For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఆహార ప్రణాళికలో ఆమ్లస్థాయిలు అధికంగాగల ఆహారాలను తగ్గించడం ఎలా?

మీ ఆహార ప్రణాళికలో ఆమ్లస్థాయిలు అధికంగాగల ఆహారాలను తగ్గించడం ఎలా?

|

మీరు ఆమ్ల సంబంధిత(ఎసిడిక్) ఆరోగ్య సమస్యలకు గురైనట్లయితే, ఆమ్లత్వం మరియు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను కలిగించే ఆహారపదార్ధాల నుండి విముక్తి పొందడం అవసరం. మీ ఆహారంలో మార్పులు చేయడం ద్వారా ఆమ్లత్వం హెచ్చుతగ్గులను క్రమబద్దీకరించగలుగుతుంది.

కానీ ఆహార ప్రణాళికలో ఆమ్లఘాడత అధికంగా గల ఆహారాలను గుర్తించడం కీలకమైన అంశం. ఆమ్ల-గాఢత అధికంగా కలిగిన ఆహార పదార్థాల గురించి తెలుసుకునే క్రమంలో భాగంగా, ముందుగా pH విలువలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. pH విలువ 0 అయినప్పుడు, అధిక ఆమ్లస్థాయిని సూచిస్తుంది. pH విలువ 7 అనేది తటస్థ సమానంగా ఉంటుంది, అయితే pH విలువ 14గా ఉన్న ఎడల, అది ఆల్కలీన్ స్థాయిలను సూచిస్తుంది.

 List of Acidic Foods & Fruits To Avoid and List of Alkaline Foods

ఆమ్ల-ఘాడత కలిగిన ఆహారాలు అనగా ఏమిటి?

4.6 లేదా అంతకన్నా తక్కువ pH విలువ కలిగి ఉన్న ఆహారాలను సహజంగానే ఆమ్ల స్థాయిగల ఆహార పదార్ధాలుగా భావిస్తారు. సాధారణంగా, సిట్రస్ పండ్లు తక్కువ pH విలువను కలిగివుంటాయి. క్రమంగా ఆమ్లస్థాయిలు కలిగిన పదార్ధాలుగా భావిస్తారు. మన శరీరానికి 0 నుండి14 వరకు pH స్థాయిలను నియంత్రించే స్వభావం ఉంటుంది. pH విలువలు 7.35 నుండి 7.45 వరకు ఉన్న “ఆల్కలీన్” స్థాయిలు మానవ ఆరోగ్యానికి ఉత్తమమైనదిగా భావించబడుతుంది. అధిక పీహెచ్ స్థాయిలు ఆల్కలోసిస్(శరీరంలో ఆమ్లస్థాయిల పెరుగుదల) సమస్యకు కారణమవుతుంది. క్రమంగా, ఇది గందరగోళం, కండరాలు మెలితిరగడం మరియు వికారం వంటి ఆరోగ్య సమస్యలకు సైతం దారితీస్తుంది. మరోవైపు, ఆమ్లొసిస్ శ్వాసతగ్గడానికి, తలనొప్పి మరియు అలసటకు కారణంగా మారే అవకాశాలు ఉన్నాయి.

 List of Acidic Foods & Fruits To Avoid and List of Alkaline Foods

మీ శరీరానికి ఎసిడిక్ ఆహారాల వలన కలిగే సమస్యలు ఏమిటి?

"యాసిడ్-యాష్" అని ఒక అభిప్రాయం గురించి నిపుణులు చర్చిస్తున్నారు కూడా. మన శరీరంలో జీవక్రియలు జరిగినప్పుడు, మిగిలిపోయిన రసాయనిక అవశేషాలను "యాష్(బూడిద)"గా పిలవబడుతుంది. ఈ అవశేషాలు శరీరంలోని ద్రవాలతో మిళితం అయినప్పుడు, క్రమంగా శరీరంలో వివిధరకాల ప్రతిచర్యలకు కారణమవుతుంది, ఇది అధిక ఆమ్ల గాఢత లేదా ఆల్కలీన్ వలె మారుస్తుంది.

ఆమ్ల ఘాడత ఏర్పడే పదార్ధాలను కలిగి ఉన్న ఆహారాలు, రక్తాన్ని తక్కువ pH విలువకు గురిచేస్తాయి. క్రమంగా శరీరంలో ఆమ్లస్థాయిలు హెచ్చుమీరుతాయి. అంతేకాకుండా శరీరంలో అత్యంత అవసరమైన ఆల్కలీన్ నిక్షేపాలు, ఉదాహరణకు కాల్షియం నిక్షేపాలను తగ్గించడంలో కూడా ఇది ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మరియు ఈ పోషకాలన్నీ మూత్రం ద్వారా విసర్జించబడుతాయి.

దీర్ఘకాలికంగా ఈ ఆహారాలను తీసుకోవడం కారణంగా శరీరంలో ఎముకలలో ఖనిజ-నష్టానికి కారణమవుతుంది. క్రమంగా బోలు ఎముకల వ్యాధి(ఆస్టియోపొరాసిస్) వంటి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అధిక ఆమ్ల గాఢత కలిగిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించడం ద్వారా మూత్రపిండాలలో రాళ్ళను నివారించడం మరియు యాసిడ్ రిఫ్లక్స్ సమస్యల లక్షణాలు తగ్గడం జరుగుతుంది.

 List of Acidic Foods & Fruits To Avoid and List of Alkaline Foods

అధిక ఆమ్ల ఘాడత కలిగిన ఆహార పదార్ధాలు మరియు వాటి pH విలువలు:

అధిక ఆమ్లస్థాయి కలిగిన ఆహారాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి, లేదా మానివేయాలని ఆహార నిపుణులు సూచిస్తుంటారు. యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సంబంధిత రుగ్మతలను వేగవంతం చేయగల లక్షణాలు ఈ ఆహార పదార్ధాలకు ఉన్నాయి. GERD మరియు యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను ప్రేరేపించే ఆహారాల జాబితా ఇక్కడ పొందుపరచబడి ఉన్నది. ఈ ఆహార పదార్థాలు 4.6 కన్నా తక్కువ pH స్థాయిలను కలిగి ఉంటాయి.


• చక్కెర

• ఫిష్

• నిల్వ చేసిన ఆహారాలు

• ధాన్యాలు

• కొన్ని పాల ఉత్పత్తులు

• టర్కీ, బీఫ్ వంటి మాంసాలు

• సోడా, తీయని పానీయాలు

• హై-ప్రోటీన్ ఆహారాలు


కొన్ని పండ్లు మరియు పండ్లరసాలు కూడా అధిక ఆమ్లస్థాయిలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా, సిట్రస్ పండ్లు తక్కువ పిహెచ్ విలువలను కలిగి ఉన్నందున అధిక ఆమ్లస్థాయిలను కలిగి ఉంటాయి.


• లైమ్స్ (pH:2 నుండి 2.8)

• బ్లూబెర్రీస్ (pH:3.12 నుండి 3.33)

• యాపిల్స్ (pH:3.30 నుండి 4)

• నిమ్మరసం (pH:2 నుండి 2.6)

• ద్రాక్ష (pH:2.90 నుండి 3.82)

• దానిమ్మ (pH:2.93 నుండి 3.20)

• పైనాపిల్ (pH:3.20 నుండి 4)

• పీచెస్ (pH:3.30 నుండి 4.05)

• నారింజ (pH:3.69 నుండి 4.34)

కూరగాయలలో, సాధారణంగా ఆమ్ల గాఢత తక్కువగా ఉంటుంది. అధిక పాస్పరస్(భాస్వరం) గల పానీయాలైన బీర్ లేదా హాట్ చాక్లెట్ వంటి వాటిని అసిడిక్ పానీయాలుగా పేర్కొనబడ్డాయి. మద్యం పరంగా, రెడ్ వైన్ లేదా వైట్ వైన్ వంటి పానీయాలలో తక్కువ భాస్వరం ఉంటుంది. ఈ అధిక ఆమ్ల గాఢత కలిగిన ఆహారాలను నివారించడం ద్వారా ఆరోగ్యం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది.

 List of Acidic Foods & Fruits To Avoid and List of Alkaline Foods

మీ ఆహారప్రణాళికలో ఆమ్లస్థాయిలు అధికంగా గల ఆహారాలను ఎలా పరిమితం చేయాలి?

తక్కువ ఆమ్లస్థాయిలు కలిగిన ఆహారాలు మరియు వాటి pH విలువలు:

ఆల్కలీన్ లేదా తక్కువ ఆమ్లస్థాయిల ఆహారాలు, కండరాల సమస్యలను తగ్గిస్తుంది. చురుకుదనానికి మరియు తెలివితేటలు పెరగడానికి దోహదం చేయవచ్చు కూడా.

ఆల్కలీన్(లేదా)ఆహారప్రణాళికలో తక్కువ ఆమ్ల-గాఢత కలిగిన ఆహారాల జాబితా:

• సోయ, టోఫు

• దాదాపు అన్నిరకాల కూరగాయలు

• బీన్స్ మరియు కాయధాన్యాలు

• ముడి పాలు మరియు పెరుగు లేదా యోగర్ట్

• హెర్బల్ టీలు

• మిల్లెట్

• మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు (ఆవాలు, ఉప్పు మరియు జాజికాయ మినహాయించి)

• ఆలివ్ నూనె

• అవోకాడోస్, తృణ ధాన్యాలు మరియు డ్రైఫ్రూట్స్

మీ ఆరోగ్యానికి సరిపడే pH స్థాయిలు కలిగిన కూరగాయల జాబితా ఇక్కడ పొందుబరచబడి ఉన్నాయి:

• బ్రొకోలీ (pH: 6.30 నుండి 6.85)

• పుట్టగొడుగులు (pH: 6 నుండి 6.70)

• క్యాబేజీ (pH: 5.20 నుండి 6.80)

• దుంపలు (pH: 5.30 నుండి 6.60)

• మొక్కజొన్న (pH: 5.90 నుండి 7.50)


మీ ఆహారంలో అధిక ఆమ్లగాఢత కలిగిన ఆహారాన్ని ఎలా పరిమితం చేయాలి :

ఆల్కలీన్ ప్రణాళిక ఎలా సహాయం చేస్తుంది?

ఆల్కలీన్ ఆహారప్రణాళిక గురించిన కొంత అవగాహన కలిగి ఉండడం మేలు. మీరు తీసుకునే ఆహారం మరియు దాని pH విలువలు, మీ శరీరం యొక్క pH విలువలపై ప్రభావాన్ని కలిగి ఉంటాయని ఎన్నటికీ మరచిపోరాదు. మీ ఆహారప్రణాళికలో భాగంగా తీసుకునే ఆహారాల pH విలువపై ఆధారపడి, మీ శరీరం సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలకు గురికాగలదు.

ఆల్కలీన్ ఆహారప్రణాళికను సిఫార్సు చేస్తున్న పోషకాహార నిపుణుల వెనుక అంతరార్ధం ఈ విధంగా ఉంది: యాసిడ్-ఫార్మింగ్ ఆహారాలకు బదులుగా ఆల్కలీన్ పదార్ధాలను భర్తీ చేయడం ద్వారా, ఆరోగ్యం మెరుగవుతుంది. అధిక ఆమ్ల గాఢత కలిగిన ఆహారాలను తీసుకోవడం ద్వారా, శరీరంలో ఆమ్ల తత్వాలు పేరుకుని పోతాయి. క్రమంగా, యాసిడ్ – రిఫ్లక్స్ వంటి సమస్యలు అధికమవుతాయి. కావున వీటికి బదులుగా ఆల్కలీన్ సంబంధిత ఆహార పదార్ధాలను తీసుకొనవలసినదిగా సూచిస్తున్నారు.

మరోవైపు, ఆల్కలీన్ సంబంధిత ఆహారాలు తీసుకోవడం ద్వారా, మీ శరీరం కూడా ఆల్కలీన్ అవుతుంది. మీ శరీరాన్ని రిఫ్రెష్ చేయాలని భావిస్తున్న ఎడల, కనీసం 30 రోజుల పాటు ఆల్కలీన్ సంబంధిత ఆహార ప్రణాళికను తీసుకొనవలసి ఉంటుంది.

English summary

List of Acidic Foods & Fruits To Avoid and List of Alkaline Foods

It is essential to consume foods that are less acidic. This all depends on the foods that we consume. Foods having a pH value of 4.6 or lower are considered acidic in nature. In general, citrus fruits have a low pH value and are therefore considered acidic. Acidic foods can aggravate digestive disorders such as acid reflux and GERD.
Story first published:Friday, September 14, 2018, 17:22 [IST]
Desktop Bottom Promotion