్యవంతులుగా ఉండడానికి వైవిధ్యమైన మార్గాలను ఎంచుకోండి:

మనం లిఫ్ట్ బదులుగా మెట్లమార్గం వాడుతూ లేదా పొద్దుట, సాయంత్రం బ్రిస్క్ వాక్ కు వెళ్తూ ఆరోగ్యం పెంపొందించుకోవాలి. అలాగే ఇంటి సరుకులు కొనడానికి వెళ్ళేటప్పుడు, వాటిని మీరే మోయండి. ఇలా చేయడం వల్ల మీ బైసెప్స్ కు మంచి ఆకృతి చేకూరుతుంది.

4. సరైన నిద్ర ముఖ్యం:

4. సరైన నిద్ర ముఖ్యం:

మంచి ఆరోగ్యానికి పోషకాహారం మాత్రమే కాదు కంటి నిండా నిద్ర కూడా అవసరమే! మీరు అవసరమైనంత సమయం నిద్ర పోకపోతే కనుక నీరసం ఆవరించి, మీరు చికాకుపడటమే కాకుండా మీ చుట్టుపక్కల వారిని కూడా చికాకు పెడతారు.

5. కెఫిన్ వినియోగాన్ని తగ్గించండి:

5. కెఫిన్ వినియోగాన్ని తగ్గించండి:

రోజంతా తగు మొత్తంలో నీటిని తాగుతుండటం వలన శారీరక దృఢత్వం పెరుగుతుంది. కాని కొంతమంది నీటికి బదులుగా కప్పుల కొద్దీ కాఫీ మరియు టీలతో గడిపేస్తారు. ఇలా చేయడం వలన శరీరం నీటిని కోల్పోయి తీవ్ర పరిణామాలకు లోనవుతుంది. నీరు లేక తాజా పండ్ల రసాలు ప్రతిరోజు సేవించాలి.

6. అప్పుడప్పుడు తీయని వేడుక చేసుకోండి:

6. అప్పుడప్పుడు తీయని వేడుక చేసుకోండి:

పరిశోధనల ప్రకారం అతిగా తీపి పదార్థాలు తినే వారికి, వారు తీసుకునే ఆహార పరిమాణంపై నియంత్రణ ఉండదు. ప్రత్యేక సందర్భాల్లో స్వీట్లు తినడం వలన మీ మూడ్ సంతోషంగా మారుతుంది అంతేకాని అతిగా తింటే మొదటికే మోసం వచ్చి బరువు అధికంగా పెరుగుతారు.

7. మనసారా నవ్వండి:

7. మనసారా నవ్వండి:

మనస్ఫూర్తిగా నవ్వటం మూలాన మనలో పెరిగిన ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరం గ్లూకోస్ విడుదలను ప్రోత్సహిస్తుంది. అధికంగా విడుదలైన గ్లూకోస్ ఇన్సులిన్ గా అటు పిమ్మట కొవ్వుగా మారుతుంది. కనుక ఎల్లప్పుడు ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయండి.

8. ఇతర వ్యాపకాలను ప్రయత్నించండి:

8. ఇతర వ్యాపకాలను ప్రయత్నించండి:

కేవలం జిమ్ కి వెళ్లడమే కాకుండా అనేక ఇతర వ్యాపకాలపై దృష్టి సారించండి. పాత స్నేహితులను కలవడం, ఈత కొట్టడం, తోటపని చేయడం, క్రీడల్లో పాల్గొనడం మరియు యోగా చేయడం వంటి వాటి వలన హృద్రోగ సమస్యలు తక్కువగా తలెత్తుతాయి.

9.జీవితాన్ని సంతులనం చేసుకోండి:

9.జీవితాన్ని సంతులనం చేసుకోండి:

తీవ్రమైన డైటింగ్ లేక కఠినమైన వ్యాయామంతో కూడుకున్న పద్ధతులు దీర్ఘకాలం మనలేవని క్రమపద్ధతిలో ధారుడ్యం సాధించిన ఆడవారికి తెలుసు. కనుక మీరు దీర్ఘకాలిక ప్రయోజనం ఆశించినవారైతే, సమతుల జీవనశైలిని అందించే పద్ధతులను ఆచరించండి.

10. నలుగురితో కలుపుగోలుగా ఉండండి:

10. నలుగురితో కలుపుగోలుగా ఉండండి:

ఒక విశ్లేషణ ప్రకారం నలుగురితో కలుపుగోలుగా వ్యవహరించడమనేది ఒక మానసిక వ్యాయాయంగా పనిచేసి, జ్ఞాపకశక్తి మెరుగయ్యి,మేధోపాటవాలు అభివృద్ధి చెందుతాయి. కనుక మీరు తరచుగా స్నేహితులతో లేక బంధువులతో సమయం పంచుకుంటే మానసికంగా చురుకుగా ఉంటారు.

English summary

International Women's Day: 10 Healthy Habits For Women

International Women's Day: 10 Healthy Habits For Women,Minor bad habits and negative thoughts can unintentionally hamper a woman's health. Know about the healthy habits for women.
Story first published: Thursday, March 8, 2018, 8:00 [IST]