For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోగా వల్ల కలిగే ఈ లాభాల గురించి తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు

సంఖ్య శాస్త్రం ప్రకారం తొమ్మిది సంఖ్యలు కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ లక్షణాలు మరియు విలక్షణతలు ఒక్కో సంఖ్యకు ఒక్కో లాగా, ప్రత్యేకంగా మరియు గుర్తించదగినివ

By R Vishnu Vardhan Reddy
|

జీవితంలో కొన్ని విషయాలను కన్నుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, అవి మానవుని యొక్క జీవన శైలిని సులభతరం చేయడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆరోగ్యవంతంగా ఉంచుతాయి మరియు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఇలాంటివాటిల్లో యోగ కూడా ఒకటి.

నిస్సందేహంగా మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంటుంది. ఏ వ్యాయామంతో కూడా పోల్చి చూసినప్పటికీ కూడా యోగాలో ఉన్న చాలా విశిష్టతలు యోగాని చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి.

These Top 15 Health Benefits Of Yoga Will Blow Your Mind

ఎవరైతే ఇప్పుడిప్పుడు యోగాని నేర్చుకుందాం అనుకుంటున్నారో, వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే యోగకు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కేవలం శరీరం పై మాత్రమే ప్రభావం చూపించదు. శరీరంతో పాటు మెదడు మరియు ఆత్మ ఇలా అన్నింటిని వృద్ధి చేయడంలో యోగ కీలక పాత్ర పోషిస్తుంది.

అంతేకాకుండా ఎవరైతే బాగా ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ కుతూహులంగా వ్యవహరిస్తారో, అటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు యోగ వైపే చూస్తున్నారు. అందుకు కారణం ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు నరాల లోపల ఏదైనా అడ్డుపడితే వాటిని తొలగిస్తుంది. క్రమం తప్పకుండా యోగ చేయడం ద్వారా వృద్యాప్యంలో వచ్చే బోలు ఎముకల వ్యాధి మరియు కీళ్ల నొప్పులకు దూరంగా ఉంచుతుంది.

ఈ వ్యాసంలో ప్రతిరోజూ యోగ చేయడం వల్ల కలిగే 15 అత్యద్భుత ఆరోగ్య లాభాల గురించి తెలుసుకోబోతున్నాం. అవేమిటో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. యోగ మీ ఎముకలను దృఢంగా శక్తివంతం చేస్తుంది :

1. యోగ మీ ఎముకలను దృఢంగా శక్తివంతం చేస్తుంది :

వయస్సు పెరిగే కొద్దీ ఎముకల్లో ఉండే క్యాల్షియం కూడా తరుగుతూ ఉంటుంది. దీని ఫలితంగా ఎముకలు బలహీనం అయిపోతాయి. ఈ పరిస్థితుల్లో బోలు ఎముకల వ్యాధి సోకె అవకాశం ఉంది. యోగాలో కొన్ని ఆసనాలు చేయడం ద్వారా ఎముకలు శక్తివంతమై వాటి యొక్క బరువు కూడా పెరుగుతుందట. ఇందువల్ల ఎముకలు ఇరగటం మరియు ఇతర ఎముకలకు సంబంధించిన సమస్యలు గాని, రోగాలు కానీ దరిచేరవట.

ఇది ఒకసారి ప్రయత్నించండి : యోధుడి ఆసనం మరియు ప్రక్క కోన ఆసనాలు చేయడం ద్వారా మీ యొక్క ఎముకలు శక్తివంతం అవుతాయని చెబుతున్నారు.

2. మీ రోగ నిరోధక శక్తి పెరగటానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుందట :

2. మీ రోగ నిరోధక శక్తి పెరగటానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుందట :

యోగా లోని కొన్ని రకాల వ్యాయామాలు మరియు ఆసనాలు చేయడం ద్వారా శరీరంలో శోషరస ద్రవాలు పెరుగుతాయట. వీటిల్లో రోగనిరోధక కణాలు అధిక సంఖ్యలో ఉంటాయట. అందువల్ల మన శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులతో సమర్ధవంతంగా పోరాడి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుందట.

ఇది ఒకసారి ప్రయత్నించండి : తడసన మరియు త్రికోణాసనాలు చేయడం ద్వారా మీ రోగనిరోధక శక్తి పెరిగి మీ దరికి వ్యాధులు రాకుండా ఈ ఆసనాలు ఎంతగానో ఉపయోగ పడతాయట.

3. అధికంగా ఆహారం తినాలి అనే మీ కోరికకు యోగ అడ్డుకట్ట వేస్తుంది :

3. అధికంగా ఆహారం తినాలి అనే మీ కోరికకు యోగ అడ్డుకట్ట వేస్తుంది :

శరీరానికి మరియు మెదడుకు మధ్య ఉన్న బంధాన్ని దృఢంగా ఉంచడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం ద్వారా మనం ఏమి తింటున్నాం, ఎంత తింటున్నాం అనే విషయం మనకు స్పష్టంగా అర్ధం అవుతుంది. దీంతో మనం అర్ధవంతమైన ఆహారాన్ని తీసుకొని, ఎంత అవసరమో అంతే భుజిస్తాము. ఇక మన అందరికి బాగా తెలిసిన నిజం ఏమిటంటే, ఎక్కువ ఒత్తిడిలో గాని లేదా ఖాళీ సమయాల్లో మనందరికీ ఎక్కువగా ఆకలి వేస్తుంటుంది. మనల్ని మాములు స్థితికి తీసుకురావడానికి మరియు ఒత్తిడిని దూరం చేయడానికి యోగ సమర్ధవంతంగా సాయపడుతుంది.

ఇది ఒకసారి ప్రయత్నించండి : ముందుకు ఒంగి ఉండటం మరియు చిన్న పిల్లల ఆసనం చేయడం ద్వారా మనం సాధారణ స్థితికి చేరుకుంటాము మరియు మనలో ఉన్న ఆహారం తినాలి అనే కోరిక కూడా తగ్గిపోతుంది.

4. నిద్రలేమిని తరిమికొట్టడానికి యోగ బాగా సహాయపడుతుంది :

4. నిద్రలేమిని తరిమికొట్టడానికి యోగ బాగా సహాయపడుతుంది :

ఒత్తిడి మరియు నిస్తేజమైన జీవిన విధానం వల్ల చాలా మంది వ్యక్తులు 20 సంవత్సరాలకే నిద్రలేమి తో బాధపడుతుంటారు. మన యొక్క నిద్రపోయే విధానాలపై యోగ సానుకూల ప్రభావం చూపిస్తుంది. వారానికి రెండు సార్లు యోగ చేసిన కూడా, అది మన మెదడుకి ఎంతో స్వాంతనను చేకూరుస్తుంది మరియు ఒత్తిడిలన్నింటిని దూరం చేస్తుంది.

ఇది ఒకసారి ప్రయత్నించండి : మీకు గనుక రాత్రి సమయంలో నిద్ర సరిగ్గా పట్టడంలేదు అని భావిస్తే శవాసనం మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆసనాన్ని వారానికి రెండుసార్లు వేయవలసి ఉంటుంది. నిద్రపోయే ముందు ఊపిరి తీసుకొనే వ్యాయామాలు చేయడం వల్ల కూడా నాణ్యమైన నిద్ర మనకు పడుతుందట.

5. రక్తపోటుని తగ్గించడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది :

5. రక్తపోటుని తగ్గించడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది :

క్రమం తప్పకుండా యోగ చేయడం ద్వారా శరీరం అంతటా కూడా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇందువల్ల ప్రాణవాయువు కలిగిన రక్తం శరీరంలో అన్ని అవయవాలకు బాగా అందుతుంది. ఇందువల్ల రక్తపోటు అనేది తగ్గుతుంది. ఒత్తిడి వల్ల కలిగే రక్తపోటుని కూడా యోగ తగ్గిస్తుంది.

దీనిని ఒకసారి ప్రయత్నించండి : ఊపిరికి సంబంధించిన వ్యాయామాలైన ప్రాణాయానం మరియు వీరభద్రాసనం చేయడం ద్వారా మన శరీరం ఎంతగానో విశ్రాంతిని పొందుతుంది మరియు రక్తపోటుని అదుపులోకి ఉంచుతుంది.

6. జీవక్రియను పెంచడంలో యోగ ఉపయోగపడుతుంది :

6. జీవక్రియను పెంచడంలో యోగ ఉపయోగపడుతుంది :

మన శరీరం మనం తీసుకొనే ఆహారం లోని పోషకాలన్నింటిని సరిగ్గా గ్రహించాలి అంటే మనం తీసుకొనే ఆహారం సరైన పద్దతిలో జీర్ణం అవ్వాలి. సరిగ్గా జీర్ణం అవ్వకపోతే, పొట్టకు సంబంధించిన సమస్యలెన్నో తలెత్తుతాయి మరియు బరువు కూడా పెరిగిపోతాము. మన పొట్ట ఎన్నో రకాల జీర్ణ క్రియకు సంబంధించిన ద్రవాలను ఉత్పత్తి చేయించడంలో యోగ ఎంతగానో సహాయపడుతుంది మరియు ఆహారం సరైన పద్దతిలో జీర్ణం అవ్వడానికి కూడా యోగ ఉపయోగపడుతుంది.

ఇది ఒకసారి ప్రయత్నించండి : మెలితిప్పి కూర్చొని వేసే ఆసనం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మరియు జీర్ణ క్రియ కూడా సరైన పద్దతిలో జరుగుతుంది.

7. యోగా మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది :

7. యోగా మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది :

యోగా శరీరంలో ఉన్న కండరాళ్లనే కాకుండా గుండె సంబంధిత కండరాలను కూడా శక్తివంతం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగా వల్ల గుండె సరైన పద్దతిలో కొట్టుకోవడమే కాకుండా, రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది మరియు గుండె పోటు వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు రక్త నాళాల్లో ఉండే కొవ్వు శాతాన్ని కూడా తగ్గిస్తుంది. సాధారణంగా ఈ రెండు కారణాల వల్లే గుండె పోటు అధికంగా వస్తుంది.

ఇది ఒకసారి ప్రయత్నించండి : పాదాంగుష్టసన లేదా పెద్ద బ్రొటని వ్రేలు భంగిమ మరియు జానూ శిరసాసన, ఇవి చేయడం వల్ల గుండెను ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు.

8. శరీరంలోని అంతస్రావ విధులను మెరుగుపరచడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది:

8. శరీరంలోని అంతస్రావ విధులను మెరుగుపరచడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది:

శరీరంలో ఉన్న హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడానికి యోగ ఎంతగానో సహాయపడుతుంది. మన శరీరం సరైన పద్దతిలో పనిచేయాలంటే అందుకు ఖచ్చితత్వం తో కూడిన హార్మోన్ల ఉత్పత్తి జరగటం చాలా ముఖ్యం. హార్మన్ల అసమతుల్యత చోటుచేసుకోకుండా ఉండటాన్ని యోగ నియంత్రిస్తుంది మరియు సరైన పద్దతిలో పనిచేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. యోగ వల్ల శారీరిక మరియు మానసిక ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది.

ఇది ఒకసారి ప్రయత్నించండి : బద్ధ కోణాసన ను సాధారణంగా సీతాకోక చిలుక భంగిమ అని కూడా పిలుస్తుంటారు మరియు విపరీత కరణి, వీటిని చేయడం వల్ల అంతస్రావ ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది.

9. రక్తంలో ఉన్న ట్రై గ్లిజరాయిడ్స్ సంఖ్యను యోగ తగ్గిస్తుంది :

9. రక్తంలో ఉన్న ట్రై గ్లిజరాయిడ్స్ సంఖ్యను యోగ తగ్గిస్తుంది :

రక్తంలో ఉన్న కొవ్వుని ట్రై గ్లిజరాయిడ్స్ అని పిలుస్తారు. ఇవి గనుక ఎక్కువగా ఉన్నట్లయితే దానిని అనారోగ్య రక్తం అని కూడా అంటారు. ఈ పరిస్థితుల్లో రక్తనాళాలు గట్టి పడిపోయే అవకాశం కూడా ఉంది. దీని ఫలితంగా శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోయే అవకాశం ఉంది. చివరికి ఇది గుండె పోటు మరియు గుండె సంబంధిత వ్యాధులు అధికంగా వచ్చే విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. యోగ చేయడం వల్ల ఈ ట్రై గ్లిజరాయిడ్స్ అనేవి నాశనం అవుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు గుండె ఆరోగ్యవంతంగా ఉంటుంది.

ఇది ఒకసారి ప్రయత్నించండి : కపాల్ భక్తి ప్రయాణం మరియు సర్వాంగాసనను నిర్దిష్టమైన ప్రదేశాల్లో చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.

10. శరీర నైపుణ్యాన్ని యోగ పెంచుతుంది :

10. శరీర నైపుణ్యాన్ని యోగ పెంచుతుంది :

ఎవరైతే యోగాని ప్రతి రోజు సాధన చేస్తారో అటువంటి వ్యక్తుల శరీరానికి వశ్యత ఎక్కువగా ఉంటుంది. మరియు శరీరానికి మెదడుకి మధ్య బలమైన బంధం ఏర్పరుచుకుంటుంది. చేతికి చూపుకి మధ్య సమన్వయం మెరుగుపరచడం లో యోగ సహాయపడుతుంది మరియు కీళ్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇందువల్ల వృద్యాప్యంలో వచ్చే కీళ్ల సమస్యలు దరిచేరవు.

ఇది ఒకసారి ప్రయత్నించండి : పద్మాసన మరియు వజ్రాసన లాంటి ఆసనాలను ప్రయత్నించడం ద్వారా మరియు క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మీ శరీరంలో వశ్యత పెరుగుతుంది.

11. మతిమరుపు వ్యాధిని పై పోరాటం చేయడానికి యోగ సహాయపడుతుంది :

11. మతిమరుపు వ్యాధిని పై పోరాటం చేయడానికి యోగ సహాయపడుతుంది :

మెదడు యొక్క సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో మరియు దాని యొక్క పనితీరు పెంచడానికి యోగ ఎంతగానో సహాయపడుతుంది. యోగా వల్ల మతిమరుపు వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని అధ్యయనాలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మతి మెరుపు వ్యాధికి ముగింపు పలకడం లో ఒక కొత్త అధ్యయనం ప్రారంభంఅయ్యిందని కూడా చెబుతున్నారు. చాలామంది ప్రజలు వృద్యాప్య దశలో ఈ వ్యాధి భారిన పడుతూ బాధపడుతున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు.

ఇది ఒకసారి ప్రయత్నించండి : బలాసన లేదా చిన్నపిల్లల భంగిమ మరియు విపరీత కరణి, మెదడు యొక్క పనితీరుని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

12. బహుళ స్క్లేరోసిస్ ని నిర్వహించడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది :

12. బహుళ స్క్లేరోసిస్ ని నిర్వహించడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది :

చేతులు, కాళ్లలో తిమ్మిరి ఉండటం, సమన్వయం కోల్పోవడం మరియు అలసటగా ఉండటం లాంటి లక్షణాలతో ఏ వ్యక్తులైతే బాధపడుతుంటారో వాళ్ళందరూ బహుళ స్క్లేరోసిస్ తో బాధపడుతున్నట్లు అర్ధం. ఈ సమస్యలన్నింటిని అధికమించడానికి యోగ పరిష్కారం చూపిస్తుంది మరియు వీటి నుండి బయటపడటానికి రక్తప్రసరణ జరగటం చాలా ముఖ్యం. అది యోగా వల్ల ఖచ్చితంగా సాధ్యం అవుతుంది మరియు శరీరం పై అవగాహనను పెంచుతుంది.

ఇది ఒకసారి ప్రయత్నించండి : తడాసన, వీరభద్రాసనా 1 మరియు 2 , త్రికోణాసన, ఇవి బహుళ స్క్లేరోసిస్ ని నియంత్రించడంలో మరియు అదుపుచేయడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది.

13. మణికట్టు సంబంధిత సొరంగ సిండ్రోమ్ ( కార్పల్ టన్నెల్ సిండ్రోమ్) ని యోగ చేయడం ద్వారా తగ్గించవచ్చు :

13. మణికట్టు సంబంధిత సొరంగ సిండ్రోమ్ ( కార్పల్ టన్నెల్ సిండ్రోమ్) ని యోగ చేయడం ద్వారా తగ్గించవచ్చు :

ఏ వ్యక్తులైతే మణికట్టు దగ్గర విపరీతమైన నొప్పిని అనుభవిస్తుంటారో ఈ పరిస్థితినే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని అంటారు. క్రమం తప్పకుండా యోగ చేయడం ద్వారా ఈ నొప్పిని మనం తగ్గించుకోవచ్చు.

ఇది ఒకసారి ప్రయత్నించండి : వెనక్కి వంగటం, ఆవు ముఖపు భంగిమ మరియు గద్ద భంగిమ చేయడం ద్వారా శరీరం యొక్క బరువు మణికట్టు పై తగ్గుతుంది. కానీ, అదే సమయంలో చేతులను కూడా వ్యాయామం చేయడం ద్వారా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ని దరి చేరకుండా చేయవచ్చని సలహా ఇస్తున్నారు

14. టైపు 2 మధుమేహం ని యోగ ప్రభావంతంగా ఎదుర్కొంటుంది :

14. టైపు 2 మధుమేహం ని యోగ ప్రభావంతంగా ఎదుర్కొంటుంది :

ఇన్సులిన్ స్థాయిలను యోగ నియంత్రణలో ఉంచుతుంది మరియు క్లోమం గ్రంధులను ఇన్సులిన్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. ఇలా టైపు 2 మధుమేహం ని నియంత్రించవచ్చు. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే.

ఇది ఒకసారి ప్రయత్నించండి : వ్రిక్షాసన మరియు ధనురాసన, పొట్ట మరియు క్లోమ గ్రంధుల యొక్క పనితీరుని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

15. మలబద్దకాన్ని నయం చేయడంలో యోగ సహాయపడుతుంది :

15. మలబద్దకాన్ని నయం చేయడంలో యోగ సహాయపడుతుంది :

జీర్ణ వ్యవస్థ మరియు విసర్జన వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి యోగాలోని కొన్ని ఆసనాలు ఎంతగానో సహాయపడతాయి. పేగుల పై యోగా ఒత్తిడిని పెంచుతుంది మరియు విసర్జన సులభంగా సక్రమంగా జరగటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సరైన సమతుల్యతతో కూడిన ఆహారం శరీరం తీసుకొనేలా యోగ చేస్తుంది మరియు మలబద్దకం వ్యాధి చాలా కొకొద్ది సమయంలోనే నయం అవుతుంది. అందుకు మీరు చేయవలసిందల్లా యోగా క్రమం తప్పకుండా చేయడమే.

ఇది ఒకసారి ప్రయత్నించండి : గాలి ఉపశమన భంగిమ మరియు సగం నాగలి భంగిమ చేయడం ద్వారా మీరు మల బద్దకాన్ని అధికమించవచ్చు.

ఈ వ్యాసాన్ని షేర్ చేయడం మాత్రం మరిచిపోకండి.

ఈ వ్యాసం గనుక మీకు నచినట్లైతే మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోండి. వారు కూడా దీనిని చదివి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.

English summary

International yoga day 2022: These Top 15 Health Benefits Of Yoga Will Blow Your Mind

Yoga might be catching up in the western world just about now, but ancient Indians have reaped its benefits for over centuries. Here are some of them: it can boost your immunity, strengthen your bones, and prevent Alzheimer's disease.
Desktop Bottom Promotion