For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చక్కెర పూర్తిగా మానివేయడం ఎంతవరకు సబబు ?

చక్కెరలు పూర్తిగా మానివేయడం ఎంతవరకు సబబు ?

|

రోజూవారీ వినియోగంలో అనేకమందికి చక్కెర ఎప్పటికీ ముందువరుసలో ఉంటుంది; స్వీట్స్ దగ్గర నుండి కాఫీ, టీల వరకు ప్రతి విషయంలోనూ చక్కరకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే వాళ్ళు ఉంటారు. కానీ, చక్కరల అధిక వినియోగం, డయాబెటిస్, ఊబకాయం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు సైతం కారణం కావచ్చు. అధిక చక్కెరలను వినియోగిస్తున్న ఎడల ఆ ప్రభావం ప్రధానంగా కాలేయం మీద పడుతుంది, క్రమంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం, జీవక్రియలు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

క్రమంగా మితిమీరిన ఆకలి, స్వీట్స్ మీదకు అతిగా మనసు వెళ్ళడం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. మితిమీరిన చక్కెరలను తీసుకోవడం, ఎంత ప్రమాదకరమో, పూర్తిగా విడిచిపెట్టడం కూడా అంతే ప్రమాదకరంగా ఉంటుంది; చక్కెరలు అంటే, కేవలం తెల్ల చక్కర కాదు. సహజ సిద్దమైన చక్కెరలు కూడా అనేకం ఉన్నాయి. పూర్తిగా చక్కెరలు వదిలేయడం ఎంతవరకు సమంజసమో ఇప్పుడు తెలుసుకుందాం!

Is Quitting Sugar Completely A Healthy Option?

అధిక చక్కెరల వినియోగం మీ శరీరంపై చూపే ప్రభావం ఏమిటి?

శుద్ధిచేసిన చక్కెరలు లేదా కృత్రిమ చక్కెరలు నిల్వ చేసిన ఆహార పదార్ధాలలో అధికంగా ఉంటాయి. ఆధునిక ఆహారాలలో అత్యంత ఘోరమైన సమ్మేళనాలు ఈ చక్కెరలు.

చక్కెరలు శరీరంపై చూపే ప్రభావాల గురించిన పూర్తి వివరాలు :

నిజానికి చక్కరలో, శరీరానికి అవసరమైన పోషకాలు అంటూ ఏమీ లేవు. మరియు మీ దంతాలకు నష్టం చేకూరుస్తుంది కూడా. క్రమంగా దంతక్షయం వంటి సమస్యలను సైతం ఎదుర్కొనవలసి ఉంటుంది. మరియు ఎటువంటి పోషకాలు లేని కాలరీలను శరీరానికి అందించినట్లు అవుతుంది.

చక్కెరలు, నోటిలో హానికరమైన బాక్టీరియాను పెంచుతాయి. తద్వారా దంత క్షయం ఏర్పడుతుంది.

చక్కెరలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది, ఇది మీ కాలేయాన్ని ఓవర్లోడ్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, ఇది ఆల్కహాల్తో సంబంధంలేని, ఫ్యాటీ లివర్ వ్యాధికి సైతం కారణం కావచ్చు.

చక్కెర, ఇన్సులిన్ తగ్గుదలకు కూడా దారితీస్తుంది. క్రమంగా జీవక్రియలు మందగించడం మరియు టైప్ – 2 డయాబెటిస్ సమస్యలకు దారితీయగలదు.

అధిక చక్కెరలు తీసుకోవడం నిజానికి వ్యసనం వంటిది; ఇది మెదడులో డోపమైన్ అధిక విడుదలకు కారణమవుతుంది.

Is Quitting Sugar Completely A Healthy Option?

చక్కెర, పిల్లలు మరియు పెద్దలలో ఊబకాయానికి దారితీస్తుంది.

చక్కెరలను పూర్తిగా త్యజించడం మంచిదేనా ?

మాక్రోబయోటిక్ కోచ్ మరియు న్యూట్రిషనిస్ట్ శిల్పా అరోరా ప్రకారం, " నిజానికి శుద్ది చేసిన చక్కెర శరీరానికి అవసరం లేనిది, మరియు ఎటువంటి శరీరతత్వానికి సరిపోనిది” ఇది శరీరానికి అత్యంత విషపూరితమైన ఆహారం, సహజ సేంద్రీయ ఆహార పదార్ధాలలోని చక్కెరలను మాత్రమే తీసుకోవాలి. ప్రకృతిలోని సహజసిద్దమైన పండ్లలోని చక్కెరలు, తియ్యదనంతో పాటు అనామ్లజనకాలు మరియు శక్తివంతమైన పోషకాలను సైతం కలిగి ఉంటాయి. మామిడి, చెర్రీస్, స్ట్రాబెర్రీలు, రేగు పండ్లు, ఆపిల్ మరియు దానిమ్మపండు వంటి కాలానుగుణంగా లభించే పండ్లలో ఈ చక్కెరలను అధికమొత్తాలలో పొందవచ్చు. ఈ సహజ సిద్దమైన ఫ్రూట్ –షుగర్స్ యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి, మీ రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావితం చేయనివిగా ఉంటాయి. మరియు శరీరానికి అధిక మొత్తాలలో ఫైబర్ మరియు నీటిని సమృద్ధిగా అందిస్తాయి. ఎండు ద్రాక్ష, ఖర్జూరం, ఆప్రికాట్లు వంటి ఎండబెట్టిన పండ్లు కూడా మంచివిగా చెప్పబడినవి. సింథటిక్ కృత్రిమ చక్కెరలలా కాకుండా, ఈ సహజ సిద్దమైన చక్కెరలు మన శరీరంలోని జీవక్రియలను ప్రోత్సహించడంలో ఎంతగానో సహకరిస్తాయి.

శుద్ధి చేసిన చక్కెరలు, మరియు తెల్ల చక్కెరలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పండ్లలో, సహజ సిద్దమైన ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు కనిపిస్తాయి. పాలు మరియు జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో లాక్టోజ్ ఉంటుంది. నిజానికి, లాక్టోస్ మరియు ఫ్రూక్టోజ్ వంటి సహజ సిద్దమైన చక్కెరలు, శరీర జీవక్రియలకు ఎంతగానో దోహదంచేసే ప్రోటీన్ మరియు ఫైబర్లను కలిగి ఉంటాయి. ఇవి ఆకలిని దూరంగా ఉంచడంతో పాటు, రక్తంలోని చక్కెరలను క్రమబద్దీకరిస్తాయి.

చక్కెరను విడిచిపెట్టాలని మీరు భావిస్తున్నట్లయితే, శుద్ధి చేయబడిన(రీఫైండ్ షుగర్) మరియు కృత్రిమ చక్కెరలను తక్కువ పరిమాణంలో తీసుకునేలా చూసుకోండి. మీరు ఆరోగ్యకరమైన జీవక్రియల కోసం, పండ్లు మరియు పాల ఉత్పత్తులలోని సహజ చక్కెరలను తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో, ఫ్రూట్ షుగర్స్ అనేకం అందుబాటులో ఉన్నాయి కూడా.

English summary

Is Quitting Sugar Completely A Healthy Option?

Regular consumption of sugar is said to have many repercussions; it may cause diabetes, obesity and other health issues. When you tend to consume excessive sugar, it may affect your liver, increase uric acid levels, causes metabolic dysfunction and trap you into this vicious cycle of craving and bingeing on sweets.
Desktop Bottom Promotion