అంతర్జాతీయ మహిళా దినోత్సవం: మహిళలలో కిడ్నీ సమస్యల సంకేతాలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఈరోజు మహిళా దినోత్సవమే కాదు, ప్రపంచ కిడ్నీ దినోత్సవం కూడా. కావున ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని మహిళల్లో దీర్ఘకాలిక కిడ్నీ సమస్యల గురించి మీకు తెలియజేయడం కోసమే ఈ ఆర్టికల్. పురుషుల కంటే మూత్రపిండాల సంబంధిత వ్యాధులు స్త్రీలలోనే ఎక్కువగా వచ్చే అవకాశo ఉంది. ఇందులో ఎక్కువగా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో భాధపడే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండడం శోచనీయం.

ఈ మూత్రపిండాల సమస్యకు ప్రధాన కారకాలు టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు మరియు ఊబకాయం. ఆహార నియమాలు పాటించడం, మద్యపానం దూమపానాలకు దూరంగా ఉండడం మరియు నీరు ఎక్కువగా తాగడం వంటి చర్యల ద్వారా మూత్రపిండాల సమస్యలను ఆదిలోనే కట్టడి చెయ్యవచ్చు. ఒక్కసారి మూత్రపిండాల పని తీరు దెబ్బతింటే, వ్యాధుల సంఖ్య జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఆస్టియోపొరాసిస్, హృదయసంబంద వ్యాధులు, గర్భ విచ్చిత్తి, హార్మోన్ అసమతౌల్యం, అధిక రక్తపోటు ఇలా చాలా కారణాలకు దారితీస్తుంది.

కిడ్నీ ఫైల్యూర్ కాని, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు కాని, వ్యాధి తీవ్రమయ్యే దాకా తీవ్రమైన సంకేతాలను చూపించదు. కాని పరీక్షల ద్వారా ఏ సమయంలో అయినా నిర్ధారణ చెయ్యవచ్చు మరియు ఏ వయసులో అయినా వీటిని సరైన చికిత్సల ద్వారా తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. మహిళలలో వచ్చే దీర్ఘకాలిక మూత్రపిండాల రోగాలను గుర్తించే కొన్ని సంకేతాలు అత్యంత ప్రమాదకరమైనవి. మూత్రపిండాలను క్రమబద్దీకరించడానికి డయాలసిస్ చేస్తారు.

మహిళల్లో సాధారణంగా గుర్తించిన మూత్రపిండాల సమస్యలలో కొన్ని ఇక్కడ పొందుపరచబడ్డాయి.

రుతుక్రమం అస్తవ్యస్తంగా

రుతుక్రమం అస్తవ్యస్తంగా

దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యం ఉన్న మహిళలకు సాధారణంగా రుతుక్రమాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. వీటిలో కొన్ని MISSED పీరియడ్స్ , అధిక రక్తస్రావం మరియు మెనోపాజ్ ప్రారంభ దశలో కూడా ఉండవచ్చు. వీరికి డయాలసిస్ ప్రారంభించిన తర్వాత, కాలానుగుణంగా రుతుక్రమం ఆగిపోతుంది మరియు మూత్రపిండపు పనితీరు సాధారణమైన పని తీరుకంటే 20 శాతం తక్కువగా పడిపోతుంది. ఈ డయాలసిస్ గర్భధారణ అవకాశాలను కూడా తక్కువ చేస్తుంది. ఈసమయంలో ఒక్కోసారి గర్భవిచ్చిత్తి జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు.

లైంగిక అసమర్థత

లైంగిక అసమర్థత

ఈ దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు ఉన్నవారికి అలసట, బాధాకరమైన సంయోగం, జననేంద్రియాలు పొడిబారడం, బలహీనత మరియు లైంగిక అసౌకర్యం భావించడం వంటి లక్షణాల వలన లైంగిక అసమర్ధత తలెత్తుతుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించే అనేక మందులు ఇప్పుడు ఉన్నాయి. వీటిలో అధిక రక్తపోటుకు సంబంధించిన మందులు కూడా ఉన్నాయి. ఈ రక్తపోటు మందుల వలన మరియు హార్మోన్ల అసమతౌల్యo వలన స్త్రీ లైంగిక ఆసక్తిని కోల్పోయేలా చేసే, భౌతిక మరియు మానసిక బలహీనతలకు కారణం కూడా కావచ్చు.

మెనోపాజ్

మెనోపాజ్

కిడ్నీ వైఫల్యంతో భాధపడేవారికి డయాలసిస్ అవసరమవుతుంది. ఈ డయాలసిస్ రక్తం నుండి వ్యర్ధాలను తొలగించడానికి సహాయపడుతుంది. కాని హార్మోన్లను ఉత్పత్తిచేసే సామర్ధ్యం దీనికి ఉండదు. స్త్రీలు మెనోపాజ్ దశకి చేరుకున్నప్పుడు, ఆస్టియోపొరాసిస్ ప్రమాదానికి ఎక్కువగా గురవుతూ ఉంటారు. దీని వలన కాల్షియం ఓరల్ గా తీసుకోవలసిన అవసరం ఉంటుంది. ఇలా కాల్షియం తీసుకోవడం, డయాలిసిస్ లేదా కిడ్నీ మార్పిడికి చాలా అవసరం. ఎందుకంటే మహిళలు మెనోపాజ్ దశకి చేరుకున్నప్పుడు హార్మోన్ల ఉత్పత్తిపై ఆ ప్రభావం పడుతుంది. తద్వారా ఆస్టియోపొరాసిస్ మరియు హృదయ సంబంధ వ్యాధులను సైతం ఎదుర్కొనవలసి వస్తుంది.

ఎముకల వ్యాధి

ఎముకల వ్యాధి

దీనినే ఆస్టియోపొరాసిస్ అని కూడా అంటారు. దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి మరియు

డయాలిసిస్ చేయించుకుంటున్న మహిళల్లో ఆస్టియో పొరాసిస్ సాధారణంగా వచ్చే వ్యాధి. దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న మహిళలు కాల్షియం సప్లిమెంట్స్ మరియు విటమిన్ డి లను తీసుకోవడం ద్వారా ఈ ఆస్టియోపొరాసిస్ ను ఎదుర్కొనవచ్చు. డాక్టర్ల సలహా మేరకు ఈ మందుల ఎంపిక అవసరం.

డిప్రెషన్

డిప్రెషన్

దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ఉన్న మహిళలు నిరాశ నిస్పృహలతో ఎక్కువగా భాదపడుతుంటారు. పురుషులు కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. డయాలసిస్ చేయించుకున్న మహిళలలో ప్రతి నలుగురిలో ఒకరు డిప్రెషన్ తో భాధపడుతున్నారని ఒక అంచనా.

గర్భధారణ సమయంలో

గర్భధారణ సమయంలో

దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి లేదా ఒక మూత్రపిండ వైఫల్యం చెందినట్లయితే, అది ఆమెతో సహా పుట్టబోయే బిడ్డను సైతం ప్రమాదంలో ఉంచుతుంది. డయాలసిస్ చేయించుకున్న మహిళ మూత్రపిండాల పనితీరు సాధారణ స్థాయికన్నా 20 శాతానికి పడిపోవడంవలన, హార్మోన్ల అసమతౌల్యానికి గురవ్వడం వంటి కారణాల వలన గర్భం దాల్చే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది కూడా.

English summary

International Women's Day: The Signs Of Kidney Problems In Women

International Women's Day: The Signs Of Kidney Problems In Women,World Kidney Day and International Women's Day is being celebrated on 8th March. Read on to know more about the kidney problems in women.
Story first published: Thursday, March 8, 2018, 18:00 [IST]