For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటలో కొబ్బరి నూనె వాడకం ఆరోగ్యానికి మంచిదేనా ? మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు

వంటలో కొబ్బరి నూనె వాడకం ఆరోగ్యానికి మంచిదేనా ? మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు

|

కొబ్బరి నూనె, వంటలలో విరివిగా ఉపయోగించే ప్రధానమైన నూనెలలో ఒకటిగా ఉంది, కానీ నెమ్మదిగా, ఆలస్యంగా వచ్చిన కొన్ని ఫలితాల ఆధారితంగా, తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటూ ఉంది. హార్వర్డ్ TH చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ప్రొఫెసర్ కారిన్ మిచెల్స్ తినే ఆహార పదార్దాలలోనే అత్యంత ఘోరమైన ఆహారంగా కొబ్బరినూనె పేర్కొంది. కొబ్బరినూనె వాడకం 'సంపూర్ణంగా అర్ధరహితం' అని ఆమె పేర్కొంది. మరియు అది గుండె ఆరోగ్యానికి చేటు చేసే, సంతృప్త కొవ్వు పదార్దాలను అధికంగా కలిగి ఉన్న 'సంపూర్ణ విషతుల్య పదార్ధం' అని చెబుతుంది.

కొబ్బరి నూనెలో అధిక కొవ్వు నిల్వలు, అధిక సంఖ్యలో కలిగి ఉన్నట్లు, ప్రొఫెసర్ తన ప్రకటనలో పేర్కొంది. ఇది LDL (చెడ్డ) కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది, క్రమంగా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొబ్బరి నూనెలో 80% పైగా సంతృప్త కొవ్వుల నిక్షేపాలు ఉంటాయి.

Is Coconut Oil Good For You? Here Is All You Need To Know!


వంటలో కొబ్బరి నూనె వాడకం ఆరోగ్యానికి మంచిదేనా ? మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు :

కొబ్బరి నూనె మీ ఆహారవంటకాలలో వినియోగించడం కన్నా, చర్మంపై వినియోగించడమే మంచి ఫలితాలని ఇస్తుంది అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సైతం పేర్కొంది. అయితే, కొబ్బరి నూనెలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులుగా పిలువబడే మీడియం-చైన్ కొవ్వు ఆమ్లాల (MCFA) మూలంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి కూడా. కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి.

అయినప్పటికీ, కొబ్బరి నూనె యొక్క ప్రతికూలతలు కూడా అదేవిధంగా ఉన్నాయి. కానీ, కొబ్బరినూనె సాధారణంగానే రెండురూపాల్లో అందుబాటులో ఉంటుంది – వర్జిన్ కొబ్బరి నూనె మరియు వాణిజ్య కొబ్బరి నూనె.

కమర్షియల్ కొబ్బరి నూనె కొన్ని దుష్ప్రభావాలు కలిగి ఉంటుంది, వీటిని మేము క్రింది విభాగంలో చర్చించబోతున్నాము:

1. మొటిమలు బ్రేక్అవుట్

1. మొటిమలు బ్రేక్అవుట్

మీరు మొటిమలను తగ్గించడం కోసం కొబ్బరి నూనె ఉపయోగించినట్లయితే, మీరు ఖచ్చితంగా దాన్ని ఆపవలసి ఉంటుంది. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ ఉనికి సాధారణంగా మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను చంపటానికి సహాయపడుతుంది. మీ చర్మం జిడ్డు చర్మంకాని పక్షాన మాత్రమే ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. జిడ్డుగల చర్మంపై ఉపయోగించడం సూచించదగినదికాదు.

బదులుగా, మీరు మొటిమలు తగ్గించడానికి, కొబ్బరి నూనెను కలిపిన ఇతర ముఖ్యమైన నూనెలను ఉపయోగించవచ్చు.

2. గుండెకు చేటు కావచ్చు

2. గుండెకు చేటు కావచ్చు

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, తక్కువ సంతృప్త కొవ్వులు మరియు అధిక స్థాయిలోని అసంతృప్త కొవ్వులు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమ మార్గంగా ఉంటుంది. కానీ కొబ్బరి నూనె, మీ గుండెకు హాని కలిగించే సంతృప్త కొవ్వులలో అధిక శాతంతో కూడుకుని ఉంటుందని తేలింది, ఎందుకంటే అసంతృప్త మొక్కల నూనెల కన్నా, అసాధారణంగా చెడు కొలెస్ట్రాల్ పెంచుతుంది కాబట్టి.

3. తలనొప్పి కారణమవుతుంది

3. తలనొప్పి కారణమవుతుంది

తరచుగా నిర్విషీకరణ కోసం కొబ్బరి నూనెను ఉపయోగించే వ్యక్తులు, ముఖ్యంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు, క్రమంగా తలనొప్పిని ఎదుర్కొంటారు. కొబ్బరి నూనెలో ఉన్న మీడియం-గొలుసు కొవ్వు ఆమ్లాలు ఈస్ట్ కణాలను విచ్ఛిన్నం చేస్తాయి కాబట్టి ఇలా జరుగుతుంది. ఇది, తలనొప్పికి కారణమయ్యే రక్తప్రసరణలోని ఫంగల్ టాక్సిన్స్ యొక్క అధిక ప్రవాహానికి కారణమవుతుంది.

4. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది

4. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది

హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం, కొబ్బరి నూనె ఇతర వెజిటబుల్ ఆయిల్స్ వలె, అనగా సోయాబీన్ లేదా ఆలివ్ నూనెలలోని సంతృప్త కొవ్వు పదార్ధాల నిల్వలతో పోలిస్తే ఆరోగ్యకరమైనది కాదు, ఎందుకంటే ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

5. అతిసారానికి కారణమవుతుంది

5. అతిసారానికి కారణమవుతుంది

అంతర్గత బాక్టీరియా సంక్రమణలతో పోటీ పడడానికి తీసుకునే అన్ని పదార్ధాల వలనే, కొబ్బరి నూనెను కూడా నోటి నుండి తీసుకుంటారు. బ్యాక్టీరియా మరియు ఇతర హానికరమైన జీవుల నాశన ప్రక్రియ అతిసారం వంటి స్వల్పకాలిక దుష్ప్రభావాలకు కూడా దారితీస్తుంది. కొబ్బరి నూనెలో అధిక కొవ్వు పదార్ధం కారణంగా ప్రధానంగా విరేచనాలు సంభవిస్తాయి.

6. కాలేయం దెబ్బతినవచ్చు

6. కాలేయం దెబ్బతినవచ్చు

కొబ్బరి నూనెలో ఉన్న మీడియం-గొలుసు కొవ్వు ఆమ్లాలు కాలేయంలోకి భట్వాడా చేయబడతాయి, ఇక్కడ అవి శక్తిగా మార్చబడతాయి. కానీ, నిపుణులు చెప్తున్న వివరాల ప్రకారం, ఈ మధ్యస్థ శృంఖల కొవ్వు ఆమ్లాలు కాలేయాన్ని క్రమంగా విచ్చిన్నం చేస్తుందని తేలింది. ఈ పరిణామాలు కాలేయంలో ఒత్తిడిని గురి చేయవచ్చు.

7. అలెర్జీలు

7. అలెర్జీలు

మీరు కొబ్బరి నూనెకు సెన్సిటివిటీ కలిగి ఉండి, తేలికగా ప్రభావానికి గురవుతున్న ఎడల, దద్దుర్లు, వికారం, తామర, వాంతులు మరియు అనాఫిలాక్సిస్ వంటి అలెర్జీలు కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ అలెర్జీ లక్షణాలు కలిగి ఉంటే తలనొప్పి, ముఖ వాపు మరియు వేగవంతమైన గుండె రేటు మొదలైనవి కలిగే అవకాశాలు ఉన్నాయి. వెంటనే మీ వైద్యుని సందర్శించండి. ఈ సమస్య కొందరిలో వ్యక్తిగతంగా కూడా గమనించడం జరిగినది. క్రమంగా వైద్యుల నిర్ణయాల ప్రకారం, ఆహార ప్రణాళికలలో మార్పులు చేయవలసి వస్తుంది కూడా.

8. కొబ్బరి నూనెను ఒక కందెన వలె ఉపయోగించకుండా ఉండండి

8. కొబ్బరి నూనెను ఒక కందెన వలె ఉపయోగించకుండా ఉండండి

మీరు ఈస్ట్ ఇన్ఫెక్షన్ వంటి యోని అంటురోగాలకు గురైనట్లయితే, కొబ్బరి నూనెను ఒక కందెనగా ఉపయోగించడం సురక్షితమైన ఎంపిక ఏమాత్రం కాజాలదు. ఎందుకంటే కొబ్బరి నూనె యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి యోని యొక్క పిహెచ్ సంతులనాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాయి. క్రమంగా ఉన్న సమస్యల సంగతేమో కానీ, లేని ఈస్ట్ ఇన్ఫెక్షన్లు కలగడానికి కారణమవుతుంది.

కావున వంటలలో కొబ్బరి నూనె వాడకం ఆరోగ్యానికి, జీవన ప్రమాణాలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని పరిశోధకుల అభిప్రాయంగా ఉంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Is Coconut Oil Good For You? Here Is All You Need To Know!

Coconut oil, one of the most sought after oils, has faced extreme criticism lately. Coconut oil has been stated as the worst foods to eat by Karin Michels, a professor at the Harvard TH Chan School of Public Health. She claims that coconut oil is 'absolute nonsense' and says it's 'pure poison' for its saturated fat content which is bad for heart health.
Desktop Bottom Promotion