For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భోజనం చేసాక టీ తాగొచ్చా? లేదా ఇప్పుడే తెలుసుకోండి...

భోజనం చేసాక టీ తాగవచ్చా? తాగరాదా?

|

భోజనం చేసాక టీ తాగడమనేది, ఒక వివాదంతో కూడుకున్న అంశం. అధ్యయనాల ప్రకారం టీ తాగితే జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుందని చెప్తారు, అదే సమయంలో, అందులోని కెఫిన్ పోషకాలను మన శరీరం గ్రహించకుండా చేస్తుందని అంటారు.

జీర్ణవ్యవస్థ పనితీరుపై టీ ప్రభావం:

అధ్యయనాల ప్రకారం , భజనం తరువాత టీ తాగితే, కడుపులోని అపాన వాయువులు మరియు ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. కానీ, అన్ని రకాల టీలు ఒకే రకమైన ప్రభావం చూపవు. హెర్బల్ టీ లేదా గ్రీన్ టీలో అధిక మొత్తంలో పాలీఫీనాల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన.అవి జీర్ణానికి తోడ్పడతాయి. ఈ టీలు పైత్యరసం, లాలాజలం మరియు జీర్ణరసాల స్రావాన్ని ప్రేరేపించి, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. కెటచిన్స్ వంటి పాలీఫీనాల్ సమ్మేళనాలు, పెప్సిన్ వంటి జీర్ణ ఎంజైములు పనితీరును ప్రోత్సహించడం వలన ప్రోటీన్ల అరుగుదల మెరుగవుతుంది.

Is it better to drink tea after meals?

భోజనంతో పాటు టీ తాగడం ఎందుకు మంచిది కాదో తెలిపే కొన్ని కారణాలు:

అధ్యయనాల ప్రకారం, టీలో ఉండే ఫీనాలిక్ సమ్మేళనాలు, ఐరన్ సోషణను అడ్డుకుంటాయి ఎందుకనగా ఇవి ఐరన్ తో చర్య జరిపి సముదాయాలను ఏర్పాటు చేస్తాయి. మీరు భోజనం చేసాక కనుక టీ తాగలనుకున్నట్లైతే, విటమిన్ సి మరియు ఐరన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. భోజనం చేసాక టీ తాగితే, శరీరంలో కెటచిన్స్ లభ్యత తగ్గిపోతుంది.

Is it better to drink tea after meals?

ఆహార మార్గదర్శకాల కమిటీ కన్వీనర్, డాక్టర్ డి రఘునాథరావు, టైమ్స్ ఆఫ్ ఇండియాకు "ఏదైనా తిన్న, కనీసం ఒక గంట ముందు మరియు తరువాత కాఫీ మరియు టీలను సేవించరాదు, ఎందుకంటే, వీటిలో ఉండే టానిన్లు ఐరన్ సోషణను అడ్డుకుంటాయి" అని తెలియజేసారు. కాఫీ మరియు టీలను సేవించడం వలన కండరాల నొప్పి, అలసట తగ్గినప్పటికీ, వాటిని తక్కువగా తీసుకోవాలి.

Is it better to drink tea after meals?

ఆహార మార్గదర్శకాల అనుసారం హృద్రోగాలతో బాధపడేవారు కాఫీ సేవనాన్ని తగ్గించుకోవాలి, ఎందుకనగా, ఇది రక్తపోటును పెంచి గుండె పనితీరును కుంటుపరుస్తుంది.

Is it better to drink tea after meals?
కనుక, మీరు ఆహారం తీసుకున్నాక, టీ లేదా కాఫీ తాగాలనుకుంటే, అల్లం టీ లేదా గ్రీన్ టీ తాగడం మంచిఫై, ఎందుకనగా రెండు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.

English summary

Is it better to drink tea after meals?

Drinking tea with meals is a controversial topic. There are several studies that report drinking tea is good for digestive health but some state that caffeine in tea hinders absorption of various nutrients. Let’s see find out if it affects our health.
Desktop Bottom Promotion